టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ, వైద్య మంత్రి ఓఎస్డీ ఆ రాష్ట్రంలో పర్యటన
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు తరహా వైద్యంపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. ప్రభుత్వ ఆసుప త్రుల్లో అధిక కాన్పులు జరపాలన్న లక్ష్యంతో ఇటీవల సీఎం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ నేతృత్వంలోని బృందం తమిళనాడులో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో బృందం ఆ రాష్ట్రంలో పర్యటించి వచ్చింది. తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ వేణుగోపాల్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఓఎస్డీ టి.గంగాధర్, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్ సోమవారం తమిళనాడుకు వెళ్లి వచ్చారు. అక్కడ ప్రభుత్వ ఆసుప త్రుల్లో కాన్పులు, నవజాత శిశువులకు అందిస్తున్న కిట్లు, తల్లీబిడ్డల సంక్షేమం కోసం అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలను ఈ బృందం అధ్యయనం చేసింది. అదే తరహాలో ఇక్కడ కూడా కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది.
ఇక్కడ అధ్వానం: తమిళనాడుతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అధ్వానంగా ఉన్నా యని బృందం అభిప్రాయపడింది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.12 వేలు ప్రోత్సాహకం ఇవ్వడంతో మహిళలు ముందుకు వస్తున్నా రంది. మౌలిక సదుపా యాలు బాగున్నాయని, వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటున్నారని అధ్యయనంలో తేలింది. మనవద్ద ఆ పరిస్థితి లేకనే ప్రభుత్వాసుప త్రులపై విశ్వాసం పోయిందని అభిప్రాయపడింది.
తమిళనాడు తరహా వైద్యంపై సర్కారు ఆసక్తి
Published Wed, Jan 11 2017 3:38 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement