
సీనియర్ ఐఏఎస్, తెలంగాణ సీఎంవో అధికారిని స్మిత సబర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో నిత్యం టచ్‌లో ఉంటారు స్మిత సబర్వాల్. ప్రభుత్వ పనులు సమర్థవంతంగా నిర్వహిస్తూనే, మరోవైపు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలి, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేస్తుంటారు.
ఈ మేరకు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన స్వీట్ మూమెంట్స్‌ని కూడా ఆమె అభిమానులతో సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ రీల్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మరింది. దీంతో నెటిజన్లు.. మేడమ్ సార్.. మేడమ్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా 2001 బ్యాచ్‌కు చెందిన స్మిత సబర్వాల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి తన పనితీరుతో ఎంతో గుర్తింపు పొందారు. తెలంగాణ సీఎంవో అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా కలెక్టర్‌గా మరింత పాపులర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment