smitha sabharwal
-
Smita Sabharwal: ‘ఏఐఎస్‌కు దివ్యాంగులెందుకు?’
సాక్షి, హైదరాబాద్: ‘వైకల్యం కలిగిన పైలట్‌ను ఏదైనా విమానయాన సంస్థ ఉద్యోగంలో తీసుకుంటుందా? వైకల్యం కలిగిన శస్త్రచికిత్స నిపుణుడిపై మీరు నమ్మకం ఉంచుతారా? మరీ అత్యంత ప్రతిష్టాత్మకమైన అఖిల భారత సేవల (ఏఐఎస్) (ఐఏఎస్/ఐపీఎస్/ఐఎఫ్ఎస్ తదితర) ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?’అని సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ ‘ఎక్స్’వేదికగా ఆదివారం ప్రశ్నించారు. ఉద్యోగ స్వభావ రీత్యా అఖిలభారత సేవల అధికారులు క్షేత్రస్థాయిలో గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ప్రజల విన్నపాలను నేరుగా వింటూ పనిచేయాల్సి ఉంటుందని, దీనికి శారీరక ఆరోగ్యం అవసరమని స్పష్టం చేశారు. స్మితా వ్యాఖ్యలు సరికాదు.. వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, మేధోశక్తిపై ప్రభావం చూపవని సీనియ ర్ సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ, బ్యూరోక్రాట్లు తమ సంకుచిత స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతు ర్వేది విమర్శించారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరికాదని ఆమె వారికి క్షమాపణ చెప్పాలని, వికలాంగుల కమిషన్ ఆమెపై కేసు నమోదు చేయాలని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, తెలంగాణ వికలాంగుల సంఘాల జేఏసీ కనీ్వనర్ నారా నాగేశ్వరరావు ఆదివారం ప్రకటనలో వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. -
TS: భారీ సంఖ్యలో బదిలీ బాట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కారు పాలనలో మార్పుబాట పట్టింది. ఇప్పటి వరకు వివిధ శాఖలు, విభాగాల్లో కీలకంగా పనిచేస్తూ వచ్చిన పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్, నాన్ కేడర్ ఎస్పీస్థాయి అధికారులను బదిలీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల అమలుతోపాటు కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి తన జట్టును సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాలనా యంత్రాంగంలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టారు. తాజాగా ఒకేసారి 26 మంది ఐఏఎస్‌లు, 23 మంది ఐపీఎస్‌లు, 21 మంది నాన్ కేడర్ ఎస్పీస్థాయి అధికారులకు స్థాన చలనం కల్పించారు. ఐఏఎస్‌లలో 18 మందికి పూర్తిగా కొత్త బాధ్యతలు అప్పగించగా.. మిగతా 8 మందికి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఐదు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఐపీఎస్‌లలో అందరినీ కొత్త స్థానాలకు బదిలీ చేశారు. నాన్ కేడర్ ఎస్పీ అధికారులకు కొన్ని స్థానాల్లో కీలక పోస్టింగ్‌లు ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడం ఇష్టం లేని, 18 గంటలు పనిచేయాలా అని అసంతృప్తిగా ఉండే అధికారులను పెద్దగా పనిలేని స్థానాలకు బదిలీ చేయడానికి సర్కారుకు అభ్యంతరం లేదని ఇటీవల సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇది జరిగి వారం గడవక ముందే భారీగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు జరగడం గమనార్హం. ఫైనాన్స్ కమిషన్‌కు స్మితా సబర్వాల్ గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా, మిషన్ భగీరథ (ఆర్డబ్ల్యూఎస్) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూసుకున్న స్మితా సబర్వాల్ పెద్దగా ప్రాధాన్యత ఉండని రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. గత ప్రభుత్వం నవంబర్ 30న ఆమెకు నీటిపారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కానీ సర్కారు మారడంతో ఆమె ఆ బాధ్యతలను చేపట్టడానికి ఆసక్తి చూపలేదు. దీంతో నీటి పారుదల శాఖ అదనపు బాధ్యతల నుంచి సైతం స్మితను ప్రభుత్వం తప్పించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈసీ రంగారెడ్డి కలెక్టర్‌గా నియమించిన భారతి హొళికేరిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించి వెయిటింగ్లో పెట్టింది. తాజాగా రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్‌గా ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. భూముల వ్యవహారంలో ఆమెపై ఆరోపణలు రావడంతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఆర్డబ్ల్యూఎస్ కార్యదర్శిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాహుల్ బొజ్జాకు నీటిపారుదల శాఖ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. సుదీర్ఘకాలం నుంచి అప్రాధాన పోస్టుల్లో కొనసాగుతున్న ఎంసీఆర్హెచ్ఆర్డీ అదనపు డీజీ బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కాకు ఎట్టకేలకు కీలక పోస్టింగ్ లభించింది. ఆయనకు ప్రభుత్వం గనుల శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న డి.దివ్యను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌గా నియమించింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను గిరిజన శాఖ కార్యదర్శిగా బదిలీ చేయగా.. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశంకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయ్యారు. కీలకమైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పదవి కె.శశాంకకు దక్కింది. నారాయణపేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పరి్ణకారెడ్డి తల్లి, 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి చిట్టెం లక్ష్మి ఇన్నాళ్లూ వెయిటింగ్లో ఉండగా.. ఆమెను టీఎస్ ఫుడ్స్ ఎండీగా నియమించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావుకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జె.శంకరయ్య (నాన్ కేడర్)ను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం పేషీకి మూడు కొత్త ముఖాలు ప్రభుత్వం మరో ముగ్గురు అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ చేసింది. తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ, ఎండీగా ఉన్న ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి జి.చంద్రశేఖరరెడ్డిని ముఖ్యమంత్రికి కార్యదర్శిగా సీఎంఓకు బదిలీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ బాధ్యతలు కూడా నిర్వహించాలని ఆయనను ఆదేశించారు. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులు (నాన్ కేడర్ అధికారి)ను ముఖ్యమంత్రికి ఓఎస్డీగా సీఎంఓకు బదిలీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కుమార్తె, 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంగీత సత్యనారాయణను టీఎస్ ఫుడ్స్ ఎండీ పోస్టు నుంచి బదిలీ చేస్తూ.. ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శిగా కీలక పదవిలో నియమించారు. దీంతో సీఎం కార్యాలయంలో కీలకమైన పదవుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, డిఫెన్స్ సర్వీసెస్, గ్రూప్–1 అధికారులను నియమించినట్టు అయింది. ఇప్పటికే సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి (ఐఏఎస్), కార్యదర్శిగా షానవాజ్ ఖాసీమ్ (ఐపీఎస్), అదనపు కార్యదర్శిగా అజిత్‌రెడ్డి (డిఫెన్స్ సర్వీసెస్) అధికారులను ప్రభుత్వం నియమించింది. మూడు కమిషనరేట్లకు కొత్త సీపీలు రాష్ట్రంలో మూడు కమిషరేట్లకు ప్రభుత్వం కొత్త పోలీస్ కమిషనర్లను నియమించింది. రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఎల్ఎస్ చౌహాన్‌ను, ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా సునీల్‌దత్, సిద్దిపేట పోలీసు కమిషనర్‌గా బి.అనురాధను ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఐదు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావును అదనపు డీజీ (టెక్నికల్ సర్వీసెస్)గా ప్రభుత్వం బదిలీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా అదనపు బాధ్యతల్లోనూ కొనసాగాలని ఆయనను ఆదేశించింది. -
ఇన్‌స్టాలో స్మితా సబర్వాల్ సందడి.. వీడియో వైరల్
సీనియర్ ఐఏఎస్, తెలంగాణ సీఎంవో అధికారిని స్మిత సబర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో నిత్యం టచ్‌లో ఉంటారు స్మిత సబర్వాల్. ప్రభుత్వ పనులు సమర్థవంతంగా నిర్వహిస్తూనే, మరోవైపు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలి, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేస్తుంటారు. ఈ మేరకు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన స్వీట్ మూమెంట్స్‌ని కూడా ఆమె అభిమానులతో సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ రీల్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మరింది. దీంతో నెటిజన్లు.. మేడమ్ సార్.. మేడమ్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2001 బ్యాచ్‌కు చెందిన స్మిత సబర్వాల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి తన పనితీరుతో ఎంతో గుర్తింపు పొందారు. తెలంగాణ సీఎంవో అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా కలెక్టర్‌గా మరింత పాపులర్ అయ్యారు. View this post on Instagram A post shared by 𝐏𝐫𝐚𝐭𝐢𝐜𝐡𝐞𝐞 𝐌𝐨𝐡𝐚𝐩𝐚𝐭𝐫𝐚 (@praticheemohapatra) View this post on Instagram A post shared by Smita Sabharwal (@smita_sabharwal1) View this post on Instagram A post shared by Smita Sabharwal (@smita_sabharwal1) -
మార్పు ప్రజల నుంచే రావాలి
వనపర్తి: మా ఊరు అభివృద్ధి చెందాలి.. అనే భావన అందరిలోనూ వచ్చినప్పుడే మార్పు కనిపిస్తుంది.. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం, ఆకాంక్ష నెరవేరుతుంది.. అని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్వితా సబర్వాల్ అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడి, మంగంపల్లి, వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామాల్లో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పల్లెప్రగతి కార్యక్రమాల్లో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో కలిసి హాజరయ్యారు. ముందుగా చిన్నమందడిలో పాటిస్తున్న పారిశుద్ధ్య పరిరక్షణ చర్యల గురించి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం చేస్తున్న పనులు, మార్కెటింగ్, హరితహారం తదితర కమిటీల సభ్యులతో విడివిడిగా మాట్లాడారు. అంతకుముందు గ్రామంలో చెత్త వేసేందుకు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన స్టీల్ చెత్తబుట్టలు, ఇంటింటికి నిర్మించుకున్న ఇంకుడు గుంతలు, గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును కలెక్టర్ శ్వేతామహంతితో కలిసి పరిశీలించారు. ప్రజలతో మాటామంతి.. పారిశుద్ధ్య సిబ్బంది రోజూ ఉదయం ఎన్ని గంటలకు చెత్తసేకరణకు వస్తారు..? ఇంటింటికీ మొక్కలు ఇచ్చారా.? సర్పంచ్, అధికారుల పనితీరు ఎలా ఉంది..? అంటూ సీఎంఓ గ్రామస్తులతో అడిగి తెలుసుకున్నారు. పరిసరాల శుభ్రత సర్పంచు, అధికారులతో పాటు ప్రజలందరి బాధ్యతగా భావించాలని సూచించారు. ఈగలు, దోమలు లేకుండా గ్రామంలో డ్రెయినేజీలు శుభ్రం చేయటంతో పాటు చెత్తను ఏ రోజుకారోజు డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. అందుకు ప్రజలు సమాధానం ఇస్తూ.. సర్పంచు గత పదేళ్ల నుంచి ఊరిని అభివృద్ధి చేస్తున్నారని, అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని తెలిపారు. రోడ్లపై చెత్తగాని, కవర్లుగాని పడితే తానే స్వయంగా తీసి రోడ్లు పక్కనే ఉండే చెత్తబుట్టలో వేస్తారని, ఆయన్ను చూసి మేమంతా మారిపోయామని, మా ఊర్లో ఎక్కడ కూడా చెత్త కనిపించదని, కావాలంటే చూసుకోండని అధికారులతో బదులివ్వగా గ్రామస్తులను సీఎంఓ భేష్..! అని అభినందించారు. పర్యటనలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, ఎంపీపీలు మెగారెడ్డి, కిచ్చారెడ్డి, సర్పంచులు సూర్యచంద్రారెడ్డి, శారద, డీఆర్డీఓ గణేష్, డీపీఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చిన్నమందడి గ్రామస్తులతో మాట్లాడుతున్న అధికారులు ప్రతి చెట్టుకు నెంబరు బాగుంది : ప్రియాంక వర్గీస్ గ్రామంలోకి వస్తుంటేనే బాగా గమనించాం.. మీ ఊరి క్రమశిక్షణ చాలా బాగుంది. గ్రామంలోని ప్రతి చెట్టుకూ నెంబర్లు వేశారు. చాలా గ్రామాలు తిరిగాను.. ఎక్కడా ఇలా కనిపించలేదు. సర్పంచు సూర్య చంద్రారెడ్డి, గ్రీన్ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం బాగుంది. వాచర్లకు మొక్కల సంరక్షణ బాధ్యత ఇవ్వడం, ఒకవేళ మొక్క ఎండితే ఏ నంబర్ మొక్క ఎండిందో తెలుసుకుని అక్కడే మరో మొక్కను నాటాలని నిర్ణయించుకోవడం లాంటి పనులు బాగా నచ్చాయి. -
పనుల తీరుపై స్మిత అసహనం
* 100 మంది కూలీలతో పని జరుగుతుందా? * అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు బాల్కొండ : సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులపై ఎందుకింత నిర్లక్ష్యమంటూ సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ అసహనం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనులు మే చివరి నాటికి పూర్తి కావాలని అన్నారు. మంగళవారం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే మండలంలోని జలాల్పూర్ వద్ద నిర్మిస్తున్న మిషన్ భగీరథ పనులను ఆమె పరిశీలించారు. పనులు నత్త నడకన సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికలో 300 మంది కూలీలు పని చేస్తున్నారంటు తెలుపుతున్నారు. కాని ఇక్కడ 100 మంది కూలీలు కూడ పని చేయడం లేదంటూ మండి పడ్డారు. ప్రతి రోజు 300 మంది కూలీలు పని చేయాల్సిన చోట 100 మంది కూలీలతో పని చేస్తే పనులు ఎలా ముందుకు సాగుతాయని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. పనులు సకాలంలో పూర్తి చేయక పోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు క్షేత్ర స్థాయికి విరుద్ధంగా ఎందుకు నివేదికలు అందిస్తున్నారని అని అన్నారు. వాటర్ గ్రిడ్ పనులను త్వరలో మళ్లీ పరిశీలిస్తానన్నారు. పనుల్లో వేగం పుంజు కోకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనులను సంబంధిత అధికారులు ఎందుకు పర్యవేక్షించడం లేదన్నారు. పనులు సాగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్ యోగితా రాణాతో ఆవేదన వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేయాలన్నారు. -
ఔట్లుక్ చెప్పీ చెప్పని క్షమాపణలు!
-
ఔట్లుక్ చెప్పీ చెప్పని క్షమాపణలు!
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వివాదంపై 'ఔట్లుక్' పత్రిక చెప్పీ చెప్పనట్లుగా క్షమాపణలు చెప్పింది. 'ద బోరింగ్ బాబు' అనే కథనంలో తాము ఎవరి పేర్లూ పేర్కొనలేదని, అయినా.. తమకు తెలంగాణ ప్రభుత్వంలోని ఓ అధికారి లీగల్ నోటీసులు పంపారంటూ కొన్ని వార్తా పత్రికలు, టీవీ న్యూస్ చానళ్లు, వెబ్ సైట్లు చెప్పాయని ఔట్లుక్ పేర్కొంది. అయితే, మీడియా గందరగోళం మొదలై 36 గంటలు దాటిపోయినా, తమకు మాత్రం ఎలాంటి నోటీసు రాలేదని తెలిపింది. సోషల్ మీడియాలో కూడా తమ పత్రిక కరస్పాండెంటుపై వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని, ఆమెపై దాడి చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆ కథనంలో రాశారు. తాము సర్వసాధారణంగానే తమ పత్రికలో కొన్ని సెటైర్లు రాస్తామని, అయితే అందులో ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం తమకు లేదని, దాన్ని తేలిగ్గా తీసుకోవాలని అన్నారు. అయినా.. పరిస్థితి సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కథనం మొత్తాన్ని తాము తీసేశామని తెలిపారు. ఒకవేళ ''ఏదైనా తప్పు జరిగినట్లయితే'' అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. గత 20 ఏళ్లుగా తాము మానవహక్కులు, మహిళల హక్కులు, మైనారిటీ హక్కులు, వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడుతూనే వచ్చామని, ఈ విషయం తమ పాఠకులు అందరికీ తెలుసని కూడా చెప్పుకొన్నారు. -
కొసరుకు కొండంత
మంథని : మంథని గాంధీచౌక్ నుంచి సామాజిక వైద్యశాల, రావులచెరువుకట్ట, మందాట, పెంజెరుకట్ట మీదుగా గాంధీచౌక్ వరకు రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.4.09 కోట్లు కేటాయించింది. ఈ రహదారిలో పురాతణమైన కట్టడాలు ఉండటంతో నిర్మాణదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ పలుమార్లు చర్చలు జరిపి 32 నుంచి 30 ఫీట్లకు, ఆ తర్వాత 28 ఫీట్లకు తగ్గించి విస్తరణకు శ్రీకారం చుట్టారు. పరిహారం పంపిణీలో ఆలస్యం జరగడంతో పనులు కొద్దినెలలు ఆగిపోయాయి. తిరిగి పనులు ప్రారంభమైనప్పటికీ కాంట్రాక్టర్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా నాణ్యతను విస్మరిస్తున్నాడు. 28 ఫీట్లు విస్తరించి అభివృద్ధి పనులు చేయాల్సి ఉండగా ఓ చోట 26 ఫీట్లు, మరో చోట మరో విధంగా విస్తరించి మురికి కాలువల నిర్మాణం చేపడుతున్నాడు. నిర్మాణాలు కోల్పోతున్న వారికి సుమారు రూ.2 కోట్ల చెల్లింపులు జరిగాయి. కనీసం ఒక్క ఫీటు సెట్‌బ్యాక్‌తో మురికి కాలువలు చేపట్టాల్సి ఉండగా, ఇంటి గోడల్లోనే నిర్మాణం చేస్తున్నారు. కాలువ పనులు సైతం ఇష్టారీతిలో చేస్తున్నారు. ఒక్కోచోట కనీసం పేరుకుపోయిన చెత్తను బయటకు తీసేందుకు ఉపయోగించే చిన్నపాటి పార కూడా పట్టనంత వెడల్పులో నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. నిర్మాణాల తొలగింపు విషయంలో నిబంధనలను విస్మరించడంతో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విస్తరణ పనులను మొదట్లో లేకపోతే చివరి నుంచి ప్రారంభించాల్సి ఉండగా ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీరాజ్ ఎస్ఈ, డీఈలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితి మారడం లేదని పలువురు వాపోతున్నారు. ఆరు ఇంచుల పిల్లర్‌కు రూ.2లక్షలా? రోడ్డు విస్తరణ, అభివృద్ధి విషయంలో అధికారులు అక్రమాలకు పాల్పడతున్నారు. ఆరు ఇంచుల పిల్లర్ పోయిన వారికి రూ.2లక్షలు ఇచ్చి పెద్ద మొత్తంలో నష్టపోతున్న వారికి రూ.వేలల్లో పరిహారం మంజూరీ చేశారు. ఈ విషయంపై పలుమార్లు పంచాయతీరాజ్ ఎస్ఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. - గుడి అశోక్ 70 ఫీట్లు పోతున్నా రూ.2.45 లక్షలే.. ఏడు దర్వాజలు, ఒక షెట్టరు, ఇల్లు, కమాన్ దర్వాజతో కలిసి 70 ఫీట్ల వరకు రోడ్డు వెడల్పులో నష్టపోతానం. మాకు కేవలం రూ.2.45 లక్షల పరిహారం మంజూరు చేసిండ్రు. ఆ చెక్కును ఇంకా మా చేతికి ఇయ్యలేదు. మేం ఇంట్లో లేనప్పుడు మాకు సమాచారం ఇయ్యకుండా ఇల్లు కూల్చుతామని బెదిరిస్తుండ్రు. నష్టపరిహారం ఇయ్యకుండా ఇల్లు కూల్చితే మా గతేం కావాలె? - పాపిట్ల నందు సంబంధం లేనివారి పేరిట చెక్కు ఐదు ఫీట్ల వెడల్పుతో 12 ఫీట్ల పొడవుతో ఖాళీ స్థలం, రెండు బాత్రూంలు రోడ్డు విస్తరణలో కోల్పోతున్నం. మాకు కేవలం రూ.29 వేలు నష్టపరిహారం మంజూరు చేసిండ్రు. అది కూడా మా పేరిట కాకుండా సంబంధం లేని మరో వ్యక్తి పేరిట చెక్కు జారీ చేసిండ్రు. ఆర్డీఓకు ఫిర్యాదు చేసి మూడు నెలలైనా ఏ ఒక్క అధికారి వచ్చి విచారణ చేయలేదు. - వడ్లకొండ రవి అక్రమాలకు ఆస్కారం లేదు అంతర్గత రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల్లో అక్రమాలకు ఆస్కారం లేదు. ఈ వ్యవహారంలో ఎవరైనా డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం. కొత్తగా నిర్మించిన కొన్ని భవనాల విషయంలో ఒకటి రెండు ఇంచుల తేడా ఉంటే మానవతాదృక్పదంతో వదిలివేశాం. - చంద్రశేఖర్, డీఈఈ, పీఆర్, మంథని -
కలెక్టర్‌గా వెళ్తానంటున్న స్మిత?
తన పనితీరుతో అందరినీ ఆకట్టుకుని.. ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితా సభర్వాల్.. మళ్లీ కలెక్టర్‌గానే వెళ్లిపోతానని అంటున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీలో ఉండే ఒత్తిళ్లను తట్టుకోవడం కష్టం అవుతోందని, దానికంటే కలెక్టర్‌గా ఉంటేనే మేలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. గతంలో కరీంనగర్, మెదక్ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన స్మితా సభర్వాల్‌ను ఆమె పనితీరు చూసి.. కేసీఆర్ తన పేషీలోకి పిలిపించుకున్న విషయం తెలిసిందే. అయితే, సాధారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలని అనుకుంటే.. అది వెంటనే కావాలంటారు. దానికి సబంధించిన ఫైళ్లు, సమాచారం ఆయనకు తక్షణం అందించాల్సి ఉంటుంది. కానీ, పలు కారణాల వల్ల అది ఆమెకు సాధ్యం కావట్లేదని అంటున్నారు. ఇంత ఒత్తిడి మధ్య సీఎం పేషీలో పని చేయడం కంటే, మళ్లీ కలెక్టర్‌గా వెళ్లిపోతేనే మంచిదని, అక్కడే తన పనితీరుకు మంచిమార్కులు సంపాదించవచ్చని స్మితా సభర్వాల్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక స్మితా సభర్వాల భర్త అకున్ సభర్వాల్ ప్రస్తుతం జాతీయ పోలీసు అకాడమీలో కేంద్ర కేడర్‌లో పనిచేస్తున్నారు. ఆయనను మళ్లీ రాష్ట్ర కేడర్‌లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు సమర్ధుడైన అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అందువల్ల ఆయన సేవలను ఇక్కడ వినియోగించుకుంటే బాగుంటుందని పలువురు సూచించడంతో ఈ మేరకు ప్రయత్నాలు మొదలయ్యాయట.