cmo officers
-
నకిలీ సీఎంఓ అధికారి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి (సీఎంఓ) అని ప్రచారం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన ప్రవీణ్ సాయి బీటెక్ పూర్తయ్యాక హైదరాబాద్‌కు వచ్చి, వనస్థలిపురంలో ఉంటున్నాడు. స్థానికంగా ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్‌లో చేరాడు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన ప్రవీణ్ సాయి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఏడాది కాలంగా సీఎంఓ అధికారిగా ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకొని, డబుల్ బెడ్రూం ఇళ్లు, స్థలాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసేవాడు. మంత్రులు, ఎమ్మెల్యేల నకిలీ లెటర్ హెడ్లతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులు, యువత నుంచి పెద్దఎత్తున డబ్బు వసూలు చేశా డు. నకిలీ ఎన్ఓసీలు, ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలు విక్రయించేవాడు. బేగంపేటలో పలువురు బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేశాడు. ఈ కేసులో ప్రవీణ్ సాయి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉండటంతో గతంలో∙ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.30 కోట్ల భూ సెటిల్మెంట్లో.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో రూ.30 కోట్లు విలువ చేసే భూమి సెటిల్మెంట్ చేయిస్తానని చెప్పి, బాధితుడితో రూ.12 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.8 లక్షలు తీసుకొని, బాధితుడిని ఆ ల్యాండ్‌లో నిలబెట్టి ఫొటోలుతీసి బోర్డు కూడా పాతాడు. కొద్దిరోజుల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లిన బాధితుడు ఆ స్థలంలో బోర్డు లేకపోవడంతో అనుమానం కలిగింది. వెంటనే ప్రవీణ్ సాయికి ఫోన్ చేయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో మోసపోయానని గ్రహించి అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం నిందితుడు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం రాగా.. వెంటనే అరెస్టు చేశారు. -
ఇన్‌స్టాలో స్మితా సబర్వాల్ సందడి.. వీడియో వైరల్
సీనియర్ ఐఏఎస్, తెలంగాణ సీఎంవో అధికారిని స్మిత సబర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో నిత్యం టచ్‌లో ఉంటారు స్మిత సబర్వాల్. ప్రభుత్వ పనులు సమర్థవంతంగా నిర్వహిస్తూనే, మరోవైపు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలి, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేస్తుంటారు. ఈ మేరకు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన స్వీట్ మూమెంట్స్‌ని కూడా ఆమె అభిమానులతో సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ రీల్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మరింది. దీంతో నెటిజన్లు.. మేడమ్ సార్.. మేడమ్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2001 బ్యాచ్‌కు చెందిన స్మిత సబర్వాల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి తన పనితీరుతో ఎంతో గుర్తింపు పొందారు. తెలంగాణ సీఎంవో అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా కలెక్టర్‌గా మరింత పాపులర్ అయ్యారు. View this post on Instagram A post shared by 𝐏𝐫𝐚𝐭𝐢𝐜𝐡𝐞𝐞 𝐌𝐨𝐡𝐚𝐩𝐚𝐭𝐫𝐚 (@praticheemohapatra) View this post on Instagram A post shared by Smita Sabharwal (@smita_sabharwal1) View this post on Instagram A post shared by Smita Sabharwal (@smita_sabharwal1) -
మణిపూర్ నుండి చివరి విద్యార్థి వచ్చేవరకు ఈ ఆపరేషన్ ఆగదు
-
CM Jagan Birthday: సందడే.. సందడి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు బుధవారం కనులపండువగా జరిగాయి. తాడేపల్లిలోని నివాసంలో సీఎం జగన్‌తో పలువురు మంత్రులు, సీఎంవో అధికారులు కేక్ కట్ చేయించారు. ఇదే సమయంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు ఫోన్ చేసి సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. పాస్టర్ జాన్ వెస్లీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తానేటి వనిత, ఆర్కే రోజా, విడదల రజిని, జోగి రమేష్, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, బాలశౌరి, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు, సీఎం సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు) ఆర్.దనుంజయ్రెడ్డి, సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదిగేకొద్దీ ఒదిగి ఉండటమే సీఎం నైజం.. ప్రజల్లో ఉండటం, ప్రజలకు సేవ చేయడంపైనే సీఎం వైఎస్ జగన్ దృష్టి పెట్టారని.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నదే ఆయన నైజమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం సీఎం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీగా తరలివచ్చి.. సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 500 కిలోల భారీ కేక్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ మూడున్నరేళ్లలోనే పల్లెల రూపురేఖలను మార్చారని.. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని వివరించారు. మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను నెరవేర్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కొందరు నాయకుల్లాగా సీఎం జగన్ ప్రజల్ని బెదిరించట్లేదని.. పాలన నచ్చితేనే వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరుతున్నారని.. ఇది నిజమైన రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణమన్నారు.అనంతరం పేదలకు దుస్తుల పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, నాయకులు చల్లా మధు, మర్రి రాజశేఖర్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, ‘నవరత్నాల’ మూర్తి, రవిచంద్రారెడ్డి, కాకుమాను రాజశేఖర్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, నారమల్లి పద్మజ, జియాఉద్దీన్, అడపా శేషు, మేడపాటి వెంకట్, పానుగంటి చైతన్య, కిరణ్‌రాజ్, దేవళ్ల రేవతి, శివశంకర్, ఈద రాజశేఖర్, మిమిక్రీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులతో సీఎం జగన్ హస్తినలోనూ ఘనంగా.. సాక్షి, న్యూఢిల్లీ: సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఏపీ భవన్ అధికారులు, ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని.. కేక్ కట్ చేసి సీఎం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. భారత రాజకీయ వ్యవస్థలోనే జగన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజా సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమని.. పేదల అభివృద్ధే ఆయన ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, తలారి రంగయ్య, రెడ్డప్ప, మాధవ్, గురుమూర్తి, సంజీవ్, లావు కృష్ణదేవరాయులు, శ్రీధర్, ఆర్.కృష్ణయ్య, కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పరశురామ్, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ పాల్గొన్నారు. -
కష్టకాలంలో మంచి నిర్ణయాలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, సొంతింటి కల దిశగా ఎంఐజీ లే అవుట్లలో ప్లాట్లు తాము ఊహించలేదని, మొత్తంగా పీఆర్సీ పట్ల సంతృప్తిగా ఉన్నామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని, కష్టకాలంలో సీఎం వైఎస్ జగన్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం వారు సీఎంవో అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం అక్కడి మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. జగన్ చిత్రపటానికి స్వర్ణ కమలాభిషేకం శ్రీకాళహస్తి: ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఇతర వరాలు ప్రకటించిన నేపథ్యంలో శనివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన చిత్రపటాన్ని స్వర్ణ పుష్పాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం నాయకులు చెంచురత్నంయాదవ్, నారాయణరెడ్డి, రవికాంత్, నాగేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేతలు కృష్ణగిరి రెడ్డి, గోపి, విశ్రాంత ఉద్యోగుల సంఘం నేత రమణయ్య, పురపాలక, ఆర్టీసీ తదితర ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల్లో పండుగ సందడి ప్రభుత్వం పీఆర్సీ 23 శాతం పెంచడంతో పాటు పలు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఉద్యోగులందరూ ఆనందంగా ఉన్నారని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.బి.ప్రతాపరెడ్డి అన్నారు. శనివారం ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఆయన ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు గుంటూరులో ఎమ్మెల్సీ కల్పలత ఉపాధ్యాయ, ఉద్యోగులతో కలసి కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు ఆశించినట్లే హెచ్ఆర్ఏ ఉంటుంది హెచ్ఆర్ఏ విషయంలో ప్రస్తుత శ్లాబులనైనా కొనసాగించాలి, లేదా పీఆర్సీ కమిషనర్ సూచించిన శ్లాబులనైనా పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశాం. పెన్షనర్లకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పాం. హెచ్ఆర్ఏ ఉద్యోగులు ఆశించినట్లే ఉంటుంది. సీఎం నిర్ణయాల పట్ల అందరూ ఆనందంగా ఉన్నారు. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వంపై నమ్మకం ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన, ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద మాకు నమ్మకముంది. అదనపు పెన్షన్ విషయంలో సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే పెన్షనర్లు ఇబ్బందులు పడతారని చెప్పాం. 62 ఏళ్లకు పదవీ విరమణ, సొంతింటి కల మేము ఊహించని నిర్ణయం. అన్ని సమస్యలపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి సచివాలయాల ఉద్యోగులకు మేలు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలిసీ తెలియక కొంత మంది ఆందోళన చేస్తున్నారు. వాళ్లందరికీ తప్పకుండా రెగ్యులర్ అవుతుంది. ఇతర ఉద్యోగులతో సమానంగా వారికి అన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది. కారుణ్య నియామకాల విషయంలో ఏ శాఖలో అయినా నియామకం చేయాలని కోరాం. – కె.వి.శివారెడ్డి, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేటి సమావేశం వాయిదా ఈ నెల 7న సీఎం జగన్ ప్రకటించినవి కాకుండా మిగిలిన విషయాల గురించి శనివారం సీఎంవో అధికారులతో చర్చించాం. కోవిడ్, నాన్ కోవిడ్‌లో చనిపోయిన వారికి కూడా కారుణ్య నియామకాలు చేయాలని కోరాం. సానుకూలంగా నిర్ణయాలు జరిగాయి కాబట్టి మా కార్యాచరణ కోసం ఆదివారం జరగాల్సిన సమావేశం వాయిదా వేస్తున్నాం. – వైవీ రావు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత డీఏలు అన్నీ ఒకేసారి క్లియర్ ఫిట్మెంట్ విషయంలో ఉపాధ్యాయులు కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. కానీ డీఏలు అన్నీ ఒకేసారి క్లియర్ చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది. సీఎం రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించాలని చెప్పారు. మేమంతా అర్థం చేసుకుని ఆమోదించాం. ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లన్నీ పరిష్కారం అవుతున్నాయి. – జోసెఫ్ సుధీర్ బాబు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరాం. సీఎంవో అధికారులను కలిసి మా సమస్యను వివరించాం. ఎలిజిబిలిటీ ఉన్న వారికి వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని విన్నవించాం. ఉన్నతాధికారి అజయ్ జైన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశం నిర్మాణ భవన్లో నిర్వహిస్తామన్నారు. – బత్తుల అంకమ్మ రావు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు కొత్త పీఆర్సీలో భాగంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొత్త స్కేల్స్ వర్తింప చేస్తామని ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. సీఎం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత కార్యక్రమాలతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కడం పట్ల గర్వంగా ఉంది. – కె.నాగరాజు, స్టేట్ సెర్ప్ ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ సీఎం నిర్ణయం సాహసోపేతం ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం సాహసోపేతమైనది. ఈ పీఆర్సీలో మానవత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఉద్యోగులను వేరుగా చూడటంలేదు. ప్రభుత్వంలో అంతర్భాగంగా చూస్తోంది. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ, ఏమాత్రం తగ్గకుండా ఉద్యోగుల కష్టాలను తీరుస్తోంది. రిటైర్మెంట్ వయో పరిమితి పెంచటంపై ఎల్లో మీడియా పెదవి విరచడం దారుణం. చంద్రబాబు వయస్సు ఎంత, ఎందుకు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వడంలేదో చెప్పాలి. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లకు జగనన్న ఇచ్చిన సంక్రాంతి కానుక. – వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ -
సీఎం సారొచ్చారు!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సరిగ్గా నెల రోజులకు సచివాలయంలో అడుగుపెట్టారు. కొత్త పరిశ్రమలకు అనుమతుల జారీకోసం చివరిసారిగా ఆయన గత నెల 23న సచివాలయానికి వచ్చారు. ఇప్పుడు అదే కారణంతో బుధవారం సచివాలయానికి వచ్చారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం(టి-పాస్) కింద రెండో విడతగా 19 కొత్త పరిశ్రమలకు అనుమతులు జారీచేస్తూ పారిశ్రామికవేత్తలకు సచివాలయంలో కేసీఆర్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం సీఎంవో అధికారులతో సమీక్ష జరిపారు. -
'తలుపులు తీసి మరీ గొడవ పడ్డారు'
హైదరాబాద్: విశాఖపట్నం ఆర్డీవోను బదిలీ చేసే విషయంలో టీడీపీ నాయకులు గొడవ పడిన విషయాన్ని అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సీఎంవో అధికారుల పట్ల మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహరించిన తీరును చంద్రబాబుకు వివరించారు. కార్యాలయం తలుపులు తీసి మరీ గట్టిగా గొడవ పడ్డారని సీఎంవో అధికారులు బాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేదాలు ఆర్డీవోల బదీలీల వ్యవహారంతో మరింత రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి నిర్ణయం మేరకు జరిగిన ఆర్డీవోల బదిలీలను మంత్రి గంటా అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సచివాలయం ఎల్ బ్లాకులోని సీఎం కార్యాలయ ఉన్నతాధికారి వద్దకు వెళ్లి, తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. బదిలీలను మీరెలా అడ్డుకుంటారని ఆయనను తప్పుపట్టినట్టు సమాచారం. సీఎంవో అధికారుల తీరు బాగోలేదని, మాట్లాడటానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందంటూ విరుచుకుపడ్డారు. సీఎంవో అధికారులు ఈ విషయాన్ని బాబు దృష్టికి తీసుకెళ్లారు.