ఫోన్‌లో శుభాకాంక్షలు అందుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు బుధవారం కనులపండువగా జరిగాయి. తాడేపల్లిలోని నివాసంలో సీఎం జగన్‌తో పలువురు మంత్రులు, సీఎంవో అధికారులు కేక్ కట్ చేయించారు. ఇదే సమయంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు ఫోన్ చేసి సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. పాస్టర్ జాన్ వెస్లీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్‌కు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తానేటి వనిత, ఆర్కే రోజా, విడదల రజిని, జోగి రమేష్, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, బాలశౌరి, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు, సీఎం సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు) ఆర్.దనుంజయ్‌రెడ్డి, సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేక్ కట్ చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎదిగేకొద్దీ ఒదిగి ఉండటమే సీఎం నైజం..
ప్రజల్లో ఉండటం, ప్రజలకు సేవ చేయడంపైనే సీఎం వైఎస్ జగన్ దృష్టి పెట్టారని.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నదే ఆయన నైజమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం సీఎం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీగా తరలివచ్చి.. సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 500 కిలోల భారీ కేక్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు.
ఆయన మాట్లాడుతూ మూడున్నరేళ్లలోనే పల్లెల రూపురేఖలను మార్చారని.. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని వివరించారు. మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను నెరవేర్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కొందరు నాయకుల్లాగా సీఎం జగన్ ప్రజల్ని బెదిరించట్లేదని.. పాలన నచ్చితేనే వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరుతున్నారని.. ఇది నిజమైన రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణమన్నారు.అనంతరం పేదలకు దుస్తుల పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, నాయకులు చల్లా మధు, మర్రి రాజశేఖర్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, ‘నవరత్నాల’ మూర్తి, రవిచంద్రారెడ్డి, కాకుమాను రాజశేఖర్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, నారమల్లి పద్మజ, జియాఉద్దీన్, అడపా శేషు, మేడపాటి వెంకట్, పానుగంటి చైతన్య, కిరణ్‌రాజ్, దేవళ్ల రేవతి, శివశంకర్, ఈద రాజశేఖర్, మిమిక్రీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
తల్లి విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులతో సీఎం జగన్
హస్తినలోనూ ఘనంగా..
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఏపీ భవన్ అధికారులు, ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని.. కేక్ కట్ చేసి సీఎం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. భారత రాజకీయ వ్యవస్థలోనే జగన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు.
ప్రజా సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమని.. పేదల అభివృద్ధే ఆయన ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, తలారి రంగయ్య, రెడ్డప్ప, మాధవ్, గురుమూర్తి, సంజీవ్, లావు కృష్ణదేవరాయులు, శ్రీధర్, ఆర్.కృష్ణయ్య, కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పరశురామ్, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment