YS Jagan Mohan Reddy Birthday Special
-
లక్షల గళాల గర్జన
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పెత్తందార్లపై పోరుకు తామంతా సిద్ధమంటూ ఎమ్మిగనూరు వేదికగా లక్షలాది గొంతుకలు సింహగర్జన చేశాయి. పొత్తులు.. జిత్తులు.. మోసాలు.. కుట్రలను ఎదుర్కొని పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుఇవ్వడంతో లక్షల మంది పిడికిళ్లు బిగించి మేమంతా సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. చంద్రబాబు లాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను సిద్ధం... మీరంతా సిద్ధమైతే సెల్ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేయాలని సీఎం జగన్ కోరడంతో ఒక్కసారిగా లక్షల మంది సెల్ఫోన్లలో టార్చ్ లైట్ వెలిగించడంతో సభా ప్రాంగణం ఆకాశంలో చుక్కలను తలపించింది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో నిర్వహించిన సభలో కనిపించిన దృశ్యాలివీ.. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని ఎమ్మిగనూరు సభ మరోసారి చాటిచెప్పిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన విశ్వాసానికి ఇది ప్రతీకగా నిలిచిందని అభివర్ణిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర జైత్రయాత్రను తలపించింది. గురువారం పెంచికలపాడు వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం జగన్ రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కర్నూలు సిటీ, పాణ్యం, కోడుమూరు సహా పలు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఎన్నికల్లో విజయానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించి రామచంద్రాపురం మీదుగా కోడుమూరుకు చేరుకున్న సీఎం జగన్‌కు భారీ గజమాలతో అభిమానులు ఘనస్వాగతం పలికారు. కోడుమూరులో సీఎం జగన్ రోడ్ షోకు జనం బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో సాగుతున్నంత దూరం బస్సు ముందు చిన్నారులు కోలాటమాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది బారులుతీరి సీఎం జగన్‌పై బంతి పూలవర్షం కురిపించారు. చేనేత కార్మికులు చీరను, మగ్గాన్ని బహూకరించి సీఎం జగన్‌కు మద్దతు పలికారు. బుడగ జంగం సామాజికవర్గ ప్రజలు సీఎం జగన్‌ను కలిసిసంఘీభావం తెలిపారు. కురుబ సామాజికవర్గానికి చెందినవారు సీఎం జగన్‌కు మేకను బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కోడుమూరు నుంచి హంద్రీ కైరవాడి చేరుకునే సమయానికి ఎండ తీవ్రత పెరిగింది. ఎండను లెక్క చేయకుండా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, చిన్నారులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి సీఎం జగన్‌పై పూలవర్షం కురిపిస్తూ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు మేమంతా సిద్ధమంటూ... నినదించారు. గోనెగండ్లలోనూ సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనాలు పలికారు. అనంతరం సీఎం జగన్ భోజన విరామం తీసుకున్నారు. ఎమ్మిగనూరులో జన సునామీ.. భోజన విరామం అనంతరం రాళ్లదొడ్డి నుంచి బయలుదేరిన సీఎం జగన్ బస్సు యాత్రకు ఎర్రకోటలో జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ బస్సుపై బంతిపూలవర్షం కురిపించారు. షెడ్యూలు ప్రకారం బస్సు యాత్ర ఎమ్మిగనూరుకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, ప్రజలు అడుగడుగునా నీరాజనాలుపలకడంతో రెండుగంటలు ఆలస్యంగా 5.30 గంటలకు చేరుకుంది. సీఎం జగన్ ఎమ్మిగనూరుకు చేరుకునేసరికి కర్నూలు జిల్లా నలుమూల నుంచి లక్షల సంఖ్యలో జనవాహిని తరలిరావడంతో జనసంద్రాన్ని తలపించింది. ఉదయం 11 గంటల నుంచి ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి మొదలైన జనప్రవాహం సాయంత్రం 4.30 గంటలకు సునామీని తలపించింది. 30 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. పక్కనే పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కు, ఇరువైపులా రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎమ్మిగనూరు చరిత్రలో సీఎం జగన్ సభ సువర్ణాక్షరాలతో లిఖించేలా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జననేత కోసం నిరీక్షణ.. ఎమ్మిగనూరు సభ రాత్రి 7.20 గంటలకు ముగిసింది. అనంతరం బస్సుయాత్ర హనుమాపురం చేరుకుంది. సీఎం జగన్‌ను చూసేందుకు అవ్వతాతలు, మహిళలు, చిన్నారులు భారీ ఎత్తున రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. సీఎం జగన్ రాగానే బంతిపూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హనుమాపురం నుంచి ఆస్పరి చేరుకునే సరికి రాత్రి 8.30 గంటలైంది. బస్సు యాత్ర అక్కడికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. జన నీరాజనాల మధ్య చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా రాతన వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి రాత్రి 9.47 గంటలకు సీఎం జగన్ చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజక వర్గాల్లో సాగిన బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బస్సు యాత్ర శనివారం నాలుగో రోజు ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ బైపాస్ నుంచి ప్రారంభమై మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఉప్పొంగిన భావోద్వేగం ఐదేళ్ల పాలనలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేయడంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తెచ్చి పేదరికాన్ని రూపుమాపడం, రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన చర్యలను వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, తన ఫొటోతోపాటు సంతకం చేసిన లేఖను ఇంటింటికీ పంపిన చంద్రబాబు రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోభృతిగా ఇస్తానని, చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ చేస్తానని, అర్హులందరికీ మూడు సెంట్ల భూమి ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిస్తాననే ముఖ్యమైన హామీలతోపాటు 650 హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చకుండా వంచించటాన్ని ప్రస్తావించినప్పుడు లక్షల మంది ప్రజలు ఔనంటూ.. చేతులు ఎత్తి ఏకీభవించారు. ఇప్పుడు మళ్లీ అదే పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలతో సూపర్ సిక్స్ అంటూ మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని, వాటిని ఎదుర్కొని పేదల భవిష్యత్తును మరింతగా గొప్ప మార్చేందుకు వైఎస్సార్సీపీని గెలిపిచేందుకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపుతో మేమంతా సిద్ధమే.. అంటూ లక్షల గొంతుకలు ప్రతిస్పందించాయి. శింగనమలలో ఎస్సీ (మాదిగ) సామాజికవర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు వైఎస్సార్సీపీ టికెట్ ఇస్తే చంద్రబాబు ఎద్దేవా చేసి తన పెత్తందారీ పోకడలను రుజువు చేసుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. పేదవాడు పైకి ఎదిగితే ఎందుకంత మంట? అని నిలదీశారు. మడకశిరలో ఈర లక్కప్ప అనే ఉపాధి కూలీకి టికెట్ ఇచ్చామని, దాన్ని కూడా ఎద్దేవా చేస్తావా బాబూ? అని ప్రశ్నించారు. ‘‘నా...’’ అంటూ అక్కున చేర్చుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 200 శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో వంద సీట్లు ఇచ్చామని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ పేదల పార్టీ కాబట్టే సగం సీట్లు ఇచ్చామన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని అవహేళన చేయడంతోపాటు తోకలు కత్తిరిస్తానంటూ బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి, మైనార్టీలను అణగదొక్కిన చంద్రబాబు తోకను కత్తిరించేలా తీర్పు ఇవ్వాలని సీఎం జగన్ పిలుపునిచ్చి నప్పుడు మేమంతా సిద్ధమే అంటూ లక్షల గొంతుకలు నినదించాయి. -
క్రికెట్ అంటే చిన్ననాటి నుంచే మక్కువ! ఆంధ్ర క్రికెటర్ల కోసం రాష్ట్రంలో..
పాఠశాల స్థాయి నుంచే జగన్‌కు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ.. ముఖ్యంగా క్రికెట్ అంటే మరీ ఇష్టం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నిహితులు చెప్పే మాట ఇది! హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించిన వైఎస్ జగన్.. క్రికెట్‌తో పాటు బాస్కెల్ బాల్ వంటి ఇతర క్రీడల్లోనూ భాగమయ్యే వారు. ఆ సమయంలో వైఎస్ కుటుంబం బంజారాహిల్స్‌లో నివాసం ఉండేవారు. కేవలం పాఠశాలలోనే కాకుండా.. ఇంటి దగ్గర కూడా స్నేహ బృందం ఏర్పాటు చేసుకున్న జగన్.. వారితో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవారు. స్కూలైనా.. బయట అయినా ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో నాయకుడిగా ఉండేందుకే ఇష్టపడే జగన్.. హెచ్‌పీఎస్‌లో హౌజ్ కెప్టెన్‌గా అరుదైన ఘనత దక్కించుకున్నారు. పన్నెండవ తరగతిలో ఉన్నపుడు.. మిగితా మూడు హౌజ్‌ల జట్లను ఓడించి రెడ్ హౌజ్‌కు ఆల్‌రౌండర్ చాంపియన్‌షిప్ అందించారు జగన్. కేవలం ఆటలే కాకుండా వ్యాసరచన వంటి పోటీలలోనూ తమ టీమ్ ముందుండేలా చేసి తన నాయకత్వ పటిమతో టైటిల్ సాధించారు. ఈ విషయాలను యువకెరటం పుస్తకంలో ఎఎస్ఆర్ మూర్తి, బుర్రా విజయశేఖర్ వెల్లడించారు. ఏపీఎల్‌తో ఆంధ్ర క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడా రంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్లో ఆంధ్ర క్రీడాకారుల సంఖ్య పెరిగేలా చొరవ తీసుకుంటోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. సీఎస్కే ముందుకు వచ్చేలా చర్యలు ఇందులో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తోంది. అంతేకాదు.. విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మించే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. విశాఖలో ఉన్న వైఎస్సార్ స్టేడియంను క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉంది. అంతేకాదు రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇక వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట ఏసీఏ సరికొత్త క్రికెట్ టోర్నీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2022లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్‌లో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగాయి. విజయవంతంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లు అరంగేట్ర ఎడిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఏసీఏ.. తాజాగా రెండో సీజన్‌ను కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసింది. ఏపీఎల్ తొలి సీజన్లో కోస్టల్ రైడర్స్ విజేతగా నిలవగా.. ఈ ఏడాది రాయలసీమ కింగ్స్ టైటిల్ సాధించింది. కాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ రాణించిన ఆటగాళ్లకే ఇటీవలి కాలంలో బీసీసీఐ సెలక్టర్లు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఔత్సాహిక ఆంధ్ర క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడేలా ఏసీఏ ఇలా ఏపీఎల్ పేరిట తమ వంతు ప్రయత్నం చేస్తోంది. క్రికెట్ దిగ్గజాలను ఆహ్వానిస్తూ 1983 వరల్డ్‌కప్ విజేత క్రిష్ణమాచారి శ్రీకాంత్ సహా టీమిండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తదితరులను ఈ ఈవెంట్లకు ఆహ్వానించడం ద్వారా జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక.. కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీ క్రీడల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా పనిచేసిన ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం. ఏపీ సీఎం కప్, ఆడుదాం ఆంధ్రా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ ప్రభుత్వం.. ఏపీ సీఎం కప్ పేరిట క్రికెట్‌తో పాటు క్రికెటేతర క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడా ఆణిముత్యాలను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్రా పేరిట క్రీడా సంబరానికి శ్రీకారం చుట్టింది. అంబాసిడర్‌గా అంబటి రాయుడు ఈ ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో అరుదైన ఘనతలు సాధించిన అంబటి రాయుడిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి ఖ్యాతి తీసుకువచ్చిన పీవీ సింధు(బ్యాడ్మింటన్), జ్యోతి సురేఖ వెన్నం(ఆర్చరీ), కేఎస్ భరత్(క్రికెటర్) తదితరులను సమున్నతరీతిలో సత్కరించింది. -
రూ.13.11 లక్షల కోట్ల ఒప్పందాలు.. 1.47 లక్షల మందికి ఉపాధి
సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. ‘నాలుగు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు’ అనే కొత్త నిర్వచనంతో జగన్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. అరకొర విమర్శలు చేయడం పారిపాటిగా పెట్టుకున్న కొంతమందికి ఈ కింది గణాంకాలు చూసైనా అర్థం అవుతుందేమో చూడాలి. అభివృద్ది అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాల అభివృధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ.. రాష్ట్ర అభివృధికి అనుగుణంగా ఆ చట్టాను మారుస్తూ.. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు(జీఐఎస్)లో భాగంగా ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించాయి. అవి రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో దాదాపు 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆ యూనిట్లలో ప్రధానంగా గ్రీన్‌ల్యామ్, డీపీ చాక్లెట్స్, అగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరిజెస్, గోద్రెజ్ అగ్రోవెట్, ఆర్ఎస్బీ ట్రాన్స్ మిషన్స్, సూక్మా గామా, ఎల్ఎల్పీ వంటి సంస్థలు ఉన్నాయి. ఇవే కాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లకు భూ కేటాయింపు పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మరో 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. అదనంగా 194 యూనిట్లు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. జీఐఎస్‌లో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. స్థానికంగా పరిశ్రమల అభివృద్ధి.. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్‌ను ఆవిష్కరించనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెట్టుబడులు సమకూర్చడంలో మేటి.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ అక్టోబర్ నెలలో గుజరాత్ (రూ.25,685 కోట్లు) తర్వాత అధిక పెట్టుబడులు సమకూర్చిన రాష్ట్రాల్లో ఏపీ(రూ.19,187 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. దేశంలో విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో (రూ.72,622 కోట్లు) 56 శాతం ఖర్చుచేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి వ్యయంలో 54 శాతం ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. బాబు హయాంలో వచ్చిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.60 వేల కోట్లు. జగన్ హయాంలో రెండేళ్లు కరోనా ఉన్నా ఇప్పటికే దాదాపు రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బాబు ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.2 శాతంతో దేశంలో 22వ స్థానంలో ఉంటే, జగన్ ప్రభుత్వంలో 12.8 శాతం వృద్ధి రేటుతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. గతంలో కంటే భారీగా పెరిగిన ఎంఎస్ఎంఈలు.. అధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే, జగన్ పాలన వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరింది. సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్‌పీసీఎల్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. జీఎస్డీసీ సూచీలో బాబు దిగిపోయిన 2019లో ఏపీ 22వ స్థానంలో ఉంటే , 2021-22 నాటికి మొదటి స్థానానికి చేరుకుంది. రాష్ట్ర తలసరి ఆదాయంలో ఎల్లో ప్రభుత్వం నిష్క్రమించే నాటికి 17వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 9వ స్థానానికి వచ్చింది. గత ప్రభుత్వ ఒప్పందాల్లో వ్యాజ్యాల పరిష్కారం జగన్ ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్లు ఏర్పాటు చేస్తుంది. 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను గతంలో బాబు అదానీకు కట్టబెట్టాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) వాటి టెండర్లు, ఒప్పందాలన్నీ పర్యవేక్షించింది. ఈ తంతు 2018, 2019ల్లో జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్థ్యం గల 3 సోలార్ ప్రాజెక్టులకు సెకీ 2018లో టెండర్లు పూర్తి చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక సోలార్ప్రాజెక్ట్కు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఎస్బీ ఎనర్జీ సెవెన్ కంపెనీను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. ఇందులో అదానీకి ప్రత్యేకంగా కలిగిన లబ్ధి ఏమీ లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుల్లో ఆ కంపెనీలపై ఉన్న వ్యాజ్యాలను పరిష్కరించి జగన్ సర్కారు ప్రాజెక్టులను అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ చొరవతో చౌకైన విద్యుత్తు సెకీ ఒప్పందం వల్ల వ్యవసాయానికి కరెంటు లభిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే ఒప్పందాల ప్రకారం రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల వివిధ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ల వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. ఈ వ్యవహారంపై అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ప్రస్తుతం సగటు ధర యూనిట్‌కు రూ.5.10 ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది. -
CM Jagan: ఏపీకి జలాభిషేకం
సాక్షి, గుంటూరు: కడలి పాలవుతున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్ జలయజ్ఞం చేపట్టగా ఆయన తనయుడు సీఎం జగన్ ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నారు. ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందిస్తున్నారు. కోవిడ్, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి పనులను పరుగులెత్తించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2019, 2020, 2021, 2022 ఖరీఫ్, రబీతో కలిపి ఏటా కోటి ఎకరాలకు సీఎం జగన్ నీళ్లందించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రంలో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులతో ఏపీని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం జగన్ నిలిపారు. ♦ వైఎస్సార్ చేపట్టిన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లలో మిగిలిన పనులను సీఎం జగన్ పూర్తి చేసి 2022లో జాతికి అంకితమిచ్చారు. ♦ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులను నింపడం ద్వారా లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18న జాతికి అంకితం చేశారు. ♦ గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్‌ను పూర్తి చేసి నవంబర్ 30న జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమం చేశారు. ♦ వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021 జనవరి 13 నాటికే సీఎం జగన్ పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లో 7.506 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. ♦విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల దాహంతో పోలవరాన్ని నీరుగార్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక అప్రోచ్ ఛానల్, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021లో గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించారు. బాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగా«దాలను పూడ్చి యధాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. నీటి పారుదలలో రికార్డు ♦ కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును దివంగత వైఎస్సార్ సాకారం చేశారు. గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించిన సీఎం జగన్ 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించేందుకు మార్గం సుగమం చేశారు. ♦ గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్ గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ♦ తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్‌కు రూ.500 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌ను నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ♦ గత నాలుగున్నరేళ్లలో ఆరు రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వకు మార్గం సుగమం చేయడం ద్వారా నీటి పారుదల రంగ చరిత్రలో సీఎం జగన్ రికార్డు సృష్టించారు. -
CM Jagan: అన్నదాతకు అభయం
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) అన్నదాతకు అభయమిస్తున్నాయి. రాత్రనకా, పగలనకా సేద్యం చేసి ఉత్పత్తి చేసిన పంటలకు గిట్టుబడి లేక సతమతమయ్యే రైతన్న పాలిట భరోసా కల్పిస్తున్నాయి. విత్తు నుంచి పంట విక్రయం వరకు ప్రతీ రైతును గ్రామస్థాయిలో చేయి పట్టి నడిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎండనక, వాననక సొసైటీల వద్ద పడిగాపులు పడితే తప్ప విత్తనాలు దొరికేవి కావు. కానీ ప్రస్తుతం ఆర్బీకేల రాకతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎరువుల కోసం అర్రులు చాస్తూ క్యూలైన్లలో నిలబడే దృశ్యాలు మచ్చుకైనా కన్పించడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి న తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేసి వాటి స్వరూపాన్ని మార్చేసింది. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది. ఆర్బీకేల్లో రాయితీలో అందించిన విత్తనాల వివరాలు ♦ రైతుల సంఖ్య: 54.34 లక్షలు ♦ లబ్ధి: రూ. 881.47 కోట్లు ♦ పంపిణీ చేసిన విత్తనాలు: 31.16 లక్షలు (క్వింటాళ్లలో) ♦ ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్లు – 421వాటికైన ఖర్చు–రూ.63.15 కోట్లు ♦ ఈ సెంటర్లలో సేవలు పొందిన రైతులు–4 లక్షల మంది ♦ రూ.5.37 కోట్లతో ఏర్పాటైన శీతల గిడ్డంగుల సంఖ్య: 43 ♦ 30.99 లక్షల మంది రైతులకు రూ.1,289.52 కోట్ల విలువైన 11.66 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ రైతన్నకు భరోసా ఇలా.. ♦ రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు 6.19 లక్షల మందికి రూ.715.84 కోట్లు ♦ క్లైయిమ్లు, సెటిల్మెంట్లు, చెల్లింపుల్లో తొలి ఏడాది రైతుల వాటాతో కలిపి ప్రభుత్వం చెల్లించిన బకాయిలు – రూ.971 కోట్లు ♦ ఏటా సగటున 13.62 లక్షల మందికి రూ.1,950.51 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు చేకూరిన లబ్ధి – రూ.7,802.05 కోట్లు ♦ 2023–24 రూపాయి ప్రీమియంతో బీమా కల్పిస్తూ ఏపీ మోడల్లో నడిచే రాష్ట్రాలు– మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ ఏపీ మాదిరిగా ఈ పంట నమోదు చేస్తున్న రాష్ట్రాలు – తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ♦ భూముల్లేని కౌలుదారులకు ఈ–క్రాప్ ప్రామాణికంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ ♦ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ♦ రూ.లక్ష లోపు రుణాలు తీసుకుని చెల్లించిన రైతుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ జమ ♦ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం ♦ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ చివరలో ఇన్పుట్ సబ్సిడీ ♦ సీజన్‌కు ముందుగానే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం ♦ యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం అంగీకరించకపోవడంతో మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లింపు ♦ 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు ♦ ప్రతి ఎకరాకు ఈ క్రాప్ ఆధారంగా యూనివర్శల్ బీమా కవరేజ్‌ను కల్పిస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీయే ♦ ఏటా లబ్దిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ అభ్యంతరాలు పరిష్కారం ♦ ఎన్నికల హామీ మేరకు 2019 ఖరీఫ్ సీజన్లో రూపాయి ప్రీమియంతో పథకం ♦ ఈ– పంట నమోదే అర్హతగా ఉచితంగా బీమా కవరేజ్ కల్పిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం. ఆదర్శం.. ‘ఫిష్ ఆంధ్ర’ ♦ రాష్ట్రంలో ఏటా 50 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులతో దేశంలోనే మొదటి స్థానం. ♦ ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పానికి పదును. ♦రూ.కోటి అంచనాతో జిల్లాకో ఆక్వా హబ్.. ♦జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్‌లు. 4,007 ఫిష్ ఆంధ్రా మినీ అవుట్‌లెñట్స్ ♦ 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం ♦ వీటికి అనుబంధంగా రిటైల్ మినీ అవుట్‌లెట్స్, ఈ మొబైల్ త్రీ వీలర్, 4 వీలర్ ఫిష్ వెండింగ్ డెయిలీ యూనిట్లు, ఏర్పాటు. ‘ఫిష్ ఆంధ్ర’లో ఏమేమి దొరుకుతాయి... మెత్తళ్లు, పండుగప్పలు, కాలువ రొయ్యలు, సముద్ర పీతలు, టూనా, కోనాం చేపలు ఇలా ఏది కావాలన్నా తాజాగా బతికున్నవి లభ్యం. రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ క్రమేపీ పెరుగుదల. ఆక్వా రైతు ఆనందం ఈ–ఫిష్ సర్వే ఆధారంగారాష్ట్రంలో ఆక్వా సాగు పరిస్థితి సాగు విస్తీర్ణం:4,65,877.54 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలోని భూమి:4,22,309.63 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం:3,56,278 ఎకరాలు పదెకరాల పైబడి విస్తీర్ణం:6,60,321.63 ఎకరాలు నాన్ ఆక్వాజోన్ పరిధిలోని భూమి: 43,567.91 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం: 23,042.02 ఎకరాలు పదెకరాలకు పైబడి విస్తీర్ణం:20,524.89 ఎకరాలు మొత్తం విద్యుత్ కనెక్షన్లు: 64,645 సబ్సిడీ పరిధిలోని కనెక్షన్లు: 50,659 -
CM Jagan: ఏపీ ‘క్లిక్’ అయిందిలా..
సుమతి రోడ్డుమీద వెళుతుండగా ఆకతాయిలు ఫాలో అవుతున్నారు. భయం వేసింది. చేతిలోని ఫోన్లో ఓ బటన్ నొక్కింది. ఐదు నిమిషాలు గడవకముందే పోలీసులొచ్చారు. ఆకతాయిల్ని పట్టుకుని బుద్ధి చెప్పారు. ఇదంతా.. ‘దిశ’ టెక్నాలజీతోనే సాధ్యమయింది. సుమతి దిశ యాప్‌లోని బటన్‌ను ప్రెస్ చేయటంతో అది పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు సమాచారం పంపింది. అక్కడి నుంచి దగ్గర్లోని పెట్రోలింగ్ బృందానికి మెసేజ్ వెళ్లింది. అంతా క్షణాల్లో జరిగిపోవటంతో.. సుమతికి ఆపద తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్‌ను.. 1.46 కోట్ల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిద్వారా అలెర్ట్ రావటంతో... 31,541 ఘటనల్లో పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ!. ఐటీ. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చింది తానేనంటారు చంద్రబాబు. ఈ క్లెయిమ్‌పై ఉన్న విభిన్న వాదనలనిక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరి 2014 నుంచీ ఏపీ ముఖ్యమంత్రిగాఉన్నపుడు ఐటీని ఏం చేశారు? ప్రపంచమంతా కొత్త ఆవిష్కరణలతో పరుగులు తీస్తున్నపుడు ఇక్కడ మాత్రం అన్నీ మాటలే తప్ప చేతల్లో ఎందుకు కనిపించలేదు? ఐటీకి పితామహుడినని చెప్పారే తప్ప... కొత్తగా టెక్నాలజీని వినియోగించిందెక్కడ? సువిశాల తీరం ఉందని... దాన్నే అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని పదే పదే చెప్పారు తప్ప ఒక్క పోర్టును గానీ, హార్బర్‌ను గానీ తేలేదెందుకు? మరి వైఎస్ జగన్ మాత్రం మాటలు చెప్పకుండా ప్రతి విభాగంలోనూ టెక్నాలజీని సమర్థంగా అమలు చేస్తున్నారు కదా? కొత్త పోర్టులు, హార్బర్లను తెచ్చారు కదా? మనకు కావాల్సింది హోరెత్తించే మాటలా..? కళ్లముందు కనిపించే నిజాలా? రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో 93,29,128 ఎకరాల్లో పంటలు వేశారు. దీన్లో వరి 32,83,593 ఎకరాల్లోను... వేరు శనక 5,93166 ఎకరాల్లోను వేశారు. ఈ లెక్కల్లో ఒక్క ఎకరా కూడా తేడా లేదు. ఎందుకంటే ‘ఈ–క్రాప్’ టెక్నాలజీ ఉందిప్పుడు. ప్రతి రైతూ తన పంటను నమోదు చేసుకునే ఈ పటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థతో... రాష్ట్రంలోని 27,800 గ్రామాల్లో ఉన్న ప్రతి ఎకరాకూ లెక్క ఉంది. అది బీమాకైనా... పంట నష్టానికైనా.. దిగుబడికైనా. ఈ ఉదాహరణలన్నీ చూస్తే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ టెక్నాలజీని ఎంత సమర్థంగా వినియోగిస్తోందో అర్థమవుతుంది. భారీ ఎత్తున ఐటీ కాంట్రాక్టులివ్వకుండా, ఉన్న వనరులను... నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సేవలను సమర్థంగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విభాగంలోనూ పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడుతోంది. అందుకనే... మునుపెన్నడూ చూడని పారదర్శకత, జవాబుదారీతనం ఇపుడు కనిపిస్తోంది. చేసిన పని పావలాదే అయినా... పదిరూపాయల ప్రచారం చేసుకోవటమనేది ఈ ప్రభుత్వ విధానం కాదు కాబట్టే.. పెద్దపెద్ద ఆరంభాలు, ఆర్భాటాలు లేకుండానే ప్రజలకు సమర్థమైన ఐటీ సేవలు అందుతున్నాయి. ఏఎన్ఎం యాప్‌లో 15 మాడ్యూల్స్... 2020లో ప్రభుత్వం రూపొందించిన ఏఎన్ఎం యాప్ ద్వారా... క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యక్రమాన్నీ వారు రిపోర్ట్ చేస్తుంటారు. ఎన్సీడీ–సీడీ సర్వే, ఫీవర్ సర్వే, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్, ఆరోగ్యశ్రీ ఫీడ్ బ్యాక్ ఇలా అన్నిటినీ నమోదు చేస్తారు. ఆశా వర్కర్లకు తెచ్చిన ‘ఈ–ఆశా’ యాప్ ద్వారా గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యాన్ని వైద్యశాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకూ యాప్‌లున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయి. స్కూళ్లకు పక్కా సమాచార వ్యవస్థ... ఈ ప్రభుత్వం తెచ్చిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం(సిమ్స్)లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఉన్న 82 లక్షల విద్యార్థుల వివరాలు అప్ టు డేట్‌గా ఉన్నాయి. విద్యార్థుల ఆధార్‌ను లింక్ చేస్తూ... ప్రత్యేక ఐడీ నెంబర్ కేటాయించారు. దీంతో స్టూడెంట్ హాజరు యాప్ ద్వారా ట్రాక్ చెయ్యటం... గ్రామ/వార్డు కార్యదర్శుల ద్వారా వారిని తిరిగి బడికి రప్పించటం సులువవుతోంది. ఇక టీచర్ల అటెండెన్స్కూ యాప్ ఉంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో అనుసంధానించిన ఈ యాప్... టీచర్ తమ స్కూల్ పరిసరాలకు 10 మీటర్ల దూరంలో ఉంటేనే హాజరును తీసుకుంటుంది. జగనన్న గోరుముద్ద అమలును పర్యవేక్షించడానికి ‘ఇంటిగ్రేటెడ్ మోనిటరింగ్ సిస్టం ఫర్ మిడ్డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) వచ్చింది. వారంలో ఆరు రోజులు.. రోజుకు సగటున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారం తీసుకుంటున్నారు. టీచర్ల ఫోన్లోని ఈ యాప్ ద్వారా... హాజరుతో పాటు ఎంతమంది పిల్లలు ఆహారం తీసుకుంటున్నారు? ఏరోజు ఏం వడ్డించారు, ఇచ్చిన సరుకు ఎంత? ఎంత స్టాక్ ఉంది? వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ప్రతిరోజు టాయిలెట్ల పరిస్థితులూ అప్డేట్ అవుతాయి. ఎంప్లాయి ఇన్ఫర్మేషన్ సిస్టంలో టీచర్ల çహాజరుతో పాటు ఎన్ఓసీ, సెలవులు, మెడికల్ రీయింబర్స్మెంట్, గ్రీవెన్స్ సహా సర్వీసు రికార్డు మొత్తం ఉంటోంది. ♦ చైల్డ్ ఇన్ఫో సిస్టంలో విద్యార్థులు ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్‌కు మారారు. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా లింకేజ్ వంటివన్నీ ఉంటాయి. ♦ జేవీకే యాప్ ద్వారా ప్రతి స్కూల్లో అవసరమైన జగనన్న విద్యాకానుక కిట్లు ఎన్ని? ఎన్ని అందించారు? ఎన్ని మిగిలాయి? వంటివన్నీ తెలుస్తాయి. పైపెచ్చు ఈ వ్యవస్థలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున నియమించి ఇబ్రహీంపట్నం, విశాఖపట్నంలో రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లున్నాయి. బడుల్లో టీచర్లు, పిల్లల అటెండెన్స్ వేశాక అది ఈ సెంటర్లకు వెళుతుంది. టెక్నాలజీతో రైతుకు దన్ను... ‘ఈ–కర్షక్’ యాప్‌తో ఆర్బీకేలో రైతులు సీజన్లో తాము సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసుకుంటారు. తర్వాత ఆర్బీకే సిబ్బంది పొలాలకు వెళ్లి స్వయంగా జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్ ద్వారా రైతుసాగు చేసే పంట పొలం విస్తీర్ణం, సర్వే నెంబర్‌తో పాటు పంట వివరాలనూ ధ్రువీకరిస్తారు. పొలం ఫోటో డిజిటైజ్ చేస్తారు. ♦ఆర్బీకేల్లోని వెటర్నరీ సహాయకుల పనితీరును పర్యవేక్షించడానికి ‘పశు సంరక్షక్’ యాప్ ఉంది. ♦రోజువారీ వ్యవసాయ పంటల హెచ్చుతగ్గులను పర్యవేక్షించడానికి మార్కెటింగ్ శాఖ ‘కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్స్’ (సీఎంయాప్)ను తీసుకొచ్చింది. ♦‘ఈ–మత్స్యకార’ పోర్టల్‌ను వివిధ యాప్‌లతో అనుసంధానించారు. అప్సడా రిజిస్ట్రేషన్లు, ఆర్బీకే ఇన్పుట్ సప్లయి, ఈక్రాప్, మత్స్య సాగుబడి, కేసీసీ, పీఎంఎంఎస్వై వంటివన్నీ దీని ద్వారానే నిర్వహిస్తున్నారు. ♦‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ యాప్‌తో 55607 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. అర చేతిలో ఆరోగ్యశ్రీ... ఆరోగ్య శ్రీ యాప్‌లో లాగిన్ అయితే... తాము గతంలో ఏ చికిత్స పొందామన్నది లబ్ధిదారులు తెలుసుకోవచ్చు. పథకం కింద ఏ ఆస్పత్రుల్లో ఏ వైద్య సేవలు అందుతాయి? దగ్గర్లో నెట్వర్క్ ఆసుపత్రులు ఏమేం ఉన్నాయి? తెలుసుకోవచ్చు. వాటి లొకేషన్‌నూ ట్రాక్ చేయొచ్చు. ‘ఈహెచ్‌ఆర్– డాక్టర్ కేర్’ ఆన్లైన్ వేదికతో యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో డిజిటల్ వైద్య సేవలందుతున్నాయి. ఈ పోర్టల్ నుంచి రోగులకు అందించిన వైద్యం వివరాలను వారి ఆయుష్మాన్ భారత హెల్త్ ఖాతాలో అప్లోడ్ చేస్తున్నారు. ల్యాబ్ టెస్ట్‌ల ఫలితాలు ఈహెచ్‌ఆర్ నుంచి నేరుగా రోగుల మొబైల్‌కే ఎస్సెమ్మెస్ ద్వారా వెళుతున్నాయి. క్రొంగొత్తగా... రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశంలో దస్తావేజులు రాయటానికి కొన్ని స్టార్టప్‌లు ఆన్లైన్ రైటర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇక్కడ ప్రభుత్వమే ఆ పనిచేసింది. ‘కార్డ్ ప్రైమ్’ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా డిజిటలైజ్ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం... వినియోగదారులు ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా ఆన్లైన్లో డాక్యుమెంట్లు తయారు చేసుకునే వీలు కల్పించింది. ఆన్లైన్లోనే చలానాలు కట్టి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ టైమ్‌లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళితే అరగంటలో పని పూర్తవుతుంది. గతంలోలా డాక్యుమెంట్ల స్కానింగ్ అక్కర్లేదు కూడా. డిజిటల్ సిగ్నేచర్ ఒక్కటీ చాలు. ♦ఇక వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆటో మ్యుటేషన్ జరిగే కొత్త విధానాన్ని తెచ్చిందీ ప్రభుత్వం. గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులకిస్తే వాళ్లు మ్యుటేషన్ చేసేవారు. దీనికి సమయం పట్టేది. ఇప్పుడా అవసరం లేదు. ♦స్టాంపు పేపర్ల స్థానంలో ఈ స్టాంపింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. గతంలో భౌతికంగా స్టాంపులు కొని, వాటి ద్వారా అగ్రిమెంట్లు చేసుకునేవారు. ఇప్పుడు స్టాంపు పేపర్లతో పని లేదు. కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద కూడా ఈ–స్టాంపింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్టాంపు పేపర్ల అవకతవకలకు చెక్ పడింది. ♦భూముల రీ సర్వే ద్వారా ఏ రాష్ట్రంలో లేని విధంగా డిజిటల్ రెవెన్యూ రికార్డులు తయారవుతున్నాయి. డ్రోన్లతో సర్వే చేసి శాటిలైట్ లింకు ద్వారా జియో కోఆర్డినేట్స్‌తో రైతుల భూముల హద్దులు నిర్ధారిస్తున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో యునిక్ ఐడీ ఉంటోంది. -
ఇదీ.. జగన్ కమిట్మెంట్
ఒకపక్క.. రోజుకు వంద రూపాయల సంపాదన కూడా లేక.. కనీస అవసరాలని చెప్పే తిండి, ఇల్లు, దుస్తులకు కూడా నోచుకోని జనం లెక్కించలేనంత మంది. మరోపక్క.. రోజుకు లక్ష రూపాయలు సైతం గ్యాంబ్లింగ్‌లో పోగొట్టుకుని చింతలేకుండా గడిపేసే శ్రీమంతులూ లెక్క లేనంతమంది. ఇదీ.. మన సమాజంలో ఉన్న విభజన. నానాటికీ పెద్దదవుతున్న ఈ రేఖ చెరిగేంతవరకూ అభివృద్ధి చెందిన దేశంగానో, రాష్ట్రంగానో మారటం అసాధ్యం. కనీస అవసరాలు తీర్చుకోలేని కోట్లాది మందిని విడిచిపెట్టేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆ అభివృద్ధిలో వాళ్లకూ వాటా ఉండాలి. ఆ స్థాయికి వాళ్లను తీసుకురావాలి. వాస్తవానికి సంక్షేమ పథకాల పరమార్థం ఇదే. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నది ఆ అభివృద్ధే. చదువుతోనే తలరాత మారుతుంది దీన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాబట్టే తన పిల్లలిద్దరినీ టాపర్లుగా నిలబెట్టగలిగారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకూ సరైన విద్యనందించాలన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ‘అమ్మ ఒడి’ని ప్రతిపాదించారు. చేతిలో డబ్బుల్లేక చిన్న పిల్లల్ని సైతం కూలికి పంపే పరిస్థితిని మార్చాలన్నదే దీనివెనకున్న ఆలోచన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీన్ని ఆచరణలోకి తెచ్చారు. ఆశించినట్టే ‘అమ్మ ఒడి’ ఊతంతో పిల్లలు బడి బాట పట్టారు. మరి ఇది సరిపోతుందా? ఇదిగో.. ఈ ఆలోచనే విద్యారంగంలో పెను సంస్కరణలకు బీజం వేసింది. స్కూళ్లకొచ్చే పిల్లల కడుపు నిండితేనే చదువు ఒంట బడుతుందన్న ఆలోచన.. పౌష్టికాహారంతో కూడిన ‘గోరుముద్ద’కు ప్రాణం పోసింది. బళ్లు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలెలా చదువుతారు? ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు, బ్యాగులతో వస్తే.. ఒకరు షూ వేసుకుని, మరొకరు చెప్పులు లేకుండా వస్తే అంతా ఒక్కటేనన్న భావన ఎందుకొస్తుంది? వీటన్నిటికీ సమాధానమే.. స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికీ అందుతున్న ‘విద్యా కానుక’. సరే! మరి స్కూళ్లో? తమ వారి ప్రయివేటు ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాలు వాటిని చిత్రవధ చేసి చంపేశాయిగా? ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికెళ్లాలి. సరైన గదుల్లేవు. బెంచీలు, బ్లాక్ బోర్డులు అన్నీ అంతంతే! ఎందుకెళ్లాలి?... అనిపించేలా ఉన్నాయి మన బడులు. వీటిని మార్చాలనుకున్నారు జగన్. అందుకే.. ‘నాడు–నేడు’ పేరిట ఓ యజ్ఞాన్ని ఆరంభించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావటంతో.. దశల వారీగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. స్కూళ్లకు వస్తున్నారు. భోజనం, దుస్తులు ఓకే. స్కూళ్లూ మారాయి. మరి చదువో! మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ రావాలి. వస్తేనే రాణించగలరు. అంతర్జాతీయంగానూ పోటీ పడగలరు. అందుకే ప్రయివేటు స్కూళ్లకు మల్లే ప్రీప్రయిమరీ–1,2 తరగతులు వచ్చాయి. ఆది నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలయింది. ఇలాగైతే ప్రయివేటు స్కూళ్లకు ఎవరూ రారు కనక.. మాతృభాషపై మమకారం లేదంటూ, ఇంగ్లీషు చదువులు వద్దంటూ మాఫియా గాళ్లంతా కలిసి మాయా యుద్ధానికి దిగారు. కేసులు వేశారు. అయినా సరే.. జగన్ సంకల్పం గట్టిది కావటంతో ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడితో ఆగలేదు జగన్. అగ్రశ్రేణి కార్పొరేట్ స్కూళ్లలోనే దొరికే ఎడ్యుటెక్ కంటెంట్‌ను దిగ్గజ సంస్థ ‘బైజూస్’ ద్వారా మన పిల్లలకూ అందుబాటులోకి తెచ్చారు. ఏటా 8వ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్‌లనూ అందజేస్తున్నారు. మిగిలిన తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ క్లాస్రూమ్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. పిల్లల చదువుపై సీఎం జగన్‌కు అంతులేని నిబద్ధత ఉంది. చదివించటం ద్వారా వారి రాతలను మార్చాలన్న తపనతో.. యావత్తు విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించటం మొదలెట్టారు. ఇదంతా చేసింది జస్ట్ నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే! వైద్యం.. ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకైనా.. సరైన వైద్యం చేయించుకోవటానికైనా పేదరికం అడ్డు కాకూడదని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని జగన్ భావించారు. అందుకే.. వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య సేవలకు అదొక బీజం మాత్రమే. అక్కడి నుంచి మొదలుపెడితే.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ పోయింది. ఆసుపత్రులన్నీ స్కూళ్ల మాదిరే ‘నాడు–నేడు’ కింద కొత్త రూపాన్ని, కొత్త సౌకర్యాలను సంతరించుకున్నాయి. ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు... ఇలా ప్రతి పోస్టూ భర్తీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీతో పాటు.. అత్యాధునిక పరికరాలనూ తీసుకొచ్చారు. యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని కూడా కోవిడ్ వణికించినపుడు వీళ్లంతా కలిసి వలంటీర్ల సాయంతో ఎంత అద్భుతం చేశారన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి, సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స తీసుకుని వెళ్లారంటే.. అది రాష్ట్రంలో వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన పక్కా వ్యవస్థ వల్లేనన్నది కాదనలేని నిజం. అంతేకాదు.. గ్రామ స్థాయి నుంచీ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. ఏకంగా 1,405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. ప్రతి చోటా వైద్యులొచ్చారు. ఉచిత మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు విదేశాల్లోనే కనిపించే ‘ఫ్యామిలీ డాక్టర్’... మన ఊళ్లలో ప్రతి ఇంటికీ అందుబాటులోకి వచ్చారు. రాష్ట్రంలో ఇపుడు నిరుపేదలందరికీ కావాలనుకున్న వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్.. అదీ ఉచితంగా దొరుకుతోందంటే.. అదే వైఎస్ జగన్ విజన్. పరిస్థితులు మారి... కొన్ని చికిత్సలకు వ్యయం ఎక్కువవుతోందని గ్రహించటంతో ఇపుడు ఆరోగ్య శ్రీ చికిత్సకయ్యే ఖర్చును ఏకంగా రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చికిత్సా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా చికిత్స ప్రకిరయలను సైతం 1,059 నుంచి 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 820 నుంచి 2,513కి పెంచారు. నాలుగున్నరేళ్లలో ఇవన్నీ చేయాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి మరి! ఇదీ వ్యవ‘సాయం’ అంటే.. దేశానికి రైతే వెన్నెముక. వైఎస్సార్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏడాదికి రెండుసార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడిగా రూ.12,500 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. దాన్ని మరో రూ.వెయ్యి పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ ఆపకుండా మరీ అమల్లోకి తెచ్చారు. నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలూ అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని సంకల్పించారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోశారు. రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్‌స్టాప్ పరిష్కారంగా ఉండాలని భావించారు. నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు, పురుగు మందులు దొరుకుతాయి. భూసార పరీక్ష కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు, ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్నిచోట్ల ఆర్బీకేలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ. రైతును విత్తు నుంచి పండిన పంటను విక్రయించుకునేదాకా చేయిపట్టి నడిపించే అమ్మ, నాన్న.. అన్నీ. మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రస్ఫుటమైంది. సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుపాన్లు దెబ్బతీసినా.. తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ అతివేగంగా సాయం అందించటంతో పాటు ప్రతి ఎకరాకూ ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించటం, ఒక సీజన్లో జరిగిన నష్టానికి మళ్లీ ఆ సీజన్ రాకముందే పరిహారాన్ని అందించటం.. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించటం.. ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ‘ఈ–క్రాప్’ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ఇదీ విజన్ అంటే. వికేంద్రీకరణకు కొత్త అర్థం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వమిచ్చే పింఛన్లంటే ఇదివరకు ఓ మహా ప్రహసనం. పట్టణాల్లోనైతే బ్యాంకుల ముందు పడిగాపులు. పల్లెల్లోనైతే ఇచ్చే వ్యక్తి ఏ రోజున వస్తాడో తెలియని దైన్యం. అసలే వాళ్లు వృద్ధులు, దివ్యాంగులు. అలాంటి వారికిచ్చే సాయమేదైనా వారికి సాంత్వన కలిగించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు కదా? ఇదిగో.. ఈ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సైన్యాన్ని సృష్టించారు. ప్రతినెలా ఒకటవ తేదీన ఠంచనుగా ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయటం ఈ సైన్యం బాధ్యత. ఆ తరవాత..! ఆ వలంటీర్లు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యారు. పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీరు. ప్రభుత్వానికి – ఆ గడపలకు తనే సంధానకర్త. సూక్ష్మ స్థాయిలో వికేంద్రీకరణ ఫలితాలను కళ్లకు కట్టిన వలంటీర్ల మాదిరే... గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువ చేయడానికి వలంటీర్లయితే... ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి చేర్చేది గ్రామ సచివాలయాలు. అవసరమైన సర్టిఫికెట్ల నుంచి స్థానికంగా కావాల్సిన సేవలూ అక్కడే. ఈ వ్యవస్థ ఆలోచనతో ఏకంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా యువత ఉన్న ఊళ్లోనే ఉద్యోగాలు తెచ్చుకుని కొలువుల్లో స్థిరపడింది. అక్కడితో ఆగకుండా గ్రామాల్లో రైతుల కోసం ఆర్బీకేలు, వైద్య సేవల కోసం పీహెచ్‌సీలు నిర్మించి, యావత్తు గ్రామ వ్యవస్థను బలోపేతం చేశారు జగన్. అందుకే ఇపుడు పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. పల్లెల నుంచి వలసలు తగ్గాయి. ఒక బలమైన ఆలోచన... దాని ద్వారా మరింత మంచి చేయాలన్న తపన... ఈ రెండూ ఉంటే ఎంతటి అద్భుతమైన వ్యవస్థలను నిర్మించవచ్చో చేసి చూపించారు జగన్. అందుకే ప్రతి రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ♦ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.2,43,958.04 కోట్లు ♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 8,29,81,601 ♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.4,11,488.99 కోట్లు ♦ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.1,67,530.95 కోట్లు ♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 4,44,04,251 ♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి 2, 3 పథకాల ద్వారా లబ్ధి) 12,73,85,852 -రమణమూర్తి మంథా -
CM Jagan: ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రగతిపథంలోనే..
ఆంధ్రప్రదేశ్ విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, కార్మికరంగం.. ఇలా ఏ రంగంలో చూసిన గతంతోపోలిస్తే అభివృద్ధి చెందింది. కొవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నా..ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా దేశంలోని కొన్ని రాష్ట్రాలు తిరిగి వాటి పూర్వస్థితి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో రంగాల్లో ముందుంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలంటే వివిధ శాఖల అనుమతులు అవసరం అవుతాయి. అవి పొందాలంటే యాజమాన్యాలకు కొంత శ్రమతో కూడుకున్న వ్యవహరం. అయితే వీటన్నిటినీ కేంద్రీకృతం చేసి ఇండస్ట్రీయల్ సింగిల్ విండో క్లియరెన్స్‌ను అమలులోకి తెచ్చిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రం. సోలార్ పవర్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రత్యేక చట్టాలను చేసింది. 2023-24 సంవత్సరానికిగాను స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.14,49,501 కోట్లుగా ఉంది. ఇది చంద్రబాబు పాలన ముగిసిన 2018-19కి గాను రూ.8,70,849 కోట్లుగా ఉండేది. గడిచిన ఈ కొన్నేళ్లలో ఇది దాదాపు 65 శాతం ఎక్కువ. 2021-22లో స్థూల విలువ ఆధారిత (జీవీఏ)వృద్ధి 18.47%గా ఉంది. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా నాణ్యమైన మౌలిక సదుపాయాలను సృష్టించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2023 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.6వేల కోట్లు. 2023లో రాష్ట్ర సరుకుల ఎగుమతులు రూ.1.58లక్షల కోట్లు. ఇందులో గరిష్ఠంగా సముద్ర ఉత్పత్తుల వల్ల దాదాపు 13.62% వాటా చేకూరింది. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా రూ.22,282.16 కోట్లతో భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు స్థాపించేలా ప్రభుత్వం కృషిచేసింది. టీడీపీ హయాంలో పరిశ్రమల అభివృద్ధిలో 27వ స్థానానికి దిగజారిన రాష్ట్రం.. ప్రస్తుతం జగన్ పాలనలో మూడో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 2023 నాటికి, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 26,675.73 మెగావాట్లు. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో 17 స్థానంలో నిలిచిన రాష్ట్రం ప్రస్తుతం 9వ స్థానానికి ఎదిగింది. చంద్రబాబు ప్రభుత్వకాలంలో కేవలం 34000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.93లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. అందులో 2.13లక్షల శాశ్వత కొలువులు ఉన్నాయి. వ్యవసాయంలో రాష్ట్రం టీడీపీ కాలంలో మైనస్ 6.5శాతంతో అధ్వానంగా మారింది. అదే 2021-22కు గాను 8.2 శాతం వృద్ధి చెందింది. దాంతో వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2022-23కుగాను వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రూ.13,640 కోట్లు కేటాయించారు. ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వం.. -
భారత జట్టులోనూ ‘వై నాట్ ఏపీ’.. సీఎం జగన్ విజన్!
‘‘పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువే’’... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచూ చెప్పే మాట. ఓట్లు వేసిన ‘పెద్దోళ్ల’కు ఇచ్చిన హామీలే నెరవేర్చని నాయకులు ఉన్న ఈరోజుల్లో.. ఓటు హక్కులేని పిల్లల గురించే ఎక్కువగా ఆలోచించడం ఆయనకే చెల్లింది. నేటి బాలలే.. రేపటి పౌరులు కదా.. అందుకే చిన్ననాటి నుంచే వారిని మెరికల్లా తీర్చిదిద్దడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించేలా ఇప్పటికే విద్యా వ్యవస్థలో ఆంగ్ల మాధ్యమం వంటి పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బాలల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారు. అంతేకాదు.. నాడు- నేడు పేరిట పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి ఉన్న యువత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఉన్నారు సీఎం జగన్. అందుకు అనుగుణంగా ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కీలకమైన ప్రతీ క్రీడాంశంలో భాగమైన భారత జట్టులో ‘వై నాట్ ఏపీ’ అనే స్థాయికి ఎదగాలంటే క్షేత్రస్థాయి నుంచే బలమైన పునాదులు పడాలన్న తలంపుతో ముందుకు సాగుతున్నారు. అంబటి రాయుడు, పీవీ సింధు, జ్యోతి సురేఖ, హనుమ విహారి, జ్యోతి యర్రాజీ, కోన శ్రీకర్ భరత్, సాత్విక్ సాయిరాజ్‌లా తాము తమకిష్టమైన స్పోర్ట్‌లో రాణించాలనుకునే వాళ్ల కోసమే ఈ క్రీడా సంబరాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా.. క్రికెట్, ఖో ఖో, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ వంటి ఐదు క్రీడాంశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోటీలు నిర్వహించనుంది. కనీవినీ ఎరుగని రీతిలో క్రీడా సంబరానికి నాంది ఇందుకోసం ఇప్పటికే ముప్పై లక్షలకు పైగా మంది ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడిచే మెగా ఈవెంట్లో మండల, మున్సిపల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం.. క్రీడాకారులకు రూ. 41.43 కోట్ల విలువైన ఐదు లక్షల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది కూడా! క్రీడల్లో రాణిస్తున్న వాళ్లకు పెద్దపీట వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడంలో సీఎం జగన్ ముందు వరుసలో ఉంటారు. ఆర్చరీలో ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించిన విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతికి సురేఖకు డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. గత సర్కారు పాలనలో జ్యోతి సురేఖ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదన్న విషయాన్ని గుర్తించి.. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చింది. అదే విధంగా రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సముచిత రీతిలో గౌరవించింది. అదే విధంగా.. వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాలా అండగా ఉంటోంది. -
పేదల కళ్లల్లో కాంతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఇందుకోసం వైద్య రంగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టారు. వైద్యాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు. గ్రామాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చి దిద్దుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజల్లో కంటి సమస్యలతో బాధ పడుతున్నవారి కోసం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు విడతల్లో కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఇచ్చారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి ఇప్పుడు నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ వైద్య శిబిరాల్లో కంటి పరీక్షలు చేస్తున్నారు. గత నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాల్లో మంగళవారం వరకు 35 లక్షల మందికిపైగా వైద్య సేవలు పొందారు. వీరిలో 5,26,045 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. వీరిలో 1,57,614 మందికి మందులతో నయమయ్యే సమస్యలేనని తేల్చారు. వారందరికీ అవసరమైన మందులు ఇచ్చారు. మరో 3,12,478 మందికి కళ్లద్దాలను సూచించారు. వీరందరికీ కళ్లద్దాలను వైద్య శాఖ అందిస్తోంది. 55,953 మందిని తదుపరి వైద్యం కోసం ఆస్పత్రులకు పంపించారు. 48,507మందికి కాటరాక్ట్ శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ధారించారు. తదుపరి వైద్యం, కాటరాక్ట్ సర్జరీలు అవసరమున్న వారిని స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్,సీహెచ్‌వో, ఏఎన్ఎంలకు మ్యాప్ చేశారు. వీరందరికీ వైద్యం అందిస్తున్నారు. వీరంతా కంటి సమస్యలు తొలగి పూర్తిస్థాయి చూపుతో తిరిగి ఇళ్లకు చేరుకోనున్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలం బెలుం గ్రామానికి చెందిన బాలసంటి వయసు 90 ఏళ్లు పైనే. చూపు మందగించడంతో గతంలో కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు కొనుక్కున్నాడు. మళ్లీ కొన్నాళ్లుగా కళ్లు సరిగా కనిపించక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల గ్రామంలోనే ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి వెళ్లాడు. వైద్యులకు తన సమస్య వివరించాడు. కంటి పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇప్పుడు బాలసంటి ఉల్లాసంగా ఉన్నాడు. బాలసంటిలానే కంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల వరకూ వెళ్లలేని వారికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ వరంగా మారింది. ఈ కార్యక్రమంలో తాము ఉంటున్న ఊరిలోనే కంటితో పాటు, ఇతర వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వైద్యుల సేవలు కూడా... రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 800 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కంటి వైద్యులు అవసరం. మన రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వైద్యులను పిలిపించాం. కంటి సమస్యల బాధితులకు అవసరమైన మందులను శిబిరాల్లోనే అందిస్తున్నాం. అద్దాలు అవసరమైన వారికి స్థానిక విక్రేతల ద్వారా అందజేస్తున్నాం. క్యాటరాక్టర్ సర్జరీలు అవసరమున్న వారిని ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీవో ఆస్పత్రులకు తరలించి ఉచితంగా సర్జరీలు చేయిస్తున్నాం. – డాక్టర్ వెంకటేశ్వర్, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్విసెస్ -
మీ ఆప్యాయతకు పొంగిపోయా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తనకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ మేరకు గురువారం ఓ ట్వీట్ చేశారు. తనపై చూపిన అభిమానానికి, అప్యాయతకు నిజంగా పొంగిపోయానంటూ ట్వీట్ చేసిన సీఎం జగన్.. వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. I thank you all for your kind wishes. I am truly overwhelmed by the affection shown by my @YSRCParty family. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 22, 2022 ఇదిలా ఉంటే.. బుధవారం(డిసెంబర్ 21)న సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా మిగతా చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
ప్రజా నాయకా వర్థిల్లు వెయ్యేళ్లు
సాక్షి,అమరావతి: నవరత్నాల విప్లవ సారధి, విలువలు, విశ్వసనీయతలో శిఖర సమానం ఆలోచన, ఆచరణలో అభ్యుదయ మార్గం, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో నడిపిస్తున్న గొప్ప అభ్యుదయ మూర్తి, సంస్కరణల సమ్మేళనంలో సృజనాత్మక నైపుణ్యం, పాలన, పరిశ్రమలో దార్శనిక సంకల్పం, కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తూ కుదేలైన వ్యవస్థలను గాడిన పెట్టిన గొప్ప నేర్పరితనం అన్ని కలగలపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల ఉన్న ప్రవాసాంధ్రుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. ఆయన పుట్టినరోజు పురష్కరించుకుని గురువారం ఖండాంతరాల్లో ఉన్న ప్రతి గుండె, ప్రతి గొంతు ఆయనకు మనసారా శుభాకాంక్షలు తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీటెల్‌లో ప్రవాసాంధ్రులు తయారు చేయించిన కేక్ జీవించు వందేళ్లు.. వర్థిల్లు వెయ్యేళ్లు అంటూ మనసారా ప్రవాసాంధ్రులు దీవించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రవాసాంధ్రులు ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ పరిశ్రమల నిర్వాహకులు రెండోరోజు సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించి జననేత జగనన్న పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. యూఎస్ఏలోని సీటెల్, డల్లాస్, అట్లాంటా, కువైట్, సింగపూర్ కత్తర్(డోహ), దుబాయ్(యూఏఈ) దేశాల్లో సీఎం జగన్ పుట్టిన రోజు సంబరాలను కన్నుపండుగా నిర్వహించారు. డల్లాస్(యూఎస్ఏ) యూకేలోని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ విభాగం ఇన్ఛార్జ్ శివారెడ్డి, మనోహర్ నక్కా, విజయ్ వైకుంఠం, మైరెడ్డి వాసుదేవరెడ్డి, మలిరెడ్డి కిషోర్ రెడ్డి, అనంత రాజు పరదేసి, సురేందర్ రెడ్డి నేతృత్వంలో తెలుగువారు, వైఎస్సార్, జగనన్న అభిమానులు, కార్యకర్తలు జగనన్న పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా కలర్స్ ఉన్న బెలూన్లను ఎగురవేశారు. పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి స్వీట్లు పంచారు. యూకే యూరప్ వింగ్ వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ విభాగం ఇన్ఛార్జ్ శివారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో జగనన్నకు తామంతా అండగా నిలబడతామన్నారు. ఏపీ నుంచి దుష్టచతుష్టయాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 175 స్థానాలు సాధించేందుకు తమ వంతు సహకారం వైఎస్ జగనకి అందిస్తామన్నారు. సీఎం జగన్ తిరిగి 2024లో ఏసీ సీఎం కావడం చారిత్రక అవసరం అని ఏపీఎన్ఆర్టీఎస్ ప్రసిడెంట్ మేడపాటి వెంకట్ అన్నారు. కువైట్ కువైట్ సింగపూర్ అట్లాంటా(యూఎస్ఏ) లండన్ -
CM YS Jagan Birthday Celebrations: అంబరాన్నంటిన సంబరం
సాక్షి, నెట్వర్క్: సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజుని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. కేవలం రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు, సీఎం వైఎస్ జగన్ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు అన్నిచోట్లా పేదలకు, అనాథలకు వస్త్రదానం చేశారు. భారీ ఎత్తున అన్నదానాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటారు. వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. రోగులకు పండ్లు అందజేశారు. భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రజాప్రతినిధులను బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ముఖ్యంగా తమ వర్గాల్లో ఆర్థిక, విద్య, రాజకీయ, సామాజిక, మహిళా సాధికారత తీసుకొచ్చేందుకు మహత్తర కృషి చేస్తున్న సీఎం పుట్టిన రోజు వేడుకలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలూ నిర్వహించారు. తద్వారా సీఎం జగన్‌పై తమ ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఇందుకోసం పోటీలు పడి వేడుకలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యుడిగా సీఎం వైఎస్ జగన్‌ను భావించి.. ప్రతి ఇంటా పండుగలా నిర్వహించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. వివిధ రాష్ట్రాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తదితర దేశాల్లోనూ సీఎం జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 15 మంది వైద్యులతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రక్తదానం చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, పలువురు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు, నంద్యాల, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మెగా రక్తదాన, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో పది వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలోని భారత్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ఏపీ విద్యార్థులు కేక్ కట్ చేశారు. విశాఖలో హ్యాపీ బర్త్‌డే సీఎం జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న స్థానికులు సీఎం పుట్టిన రోజున 49 ఎకరాల భూ పంపిణీ సీతంపేట: సీఎం జగన్ జన్మదినం సందర్భంగా విశాఖపట్నంకు చెందిన సుబ్రహ్మణ్యంరాజు కుమారుడు వెంకటపతిరాజు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో 49 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. బిల్లమడ, మోహన్ కాలనీకి చెందిన గిరిజనులకు గిఫ్డ్‌డీడ్ కింద జిరాయితీ సాగుభూమి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను సీతంపేట ఐటీడీఏ పీవో బి.నవ్య, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్‌కమర్ చేతుల మీదుగా అందజేశారు. బిల్లుమడలో 30 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఎకరా 33 సెంట్లు చొప్పున మొత్తం 40 ఎకరాలు, రెండు ఎకరాలు గ్రామకంఠానికి, మరో ఎకరా కమ్యూనిటీ హాల్‌కు ఇచ్చారు. మోహన్ కాలనీలో 6 కుటుంబాలకు ఎకరా చొప్పున 6 ఎకరాలు పంపిణీ చేశారు. డెహ్రాడూన్‌లో వేడుకలు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో సీఎం పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మూడో జాతీయస్థాయి మహిళా కమిషన్ల సదస్సులో పాల్గొనేందుకు డెహ్రాడూన్ వెళ్లిన ఏపీ మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీరెడ్డి, గజ్జల లక్ష్మిరెడ్డి, బూసి వినీత అక్కడ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్, తెలంగాణ, కర్ణాటక, అసోం, గుజరాత్ రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్పర్సన్లు, సభ్యులు పాల్గొన్నారు. సంగమూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యాభివృద్ధి కోసం సీఎం జగన్ చేస్తున్న కృషికి కృతజ్ఞతగా ‘‘హ్యాపీ బర్త్ డే జగన్ మామ’’ అంటూ అక్షర రూపంలో కూర్చుని ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. – కృత్తివెన్ను 16 కిలోమీటర్ల వెంబడి రహదారి పక్కన మొక్కలు ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సుమారు మూడు వేల మొక్కలను ఎనిమిది కిలోమీటర్ల పొడవునా రహదారికి ఇరువైపులా మొత్తం 16 కిలోమీటర్ల మేర నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు కొట్టు విశాల్, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. తాడేపల్లిగూడెం పట్టణంలోని కనకదుర్గ ఆలయం నుంచి వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వరకు నాలుగు లైన్లుగా విస్తరిస్తున్న రోడ్డుకు ఇరువైపులా వీటిని నాటారు. విజయవాడ నుంచి ప్రత్యేకంగా వాహనాలలో తీసుకొచ్చిన రోజీ ట్రంపెట్ ట్రీ, సపాటేసి మొక్కలను పెట్టారు. దాదాపు రూ.26 లక్షల విలువ చేసే మొక్కలను నాటారు. -
CM YS Jagan Birthday: ట్విట్టర్లో సీఎం జగన్ ట్రెండింగ్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సీఎం జగన్ అభిమానులు తమ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ #HBDYSJagan అనే హ్యాష్ టాగ్‌తో 5 లక్షల 50 వేలకు పైగా ట్వీట్స్‌తో, మూడు వందల మిలియన్స్‌కి పైగా రీచ్తో ట్రెండ్ చేశారు. డిసెంబర్ 20 సాయంత్రం ఐదు గంటలకు ఈ ట్రెండ్ మొదలవగా.. సీఎం జగన్ అభిమానుల ట్వీట్ల సునామీతో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ప్రథమ స్థానంలో, ఆసియా ఖండంలో నాలుగో స్థానంలో, ప్రపంచ వ్యాప్తంగా ఐదో స్థానంలో నిలవడం విశేషం. ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్ అభిమానుల జన్మదిన శుభాకాంక్షల ట్వీట్ల ప్రవాహం నిరాటంకంగా కొనసాగడం దేశంలో మరే ఇతర నాయకుడికీ జరగలేదు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం జగన్‌కు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం జీవించాలంటూ పేర్కొన్నారు. దానిపై సీఎం జగన్ స్పందిస్తూ ‘శ్రీ మోదీ గారు.. మీ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా’.. అంటూ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, గజేంద్రసింగ్ షెకావత్, నారాయణ రాణే, భూపేందర్‌సింగ్, అర్జున్ ముండా, పశుపతి కుమార్పరాస్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు అభినందనలు తెలపగా.. ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం బొమ్మై, మేఘాలయ సీఎం కన్రడ్ సంగ్మా, అసోం సీఎం హిమాంత్ బిశ్వశర్మలు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాలో ఆస్ట్రేలియా హై కమిషనర్ బారి వో ఫారెల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారియత్ వైన్ ఓవెన్లు సీఎంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మోహన్‌బాబు, విశాల్, అల్లు అర్జున్, మంచు విష్ణు, డైరెక్టర్ మారుతీ, బీవీఎస్ రవి తదితరులు ట్వీట్ ద్వారా సీఎంకు శుభాకాంక్షలు చెప్పారు. సోదరి వైఎస్ షర్మిల అన్నాచెల్లెలు కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా.. అంటూ ట్వీట్ చేశారు. -
CM Jagan Birthday: సందడే.. సందడి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు బుధవారం కనులపండువగా జరిగాయి. తాడేపల్లిలోని నివాసంలో సీఎం జగన్‌తో పలువురు మంత్రులు, సీఎంవో అధికారులు కేక్ కట్ చేయించారు. ఇదే సమయంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు ఫోన్ చేసి సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. పాస్టర్ జాన్ వెస్లీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తానేటి వనిత, ఆర్కే రోజా, విడదల రజిని, జోగి రమేష్, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, బాలశౌరి, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు, సీఎం సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు) ఆర్.దనుంజయ్రెడ్డి, సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదిగేకొద్దీ ఒదిగి ఉండటమే సీఎం నైజం.. ప్రజల్లో ఉండటం, ప్రజలకు సేవ చేయడంపైనే సీఎం వైఎస్ జగన్ దృష్టి పెట్టారని.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నదే ఆయన నైజమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం సీఎం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీగా తరలివచ్చి.. సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 500 కిలోల భారీ కేక్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ మూడున్నరేళ్లలోనే పల్లెల రూపురేఖలను మార్చారని.. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని వివరించారు. మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను నెరవేర్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కొందరు నాయకుల్లాగా సీఎం జగన్ ప్రజల్ని బెదిరించట్లేదని.. పాలన నచ్చితేనే వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరుతున్నారని.. ఇది నిజమైన రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణమన్నారు.అనంతరం పేదలకు దుస్తుల పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, నాయకులు చల్లా మధు, మర్రి రాజశేఖర్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, ‘నవరత్నాల’ మూర్తి, రవిచంద్రారెడ్డి, కాకుమాను రాజశేఖర్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, నారమల్లి పద్మజ, జియాఉద్దీన్, అడపా శేషు, మేడపాటి వెంకట్, పానుగంటి చైతన్య, కిరణ్‌రాజ్, దేవళ్ల రేవతి, శివశంకర్, ఈద రాజశేఖర్, మిమిక్రీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులతో సీఎం జగన్ హస్తినలోనూ ఘనంగా.. సాక్షి, న్యూఢిల్లీ: సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఏపీ భవన్ అధికారులు, ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని.. కేక్ కట్ చేసి సీఎం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. భారత రాజకీయ వ్యవస్థలోనే జగన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజా సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమని.. పేదల అభివృద్ధే ఆయన ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, తలారి రంగయ్య, రెడ్డప్ప, మాధవ్, గురుమూర్తి, సంజీవ్, లావు కృష్ణదేవరాయులు, శ్రీధర్, ఆర్.కృష్ణయ్య, కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పరశురామ్, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ పాల్గొన్నారు. -
Happy Birthday CM YS Jagan: ‘రక్తదానం’లో గిన్నిస్, జీనియస్ రికార్డులు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రక్తదానం చేసేందుకు అంగీకారం తెలియజేసి(టేక్ ది ప్లెడ్జ్.. సేవ్ ఏ లైఫ్) రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోని ఆయన అభిమానులు రక్తదానం చేసేందుకు సిద్ధమంటూ WWW. ysrcpblooddonation.com ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు 1,28,534 మంది, ఆఫ్‌లైన్ ద్వారా 26,503 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అలాగే బుధవారం నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో 13,039 మంది రక్తదానం చేశారు. ఈ మేరకు మొత్తం 1,68,076 మందితో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఇది వరకు(దక్షిణాఫ్రికా పేర్న) ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి వీరేంద్ర.. ప్రపంచ రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం, మెడల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డికి అందించారు. 24 గంటల్లోనే రికార్డులు బద్దలు అత్యవసర సమయాల్లో రక్తం ఇచ్చేందుకు ఆసక్తి చూపే దాతల నుంచి అక్టోబర్ 24న దక్షిణాఫ్రికాలో సౌతాఫ్రికా నేషనల్ బ్లడ్ సర్వీస్ అనే సంస్థ ఆన్లైన్ ద్వారా ఫ్లెడ్జ్ ఫామ్స్ సేకరించింది. అప్పుడు 24 గంటల్లో 71,121 మంది ఫ్లెడ్జ్ ఫామ్స్‌ను అందజేసి సరికొత్త రికార్డును సృష్టించారు. అప్పటిదాకా మన దేశంలో కేవలం ఎనిమిది గంటల్లో 10,217 మంది ప్లెడ్జ్ ఫామ్స్ ఇచ్చిందే ప్రపంచ రికార్డుగా ఉండేది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు రెడ్‌క్రాస్ సొసైటీతో కలిసి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో భారీ ఎత్తున రక్తదానం చేశారు. కేవలం 24 గంటల్లోనే 1,68,076 ఈ రికార్డు సృష్టించి.. దక్షిణాఫ్రికా రికార్డును బద్దలు కొట్టారని రెడ్‌క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. రక్తదాన ఉద్యమం మరింత ముందుకు.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ వెంట మనం నడుస్తున్నందునే మనం ఎక్కడికెళ్లినా ప్రజలు ఆప్యాయత, అభిమానం చూపుతున్నారని చెప్పారు. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సీఎం జగన్ దార్శనికుడిగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమం ఇంత భారీ ఎత్తున విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు(నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ) చల్లా మధుసూదనరెడ్డిని, వారికి సహకరించిన ఐటీ వింగ్ ప్రతినిధులు, సోషల్ మీడియా, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు తెలిపారు. రక్తదాన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సజ్జల పిలుపు నిచ్చారు. -
CM YS Jagan Birthday: " పండుగలా దిగివచ్చాడు " సీఎం వైఎస్ జగన్
-
దటీజ్ సీఎం.. మరోమారు మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
హ్యాపీ బర్త్ డే సీఎం సార్: ప్రతి పాట సీఎం జగన్ వ్యక్తిత్వం పట్టి చూపేదే
-
హ్యాపీ బర్త్ డే సీఎం సార్: ప్రతి ఒక్కరూ అభివందనం చేయాల్సిందే..
-
Happy Birthday CM YS Jagan: ఎవరైనా జేజేలు కొట్టాల్సిందే..
-
CM YS Jagan Birthday: చిన్నారులకు ట్యాబ్స్ అందజేసిన సీఎం జగన్
-
CM YS Jagan Birthday Special: వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్
-
CM Jagan Birthday: శ్రీకాళహస్తి పట్టణం వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పండగల జననేత జగనన్న జన్మదిన వేడుకలు
-
CM YS Jagan Birthday: క్యాంప్ కార్యాలయంలో బర్త్‌డే వేడుకలు.. కేక్ కట్ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్‌ను వేద పండితులు ఆశీర్వదించారు. సీఎంతో కేక్ కట్ చేయించిన మంత్రులు.. శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌కు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు బర్త్‌డే విషెస్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. చదవండి: మేనమామ సీఎం జగన్‌కు చిన్నారుల ప్రత్యేక శుభాకాంక్షలు