CM YS Jagan Birthday: ట్విట్టర్‌లో సీఎం జగన్‌ ట్రెండింగ్‌ | CM Jagan trending on Twitter | Sakshi
Sakshi News home page

CM YS Jagan Birthday: ట్విట్టర్‌లో సీఎం జగన్‌ ట్రెండింగ్‌

Published Thu, Dec 22 2022 3:41 AM | Last Updated on Thu, Dec 22 2022 2:59 PM

CM Jagan trending on Twitter - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఆయన అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సీఎం జగన్‌ అభిమానులు తమ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ #HBDYSJagan అనే హ్యాష్‌ టాగ్‌తో 5 లక్షల 50 వేలకు పైగా ట్వీట్స్‌తో, మూడు వందల మిలియన్స్‌కి పైగా రీచ్‌తో ట్రెండ్‌ చేశారు.

డిసెంబర్‌ 20 సాయంత్రం ఐదు గంటలకు ఈ ట్రెండ్‌ మొదలవగా.. సీఎం జగన్‌ అభిమానుల ట్వీట్ల సునామీతో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ప్రథమ స్థానంలో, ఆసియా ఖండంలో నాలుగో స్థానంలో,  ప్రపంచ వ్యాప్తంగా ఐదో స్థానంలో నిలవడం విశేషం. ట్విట్టర్‌ వేదికగా సీఎం వైఎస్‌ జగన్‌ అభిమానుల జన్మదిన శుభాకాంక్షల ట్వీట్ల ప్రవాహం నిరాటంకంగా కొనసాగడం దేశంలో మరే ఇతర నాయకుడికీ జరగలేదు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం జగన్‌కు ట్విట్టర్‌ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

దేవుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం జీవించాలంటూ పేర్కొన్నారు. దానిపై సీఎం జగన్‌ స్పందిస్తూ ‘శ్రీ మోదీ గారు.. మీ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా’.. అంటూ ట్వీట్‌ చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌ గడ్కరీ, గజేంద్రసింగ్‌ షెకావత్, నారాయణ రాణే, భూపేందర్‌సింగ్, అర్జున్‌ ముండా, పశుపతి కుమార్‌పరాస్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాలు అభినందనలు తెలపగా.. ప్రతి ఒక్కరికీ సీఎం జగన్‌ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం బొమ్మై, మేఘాలయ సీఎం కన్‌రడ్‌ సంగ్మా, అసోం సీఎం హిమాంత్‌ బిశ్వశర్మలు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాలో ఆస్ట్రేలియా హై కమిషనర్‌ బారి వో ఫారెల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారియత్‌ వైన్‌ ఓవెన్‌లు సీఎంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మోహన్‌బాబు, విశాల్, అల్లు అర్జున్, మంచు విష్ణు, డైరెక్టర్‌ మారుతీ, బీవీఎస్‌ రవి తదితరులు ట్వీట్‌ ద్వారా సీఎంకు శుభాకాంక్షలు చెప్పారు. సోదరి వైఎస్‌ షర్మిల అన్నాచెల్లెలు కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోను షేర్‌ చేస్తూ హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా.. అంటూ ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement