పువ్వుపుట్టగానే పరిమళిస్తుంది అన్నది ఓ నానుడి. మనిషి జీవితంలోనూ బాల్యంలోనే అతని భవిష్యత్తు కనిపిస్తుందన్నది ఒక నమ్మకం. ఒక నిజం. వైయస్ జగన్ విషయంలో ఈ విషయం సుస్పష్టం. ఆయనలో నాయకత్వ లక్షణాలు చిన్ననాడే, విద్యార్థిదశలోనే కనిపించాయి. విలువలు, ఆదర్శాలతో కూడిన జీవితాన్ని గడపాలన్న లక్ష్యంగా ఎదిగారు జగన్. అనుకున్నది సాధించే క్రమంలో చూపే పట్టుదల రాజకీయాల్లోనూ చూపారు. ఒకే ఒక్కడై విజేతగా నిలిచారు.
ప్రాథమిక విద్య ఒకటిరెండు తరగతుల తర్వాత పులివెందుల నుంచి వైయస్ జగన్ చదువు హైదరాబాద్‌కు మారింది. హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్‌లో ఆయన ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నారు. ఆ రోజుల్ని, ఆయనతో గడిపిన క్షణాల్ని ఇప్పటికీ గర్వంగా గుర్తుచేసుకుంటూ వుంటారు మిత్రులు. జగన్ అన్నివేళలా ఇన్‌స్ఫయిరింగ్ క్యారెక్టర్ అని చెబుతుంటారు. జగన్ అంటే ధైర్యం. జగన్ అంటే సాహసం. జగన్ అంటే ఒక విశ్వాసం. జగన్ అంటే స్నేహస్వభావం. జగన్ అంటే సాయపడే తత్వం. ఇది ఆయనపై మిత్రుల అభిప్రాయం.
- వరప్రసాద్, జగన్ క్లాస్‌మేట్
- వెంకటన్న, జగన్ సహవిద్యార్థి
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జగన్‌లోని నాయకత్వ లక్షణాలను పెంచింది. అక్కడ ఆయన ఎన్‌సీసీలోనూ ఉన్నారు. క్రమశిక్షణకు మారుపేరయిన ఆ స్కూలు, వైఎస్ జగన్‌పై చాలా ప్రభావాన్నే చూపింది.
హైదరాబాద్ పబ్లిక్ స్కూలు చదువు తర్వాత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కోటీలోని ప్రగతి మహావిద్యాలయంలో బికాం డిగ్రీ చదివారు. ఈ మూడేళ్ల డిగ్రీ చదువులో ఆయనకు స్నేహితులుగా వున్నవారు, నేటికీ జగన్‌రెడ్డిని గుర్తు చేసుకుంటూనే వున్నారు. నాడు ప్రగతి మహావిద్యాలయలో పనిచేసిన లెక్కరర్లు కూడా జగన్ కాలేజీలో గడిపిన నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటుంటారు. విద్యార్థిగా ఆయన నడక, నడత బావుండేవని అంటున్నారు.
- రమేష్, స్కూల్‌మేట్
- ప్రవీణ్, క్లాస్‌మేట్
- చంద్రకాంత్ నాయక్, క్లాస్‌మేట్
ఆ తర్వాత వైఎస్ జగన్ ఎంబీఏ నిమిత్తం లండన్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చిన అనంతరం బెంగళూరులో వ్యాపారాలు మొదలుపెట్టారు. సూక్ష్మగ్రాహి కావడం, ప్రతి విషయాన్ని డిటైల్డ్‌గా తెలుసుకోవడం, అనుకున్నది సాధించేంతవరకు శ్రమించడం అనే లక్షణాలు ఆయనను బిజినెస్‌లో సక్సెస్ అయ్యేలా చేశాయి.బ్రిలియెంట్, డేరింగ్, వాల్యూబేస్‌డ్ పర్శనాలిటీ వున్న స్టూడెంట్ అని నాటి నుంచి జగన్‌కు మంచి పేరుంది.
- కృష్ణమోహన్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment