సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) అన్నదాతకు అభయమిస్తున్నాయి. రాత్రనకా, పగలనకా సేద్యం చేసి ఉత్పత్తి చేసిన పంటలకు గిట్టుబడి లేక సతమతమయ్యే రైతన్న పాలిట భరోసా కల్పిస్తున్నాయి. విత్తు నుంచి పంట విక్రయం వరకు ప్రతీ రైతును గ్రామస్థాయిలో చేయి పట్టి నడిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎండనక, వాననక సొసైటీల వద్ద పడిగాపులు పడితే తప్ప విత్తనాలు దొరికేవి కావు.
కానీ ప్రస్తుతం ఆర్బీకేల రాకతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎరువుల కోసం అర్రులు చాస్తూ క్యూలైన్లలో నిలబడే దృశ్యాలు మచ్చుకైనా కన్పించడం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి న తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేసి వాటి స్వరూపాన్ని మార్చేసింది. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది.
ఆర్బీకేల్లో రాయితీలో అందించిన విత్తనాల వివరాలు
♦ రైతుల సంఖ్య: 54.34 లక్షలు
♦ లబ్ధి: రూ. 881.47 కోట్లు
♦ పంపిణీ చేసిన విత్తనాలు: 31.16 లక్షలు (క్వింటాళ్లలో)
♦ ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్లు – 421వాటికైన ఖర్చు–రూ.63.15 కోట్లు
♦ ఈ సెంటర్లలో సేవలు పొందిన రైతులు–4 లక్షల మంది
♦ రూ.5.37 కోట్లతో ఏర్పాటైన శీతల గిడ్డంగుల సంఖ్య: 43
♦ 30.99 లక్షల మంది రైతులకు రూ.1,289.52 కోట్ల విలువైన 11.66 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ
రైతన్నకు భరోసా ఇలా..
♦ రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు 6.19 లక్షల మందికి రూ.715.84 కోట్లు
♦ క్లైయిమ్‌లు, సెటిల్‌మెంట్లు, చెల్లింపుల్లో తొలి ఏడాది రైతుల వాటాతో కలిపి ప్రభుత్వం చెల్లించిన బకాయిలు – రూ.971 కోట్లు
♦ ఏటా సగటున 13.62 లక్షల మందికి రూ.1,950.51 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు చేకూరిన లబ్ధి – రూ.7,802.05 కోట్లు
♦ 2023–24 రూపాయి ప్రీమియంతో బీమా కల్పిస్తూ ఏపీ మోడల్‌లో నడిచే రాష్ట్రాలు– మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ ఏపీ మాదిరిగా ఈ పంట నమోదు చేస్తున్న రాష్ట్రాలు – తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర
♦ భూముల్లేని కౌలుదారులకు ఈ–క్రాప్ ప్రామాణికంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ
♦ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు
♦ రూ.లక్ష లోపు రుణాలు తీసుకుని చెల్లించిన రైతుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ జమ
♦ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం
♦ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ చివరలో ఇన్‌పుట్ సబ్సిడీ
♦ సీజన్‌కు ముందుగానే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం
♦ యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం అంగీకరించకపోవడంతో మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లింపు
♦ 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు
♦ ప్రతి ఎకరాకు ఈ క్రాప్ ఆధారంగా యూనివర్శల్ బీమా కవరేజ్‌ను కల్పిస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీయే
♦ ఏటా లబ్దిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ అభ్యంతరాలు పరిష్కారం
♦ ఎన్నికల హామీ మేరకు 2019 ఖరీఫ్ సీజన్‌లో రూపాయి ప్రీమియంతో పథకం
♦ ఈ– పంట నమోదే అర్హతగా ఉచితంగా బీమా కవరేజ్ కల్పిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం.
ఆదర్శం.. ‘ఫిష్ ఆంధ్ర’
♦ రాష్ట్రంలో ఏటా 50 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులతో దేశంలోనే మొదటి స్థానం.
♦ ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పానికి పదును.
♦రూ.కోటి అంచనాతో జిల్లాకో ఆక్వా హబ్..
♦జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్‌లు. 4,007 ఫిష్ ఆంధ్రా మినీ అవుట్‌లెñట్స్
♦ 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం
♦ వీటికి అనుబంధంగా రిటైల్ మినీ అవుట్‌లెట్స్, ఈ మొబైల్ త్రీ వీలర్, 4 వీలర్ ఫిష్ వెండింగ్ డెయిలీ యూనిట్లు, ఏర్పాటు.
‘ఫిష్ ఆంధ్ర’లో ఏమేమి దొరుకుతాయి...
మెత్తళ్లు, పండుగప్పలు, కాలువ రొయ్యలు, సముద్ర పీతలు, టూనా, కోనాం చేపలు ఇలా ఏది కావాలన్నా తాజాగా బతికున్నవి లభ్యం. రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ క్రమేపీ పెరుగుదల.
ఆక్వా రైతు ఆనందం
ఈ–ఫిష్ సర్వే ఆధారంగారాష్ట్రంలో ఆక్వా సాగు పరిస్థితి
సాగు విస్తీర్ణం:4,65,877.54 ఎకరాలు
ఆక్వాజోన్ పరిధిలోని భూమి:4,22,309.63 ఎకరాలు
పదెకరాల లోపు విస్తీర్ణం:3,56,278 ఎకరాలు
పదెకరాల పైబడి విస్తీర్ణం:6,60,321.63 ఎకరాలు
నాన్ ఆక్వాజోన్ పరిధిలోని భూమి: 43,567.91 ఎకరాలు
పదెకరాల లోపు విస్తీర్ణం: 23,042.02 ఎకరాలు
పదెకరాలకు పైబడి విస్తీర్ణం:20,524.89 ఎకరాలు
మొత్తం విద్యుత్ కనెక్షన్లు: 64,645
సబ్సిడీ పరిధిలోని కనెక్షన్లు: 50,659
Comments
Please login to add a commentAdd a comment