AP CM YS Jagan Birthday Special
-
షార్జాలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు షార్జాలోని కింగ్ ఫైసల్ పార్కులో సంఘ సేవకులు రిజవాన్గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనేక మంది అభిమానుల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ గారి పుట్టిన రోజుని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూఏఈ వైస్సార్సీపీ కన్వీనర్ సయ్యద్ అక్రమ్, ఇర్షాద్, అబ్దుల్లా, చక్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రామాలని వివరిస్తూ మరోసారి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా శక్తి వంచన లేకుండా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వం చేస్తున్న మంచిని విస్తృతంగా తీసుకువెళ్లాలి అని ఈ సందర్భంగా వారు పార్టీ శ్రేణుల్ని కోరారు. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీసీ ప్రెసిడెంట్ శ్రీ మేడపాటి వెంకట్ గారు, బీహెచ్ ఇలియాస్ గారు ప్రవాసాంధ్రలు అభివృద్ధి కొరకు ప్రభుత్వంతో సమన్వయము చేసుకుంటూ అన్ని విధాలుగా ప్రవాసాంధ్రుల అభ్యున్నతి కొరకు చేస్తున్న కృషిని వారు కొనియాడారు. (చదవండి: లండన్‌లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు!) -
CM Jagan Birthday Special Photos: ప్రజా సంక్షేమ రథసారథి సీఎం వైఎస్ జగన్ (ఫోటోలు)
-
#HBDYSJagan జయహో జననేతా..ఏ దైవం పంపించాడో!
జనం మాటే. జగన్ బాట. ఆపదలో ఆపన్నహస్తం. కష్టాల్లో తోడు నీడ. అనేకమంది ఆశలకు, ఆశయాలకు రెక్కలు...ఏ దైవం పంపాడో ..పండగలా దిగివచ్చిన దేవుడు. తమ నీడకు నీడై, తోడుకు తోడై..వెలుగు పూలు పూయించిన జనహృదయనేత. జయహో జగన్. ఇదీ జనం మాట! అడగనిదే అమ్మ అయినా పెట్టదు అనేది సామెత. అన్నా..అని సాయం కోరితే చాలు.. నేనున్నానంటూ ఇచ్చే కొండంత ధైర్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మాకూ ఓ జగన్ కావాలనేంత.. భరోసా! మాట నిలబెట్టు కోవడంలో, హామీలను తు.చ. తప్పకుండా నెరవేర్చడంలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ తరువాతే ఎవరైనా. అన్నదాతలను అక్కున చేర్చు కోవడం దగ్గరినించి వైద్య ఆరోగ్య సేవల వరకు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ల నుంచి , మహిళా సాధికారత వరకు, చదువుల నుంచి పౌరసేవల దాకా అన్నింటా ఆయనొక భరోసా.పేదలు గెలిచే వరకు.. వారి జీవితం బాగుపడే వరకు.. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.Telugu Rap Song 🔥#HBDYSJagan pic.twitter.com/aQ812SOH5H— Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2023ఆడపడుచులకు అండగా, బిడ్డలకు విద్యా దీవెనగా, పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు ఆయన మానస పుత్రికలు. కనుకనే ఎన్ని విమర్శ లొచ్చినా నిండుమనసుతో అమలు చేస్తున్న నిబద్ధత ఆయన సొంతం. అందుకే మాట తప్పని నేతగా, జననేతగా నిలిచారు. అంతేకాదు కరువొచ్చినా, కష్టమొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, అరుదైన వ్యాధి వచ్చినా, చదువు కోవాలన్నా ‘నేను ఉన్నాను’ అంటూ ఆదుకునే ఆ మంచి మనసు భరోసా నభూతో నభవిష్యతి. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని రుజువు చేస్తూ జననీరాజనాలు అందుకుంటున్నారు సీఎం జగన్. అవినీతికి, వివక్షకు తావులేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వేగిరమే ముందుకు రావడమే కాదు. ప్రకటించిన సంబంధిత సాయాన్ని తక్షణమే అందించడంలో ఆయన తీరే వేరు. బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో గానీ, ఉద్యోగార్థులకు ఉద్యోగావకాశాన్ని కల్పించడంలో గానీ, ముఖ్యంగా తుపాను సమయాల్లో, ప్రభావిత ప్రాంతాలను పర్యటించడంలోగానీ, బాధితులను ఆదుకోవడంలోగానీ సీఎం జగన్ ఎపుడూ ముందే ఉంటారు. బాధితులను ఆదుకునేలా వెనువెంటనే సాయాన్ని అందించే పెద్ద మనసు. అలాగే ఆరుగాలం పండించిన పంట పాడైపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అన్నదాతలను ఓదార్చి, వరద ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన జమచేసిన ఘనత ఆయనది. ఇటీవల మిచౌంగ్ తుపాను కారణంగా తడిసిన ధాన్యంలో ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను తీసుకొవడమే ఇందుకు గొప్ప నిదర్శనం.2023లొ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రావణి పైలట్ కావాలన్నకలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శ్రావణి ఏవియేషన్ శిక్షణకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. విజయవాడలో కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారికి తక్షణమే సాయం, అన్ని విధాలా ఆదకుంటామని హామీ. 2022లో అరుదైన ‘గాకర్స్’ వ్యాధితో బాధపడుతున్న హనీ చిన్నారికి కోటి రూపాయిల సాయం అందించారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి హృదయానికి హత్తుకునే ఘటనలు కోకొల్లలు. ఉద్ధానమా.. గర్వించు!అంతెందుకు ఏ నాయకుడూ నామమాత్రంగా కూడా పట్టించుకోని శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం సంగతి చూడండి. ఉద్ధానం కిడ్నీ బాధితులకిచ్చిన మాటను జగన్ అక్షరాల నెరవేర్చిన సందర్భం అపూర్వం, వేనోళ్ల కీర్తి దగించిందే! దశాబ్దాల తరబడి ఆ ప్రాంత వాసులను వేధించిన సమస్యకు శాశ్వత పరిష్కారంగా వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మచ్చుతునకలు. వీటన్నింటికీ మించి ఆయన రాష్ట్రంలో ఏమూల పర్యటనకు వెళ్లినా.. పేద, గొప్ప, కులం, జాతి మతంతో సంబంధం లేకుండా తన దగ్గరికొచ్చిన వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కున చేర్చుకోవడం ఆయన ప్రత్యేకత. ఏ ప్రజకైనా తమ నాయకుడిని నెత్తిన పెట్టుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి. (విన్నారు.. ఆదుకున్నారు)కోవిడ్-19 సంక్షోభ సమయంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలోని లక్షలాదిమంది ప్రజల్ని మహమ్మారి ముప్పునుంచి కాపాడాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును, ప్రశంసల్ని దక్కించుకున్నాయి. కరోనా కష్టకాలంలో తమ ప్రియతమ నేత తీసుకున్న కీలక నిర్ణయాలు, చూపించిన ప్రేమ, ఆదరణను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజలు మరువలేరు. సీఎం జనగ్ సేవలను గుర్తు చేసుకుంటూ కన్నతండ్రిలా తమను ఆదుకున్న జన నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ‘‘హ్యాపీ బర్త్‌డే జగనన్నా.. వెయ్యేళ్లు వర్ధిల్లు’’ అంటూ నిండు మనసుతో జనం ఆశీర్వదిస్తున్నారు. -
రూ.13.11 లక్షల కోట్ల ఒప్పందాలు.. 1.47 లక్షల మందికి ఉపాధి
సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. ‘నాలుగు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు’ అనే కొత్త నిర్వచనంతో జగన్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. అరకొర విమర్శలు చేయడం పారిపాటిగా పెట్టుకున్న కొంతమందికి ఈ కింది గణాంకాలు చూసైనా అర్థం అవుతుందేమో చూడాలి.అభివృద్ది అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాల అభివృధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ.. రాష్ట్ర అభివృధికి అనుగుణంగా ఆ చట్టాను మారుస్తూ.. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు(జీఐఎస్)లో భాగంగా ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించాయి. అవి రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో దాదాపు 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆ యూనిట్లలో ప్రధానంగా గ్రీన్‌ల్యామ్, డీపీ చాక్లెట్స్, అగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరిజెస్, గోద్రెజ్ అగ్రోవెట్, ఆర్ఎస్బీ ట్రాన్స్ మిషన్స్, సూక్మా గామా, ఎల్ఎల్పీ వంటి సంస్థలు ఉన్నాయి.ఇవే కాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లకు భూ కేటాయింపు పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మరో 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. అదనంగా 194 యూనిట్లు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. జీఐఎస్‌లో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది.స్థానికంగా పరిశ్రమల అభివృద్ధి..పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్‌ను ఆవిష్కరించనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెట్టుబడులు సమకూర్చడంలో మేటి..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ అక్టోబర్ నెలలో గుజరాత్ (రూ.25,685 కోట్లు) తర్వాత అధిక పెట్టుబడులు సమకూర్చిన రాష్ట్రాల్లో ఏపీ(రూ.19,187 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. దేశంలో విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో (రూ.72,622 కోట్లు) 56 శాతం ఖర్చుచేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి వ్యయంలో 54 శాతం ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. బాబు హయాంలో వచ్చిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.60 వేల కోట్లు. జగన్ హయాంలో రెండేళ్లు కరోనా ఉన్నా ఇప్పటికే దాదాపు రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బాబు ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.2 శాతంతో దేశంలో 22వ స్థానంలో ఉంటే, జగన్ ప్రభుత్వంలో 12.8 శాతం వృద్ధి రేటుతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది.గతంలో కంటే భారీగా పెరిగిన ఎంఎస్ఎంఈలు..అధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే, జగన్ పాలన వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరింది. సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్‌పీసీఎల్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది.జీఎస్డీసీ సూచీలో బాబు దిగిపోయిన 2019లో ఏపీ 22వ స్థానంలో ఉంటే , 2021-22 నాటికి మొదటి స్థానానికి చేరుకుంది. రాష్ట్ర తలసరి ఆదాయంలో ఎల్లో ప్రభుత్వం నిష్క్రమించే నాటికి 17వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 9వ స్థానానికి వచ్చింది. గత ప్రభుత్వ ఒప్పందాల్లో వ్యాజ్యాల పరిష్కారంజగన్ ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్లు ఏర్పాటు చేస్తుంది. 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను గతంలో బాబు అదానీకు కట్టబెట్టాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) వాటి టెండర్లు, ఒప్పందాలన్నీ పర్యవేక్షించింది. ఈ తంతు 2018, 2019ల్లో జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్థ్యం గల 3 సోలార్ ప్రాజెక్టులకు సెకీ 2018లో టెండర్లు పూర్తి చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక సోలార్ప్రాజెక్ట్కు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఎస్బీ ఎనర్జీ సెవెన్ కంపెనీను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. ఇందులో అదానీకి ప్రత్యేకంగా కలిగిన లబ్ధి ఏమీ లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుల్లో ఆ కంపెనీలపై ఉన్న వ్యాజ్యాలను పరిష్కరించి జగన్ సర్కారు ప్రాజెక్టులను అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ చొరవతో చౌకైన విద్యుత్తుసెకీ ఒప్పందం వల్ల వ్యవసాయానికి కరెంటు లభిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే ఒప్పందాల ప్రకారం రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల వివిధ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ల వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. ఈ వ్యవహారంపై అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ప్రస్తుతం సగటు ధర యూనిట్‌కు రూ.5.10 ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది. -
సీఎం జగన్‌కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్‌ను విష్ చేశారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు సీఎం జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎత్తున సేవా కార్యక్రమాలను వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. Birthday wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu. May he lead a long and healthy life.— Narendra Modi (@narendramodi) December 21, 2023గవర్నర్ శుభాకాంక్షలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh on his Birthday. pic.twitter.com/75KTexNMbI— governorap (@governorap) December 21, 2023 -
CM Jagan: ‘నాడి’ పట్టిన నేత
సాక్షి, గుంటూరు: 2019కి ముందు చిన్న జబ్బు చేసినా ప్రజలు పట్టణాలు, నగరాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నం. ఏకంగా రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కింద వివిధ కార్యక్రమాలను చేపట్టారు.గతంలో పడకేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి రెట్టింపు భరోసా కల్పిస్తున్నారు. పథకంలో ఏకంగా 3,257 వైద్య ప్రొసీజర్లు అందుబాటులో తీసుకొచ్చారు. అంతేకాక.. దేశంలో ఎక్కడా లేనట్లుగా వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి చికిత్సలు అందించే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు.నాడుప్రభుత్వాసుపత్రుల్లో శిశువులను ఎలుకలు పీక్కుతిన్న అధ్వాన పరిస్థితులు.. సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో సర్జరీలు చేసిన ఘటనలు.. విపరీతమైన సిబ్బంది కొరత.. వెరసి ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం అడుగంటింది.. నేడుసర్కారీ వైద్యం ప్రజలకు అత్యంత చేరువైంది. నాడు–నేడుతో ప్రభుత్వాసుపత్రులు కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా మారాయి. 53 వేలకుపైగా పోస్టుల భర్తీ. అటకెక్కిన ఆరోగ్యశ్రీ మళ్లీ పట్టాలెక్కింది. పిలవగానే పలికే అంబులెన్సులు. గ్రామస్థాయిలో ఆరోగ్య శిబిరాలు. ఇలా నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజారోగ్య ముఖచిత్రాన్ని సీఎం వైఎస్ జగన్ సమూలంగా మార్చేశారు. ఆరోగ్యశ్రీ బలోపేతం ఇలా.. ♦ 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 1,059 ♦ వైఎస్ జగన్ సర్కార్ కొత్తగా చేర్చిన ప్రొసీజర్లు 2,198 ♦ వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు. ♦ 2019 నుంచి ఈ ఏడాది నవంబరు వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం పొందినవారు– 37,40,525 మంది ♦ వీరికి వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం – రూ. 11,859.96 కోట్లు ♦ ఆరోగ్య ఆసరా కోసం వెచ్చించిన మొత్తం– రూ.1,309.90 కోట్లు ♦ నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం చేసిన ఖర్చు– రూ.13,169.86 కోట్లు ♦ ఆరోగ్యశ్రీకి 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు– రూ. 5,177.38 కోట్లు ♦ కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను 2021 మే, జూన్ నెలల్లో ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. ♦ రెండు లక్షల మందికిపైగా కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించారు. ♦ కోవిడ్ బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.744 కోట్లు. ప్రజారోగ్యానికి రక్ష జగనన్న ఆరోగ్య సురక్ష.. ♦ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శిబిరాలు12,423 ♦ మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసింది 86,690 మంది ♦ సొంత గ్రామంలోనే చికిత్స పొందినవారు 60.27 లక్షలు ♦ కేటరాక్ట్ సర్జరీలు నిర్వహించింది 78,292 మందికి నాడు–నేడులో పనులు.. ♦ రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు.. వీటి ద్వారా 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు గ్రామంలోనే అందుతున్నాయి. ♦ రూ.664.96 కోట్లతో పీహెచ్‌సీల బలోపేతం చేశారు. 983 పీహెచ్సీ భవనాలకు మరమ్మతులు చేయడంతోపాటు 150 కొత్త భవనాలను నిర్మించారు. కొత్తగా 176 పీహెచ్‌సీల ఏర్పాటు. ప్రతి పీహెచ్సీలో 63 రకాల వైద్య పరీక్షలు, 215 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. ♦ రూ. 374.61 కోట్లతో 528 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. వీటికోసం 184 భవనాలకు మరమ్మతులు, 344 కొత్త భవనాల నిర్మాణం. ♦ రూ.682 కోట్లతో 42 ఏరియా ఆస్పత్రులు, రూ.13 కోట్లతో ఎంసీహెచ్/జిల్లా ఆస్పత్రులు, రూ.528 కోట్లతో 121 సీహెచ్‌సీల బలోపేతం చేశారు. ♦ రూ.246 కోట్లతో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఐదు ట్రైబల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు.. ♦ రూ. 272 కోట్లతో కడపలో క్యాన్సర్, మెంటల్ హెల్త్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. ♦ రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుచేశారు. 17 వైద్యకళాశాలల ఏర్పాటుతో నూతన అధ్యాయం మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలను మెరుగుపరచడంతో పాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో తన ముద్ర చూపించారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు.♦ రూ. 8,480 కోట్లతో 17 కొత్త కళాశాలల ఏర్పాటుద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లు. ♦ 2023లో విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం వైద్యకళాశాలల ప్రారంభం. ♦ కొత్త వైద్య కళాశాలలో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి. ♦ వచ్చే విద్యాసంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని వైద్యకళాశాలల ప్రారంభం. ♦ ఇక మిగిలిన ఏడు కళాశాలలు 2025–26లో ప్రారంభించడానికి అనుగుణంగా చర్యలు. 108 సేవలకు ఊపిరి.. ఇక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని దుస్థితి ఉండేది. ఈ పరిస్థితుల్లో మార్పునకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ 2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో.. ♦ ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చుచేశారు. ♦ గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్‌లను 2022 అక్టోబరులో అదనంగా కొన్నారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ♦ వీటిలో 2.5 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుకు మరో రూ.34.79 కోట్లు ఖర్చుచేసింది. ♦ మరోవైపు.. గత ప్రభుత్వంలో కేవలం 292 ‘104’ వాహనాలు ఉండగా ఇందులో పాతవాటిని తొలగించి మొత్తం 910 మొబైల్ క్లినిక్ యూనిట్లను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ కోసం గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు భారీగా ఖర్చు పెడుతున్నారు. ♦ ఇలా అంబులెన్స్‌ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు ఖర్చుచేశారు. వీటి నిర్వహణ కోసం ఏటా రూ.188 కోట్ల చొప్పున ఖర్చుచేస్తున్నారు. ♦ ఈ లెక్కన పరిశీలించినట్లయితే నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు రూపంలో రూ.750 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లయింది. -
CM Jagan: ఏపీకి జలాభిషేకం
సాక్షి, గుంటూరు: కడలి పాలవుతున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్ జలయజ్ఞం చేపట్టగా ఆయన తనయుడు సీఎం జగన్ ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నారు. ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందిస్తున్నారు. కోవిడ్, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి పనులను పరుగులెత్తించారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2019, 2020, 2021, 2022 ఖరీఫ్, రబీతో కలిపి ఏటా కోటి ఎకరాలకు సీఎం జగన్ నీళ్లందించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రంలో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులతో ఏపీని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం జగన్ నిలిపారు.♦ వైఎస్సార్ చేపట్టిన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లలో మిగిలిన పనులను సీఎం జగన్ పూర్తి చేసి 2022లో జాతికి అంకితమిచ్చారు.♦ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులను నింపడం ద్వారా లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18న జాతికి అంకితం చేశారు.♦ గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్‌ను పూర్తి చేసి నవంబర్ 30న జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమం చేశారు.♦ వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021 జనవరి 13 నాటికే సీఎం జగన్ పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లో 7.506 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. ♦విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల దాహంతో పోలవరాన్ని నీరుగార్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక అప్రోచ్ ఛానల్, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021లో గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించారు. బాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగా«దాలను పూడ్చి యధాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. నీటి పారుదలలో రికార్డు♦ కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును దివంగత వైఎస్సార్ సాకారం చేశారు. గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించిన సీఎం జగన్ 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించేందుకు మార్గం సుగమం చేశారు.♦ గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్ గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.♦ తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్‌కు రూ.500 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌ను నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ♦ గత నాలుగున్నరేళ్లలో ఆరు రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వకు మార్గం సుగమం చేయడం ద్వారా నీటి పారుదల రంగ చరిత్రలో సీఎం జగన్ రికార్డు సృష్టించారు. -
CM Jagan: అన్నదాతకు అభయం
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) అన్నదాతకు అభయమిస్తున్నాయి. రాత్రనకా, పగలనకా సేద్యం చేసి ఉత్పత్తి చేసిన పంటలకు గిట్టుబడి లేక సతమతమయ్యే రైతన్న పాలిట భరోసా కల్పిస్తున్నాయి. విత్తు నుంచి పంట విక్రయం వరకు ప్రతీ రైతును గ్రామస్థాయిలో చేయి పట్టి నడిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎండనక, వాననక సొసైటీల వద్ద పడిగాపులు పడితే తప్ప విత్తనాలు దొరికేవి కావు.కానీ ప్రస్తుతం ఆర్బీకేల రాకతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎరువుల కోసం అర్రులు చాస్తూ క్యూలైన్లలో నిలబడే దృశ్యాలు మచ్చుకైనా కన్పించడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి న తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేసి వాటి స్వరూపాన్ని మార్చేసింది. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది. ఆర్బీకేల్లో రాయితీలో అందించిన విత్తనాల వివరాలు ♦ రైతుల సంఖ్య: 54.34 లక్షలు♦ లబ్ధి: రూ. 881.47 కోట్లు ♦ పంపిణీ చేసిన విత్తనాలు: 31.16 లక్షలు (క్వింటాళ్లలో)♦ ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్లు – 421వాటికైన ఖర్చు–రూ.63.15 కోట్లు ♦ ఈ సెంటర్లలో సేవలు పొందిన రైతులు–4 లక్షల మంది♦ రూ.5.37 కోట్లతో ఏర్పాటైన శీతల గిడ్డంగుల సంఖ్య: 43 ♦ 30.99 లక్షల మంది రైతులకు రూ.1,289.52 కోట్ల విలువైన 11.66 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ రైతన్నకు భరోసా ఇలా.. ♦ రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు 6.19 లక్షల మందికి రూ.715.84 కోట్లు ♦ క్లైయిమ్లు, సెటిల్మెంట్లు, చెల్లింపుల్లో తొలి ఏడాది రైతుల వాటాతో కలిపి ప్రభుత్వం చెల్లించిన బకాయిలు – రూ.971 కోట్లు♦ ఏటా సగటున 13.62 లక్షల మందికి రూ.1,950.51 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు చేకూరిన లబ్ధి – రూ.7,802.05 కోట్లు ♦ 2023–24 రూపాయి ప్రీమియంతో బీమా కల్పిస్తూ ఏపీ మోడల్లో నడిచే రాష్ట్రాలు– మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ ఏపీ మాదిరిగా ఈ పంట నమోదు చేస్తున్న రాష్ట్రాలు – తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ♦ భూముల్లేని కౌలుదారులకు ఈ–క్రాప్ ప్రామాణికంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ ♦ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ♦ రూ.లక్ష లోపు రుణాలు తీసుకుని చెల్లించిన రైతుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ జమ ♦ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం ♦ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ చివరలో ఇన్పుట్ సబ్సిడీ ♦ సీజన్‌కు ముందుగానే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం ♦ యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం అంగీకరించకపోవడంతో మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లింపు ♦ 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు ♦ ప్రతి ఎకరాకు ఈ క్రాప్ ఆధారంగా యూనివర్శల్ బీమా కవరేజ్‌ను కల్పిస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీయే ♦ ఏటా లబ్దిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ అభ్యంతరాలు పరిష్కారం ♦ ఎన్నికల హామీ మేరకు 2019 ఖరీఫ్ సీజన్లో రూపాయి ప్రీమియంతో పథకం ♦ ఈ– పంట నమోదే అర్హతగా ఉచితంగా బీమా కవరేజ్ కల్పిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం. ఆదర్శం.. ‘ఫిష్ ఆంధ్ర’ ♦ రాష్ట్రంలో ఏటా 50 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులతో దేశంలోనే మొదటి స్థానం. ♦ ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పానికి పదును. ♦రూ.కోటి అంచనాతో జిల్లాకో ఆక్వా హబ్.. ♦జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్‌లు. 4,007 ఫిష్ ఆంధ్రా మినీ అవుట్‌లెñట్స్♦ 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం ♦ వీటికి అనుబంధంగా రిటైల్ మినీ అవుట్‌లెట్స్, ఈ మొబైల్ త్రీ వీలర్, 4 వీలర్ ఫిష్ వెండింగ్ డెయిలీ యూనిట్లు, ఏర్పాటు. ‘ఫిష్ ఆంధ్ర’లో ఏమేమి దొరుకుతాయి... మెత్తళ్లు, పండుగప్పలు, కాలువ రొయ్యలు, సముద్ర పీతలు, టూనా, కోనాం చేపలు ఇలా ఏది కావాలన్నా తాజాగా బతికున్నవి లభ్యం. రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ క్రమేపీ పెరుగుదల. ఆక్వా రైతు ఆనందంఈ–ఫిష్ సర్వే ఆధారంగారాష్ట్రంలో ఆక్వా సాగు పరిస్థితి సాగు విస్తీర్ణం:4,65,877.54 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలోని భూమి:4,22,309.63 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం:3,56,278 ఎకరాలు పదెకరాల పైబడి విస్తీర్ణం:6,60,321.63 ఎకరాలు నాన్ ఆక్వాజోన్ పరిధిలోని భూమి: 43,567.91 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం: 23,042.02 ఎకరాలు పదెకరాలకు పైబడి విస్తీర్ణం:20,524.89 ఎకరాలు మొత్తం విద్యుత్ కనెక్షన్లు: 64,645సబ్సిడీ పరిధిలోని కనెక్షన్లు: 50,659 -
CM Jagan: ఏపీ ‘క్లిక్’ అయిందిలా..
సుమతి రోడ్డుమీద వెళుతుండగా ఆకతాయిలు ఫాలో అవుతున్నారు. భయం వేసింది. చేతిలోని ఫోన్లో ఓ బటన్ నొక్కింది. ఐదు నిమిషాలు గడవకముందే పోలీసులొచ్చారు. ఆకతాయిల్ని పట్టుకుని బుద్ధి చెప్పారు. ఇదంతా.. ‘దిశ’ టెక్నాలజీతోనే సాధ్యమయింది. సుమతి దిశ యాప్‌లోని బటన్‌ను ప్రెస్ చేయటంతో అది పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు సమాచారం పంపింది. అక్కడి నుంచి దగ్గర్లోని పెట్రోలింగ్ బృందానికి మెసేజ్ వెళ్లింది. అంతా క్షణాల్లో జరిగిపోవటంతో.. సుమతికి ఆపద తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్‌ను.. 1.46 కోట్ల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిద్వారా అలెర్ట్ రావటంతో... 31,541 ఘటనల్లో పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ!. ఐటీ. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చింది తానేనంటారు చంద్రబాబు. ఈ క్లెయిమ్‌పై ఉన్న విభిన్న వాదనలనిక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరి 2014 నుంచీ ఏపీ ముఖ్యమంత్రిగాఉన్నపుడు ఐటీని ఏం చేశారు? ప్రపంచమంతా కొత్త ఆవిష్కరణలతో పరుగులు తీస్తున్నపుడు ఇక్కడ మాత్రం అన్నీ మాటలే తప్ప చేతల్లో ఎందుకు కనిపించలేదు? ఐటీకి పితామహుడినని చెప్పారే తప్ప... కొత్తగా టెక్నాలజీని వినియోగించిందెక్కడ? సువిశాల తీరం ఉందని... దాన్నే అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని పదే పదే చెప్పారు తప్ప ఒక్క పోర్టును గానీ, హార్బర్‌ను గానీ తేలేదెందుకు? మరి వైఎస్ జగన్ మాత్రం మాటలు చెప్పకుండా ప్రతి విభాగంలోనూ టెక్నాలజీని సమర్థంగా అమలు చేస్తున్నారు కదా? కొత్త పోర్టులు, హార్బర్లను తెచ్చారు కదా? మనకు కావాల్సింది హోరెత్తించే మాటలా..? కళ్లముందు కనిపించే నిజాలా?రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో 93,29,128 ఎకరాల్లో పంటలు వేశారు. దీన్లో వరి 32,83,593 ఎకరాల్లోను... వేరు శనక 5,93166 ఎకరాల్లోను వేశారు. ఈ లెక్కల్లో ఒక్క ఎకరా కూడా తేడా లేదు. ఎందుకంటే ‘ఈ–క్రాప్’ టెక్నాలజీ ఉందిప్పుడు. ప్రతి రైతూ తన పంటను నమోదు చేసుకునే ఈ పటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థతో... రాష్ట్రంలోని 27,800 గ్రామాల్లో ఉన్న ప్రతి ఎకరాకూ లెక్క ఉంది. అది బీమాకైనా... పంట నష్టానికైనా.. దిగుబడికైనా.ఈ ఉదాహరణలన్నీ చూస్తే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ టెక్నాలజీని ఎంత సమర్థంగా వినియోగిస్తోందో అర్థమవుతుంది. భారీ ఎత్తున ఐటీ కాంట్రాక్టులివ్వకుండా, ఉన్న వనరులను... నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సేవలను సమర్థంగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విభాగంలోనూ పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడుతోంది. అందుకనే... మునుపెన్నడూ చూడని పారదర్శకత, జవాబుదారీతనం ఇపుడు కనిపిస్తోంది. చేసిన పని పావలాదే అయినా... పదిరూపాయల ప్రచారం చేసుకోవటమనేది ఈ ప్రభుత్వ విధానం కాదు కాబట్టే.. పెద్దపెద్ద ఆరంభాలు, ఆర్భాటాలు లేకుండానే ప్రజలకు సమర్థమైన ఐటీ సేవలు అందుతున్నాయి.ఏఎన్ఎం యాప్‌లో 15 మాడ్యూల్స్...2020లో ప్రభుత్వం రూపొందించిన ఏఎన్ఎం యాప్ ద్వారా... క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యక్రమాన్నీ వారు రిపోర్ట్ చేస్తుంటారు. ఎన్సీడీ–సీడీ సర్వే, ఫీవర్ సర్వే, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్, ఆరోగ్యశ్రీ ఫీడ్ బ్యాక్ ఇలా అన్నిటినీ నమోదు చేస్తారు. ఆశా వర్కర్లకు తెచ్చిన ‘ఈ–ఆశా’ యాప్ ద్వారా గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యాన్ని వైద్యశాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకూ యాప్‌లున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయి.స్కూళ్లకు పక్కా సమాచార వ్యవస్థ...ఈ ప్రభుత్వం తెచ్చిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం(సిమ్స్)లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఉన్న 82 లక్షల విద్యార్థుల వివరాలు అప్ టు డేట్‌గా ఉన్నాయి. విద్యార్థుల ఆధార్‌ను లింక్ చేస్తూ... ప్రత్యేక ఐడీ నెంబర్ కేటాయించారు. దీంతో స్టూడెంట్ హాజరు యాప్ ద్వారా ట్రాక్ చెయ్యటం... గ్రామ/వార్డు కార్యదర్శుల ద్వారా వారిని తిరిగి బడికి రప్పించటం సులువవుతోంది. ఇక టీచర్ల అటెండెన్స్కూ యాప్ ఉంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో అనుసంధానించిన ఈ యాప్... టీచర్ తమ స్కూల్ పరిసరాలకు 10 మీటర్ల దూరంలో ఉంటేనే హాజరును తీసుకుంటుంది. జగనన్న గోరుముద్ద అమలును పర్యవేక్షించడానికి ‘ఇంటిగ్రేటెడ్ మోనిటరింగ్ సిస్టం ఫర్ మిడ్డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) వచ్చింది. వారంలో ఆరు రోజులు.. రోజుకు సగటున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారం తీసుకుంటున్నారు. టీచర్ల ఫోన్లోని ఈ యాప్ ద్వారా... హాజరుతో పాటు ఎంతమంది పిల్లలు ఆహారం తీసుకుంటున్నారు? ఏరోజు ఏం వడ్డించారు, ఇచ్చిన సరుకు ఎంత? ఎంత స్టాక్ ఉంది? వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ప్రతిరోజు టాయిలెట్ల పరిస్థితులూ అప్డేట్ అవుతాయి. ఎంప్లాయి ఇన్ఫర్మేషన్ సిస్టంలో టీచర్ల çహాజరుతో పాటు ఎన్ఓసీ, సెలవులు, మెడికల్ రీయింబర్స్మెంట్, గ్రీవెన్స్ సహా సర్వీసు రికార్డు మొత్తం ఉంటోంది.♦ చైల్డ్ ఇన్ఫో సిస్టంలో విద్యార్థులు ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్‌కు మారారు. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా లింకేజ్ వంటివన్నీ ఉంటాయి. ♦ జేవీకే యాప్ ద్వారా ప్రతి స్కూల్లో అవసరమైన జగనన్న విద్యాకానుక కిట్లు ఎన్ని? ఎన్ని అందించారు? ఎన్ని మిగిలాయి? వంటివన్నీ తెలుస్తాయి. పైపెచ్చు ఈ వ్యవస్థలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున నియమించి ఇబ్రహీంపట్నం, విశాఖపట్నంలో రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లున్నాయి. బడుల్లో టీచర్లు, పిల్లల అటెండెన్స్ వేశాక అది ఈ సెంటర్లకు వెళుతుంది.టెక్నాలజీతో రైతుకు దన్ను...‘ఈ–కర్షక్’ యాప్‌తో ఆర్బీకేలో రైతులు సీజన్లో తాము సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసుకుంటారు. తర్వాత ఆర్బీకే సిబ్బంది పొలాలకు వెళ్లి స్వయంగా జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్ ద్వారా రైతుసాగు చేసే పంట పొలం విస్తీర్ణం, సర్వే నెంబర్‌తో పాటు పంట వివరాలనూ ధ్రువీకరిస్తారు. పొలం ఫోటో డిజిటైజ్ చేస్తారు. ♦ఆర్బీకేల్లోని వెటర్నరీ సహాయకుల పనితీరును పర్యవేక్షించడానికి ‘పశు సంరక్షక్’ యాప్ ఉంది. ♦రోజువారీ వ్యవసాయ పంటల హెచ్చుతగ్గులను పర్యవేక్షించడానికి మార్కెటింగ్ శాఖ ‘కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్స్’ (సీఎంయాప్)ను తీసుకొచ్చింది. ♦‘ఈ–మత్స్యకార’ పోర్టల్‌ను వివిధ యాప్‌లతో అనుసంధానించారు. అప్సడా రిజిస్ట్రేషన్లు, ఆర్బీకే ఇన్పుట్ సప్లయి, ఈక్రాప్, మత్స్య సాగుబడి, కేసీసీ, పీఎంఎంఎస్వై వంటివన్నీ దీని ద్వారానే నిర్వహిస్తున్నారు. ♦‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ యాప్‌తో 55607 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు.అర చేతిలో ఆరోగ్యశ్రీ...ఆరోగ్య శ్రీ యాప్‌లో లాగిన్ అయితే... తాము గతంలో ఏ చికిత్స పొందామన్నది లబ్ధిదారులు తెలుసుకోవచ్చు. పథకం కింద ఏ ఆస్పత్రుల్లో ఏ వైద్య సేవలు అందుతాయి? దగ్గర్లో నెట్వర్క్ ఆసుపత్రులు ఏమేం ఉన్నాయి? తెలుసుకోవచ్చు. వాటి లొకేషన్‌నూ ట్రాక్ చేయొచ్చు. ‘ఈహెచ్‌ఆర్– డాక్టర్ కేర్’ ఆన్లైన్ వేదికతో యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో డిజిటల్ వైద్య సేవలందుతున్నాయి. ఈ పోర్టల్ నుంచి రోగులకు అందించిన వైద్యం వివరాలను వారి ఆయుష్మాన్ భారత హెల్త్ ఖాతాలో అప్లోడ్ చేస్తున్నారు. ల్యాబ్ టెస్ట్‌ల ఫలితాలు ఈహెచ్‌ఆర్ నుంచి నేరుగా రోగుల మొబైల్‌కే ఎస్సెమ్మెస్ ద్వారా వెళుతున్నాయి. క్రొంగొత్తగా... రిజిస్ట్రేషన్ల వ్యవస్థదేశంలో దస్తావేజులు రాయటానికి కొన్ని స్టార్టప్‌లు ఆన్లైన్ రైటర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇక్కడ ప్రభుత్వమే ఆ పనిచేసింది. ‘కార్డ్ ప్రైమ్’ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా డిజిటలైజ్ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం... వినియోగదారులు ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా ఆన్లైన్లో డాక్యుమెంట్లు తయారు చేసుకునే వీలు కల్పించింది. ఆన్లైన్లోనే చలానాలు కట్టి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ టైమ్‌లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళితే అరగంటలో పని పూర్తవుతుంది. గతంలోలా డాక్యుమెంట్ల స్కానింగ్ అక్కర్లేదు కూడా. డిజిటల్ సిగ్నేచర్ ఒక్కటీ చాలు. ♦ఇక వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆటో మ్యుటేషన్ జరిగే కొత్త విధానాన్ని తెచ్చిందీ ప్రభుత్వం. గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులకిస్తే వాళ్లు మ్యుటేషన్ చేసేవారు. దీనికి సమయం పట్టేది. ఇప్పుడా అవసరం లేదు. ♦స్టాంపు పేపర్ల స్థానంలో ఈ స్టాంపింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. గతంలో భౌతికంగా స్టాంపులు కొని, వాటి ద్వారా అగ్రిమెంట్లు చేసుకునేవారు. ఇప్పుడు స్టాంపు పేపర్లతో పని లేదు. కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద కూడా ఈ–స్టాంపింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్టాంపు పేపర్ల అవకతవకలకు చెక్ పడింది.♦భూముల రీ సర్వే ద్వారా ఏ రాష్ట్రంలో లేని విధంగా డిజిటల్ రెవెన్యూ రికార్డులు తయారవుతున్నాయి. డ్రోన్లతో సర్వే చేసి శాటిలైట్ లింకు ద్వారా జియో కోఆర్డినేట్స్‌తో రైతుల భూముల హద్దులు నిర్ధారిస్తున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో యునిక్ ఐడీ ఉంటోంది. -
ఇదీ.. జగన్ కమిట్మెంట్
ఒకపక్క.. రోజుకు వంద రూపాయల సంపాదన కూడా లేక.. కనీస అవసరాలని చెప్పే తిండి, ఇల్లు, దుస్తులకు కూడా నోచుకోని జనం లెక్కించలేనంత మంది. మరోపక్క.. రోజుకు లక్ష రూపాయలు సైతం గ్యాంబ్లింగ్‌లో పోగొట్టుకుని చింతలేకుండా గడిపేసే శ్రీమంతులూ లెక్క లేనంతమంది. ఇదీ.. మన సమాజంలో ఉన్న విభజన. నానాటికీ పెద్దదవుతున్న ఈ రేఖ చెరిగేంతవరకూ అభివృద్ధి చెందిన దేశంగానో, రాష్ట్రంగానో మారటం అసాధ్యం. కనీస అవసరాలు తీర్చుకోలేని కోట్లాది మందిని విడిచిపెట్టేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆ అభివృద్ధిలో వాళ్లకూ వాటా ఉండాలి. ఆ స్థాయికి వాళ్లను తీసుకురావాలి. వాస్తవానికి సంక్షేమ పథకాల పరమార్థం ఇదే. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నది ఆ అభివృద్ధే. చదువుతోనే తలరాత మారుతుంది దీన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాబట్టే తన పిల్లలిద్దరినీ టాపర్లుగా నిలబెట్టగలిగారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకూ సరైన విద్యనందించాలన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ‘అమ్మ ఒడి’ని ప్రతిపాదించారు. చేతిలో డబ్బుల్లేక చిన్న పిల్లల్ని సైతం కూలికి పంపే పరిస్థితిని మార్చాలన్నదే దీనివెనకున్న ఆలోచన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీన్ని ఆచరణలోకి తెచ్చారు. ఆశించినట్టే ‘అమ్మ ఒడి’ ఊతంతో పిల్లలు బడి బాట పట్టారు. మరి ఇది సరిపోతుందా? ఇదిగో.. ఈ ఆలోచనే విద్యారంగంలో పెను సంస్కరణలకు బీజం వేసింది. స్కూళ్లకొచ్చే పిల్లల కడుపు నిండితేనే చదువు ఒంట బడుతుందన్న ఆలోచన.. పౌష్టికాహారంతో కూడిన ‘గోరుముద్ద’కు ప్రాణం పోసింది. బళ్లు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలెలా చదువుతారు? ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు, బ్యాగులతో వస్తే.. ఒకరు షూ వేసుకుని, మరొకరు చెప్పులు లేకుండా వస్తే అంతా ఒక్కటేనన్న భావన ఎందుకొస్తుంది? వీటన్నిటికీ సమాధానమే.. స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికీ అందుతున్న ‘విద్యా కానుక’. సరే! మరి స్కూళ్లో? తమ వారి ప్రయివేటు ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాలు వాటిని చిత్రవధ చేసి చంపేశాయిగా? ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికెళ్లాలి. సరైన గదుల్లేవు. బెంచీలు, బ్లాక్ బోర్డులు అన్నీ అంతంతే! ఎందుకెళ్లాలి?... అనిపించేలా ఉన్నాయి మన బడులు. వీటిని మార్చాలనుకున్నారు జగన్. అందుకే.. ‘నాడు–నేడు’ పేరిట ఓ యజ్ఞాన్ని ఆరంభించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావటంతో.. దశల వారీగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. స్కూళ్లకు వస్తున్నారు. భోజనం, దుస్తులు ఓకే. స్కూళ్లూ మారాయి. మరి చదువో! మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ రావాలి. వస్తేనే రాణించగలరు. అంతర్జాతీయంగానూ పోటీ పడగలరు. అందుకే ప్రయివేటు స్కూళ్లకు మల్లే ప్రీప్రయిమరీ–1,2 తరగతులు వచ్చాయి. ఆది నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలయింది. ఇలాగైతే ప్రయివేటు స్కూళ్లకు ఎవరూ రారు కనక.. మాతృభాషపై మమకారం లేదంటూ, ఇంగ్లీషు చదువులు వద్దంటూ మాఫియా గాళ్లంతా కలిసి మాయా యుద్ధానికి దిగారు. కేసులు వేశారు. అయినా సరే.. జగన్ సంకల్పం గట్టిది కావటంతో ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడితో ఆగలేదు జగన్.అగ్రశ్రేణి కార్పొరేట్ స్కూళ్లలోనే దొరికే ఎడ్యుటెక్ కంటెంట్‌ను దిగ్గజ సంస్థ ‘బైజూస్’ ద్వారా మన పిల్లలకూ అందుబాటులోకి తెచ్చారు. ఏటా 8వ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్‌లనూ అందజేస్తున్నారు. మిగిలిన తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ క్లాస్రూమ్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. పిల్లల చదువుపై సీఎం జగన్‌కు అంతులేని నిబద్ధత ఉంది. చదివించటం ద్వారా వారి రాతలను మార్చాలన్న తపనతో.. యావత్తు విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించటం మొదలెట్టారు. ఇదంతా చేసింది జస్ట్ నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే! వైద్యం.. ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకైనా.. సరైన వైద్యం చేయించుకోవటానికైనా పేదరికం అడ్డు కాకూడదని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని జగన్ భావించారు. అందుకే.. వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య సేవలకు అదొక బీజం మాత్రమే. అక్కడి నుంచి మొదలుపెడితే.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ పోయింది. ఆసుపత్రులన్నీ స్కూళ్ల మాదిరే ‘నాడు–నేడు’ కింద కొత్త రూపాన్ని, కొత్త సౌకర్యాలను సంతరించుకున్నాయి. ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు... ఇలా ప్రతి పోస్టూ భర్తీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీతో పాటు.. అత్యాధునిక పరికరాలనూ తీసుకొచ్చారు.యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని కూడా కోవిడ్ వణికించినపుడు వీళ్లంతా కలిసి వలంటీర్ల సాయంతో ఎంత అద్భుతం చేశారన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి, సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స తీసుకుని వెళ్లారంటే.. అది రాష్ట్రంలో వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన పక్కా వ్యవస్థ వల్లేనన్నది కాదనలేని నిజం. అంతేకాదు.. గ్రామ స్థాయి నుంచీ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. ఏకంగా 1,405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. ప్రతి చోటా వైద్యులొచ్చారు. ఉచిత మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు విదేశాల్లోనే కనిపించే ‘ఫ్యామిలీ డాక్టర్’... మన ఊళ్లలో ప్రతి ఇంటికీ అందుబాటులోకి వచ్చారు.రాష్ట్రంలో ఇపుడు నిరుపేదలందరికీ కావాలనుకున్న వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్.. అదీ ఉచితంగా దొరుకుతోందంటే.. అదే వైఎస్ జగన్ విజన్. పరిస్థితులు మారి... కొన్ని చికిత్సలకు వ్యయం ఎక్కువవుతోందని గ్రహించటంతో ఇపుడు ఆరోగ్య శ్రీ చికిత్సకయ్యే ఖర్చును ఏకంగా రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చికిత్సా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా చికిత్స ప్రకిరయలను సైతం 1,059 నుంచి 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 820 నుంచి 2,513కి పెంచారు. నాలుగున్నరేళ్లలో ఇవన్నీ చేయాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి మరి! ఇదీ వ్యవ‘సాయం’ అంటే.. దేశానికి రైతే వెన్నెముక. వైఎస్సార్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏడాదికి రెండుసార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడిగా రూ.12,500 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. దాన్ని మరో రూ.వెయ్యి పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ ఆపకుండా మరీ అమల్లోకి తెచ్చారు. నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలూ అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని సంకల్పించారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోశారు. రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్‌స్టాప్ పరిష్కారంగా ఉండాలని భావించారు.నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు, పురుగు మందులు దొరుకుతాయి. భూసార పరీక్ష కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు, ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్నిచోట్ల ఆర్బీకేలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ. రైతును విత్తు నుంచి పండిన పంటను విక్రయించుకునేదాకా చేయిపట్టి నడిపించే అమ్మ, నాన్న.. అన్నీ. మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రస్ఫుటమైంది. సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుపాన్లు దెబ్బతీసినా.. తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ అతివేగంగా సాయం అందించటంతో పాటు ప్రతి ఎకరాకూ ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించటం, ఒక సీజన్లో జరిగిన నష్టానికి మళ్లీ ఆ సీజన్ రాకముందే పరిహారాన్ని అందించటం.. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించటం.. ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ‘ఈ–క్రాప్’ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ఇదీ విజన్ అంటే. వికేంద్రీకరణకు కొత్త అర్థం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వమిచ్చే పింఛన్లంటే ఇదివరకు ఓ మహా ప్రహసనం. పట్టణాల్లోనైతే బ్యాంకుల ముందు పడిగాపులు. పల్లెల్లోనైతే ఇచ్చే వ్యక్తి ఏ రోజున వస్తాడో తెలియని దైన్యం. అసలే వాళ్లు వృద్ధులు, దివ్యాంగులు. అలాంటి వారికిచ్చే సాయమేదైనా వారికి సాంత్వన కలిగించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు కదా? ఇదిగో.. ఈ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సైన్యాన్ని సృష్టించారు. ప్రతినెలా ఒకటవ తేదీన ఠంచనుగా ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయటం ఈ సైన్యం బాధ్యత. ఆ తరవాత..! ఆ వలంటీర్లు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యారు.పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీరు. ప్రభుత్వానికి – ఆ గడపలకు తనే సంధానకర్త. సూక్ష్మ స్థాయిలో వికేంద్రీకరణ ఫలితాలను కళ్లకు కట్టిన వలంటీర్ల మాదిరే... గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువ చేయడానికి వలంటీర్లయితే... ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి చేర్చేది గ్రామ సచివాలయాలు. అవసరమైన సర్టిఫికెట్ల నుంచి స్థానికంగా కావాల్సిన సేవలూ అక్కడే. ఈ వ్యవస్థ ఆలోచనతో ఏకంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా యువత ఉన్న ఊళ్లోనే ఉద్యోగాలు తెచ్చుకుని కొలువుల్లో స్థిరపడింది. అక్కడితో ఆగకుండా గ్రామాల్లో రైతుల కోసం ఆర్బీకేలు, వైద్య సేవల కోసం పీహెచ్‌సీలు నిర్మించి, యావత్తు గ్రామ వ్యవస్థను బలోపేతం చేశారు జగన్. అందుకే ఇపుడు పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. పల్లెల నుంచి వలసలు తగ్గాయి. ఒక బలమైన ఆలోచన... దాని ద్వారా మరింత మంచి చేయాలన్న తపన... ఈ రెండూ ఉంటే ఎంతటి అద్భుతమైన వ్యవస్థలను నిర్మించవచ్చో చేసి చూపించారు జగన్. అందుకే ప్రతి రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ♦ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.2,43,958.04 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 8,29,81,601♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.4,11,488.99 కోట్లు♦ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.1,67,530.95 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 4,44,04,251♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి 2, 3 పథకాల ద్వారా లబ్ధి) 12,73,85,852-రమణమూర్తి మంథా -
ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధిపై సీఎం జగన్ మార్క్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో విశాఖపట్నం సినీ పరిశ్రమ కేంద్రంగా వర్ధిల్లుతుందని అందరూ ఆశించారు. విభజన ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సినిమా పరిశ్రమ బాగు కోసం ఆయన ఎలాంటి కార్యచరణ ప్రారంభించలేదు. బాబు అధికారంలోకి వచ్చాక ఆయనకు అనుకూలంగా ఉండే సినీపెద్దలు విశాఖలోని భూములపై కన్నేశారు. ఆపై ఏపీలోని సినిమా థియేటర్ల లీజులు, క్యాంటీన్ కాంట్రాక్టుల, టికెట్ ధరలు ఇలా అన్నీ బాబుగారి మిత్రులుగా కొనసాగిన కొందరి గుప్పెట్లోకి వెళ్లాయి. దీంతో ఏపీలో సినిమా పరిశ్రమ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి విషయంలో తొలి అడుగులు పడ్డాయి. సినిమా టికెట్ల ధరలు, బెన్ఫిట్ షోలు, ఏపీలో ప్రతి సినిమా షూటింగ్ కార్యక్రమాల పనులు, ఆన్లైన్లో టికెట్ల విక్రయం ఇలా అనేక నిర్ణయాలను సీఎం జగన్ తీసుకున్నారు. మొదటి స్టూడియో విశాఖలోనేసాగర తీరాల్లో ప్రపంచంలో ఎన్నో నగరాలు కొలువుదీరినా వాటిలో విశాఖ నగరానిది ప్రత్యేక స్థానం. ఇక్కడి సాగరతీరం.. పచ్చని కొండలు.. పర్యాటక ప్రాంతాలు పర్యాటక రంగానికే కాకుండా.. సినీ షూటింగులకూ స్వర్గధామాలు. అందువల్లే ఇక్కడ ఆంధ్రా సినీటోన్ పేరుతో 1936లోనే ఒక స్టూడియో ఉండేది. ఇది రాష్ట్రంలో రెండవది. అప్పటికే రాజమండ్రిలో దుర్గ సినీ టోన్ పేరుతో ఒక స్టూడియో ఉండేది. విశాఖలో సినీ స్టూడియో నిర్మించి నగరంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని జగన్నాధరాజు భావించారు. ఆయనతో సూర్యనారాయణ రాజు అనే వ్యక్తి కూడా తోడవడంతో ఇద్దరూ కలిసి ఆంధ్రా సినీ టోన్ స్టూడియోను పూర్తి చేశారు.కానీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని హైదరాబాద్ కావడంతో సినిమా రంగానికి చెందిన వారందరూ కూడా ఆనాడు హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో విశాఖ వెనుకపడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో చిత్ర పరిశ్రమ బాగు కోసం ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఇండస్ట్రీలో బాబుగారికి భజన చేసే బ్యాచ్‌కు పెత్తనం అప్పజెప్పడం.. ఆపే వారికి మాత్రమే భూ కేటాయింపులు చేసే ప్రయత్నాలు చేయడం వంటివి జరిగిపోయాయి. భూములు పొందిన వారు అక్కడ సినీ పరిశ్రమ బాగు కోసం కాకుండా వారి స్వలాభం కోసమే ఉపయోగించుకున్నారు.విశాఖలో స్టూడియోలు, ఇల్లు నిర్మాణలకు స్థలాల కేటాయింపు విశాఖలో చిత్ర పరిశ్రమకు పెద్దపీట వేయాలని అధికారంలోకి వచ్చిన రోజు నుంచే జగన్ ప్రభుత్వం అడుగులేసింది. విశాఖకు రావాలని సినీ ఇండస్ట్రీ పెద్దలను ప్రత్యక్షంగానే సీఎం జగన్ కోరారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు,ప్రభాస్,రాజమౌళి, ఆర్. నారాయణ మూర్తి, కొరటాల శివ వంటి వారితో సినిమా పరిశ్రమ గురించి చర్చించారు. అపై ఇక్కడే స్టూడియోలు నిర్మించాలని ఆయన కోరారు. అలా ఎవరైనా ముందుకు వస్తే వారికి భూములు కేటాయిస్తామని ఆయన ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఈమేరకు విశాఖలో స్టూడియోల నిర్మాణాలకు ప్రభుత్వం సహకరిస్తుందని అప్పట్లో ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని బహిరంగానే ప్రకటించారు.సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులను మంజూరు చేశారు. ఏపీలో షూటింగ్ జరుపుకుంటున్న పలు టాలీవుడ్ చిత్రాలు ప్రభుత్వం నుంచి ఇతర ప్రోత్సాహకాలను కూడా అందుకుంటున్నాయి. విశాఖలో సినీ ప్రముఖులు ఉంటామంటే ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ విధంగా వారు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ సినీ కార్యకలాపాలు మొదలుపెడితే విశాఖలో మరో ఫిలిమ్‌నగర్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాలు తయారవుతాయని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భీమిలి బీచ్‌రోడ్డు నిడిగట్టు పంచాయతీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు 316 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ భూములు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే..సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై కీలక నిర్ణయంసినిమా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. అదీ కూడా సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి, రూపొందించిన నిబంధనలే. సినిమా టికెట్ల రేట్లను తొలి వారం, పది రోజులపాటు పెంచడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు 2022 ఏప్రిల్ 11న ఒక మెమో కూడా జారీ చేసి ఆ ప్రకారం హీరో హీరోయిన్, డైరెక్టర్ల పారితోషకాలు కాకుండా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చు కలిపి ఒక సినిమాకు బడ్జెట్ రూ.100 కోట్లు దాటాలి.ఆ సినిమా షూటింగ్లో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో చేయాలి. సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించాలి. దాన్ని చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ధ్రువీకరించాలి. సినిమా నిర్మాణానికి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ/ ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించాలి. మొత్తం ఇలా 12 రకాల సాధారణ పత్రాలను సమర్పించాలని నిబంధనలను ఏపీ ప్రభుత్వం పెట్టింది.అలా నిర్మించిన సినిమాలకు మాత్రమే ఏపీలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు వచ్చేలా నిబంధనలు పెట్టింది. లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్ల రేట్లు ఉండాల్సిందే. ఇందులో భాగంగా బెనిఫిట్ షోలను కూడా రద్దు చేసింది. బెనిఫిట్ షోల పేరుతో ప్రజల డబ్బుల్ని దళారుల రూపంలో దోచుకుంటున్న వ్యవస్థను క్లోజ్ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై సామన్య ప్రజల నుంచి సానుకూలత లభించింది. సినిమా టికెట్ల రేట్లు తగ్గించిన తర్వాత కొందరు హీరోలు సైతం వారి స్వలాభం కోసం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే. టికెట్ల ధరలు తగ్గించడం వల్ల చిన్ని సినిమాలకు మేలు జరుగుతుందని పలువురు నిర్మాతలు బహిరంగంగానే ఒప్పుకున్నారు. సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే సినిమా చూసేందుకు మరికొందరు థియేటర్‌కు వస్తారు.. లేదంటే ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దాంలే అని ఆలోచించడం సహజం.ఆన్లైన్ టికెట్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయంఆన్లైన్ టికెట్ల యవ్వారంలో గోల్మాల్ సాగుతోందని చాలా ఏళ్ల నుంచి విమర్శలు ఉన్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీలో డిస్ట్రిబ్యూషన్ మాఫియా బలంగా ఉంది. చిన్న సినిమాలను బతకనివ్వడం లేదు. ఎంతసేపూ పెద్ద హీరోలు, పెద్ద సినిమాలే. ఏపీలో షూటింగులు చేయడం లేదు. ఎపీలో చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎటువంటి యాక్టివిటీ లేకుండా పోయింది. దీంతో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థపై గురిపెట్టారు. ఓ నిర్ణయం తీసుకున్నారు.తెలుగు సినిమాల్లో ఎంత పెద్ద సినిమా అయినా కానివ్వండి ఏపీలో షూటింగ్ జరగాల్సిందే అని కొన్ని షరతులు తీసుకురావడం జరిగింది. రైల్వే ఆన్లైన్ ట్రాకింగ్ లాగే సినిమా టికెట్లకూ ఓ పద్థతి ఉండాలని ఆయ సంబంధించిన శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు బుక్ మై షో వంటి ప్రైవేటు ప్లాట్‌ఫాంల ద్వారా ఇప్పటివరకు సాగిన ఆన్లైన్ టికెట్ అమ్మకాలు కుదరదు. సినిమా థియేటర్లతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ ప్లాట్‌ఫాం(గేట్‌వే) ద్వారానే టికెట్లు విక్రయించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసింది.ఈ విధానంలో ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ ఎగరగొట్టడం వంటివి జరగవు. దీంట్లో ప్రభుత్వానికి మాత్రమే కాకుండా సినిమా రంగానికి కూడా మంచిదేనని అభిప్రాయాలు కూడా వచ్చాయి. తప్పుడు కలెక్షన్ల రిపోర్టులు, టికెట్లు కోసేసి, తప్పుడు కలెక్షన్లు చూపించేసి, సినిమాలకు ఇబ్బడిముబ్బడి లాభాలు వచ్చాయిని దొంగ లెక్కలు చూపించి, ఆపైన నిర్మాతల దగ్గర హీరోల రెమ్యూనిరేషన్ భారీగా పెంచేయడం అనే పని ఇకపై జరగదని సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో నిర్వహించగలిగితే, పన్నులు కచ్చితంగా అందడంతో పాటు సినిమా లెక్కలు కూడా కరెక్ట్‌గా ఉంటాయనేది అందరి ఆలోచనకు తగినట్లు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీనీ పరిశ్రమకు సీఎం జగన్ భరోసా► వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని సినీ పరిశ్రమలోని 24 విభాగాలను విశాఖలో స్థిరపడేలా చేస్తే రాష్ట్రానికి, తెలుగు సినీ పరిశ్రమకు మేలు కలుగుతుంది.►విశాఖ పరిసర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో సినీ హబ్ ఏర్పాటు చేసి.. దక్షిణాది సినీ నిర్మాతలందరికీ గమ్యస్థానంగా మార్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.►తెలుగు, తమిళ, మలయాళ, ఒడియా, బెంగాలీ చిత్రాల నిర్మాణ కేంద్రంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ కలసికట్టుగా ముందడుగు వేయాల్సి ఉంది. ►గతంలో సీఎం జగన్‌ను కలిసిన సినీ పెద్దలకు అడిగిందే తడవుగా షూటింగులకు అనుమతులివ్వడమే కాకుండా, ఇంకేం కావాలో చెప్పండని సీఎం వైఎస్ జగన్ అడిగి వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ► సినిమా రంగానికి చెందిన వారికి నివాస స్థలాలు ఇస్తామని సీఎం జగన్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. -
CM Jagan: ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రగతిపథంలోనే..
ఆంధ్రప్రదేశ్ విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, కార్మికరంగం.. ఇలా ఏ రంగంలో చూసిన గతంతోపోలిస్తే అభివృద్ధి చెందింది. కొవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నా..ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా దేశంలోని కొన్ని రాష్ట్రాలు తిరిగి వాటి పూర్వస్థితి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో రంగాల్లో ముందుంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలంటే వివిధ శాఖల అనుమతులు అవసరం అవుతాయి. అవి పొందాలంటే యాజమాన్యాలకు కొంత శ్రమతో కూడుకున్న వ్యవహరం. అయితే వీటన్నిటినీ కేంద్రీకృతం చేసి ఇండస్ట్రీయల్ సింగిల్ విండో క్లియరెన్స్‌ను అమలులోకి తెచ్చిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రం. సోలార్ పవర్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రత్యేక చట్టాలను చేసింది. 2023-24 సంవత్సరానికిగాను స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.14,49,501 కోట్లుగా ఉంది. ఇది చంద్రబాబు పాలన ముగిసిన 2018-19కి గాను రూ.8,70,849 కోట్లుగా ఉండేది. గడిచిన ఈ కొన్నేళ్లలో ఇది దాదాపు 65 శాతం ఎక్కువ. 2021-22లో స్థూల విలువ ఆధారిత (జీవీఏ)వృద్ధి 18.47%గా ఉంది. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా నాణ్యమైన మౌలిక సదుపాయాలను సృష్టించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2023 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.6వేల కోట్లు. 2023లో రాష్ట్ర సరుకుల ఎగుమతులు రూ.1.58లక్షల కోట్లు. ఇందులో గరిష్ఠంగా సముద్ర ఉత్పత్తుల వల్ల దాదాపు 13.62% వాటా చేకూరింది. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా రూ.22,282.16 కోట్లతో భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు స్థాపించేలా ప్రభుత్వం కృషిచేసింది. టీడీపీ హయాంలో పరిశ్రమల అభివృద్ధిలో 27వ స్థానానికి దిగజారిన రాష్ట్రం.. ప్రస్తుతం జగన్ పాలనలో మూడో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 2023 నాటికి, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 26,675.73 మెగావాట్లు. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో 17 స్థానంలో నిలిచిన రాష్ట్రం ప్రస్తుతం 9వ స్థానానికి ఎదిగింది. చంద్రబాబు ప్రభుత్వకాలంలో కేవలం 34000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.93లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. అందులో 2.13లక్షల శాశ్వత కొలువులు ఉన్నాయి. వ్యవసాయంలో రాష్ట్రం టీడీపీ కాలంలో మైనస్ 6.5శాతంతో అధ్వానంగా మారింది. అదే 2021-22కు గాను 8.2 శాతం వృద్ధి చెందింది. దాంతో వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2022-23కుగాను వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రూ.13,640 కోట్లు కేటాయించారు. ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వం..