fertilizers subsidy
-
CM Jagan: అన్నదాతకు అభయం
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) అన్నదాతకు అభయమిస్తున్నాయి. రాత్రనకా, పగలనకా సేద్యం చేసి ఉత్పత్తి చేసిన పంటలకు గిట్టుబడి లేక సతమతమయ్యే రైతన్న పాలిట భరోసా కల్పిస్తున్నాయి. విత్తు నుంచి పంట విక్రయం వరకు ప్రతీ రైతును గ్రామస్థాయిలో చేయి పట్టి నడిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎండనక, వాననక సొసైటీల వద్ద పడిగాపులు పడితే తప్ప విత్తనాలు దొరికేవి కావు. కానీ ప్రస్తుతం ఆర్బీకేల రాకతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎరువుల కోసం అర్రులు చాస్తూ క్యూలైన్లలో నిలబడే దృశ్యాలు మచ్చుకైనా కన్పించడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి న తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేసి వాటి స్వరూపాన్ని మార్చేసింది. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది. ఆర్బీకేల్లో రాయితీలో అందించిన విత్తనాల వివరాలు ♦ రైతుల సంఖ్య: 54.34 లక్షలు ♦ లబ్ధి: రూ. 881.47 కోట్లు ♦ పంపిణీ చేసిన విత్తనాలు: 31.16 లక్షలు (క్వింటాళ్లలో) ♦ ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్లు – 421వాటికైన ఖర్చు–రూ.63.15 కోట్లు ♦ ఈ సెంటర్లలో సేవలు పొందిన రైతులు–4 లక్షల మంది ♦ రూ.5.37 కోట్లతో ఏర్పాటైన శీతల గిడ్డంగుల సంఖ్య: 43 ♦ 30.99 లక్షల మంది రైతులకు రూ.1,289.52 కోట్ల విలువైన 11.66 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ రైతన్నకు భరోసా ఇలా.. ♦ రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు 6.19 లక్షల మందికి రూ.715.84 కోట్లు ♦ క్లైయిమ్లు, సెటిల్మెంట్లు, చెల్లింపుల్లో తొలి ఏడాది రైతుల వాటాతో కలిపి ప్రభుత్వం చెల్లించిన బకాయిలు – రూ.971 కోట్లు ♦ ఏటా సగటున 13.62 లక్షల మందికి రూ.1,950.51 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు చేకూరిన లబ్ధి – రూ.7,802.05 కోట్లు ♦ 2023–24 రూపాయి ప్రీమియంతో బీమా కల్పిస్తూ ఏపీ మోడల్లో నడిచే రాష్ట్రాలు– మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ ఏపీ మాదిరిగా ఈ పంట నమోదు చేస్తున్న రాష్ట్రాలు – తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ♦ భూముల్లేని కౌలుదారులకు ఈ–క్రాప్ ప్రామాణికంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ ♦ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ♦ రూ.లక్ష లోపు రుణాలు తీసుకుని చెల్లించిన రైతుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ జమ ♦ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం ♦ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ చివరలో ఇన్పుట్ సబ్సిడీ ♦ సీజన్‌కు ముందుగానే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం ♦ యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం అంగీకరించకపోవడంతో మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లింపు ♦ 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు ♦ ప్రతి ఎకరాకు ఈ క్రాప్ ఆధారంగా యూనివర్శల్ బీమా కవరేజ్‌ను కల్పిస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీయే ♦ ఏటా లబ్దిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ అభ్యంతరాలు పరిష్కారం ♦ ఎన్నికల హామీ మేరకు 2019 ఖరీఫ్ సీజన్లో రూపాయి ప్రీమియంతో పథకం ♦ ఈ– పంట నమోదే అర్హతగా ఉచితంగా బీమా కవరేజ్ కల్పిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం. ఆదర్శం.. ‘ఫిష్ ఆంధ్ర’ ♦ రాష్ట్రంలో ఏటా 50 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులతో దేశంలోనే మొదటి స్థానం. ♦ ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పానికి పదును. ♦రూ.కోటి అంచనాతో జిల్లాకో ఆక్వా హబ్.. ♦జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్‌లు. 4,007 ఫిష్ ఆంధ్రా మినీ అవుట్‌లెñట్స్ ♦ 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం ♦ వీటికి అనుబంధంగా రిటైల్ మినీ అవుట్‌లెట్స్, ఈ మొబైల్ త్రీ వీలర్, 4 వీలర్ ఫిష్ వెండింగ్ డెయిలీ యూనిట్లు, ఏర్పాటు. ‘ఫిష్ ఆంధ్ర’లో ఏమేమి దొరుకుతాయి... మెత్తళ్లు, పండుగప్పలు, కాలువ రొయ్యలు, సముద్ర పీతలు, టూనా, కోనాం చేపలు ఇలా ఏది కావాలన్నా తాజాగా బతికున్నవి లభ్యం. రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ క్రమేపీ పెరుగుదల. ఆక్వా రైతు ఆనందం ఈ–ఫిష్ సర్వే ఆధారంగారాష్ట్రంలో ఆక్వా సాగు పరిస్థితి సాగు విస్తీర్ణం:4,65,877.54 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలోని భూమి:4,22,309.63 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం:3,56,278 ఎకరాలు పదెకరాల పైబడి విస్తీర్ణం:6,60,321.63 ఎకరాలు నాన్ ఆక్వాజోన్ పరిధిలోని భూమి: 43,567.91 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం: 23,042.02 ఎకరాలు పదెకరాలకు పైబడి విస్తీర్ణం:20,524.89 ఎకరాలు మొత్తం విద్యుత్ కనెక్షన్లు: 64,645 సబ్సిడీ పరిధిలోని కనెక్షన్లు: 50,659 -
విత్తనాలు, పిచికారీ డ్యూటీ డ్రోన్లదే..
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. సంప్రదాయ సాగు నుంచి ఆధునిక పద్ధతిలో పంటలు పండించే విధానాలు పెరుగుతున్నాయి. విత్తనాలు వేయడం నుంచి ఎరువులు చల్లడం వరకు అన్ని ప్రక్రియల్లో డ్రోన్లు గణనీయమైన పాత్ర పోషించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెయ్యి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో వాటిని అందుబాటులో ఉంచి రైతులకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆగ్రోస్ వర్గాలు వెల్లడించాయి. సేవా కేంద్రాల నిర్వా హకులు డ్రోన్లు కొనుగోలు చేసుకునేందుకు అవసరమైన బ్యాంకు రుణాలను ఆగ్రోస్ ఏర్పాటు చేస్తుంది. వారికి శిక్షణతో పాటు లైసెన్స్ ఇచ్చేందుకు విమానయాన సంస్థతో ఆగ్రోస్ ఒప్పందం చేసుకుంది. డ్రోన్ పైలట్ శిక్షణ తప్పనిసరి ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణలో ట్రాక్టర్లు, స్ప్రేలు, దుక్కిదున్నే యంత్రాలు, వరి కోత మెషీన్లు తదితరాలను ఇచ్చిన వ్యవసాయశాఖ ఇప్పుడు డ్రోన్లను ఇచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. డ్రోన్ ద్వారా స్ప్రే చల్లడం వల్ల తక్కువ మొత్తంలో నీరు, పురుగుమందులు అవసరమవుతాయి. విత్తనాలు చల్లడంలో డ్రోన్లను వినియోగించడం వల్ల కచ్చితత్వం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే యూరియా వంటి ఎరువులను డ్రోన్ల ద్వారా చల్లితే ప్రతీ మొక్కకు చేరతాయని అంటున్నారు. అదీగాక, డ్రోన్లతో పిచికారీ వల్ల రైతులు పురుగు మందుల దు్రష్పభావాలకు గురికాకుండా, అనారోగ్యం బారినపడకుండా ఉండొచ్చని ఆగ్రోస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో డ్రోన్ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుందని అంచనా. వాటిని ఆగ్రోస్ కేంద్రాల నిర్వాహకులకు సబ్సిడీపై ఇస్తారు. అలాగే కొంతమంది రైతులకు కలిపి గ్రూప్‌గా కూడా డ్రోన్ ఇచ్చే అవకాశముంది. ఒకవేళ రైతులు డ్రోన్లను కొనుగోలు చేయాలనుకుంటే సబ్సిడీ కూడా ఇవ్వనున్నారు. సబ్సిడీ మొత్తాన్ని త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిసింది. కాగా, డ్రోన్‌ను తీసుకోవాలంటే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. అలాగే డ్రోన్ పైలట్ శిక్షణ తీసుకొని ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి. ఏవియేషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఒక్కో డ్రోన్ ధర: సుమారు 10,00,000 రూపాయలు డ్రోన్ అద్దె ఎకరాకు: రూ. 400 డ్రోన్లతో ఎకరాకు తగ్గనున్న ఖర్చు: రూ. 4,000 - 5,000 డ్రోన్లు ఏం చేస్తాయంటే.. ప్రధానంగా డ్రోన్లను విత్తనాలు చల్లడానికి, పురుగు మందులను స్ప్రే చేయడానికి వాడతారు. కొన్ని పంటలకు పైౖపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. కొన్నింటికి కాండం మొదళ్లో చల్లాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పంటలకు ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు డ్రోన్లకు పరికరాలు అమర్చుతారు. అలాగే పంటకు చీడపీడలు ఏమైనా ఆశించాయో తెలుసుకునేందుకు ఫొటోలు కూడా తీస్తాయి. వాటిని వ్యవసాయాధికారికి పంపేలా ఏర్పాటు చేయనున్నారు. అలాగే కాత ఎలా ఉంది? దిగుబడి ఏ మేరకు వచ్చే అవకాశముంది. ఇలా పంటకు సంబంధించిన ప్రతీ అంశాన్ని సూక్ష్మంగా పర్యవేక్షించేలా డ్రోన్లను అందుబాటులోకి తెస్తారు. ఈ మేరకు పలు కంపెనీలతో చర్చించినట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో గ్రామాల్లో డ్రోన్లతో సాగు సులభంగా జరుగుతుందని అంటున్నారు. డ్రోన్లతో సాగు ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. రైతులకు ఆదాయం పెరుగుతుంది ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు అద్దెకు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. డ్రోన్ల వినియోగంతో సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. పెద్దసంఖ్యలో కూలీలు చేసే పనిని ఒక డ్రోన్ కొన్ని నిమిషాల్లో చేస్తుంది. కాబట్టి సాగు ఖర్చు తగ్గి రైతులకు ఆదాయం పెరుగుతుంది. -
సింగిల్ బ్రాండ్ భారత్‌తో అన్ని సబ్సిడి ఎరువులు: మోదీ కొత్త స్కీం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన కింద 'వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్' అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అన్ని సబ్సిడీ ఎరువులను ఒకే బ్రాండ్ కింద మార్కెట్ చేయడం తప్పనసరి చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మేళన్ 2022 సందర్భంగా జరుగుతున్న రెండు రోజుల కార్యక్రమంలో సింగిల్ బ్రాండ్ భారత్ పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. సబ్సడి ఎరువుల అక్రమ మార్గంలో తరలింపుకు చెక్‌పెట్టేలా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం కింద యూరియా, డి అమ్మెనియా ఫాస్ఫేట్(డీఏపీ), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ), ఎన్పీకే వంటివి ఒకే బ్రాంక్ కింద విక్రయాలు జరుగుతాయి. అంతేగాక సుమారు 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను(పీఎంకేఎస్కే) కూడా ప్రారంభించారు. ఇవి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు అందిచడమే కాకుండా బహుళ సేవలను అందించే ఒక షాపుగా పనిచేస్తుంది. దేశంలో దాదాపు 3.5 లక్షలకు పైగా ఉన్న రిటైల్ దుకాణాలను పీఎంకేఎస్‌కేగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ఈ కేంద్రల్లో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు వంటివి అందించడమే కాకుండా, మట్టి, విత్తనాలు, ఎరువులకు సంబంధించిన పరీక్ష సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తుంది. మోదీ ఈ రెండు రోజుల కిసాన్ సమ్మేళన్ కార్యక్రమంలో "ఇండియన్ ఎడ్జ్" అనే ఈ మ్యాగజైన్ కూడా ప్రారంభించారు. దీనిలో దేశీయ, అంతర్జాతీయ ఎరువుల సమాచారం, ఇటీవల ఉన్న ధరలు, అభివృద్ధి, వినియోగాలు తదితర అంశాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆ రైతు పక్కా ప్రణాళిక.. రోజూ ఆదాయం, లాభాలే లాభాలు!) -
PM PRANAM Scheme: ఈ పథకంతో ఆహార భద్రతకు ప్రమాదం
కేంద్ర ప్రభుత్వం ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని చర్చల కోసం విడుదల చేసింది. ఈ పథకాన్ని రాష్ట్రాలు ఆమో దిస్తే చట్టం చేయాలని నిర్దేశించారు. దేశంలో ఎరువుల వాడకం విచక్షణా రహితంగా పెరుగుతున్నదనీ, ఆ విని యోగాన్ని తగ్గించాలనీ ఈ పథకాన్ని రూపొందించారు. ఎరువుల వినియోగం తగ్గితే వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గిపోతుంది. ఇప్పటికే వంటనూనెలు, పప్పులు, పంచదార, పత్తి, ముతక ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాము. గతంలో ఇవన్నీ ఎగుమతి చేసిన దేశం మనది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) విధానాలు వచ్చిన తర్వాత, స్వయంపోష కత్వంలో ఉన్న దేశం సబ్సిడీలు తగ్గించడంతో దిగుమతులపై ఆధారపడుతున్నాము. ‘పీఎం ప్రణామ్’(పీఎం ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజేమెంట్) పథకం ఎరువుల సబ్సిడీలను కోత పెట్టాలని స్పష్టంగా చెపుతున్నది. 2017–18లో 528 లక్షల టన్నుల ఎరువులు విని యోగించాము. 2021–22లో 640 లక్షల టన్నులకు వినియోగం పెరిగింది. ఈ పెరుగుదలను తగ్గించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ప్రకారం ఎరువులకు ఇస్తున్న సబ్సిడీని ఆదా చేస్తారు. ఆదా చేసిన దానిలో 50 శాతం రాష్ట్రాలకు ఇస్తారు. ఈ 50 శాతంలో 70 శాతం గ్రామ, జిల్లా, బ్లాక్‌లకు ప్రత్యామ్నాయ ఎరువుల సాధనకు ఇస్తారు. మిగిలిన 30 శాతం ఎరువుల తగ్గింపుపై, సేంద్రీయ ఎరువులపై అవగాహన కల్పించడానికీ, రైతులను చైతన్యపర్చడానికీ శిక్షణ ఇస్తారు. మిగిలిన 50 శాతం కేంద్రప్రభుత్వం తన బడ్జెట్లో కలుపుకొంటుంది. భారతదేశంలో హెక్టారుకు 175 కిలోల ఎరువులు వాడుతున్నాము. హెక్టారు ఉత్పాదకత 3,248 కిలోలు వస్తున్నది. 43 కోట్ల ఎకరాలు సాగుచేస్తున్న దేశంలో నేటికి 9 కోట్ల ఎకరాల భూమి బీడుగా మారింది. జనాభా ఏటా 1.9 శాతం పెరుగుతున్నది. పెరిగిన జనాభాకు ఆహారధాన్యాల ఉత్పత్తిని మరింత పెంచాలి. వాస్తవానికి భారతదేశంలో 80 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. అందులో 40 కోట్ల మంది దినసరి ఆహారధాన్యాల వాడకం 450 గ్రాముల నుండి 325 గ్రాములకు తగ్గిపోయింది. సేంద్రీయ ఎరువులను, రసాయనిక ఎరువులను కలిపి వాడడం ద్వారానే వ్యవసాయోత్పత్తులు పెరుగుతాయి. చైనాలో 25.5 కోట్ల ఎకరాలలో 61.22 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి చేస్తున్నారు. హెక్టారుకు 6,081 కిలోలు ఉత్పత్తి అవుతున్నది. 2018 గణాంకాల ప్రకారం హెక్టారుకు 393.2 కిలోల ఎరువులు వాడుతున్నారు. ఎరువుల వినియోగం పెంచడంతో మనదేశం కన్నా రెట్టింపు ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతున్నది. పైగా వారు 2.77 బిలియన్ డాలర్ల ఎరువులను ఎగుమతి చేస్తున్నారు. ఎరువుల వినియోగాన్ని పెంచకుండా ఉత్పత్తి, ఉత్పాదకత పెరగదు. ఈమధ్య శ్రీలంక అనుభవం చూసినపుడు సేంద్రీయ ఎరువుల వాడకంతో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయి తీవ్ర సంక్షోభంలో పడి ప్రభుత్వమే కూలిపోయింది. ఈ పథకం అమలుచేస్తే భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే వ్యవసాయ రంగంలోకి 8 కార్పొరేట్ సంస్థలు వచ్చి తమ వ్యాపారాలు సాగిస్తున్నాయి. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడంకన్నా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనే వారికి మంచి లాభాలు వస్తాయి. 2015లో శాంత కుమార్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం, కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలను ఎత్తివేయడం, సబ్సిడీని నగదు బదిలీగా మార్చడం చేయాలని ఇచ్చిన సలహాలను ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్నది. మనకు ఎగుమతులు చేస్తున్న దేశాలు తమ బడ్జెట్లలో 7 నుండి 10 శాతం వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నాయి. పైగా ముడి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి అదనపు లాభానికి భారతదేశానికి ఎగుమతి చేస్తూ వేలకోట్ల లాభాలు గడిస్తున్నాయి. దిగుమతులు రావడం వల్ల స్థానిక పంటల ధరలు తగ్గి రైతులకు గిట్టుబాటు కావడంలేదు. కార్పొరేట్ సంస్థలు వ్యవసాయరంగంలో తమ ప్రాబల్యం పెంచడానికి వీలుగా ఇలాంటి పథకాలను తేవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం రుణాలు ఇవ్వక పోవడం, సబ్సిడీలకు కోతపెట్టడంతో రైతులు మైక్రోఫైనాన్స్ సంస్థల బారిన పడి, వారికి వడ్డీ చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో 2.5 శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు. దీనిని 7 శాతానికి పెంచాలి. ఎరువులను శాస్త్రీయంగా వినియోగించడానికి వీలుగా భూసార పరీక్షలు జరిపి రైతులను చైతన్య పరచాలి. అంతేగానీ ఇలాంటి ప్రమాదకర పథకాలను అమలు పరచరాదు. - సారంపల్లి మల్లారెడ్డి ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు -
ఎరువులు పుష్కలం.. ఇప్పటివరకు 8.54 లక్షల టన్నుల విక్రయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. సాగు లక్ష్యంలో ఇప్పటికే 68 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఈ దశలోనే ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో.. గతంలో ఎన్నడూలేని విధంగా డిమాండ్‌కు మించి ఎరువుల నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచడమే కాకుండా ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తోంది. కృత్రిమ కొరత సృష్టించాలని ప్రయత్నిస్తే సహించే ప్రశ్నేలేదని హెచ్చరించింది. కృత్రిమ కొరతను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. విస్తృత తనిఖీలు చేస్తోంది. ఆర్బీకే లేదా టోల్ ఫ్రీ నెం.155251కు ఫోన్‌చేస్తే డీలర్ల భరతం పడతామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. రాష్ట్రంలో 7.70 లక్షల టన్నుల నిల్వలు ఖరీఫ్ సీజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం. రబీలో మిగిలిన ఎరువులు, ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు కేంద్రం కేటాయించిన ఎరువులతో కలిపి మొత్తం 16.24 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. వీటిలో ఇప్పటివరకు 8.54 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం 7.70 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 3.44 లక్షల టన్నుల యూరియా, 2.83 లక్షల టన్నుల కాంప్లెక్స్, 65,265 టన్నుల డీఏపీ, 40,688 టన్నుల ఎంఓపీ, 37,268 టన్నుల ఎస్ఎస్పీ ఎరువుల నిల్వలున్నాయి. ఆగస్టు నెలకు కేంద్ర కేటాయింపులు ద్వారా 6.11 లక్షల టన్నులు రావాల్సి ఉంది. మరోవైపు.. ఆర్బీకేల్లో 1.69 లక్షల టన్నులు నిల్వచేయగా, 94,676 టన్నుల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం 74,373 టన్నుల ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. సమృద్ధిగా డీఏపీ ఎరువులు ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా వినియోగించే డీఏపీ ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి. ఖరీఫ్–2021లో 1.26 లక్షల టన్నుల డీఏపీ వినియోగించగా, ప్రస్తుత సీజన్‌కు 2.25 లక్షల టన్నులను కేంద్రం కేటాయించింది. ఇప్పటివరకు 1.90 లక్షల టన్నులను అందుబాటులో ఉంచగా, 1.25 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం 65,265 టన్నుల డీఏపీ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల్లో కూడా 36,474 టన్నుల డీఏపీ ఎరువులు అందుబాటులో ఉంచగా, ఇప్పటివరకు 19 వేల టన్నుల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం 17,465 టన్నులు అందుబాటులో ఉన్నాయి. కృత్రిమ కొరత సృష్టిస్తే కొరడా ఇక గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డీఏపీ, ఎస్ఎస్పీ మినహా మిగిలిన ఎరువుల ధరల్లో ఎలాంటి మార్పులేదు. పోషక ఆధారిత రాయితీ, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడిసరుకుల ధరల కారణంగా బస్తా డీఏపీకి రూ.150లు, ఎస్ఎస్పీపై రూ.125లు మేర కంపెనీలు పెంచాయి. వీటి ధరల నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమాత్రం ఉండదు. మరోవైపు.. భవిష్యత్‌లో ఎరువుల ధరలు పెరుగుతాయనే ఆలోచనతో కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎరువుల సరఫరా, పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రతీ జిల్లాకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలను అప్పగించింది. జిల్లా స్థాయిలో తనిఖీ బృందాలను ఏర్పాటుచేసింది. ఎరువుల దుకాణాలతో పాటు స్టాక్ పాయింట్లను విస్తృతంగా తనిఖీచేస్తోంది. ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే కఠిన చర్యలు ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. డిమాండ్‌కు మించి ఎరువులు అందుబాటులో ఉంచాం. ఏ ఒక్కరూ ఎమ్మార్పీకి మించి చెల్లించొద్దు. విధిగా రశీదు తీసుకోండి. ఎవరైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే సమీప ఆర్బీకే లేదా స్థానిక వ్యవసాయాధికారికి సమాచారమివ్వండి. లేదంటే టోల్ ఫ్రీ నెం.155251కు ఫిర్యాదు చేయండి. వారి లైసెన్సులు రద్దుచేయడమే కాక.. క్రిమినల్ కేసులూ పెడతాం. ఇక ఎరువుల కొరత, ధరల పెరుగుదలపై దుష్ప్రచారం సరికాదు. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ చదవండి: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు -
సమృద్ధిగా ఎరువులు
సాక్షి, అమరావతి: రబీ సాగు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 80 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లోలానే రబీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంది. సమృద్ధిగా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచింది. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా పారదర్శకంగా పంపిణీ చేపట్టింది. కొన్ని జిల్లాల్లో ఎరువుల్లేవంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరం మేరకు ఎరువులు ఉన్నాయని, ఆందోళన వద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎరువుల నిల్వలు, అమ్మకాలపై మంగళవారం ప్రకటన చేసింది. ఆర్బీకేల ద్వారా 1.50 లక్షల ఎంటీల విక్రయం 2021–22 రబీ సీజన్ కోసం 23.44 లక్షల ఎంటీల ఎరువులు అవసరం కాగా, అక్టోబర్ నాటికి 6.97 లక్షల ఎంటీల నిల్వలున్నాయి. అదనంగా జనవరి 31 నాటికి రాష్ట్రానికి 11.94 లక్షల ఎంటీలు కేంద్రం కేటాయించింది. మొత్తం 18.91 లక్షల ఎంటీలు అందుబాటులో ఉండగా, అక్టోబర్ నుంచి జనవరి 31 వరకు 13.77 లక్షల ఎంటీల విక్రయాలు జరిగాయి. రబీ సీజన్లో ఆర్బీకేలకు 1.95 లక్షల ఎంటీల ఎరువుల సరఫరా లక్ష్యం కాగా ఇప్పటికే 1.80 లక్షల ఎంటీలు సరఫరా చేశారు. ఇప్పటివరకు ఆర్బీకేల ద్వారా 1.50 లక్షల ఎంటీల విక్రయాలు జరిగాయి. మరో 30 వేల ఎంటీలు ఆర్బీకేల్లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 5.14లక్షల టన్నుల ఎరువు నిల్వలు ఫిబ్రవరి నెలకు రాష్ట్రంలో 3,72,104 ఎంటీల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం సుమారు 5,14,160 ఎంటీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో.. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. దీంతో ఎరువుల సరఫరా, పంపిణీ పర్యవేక్షణకు జిల్లాకు ఓ సీనియర్ అధికారిని నియమించింది. సీఎం జగన్ అభ్యర్థన మేరకు కేంద్రం రాష్ట్రానికి 49,736 మెట్రిక్ టన్నుల ఇంపోర్టెడ్ యూరియాను కేటాయించింది. ఈ యూరియా రెండు నౌకల్లో కాకినాడ, గంగవరం పోర్టులకు చేరుకుంది. దీనిని ఒకట్రెండు రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు సరఫరా చేస్తారు. ఎరువుల కొరత లేదు రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. రబీ సీజన్లో ఏ ఒక్క రైతుకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. డిమాండ్ ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థన మేరకు కేంద్రం రాష్ట్రానికి యూరియా కేటాయించింది. దీనిని జిల్లాలకు సరఫరా చేస్తాం. –కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
రైతులకు ప్రధాని మోదీ శుభవార్త
న్యూఢిల్లీ: దేశ రైతాంగానికి ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. డీఏపీ బస్తాపై ప్రస్తుతం అందుతున్న రూ.500ల సబ్సిడీని రూ.1200లకు పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఓ బస్తా డీఏపీపై 140 శాతం సబ్సిడీ లభించనుంది. ఎరువుల ధరపై బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల ఉన్నప్పటికీ రైతు అతి తక్కువ ధరకే ఎరువులు పొందాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని ప్రధాని వెల్లడించారు. కాగా, సవరించిన సబ్సిడీ ధరలతో కేంద్ర ప్రభుత్వంపై రూ.14,775 కోట్ల అదనపు భారం పడనుంది. -
రూ.6 లక్షల కోట్లకు చేరిన ఆహారం, ఎరువుల సబ్సిడీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆహారం, ఇంధనం, ఎరువులపై కేంద్రం ఇస్తున్న సబ్సిడీలు సుమారు రూ.6 లక్షల కోట్లకు చేరాయి. 2020–21 బడ్జెట్ అంచనాల్లో రూ.2,27,793.89 కోట్లుగా ఉన్న సబ్సిడీ.. సవరించిన అంచనాల ప్రకారం రూ.5,95,620.23 కోట్లకు పెరిగింది. గతేడాది ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం.. కోవిడ్, లాక్డౌన్ వల్ల తలెత్తిన పరిస్థితులతో అంచనాలు తలకిందులయ్యాయి. 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం వల్ల సబ్సిడీ బిల్లు అమాంతం పెరిగిపోయింది. అయితే, 2021–22 ఆర్థిక సంవత్సరానికి గానూ సబ్సిడీ బిల్లును రూ.3,36,439.03 కోట్లుగా అంచనా వేశారు. ఇక ఆహార ధాన్యాలపై సబ్సిడీ రూ.1,15,569.68 కోట్ల నుంచి రూ.4,22,618.14 కోట్లకు పెరిగింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.2,42,836 కోట్లుగా అంచనా వేశారు. ఎరువులపై సబ్సిడీ రూ.71,309 కోట్ల నుంచి రూ.1,33,947.3 కోట్లకు చేరగా.. 2021–22లో రూ.79,529.68 కోట్లుగా అంచనా వేశారు. పెట్రోలియం ఉత్పత్తులు(ఎల్పీజీ, కిరోసిన్) మీద సబ్సిడీని రూ.40,915.21 కోట్లుగా అంచనా వేయగా.. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.39,054.79 కోట్లయ్యింది. 2021–22లో పెట్రోలియం సబ్సిడీ కింద రూ.14,073.35 కోట్లు కేటాయించారు. -
దిశ మారింది .. దశ తిరిగింది
సాక్షి, అమరావతి: మార్క్‌ఫెడ్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో నామమాత్రపు సేవలకే పరిమితమై, మండలానికో కొనుగోలు కేంద్రంతో కొన్ని పంటలనే కొనుగోలు చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు గ్రామ స్ధాయిలో పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటలనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటలనూ కొనుగోలు చేస్తోంది. అలాగే గతంలో కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే ఎరువులు పంపిణీ చేసేవి. ఇప్పుడు గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి, విస్తరిస్తున్న సంస్థ సేవలకు అనుగుణంగా రైతు సమస్యల పరిష్కారం విషయంలో నిబద్ధత కలిగిన అధికారులు, సిబ్బంది 100 మందిని డిప్యుటేషన్‌పై నియమించుకోవడానికి మార్క్‌ఫెడ్ కసరత్తు చేస్తోంది. ఎరువుల పంపిణీ బాధ్యత రాష్ట్రంలో 1950 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఆరి్ధకంగా బలమైన ఐదు వందల్లోపు సంఘాలు రైతులకు ఎరువులు పంపిణీ చేశాయి. మిగిలిన సహకార సంఘాల పరిధిలోని రైతులు ప్రైవేట్ డీలర్ల నుంచి అధిక రేటుకు ఎరువులను కొనుగోలు చేశారు. అదే సమయంలో అనేక సహకార సంఘాల పాలకవర్గాలు ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడ్డాయి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించడం ద్వారా ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు చెక్ పెట్టినట్టయ్యింది. అప్పుడు ‘ఆ కొందరి’కే సేవలు టీడీపీ హయాంలో మార్క్‌ఫెడ్ నామమాత్రపు సేవలకే పరిమితమయ్యింది. మండలానికో కొనుగోలు కేంద్రం మాత్రమే ఉండటంతో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి అనేక వ్యయ ప్రయాసలకు గురయ్యారు. కేవలం తెలుగుదేశం సానుభూతిపరులకే సేవలందించిందనే అపప్రథను సంస్థ మూటగట్టుకుంది. ఆ పార్టీ నాయకులు సిఫారసు చేసిన రైతుల నుంచే పంటలను కొనుగోలు చేసేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పుడు రైతులందరి సంక్షేమమే లక్ష్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మార్క్‌ఫెడ్ దశ తిరిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడంలో రైతులు ఎలాంటి ఇబ్బందులూ పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీంతో తెలుగుదేశం పాలనలో ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు కేవలం రూ.3 వేల కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గత ఏడాదిలోనే రూ.3,119 కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేశారు. అప్పట్లో కందులు, అపరాలు, పసుపు, వేరుశనగ వంటి పంటలనే కొనుగోలు చేస్తే .. గత ఏడాది కందులు, అపరాలు, శనగలు, వేరుశనగ, మొక్కజొన్న, జొన్నలు, పసుపు, సజ్జలు, ఉల్లిపాయలు, పొగాకు, అరటి, బత్తాయి, టమాటా వంటి అనేక పంటలు మొత్తం 8.74 లక్షల టన్నులు ప్రస్తుత ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాదాపు వెయ్యి కొనుగోలు కేంద్రాల ద్వారా మార్క్‌ఫెడ్ సిబ్బంది సెలవుల్లోనూ పంటలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది 10,641 రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రైతులు తమ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోనే పంటలను అమ్ముకుంటున్నారు. టైమ్‌స్లాట్ విధానం, పంటల నమోదు వంటి నిబంధనలు సడలించి ఒక రోజు ముందు అధికారులకు తెలియపరిచి పంటను అమ్ముకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. పొగాకు కొనుగోలు బాధ్యత కూడా.. వ్యాపారులంతా కూటమిగా ఏర్పడి పొగాకు రైతులను దోపిడీ చేస్తున్న పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పొగాకు కొనుగోలు బాధ్యతను ఈసారి మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. దీంతో పొగాకు బోర్డులో బిడ్డరుగా పేరు నమోదు చేసుకున్న సంస్థ మిగిలిన వ్యాపారులకు పోటీగా తొలిసారిగా పొగాకు కొనుగోలు చేసింది. దీంతో రైతులు గతంతో పోల్చుకుంటే సగటున కిలోకు రూ.2.42 అధికంగా పొందారు. గతంలో సగటున కిలోకు రూ.121.53 పొందిన రైతులు.. మార్క్‌ఫెడ్ రంగ ప్రవేశంతో సగటున కిలోకు రూ.123.95 పొందగలిగారు. పొగాకు బోర్డు ఆధ్వర్యంలో మొత్తం 128.65 మిలియన్ కిలోల అమ్మకాలు జరిగితే, అందులో పదిశాతం అంటే 12.93 మిలియన్ కిలోల పొగాకును మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. మార్క్‌ఫెడ్ ప్రవేశానికి ముందు, ఆ తర్వాత జరిగిన అమ్మకాలతో రైతులకు లభించిన మొత్తంలో వ్యత్యాసం రూ.150 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సిబ్బందిని పెంచుతున్నాం ఎరువుల పంపిణీ బాధ్యతను ఆగ్రోస్ నుంచి మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం బదిలీ చేసిన నేపథ్యంలో.. సంస్థకు ఎక్కువమంది సిబ్బంది అవసరం. మార్కెటింగ్ శాఖ మనుగడ ప్రశ్నార్ధకం కావడంతో.. అక్కడి ఉద్యోగులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. –ఎస్.ప్రద్యుమ్న, ఎమ్డీ, మార్క్‌ఫెడ్ రైతు సంక్షేమానికి సర్కారు చర్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పంట పండించడానికి, అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకుంటున్నారు. రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, కొనుగోలు కేంద్రాలు అన్నిటినీ గ్రామస్థాయికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కొన్ని ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు పెరుగుతున్నాయి. –మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ సేవలు అందించే సంస్ధల బలోపేతం రైతులకు సేవలు అందించే ప్రభుత్వ శాఖలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్క్‌ఫెడ్ గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే 8.74 లక్షల టన్నుల పంటలను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.3,119 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ పంటల కొనుగోలు జరగలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకేసారి 24 పంటలకు మద్దతు ధర ప్రకటించారు. సీజను ప్రారంభానికి ముందే ప్రకటించడంతో రైతులు మార్కెట్లోని ధరలను బేరీజు వేసుకుని పంటల అమ్మకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. – నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు -
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కన్నబాబు
సాక్షి, అమరావతి : ఫెర్టిలైజర్స్ విషయంతో ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, అవసరానికి మించిన ఫెర్టిలైజర్స్ అందుబాటులో ఉన్నాయమని మంత్రి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని చోట్ల వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. 80 శాతం మేర నాట్లు పడ్డాయని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. సెప్టెంబర్ 15 తర్వాత వ్యవసాయ యంత్రాలతో ఎగ్జిబిషన్ల ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. సీడ్ విలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రైతులకు రుణాలు అందించామన్నారు. రైతుభరోసా కేంద్రాల(ఆర్బీకే) సొంత భవనాల నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆర్బీకే స్థాయిలో పాల సేకరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయ శాఖకు చెందిన గ్రామ కార్యదర్శులకు వేరే పనులు అప్పగించవద్దని జేసీలను మంత్రి కన్నబాబు ఆదేశించారు. -
రైతుల ధర్నాలు మీకు కనపడవా ?
సాక్షి, హుజురాబాద్ : రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల పంపిణీలో నిర్దిష్టమైన కార్యచరణ చేపట్టకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. హుజురాబాద్‌లో ఎరువుల కొరకు సొసైటీల ముందు బారులు తీరిన రైతులకు మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టిన రైతులు వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రుణమాఫీపై ఇప్పటివరకు బ్యాంకర్లతో ఎలాంటి సమావేశాలు నిర్వహించకపోవడం పట్ల రైతులపై ప్రభుత్వానికున్న చిత్తశుద్దిని తెలియజేస్తుందని మండిపడ్డారు. రైతులకు సహకారం అందించడం కోసం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితిలు ఎక్కడా కనబడడం లేదని ఎద్దేవా చేశారు. రైతులెవరు ఆగ్రహానికి గురి కావొద్దని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 10వేల మెట్రిక్ టన్నుల యూరియాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్సీ ద్వారా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సాగునీరు అందించలేకపోతుందని , కనీసం 70 టీఎంసీల మేర నీరు అవసరం ఉందని గుర్తు చేశారు. కాళేశ్వరం పంపులు ఎందుకు ఆపరేట్ చేయడం లేదో చెప్పాలని, ప్రాజెక్టులో తగినంత నీరున్నా ఇప్పటివరకు చుక్కనీరు తరలించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని వెల్లడించారు. -
భారీ అగ్గి.. కోట్లు బుగ్గి
కుషాయిగూడ: చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఎగిసిపడ్డ మంటలు పక్కనే ఉన్న మరోకంపెనీకి కూడా వ్యాపించడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. చర్లపల్లి పారిశ్రామికవాడ లోని ఓ శీతల గిడ్డంగిని తల్లూరి సతీశ్ అనేవ్యక్తి లీజుకు తీసుకుని సన్సేషనల్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఫ్లాంట్‌లోని లేబుల్స్, ప్యాకింగ్ అట్టలు భద్రపరిచిన గదిలో షాట్‌సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. అవి ఫర్టిలైజర్స్‌లో కెమికల్స్‌కు బదులుగా వినియోగించే ఆయిల్ డబ్బా ల వరకూ వ్యాపించడంతో భారీగా పేలుడు సంభవించింది. దీంతో మంటల ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి కంపెనీ క్వార్టర్స్‌లో ఉన్న నలుగురు కార్మికులు కేకలు వేస్తు భయంతో పరుగులు తీశారు. స్థానిక ఫైర్‌స్టేషన్‌కు అగ్ని ప్రమాదం సమాచారాన్ని ఇవ్వగా అగ్నిమాపకదళం అక్కడకు చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే మంటలు పక్కనే ఉన్న బోర్డ్రిల్స్ ఫ్యాక్టరీ బెన్వర్ట్రాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి ఆ మంటల్ని సాయంత్రం ఐదు గంటలకు అదుపులోకి తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో ఆర్గానిక్ ఫ్యాక్టరీకి చెందిన సుమారు రూ. 25 కోట్ల విలువైన ముడి సరుకు మంటల్లో కాలి బూడిదైపోయింది. ఈమేరకు కంపెనీ యజమాని సతీశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక బోర్వెల్ డ్రిల్స్ కంపెనీకి రూ. కోటికి పైగానే ఆస్తినష్టం వాటిల్లిందని నిర్వాహకుడు నవీన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్లాంట్ యజమానికి నోటీసులు ఆర్గానిక్ ప్లాంట్ నిర్వహణకు యజమాని తమనుంచి ఎలాంటి అనుమతులు పొందలేని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జంగయ్య తెలిపారు. దీంతో ప్లాంట్ యజమానికి నోటీసులు జారీ చేయడంతో పాటుగా ఈ ఘటనను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అగ్నిప్రమాదం విషయం తెలిసిన కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆ మార్గంలో రోడ్డును మూసివేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
ఎరువుల సబ్సిడీ రూ.2వేల కోట్లు పెంపు
న్యూఢిల్లీ: ఈ బడ్జెట్లో ఎరువుల సబ్సిడీని రూ. 2 వేల కోట్లు పెంచారు. దీంతో మొత్తం ఎరువుల సబ్సిడీ రూ.72,968 కోట్లకు చేరుకుంది. రూ.38,200 కోట్లు దేశీయంగా ఉత్పత్తి చేసే యూరియాకు కేటాయించారు. రూ. 12, 300కోట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియాకు కేటాయించారు. రూ. 22,468 కోట్లు నియంత్రణ లేని పాస్ఫరస్, పొటాషియం ఎరువుల కోసం కేటాయించారు.