సాక్షి, అమరావతి : ఫెర్టిలైజర్స్ విషయంతో ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, అవసరానికి మించిన ఫెర్టిలైజర్స్ అందుబాటులో ఉన్నాయమని మంత్రి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని చోట్ల వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. 80 శాతం మేర నాట్లు పడ్డాయని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. సెప్టెంబర్ 15 తర్వాత వ్యవసాయ యంత్రాలతో ఎగ్జిబిషన్ల ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. సీడ్ విలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రైతులకు రుణాలు అందించామన్నారు. రైతుభరోసా కేంద్రాల(ఆర్బీకే) సొంత భవనాల నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆర్బీకే స్థాయిలో పాల సేకరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయ శాఖకు చెందిన గ్రామ కార్యదర్శులకు వేరే పనులు అప్పగించవద్దని జేసీలను మంత్రి కన్నబాబు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment