బాపట్ల: జగనన్న 175/175.. ఆకట్టుకున్న వరి కోత | Venkata Reddy Karmuru Special Gesture For YS Jagan Birthday 2022 | Sakshi
Sakshi News home page

CM YS Jagan Birthday: జగనన్న పుట్టినరోజుకి కారుమూరు సర్‌ప్రైజ్‌.. మరోసారి ఆకట్టుకున్న వైనం

Published Tue, Dec 20 2022 8:39 PM | Last Updated on Thu, Dec 22 2022 12:54 PM

Venkata Reddy Karmuru Special Gesture For YS Jagan Birthday 2022 - Sakshi

గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా వైఎస్‌ జగన్‌ పుట్టినరోజుకి.. ప్రత్యేకతను కనబరుస్తూ.. 

సాక్షి, బాపట్ల: జననేత వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా అభిమానం వెల్లువెత్తుతోంది. ఇదిలా ఉంటే.. గత మూడేళ్లుగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజుకి తన అభిమానాన్ని డిఫరెంట్‌గా కనబరిచే వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి.. మరోసారి ప్రత్యేకతను చూపించారు. చుండూరు మండలం వలివేరు పంట పొలాలలో  వైఎస్‌ జగన్‌ 175/175 సీట్లు లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ.. వరి కోత ప్రదర్శించారు. 

ఇదిలా ఉంటే.. మొదటి సంవత్సరం బాపట్ల బీచ్ లో ఇసుకతో జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని చేయించారు తర్వాత సంవత్సరం జై జగనన్న వరికొత్తతో కోయించారు తర్వాత సంవత్సరం రావిఆకు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో గియించారు. ఇక ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి 175/175 సీట్ల లక్ష్యం సాధించాలని 175/175 జగనన్న అని వరి కోతతో కోయించి తన అభిమానాన్ని మరో సారి చాటుకున్నారు.

సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేరుగు నాగార్జున, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని కేక్ నీ కట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటూ వెంకటరెడ్డికి అభినందనలు తెలిపారు మంత్రి మేరుగు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement