
రాజకీయ ప్రయాణంలో ఊహించని మలుపు..
ఎదురొచ్చిన అడ్డంకులు.. ఆటంకాలు.
రాజకీయ కుట్రల, కుతంత్రాలు దుర్మార్గాలపై ఎదురు పోరాటం.
వాటన్నింటిని ప్రజాభిమానమనే ఆయుధంతో పక్కకు తోసేసిన వైనం..
అనితరసాధ్యమైన రాజకీయ ప్రస్థానం ఆయన సొంతం.
ఆ ఒకే ఒక్కడు వైఎస్ జగన్..
ఆ సంక్షేమ సారథికి జన్మదిన శుభాకాంక్షలు(డిసెంబర్ 21వ తేదీ)..
తండ్రిని చూశాడు. ఆ మహానేత అడుగుజాడలు గమనించాడు. ఆ పెద్దాయన పేరుకే పొలిటీషియన్. కానీ, నిరంతరం ప్రజల మనిషి. అదే జీవితానికి సార్థకత అనుకున్న మంచి మనిషి. అలాంటి తండ్రిని గమనించిన తనయుడు.. మరోలా ఎందుకు అవుతాడు!. ప్రజలతో మమేకం కావడం, వారు చెప్పింది వినడం, వారి సమస్యలు తీర్చడం కోసం ఎలా పాటుపడాలనేది నేర్చాడు. ప్రజలతోనే ఉంటూ.. వారి జీవితాల్లో మేలు కోసం ఈ మూడున్నరేళ్లు కృషి చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు.
తిరుగులేని నేత
కాలం పరీక్షలు పెడుతుంది. ఏడిపించేంత పనిచేస్తుంది. ఈ క్రమంలో ధీరోదాత్తుడు కూడా చలించాడు. కానీ, పరీక్షకు భయపడలేదు. సాహసికంగా ఎదుర్కొన్నాడు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా.. కుతంత్రాలు అడ్డుపడినా తన అడుగులు తడపడకుండా చూసుకున్నాడు. గుండెను సడలనివ్వకుండా.. ధైర్యాన్ని వీడకుండా ముందుకుసాగాడు. వైయస్ జగన్ రాజకీయ ప్రయాణం.. ఆయన్ని తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. మానవీయ రాజకీయాలు ఆయన మార్క్‌గా మారిపోయింది.
తండ్రి బాటలో..
రాజకీయాల్లో వైయస్ కూడా ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. ఆయన్ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి, వేధించడానికి కూడా అప్పటి హస్తం నేతలు ఎంతో ప్రయత్నించారు. సీనియర్ల దృష్టిలో అయితే వైఎస్ ఒక కొరకరానికొయ్య. చివరికి.. ఆయన ఆర్థికమూలాలను దెబ్బతీశారు. అయినా ఆయన తోణకలేదు. ప్రజా జీవితంతో పెనకేసుకుపోయిన.. పాదయాత్రతో ఆయన కీర్తి శిఖరాగ్రానికి చేరింది. ముఖ్యమంత్రిగా ఆ మహానేత ఐదేళ్ల పాలన సువర్ణయుగం. ఆయన తలపెట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి పథకాలు నభూతో న భవిష్యతి. అలా.. ఆ తండ్రి అడుగుజాడల్లోనే జగన్ తన రాజకీయప్రయాణాన్ని మొదలుపెట్టారు.
అందరు వారసుల్లాగే తన రాజకీయ వారసుడు హస్తినలో జాతీయ నేతల వారసుల మధ్య తిరగాలని కోరుకున్నారు వైఎస్‌ఆర్. కానీ, విధి మరోలా తలిచింది. వైఎస్సార్ హఠాన్మరణం రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసింది. అప్పటిదాకా తండ్రి ఆలోచనలు, సలహాలు. కానీ, అప్పటి నుంచి తనే ఆలోచించాలి.. తనే ఆచరించాలి అనుకున్నాడు. ఒక్కడిగానే తనదైన కొత్త చరిత్రను సృష్టించడానికి జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. వారసత్వంగా వచ్చిన బలమే కాదు.. వ్యక్తిత్వం బలం కూడా తోడయ్యింది. రాజకీయాలకు అతీతమైన వాదం. కులమతాల ఊసే లేని మానవత్వం. ప్రజాసేవ పరమావధిగా భావించిన ఆదర్శం వైఎస్ జగన్‌ది. అన్నీ స్వంత ఆలోచనలే. చివరకు.. తన రెక్కల కష్టంపై ఏర్పాటు చేసుకున్న సొంత పార్టీ. తన ఆలోచనలు, సిద్ధాంతాలే పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలుగా మలుచుకున్నాడు. అందుకే.. జగన్ రాజకీయప్రస్థానం అసామాన్యమైనది. యువతకు స్ఫూర్తిదాయకమైనది.
సమస్యలతో నడుస్తూ.. పరిష్కరించే దాకా..
బహుశా .. భారత దేశ చరిత్రలో వైయస్సార్‌సీపీ ఆవిర్భావం..ఆ తర్వాతి ప్రస్థానం చారిత్రాత్మకమైనవేమో. ఆ చరిత్రకు సృష్టి కర్త, కర్మ, క్రియ అన్నీ జననేతనే. పార్టీ 2014 నుంచి ప్రతిపక్షంలో వున్న కాలంలోనూ ఆయన ప్రతిపక్షనేతగా సమర్ధవంతంగా పనిచేశారు. వైఎస్ జగన్.. ప్రజలకోసం అనేక దీక్షలు చేశారు. రైతుల తరఫున, చేనేతల తరఫున, మత్స్యకారుల తరఫున, విద్యార్థుల తరఫున ఇలా ఆయన.. లక్షలాది మంది సమక్షంలో దీక్షలకు పూనారు. వాటిని విజయవంతం చేశారు. నాటి ప్రభుత్వాల కళ్లు తెరిపించే పనులు చేశారు. ప్రజల కోసమే జగన్ రాజకీయాలు నడిచాయి పూర్తిగా. ఆపై పాదయాత్ర..
ఆయన ఆలోచల్నే కాదు.. రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. కోట్ల మందికి వైఎస్ జగన్ అభిమాన నాయకుడయ్యాడు. తానొక సాహసి అనే విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేశాడాయన. తనేంటో తనకు తెలుసు. తన బలమేంటో తనకు తెలుసు. అదే పార్టీ సహచరులకు ధైర్యం అయ్యింది. ప్రజలకు నమ్మకమయింది. పాదయాత్ర విజయవంతమైంది. 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర ఆయన్ను ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అద్దంగా నిలిపింది. జగన్ సారథ్యంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ బలంగా ప్రజా హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ఫ్యాన్ దెబ్బకు సైకిల్ తుక్కుతుక్కు అయ్యింది. పాదయాత్ర నుంచే మేనిఫెస్టో పుట్టింది. దానికంటూ ఓ పవిత్రతను ఇచ్చిన ఆయన.. అధికారంలోనూ దాని అమలును అంతే చిత్తశుద్ధితో చేస్తున్నారు.
మూడున్నర ఏళ్లు పూర్తి అయ్యింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయనలో కనిపించిన సంకల్పం.. ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతోంది. సీఎం జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులకు ఏపీ వేదికయ్యింది. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనే తపన.. ఆయనపై అభిమానాన్ని ప్రజల్లో మరింత పెంచుతూ వస్తోంది. మంత్రులు, తోటి నేతలు, ఉన్నతాధికారులు.. ఎవరినీ ఉపేక్షించలేదాయన. సంక్షేమం కోసం తనతో పాటు వాళ్లందరినీ పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సచివాలయం, ఆర్బీకే.. లాంటి వ్యవస్థలను దేశం ఆదర్శంగా తీసుకుంది. పారదర్శకపాలన.. పైగా గడపకే సంక్షేమ పథకాలు. ప్రతి సామాన్యుడికి ప్రతి పనీ సులువుగా అయిపోయింది. ఇంతకంటే సమర్థవంతమైన వ్యవస్థలను ఎవరు నడిపించగలరు?!.. ఒక్క వైఎస్ జగన్ తప్ప.
సంక్షేమమే శ్రీరామరక్ష
సామాజిక పెన్షన్లు, అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యార్థుల పథకాలు, నాడు - నేడు పేరిట విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం అన్ని పటిష్టంగా అమలయ్యేలా చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. నభూతో న భవిష్యతి అన్నట్టుగా తన పాలన ఉండాలని ఆదర్శంగా పెట్టుకున్నారు. ఆ దిశగానే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఈ విలక్షణ నాయకుడు. ఇంతగా ప్రజలతో మమేకమైన ఆ వయసు నాయకుడు గానీ, ప్రజా జీవితంతో పెనవేసుకుపోయిన నాయకుడు గానీ మరొకరు లేరు. చిన్నవయసులోనే పెద్ద బాధ్యతను ఎత్తుకున్న జగన్ నిజంగా ఓ రకంగా శిఖరాగ్రానికే చేరాడు. అక్కడే చాలినంత కాలం వుండటానికి ఆయనకు తనవైన కృష్టి, పట్టుదలలు తోడు నీడగా వుంటాయి. ఆయన సంకల్పబలమే ఆయన్ను విజేతగా నిలుపుతుంటుంది కూడా. అలాగే తనను తాను ఆల్రెడీ సీఎంగా ప్రూవ్ చేసుకున్న ది ట్రూ లీడర్ ఆయన. అయినప్పటికీ నిజాయితీ ఆయన అదనపు పొలిటికల్ క్వాలిఫికేషన్. అందుకే తన పాలనను గత పాలనతో బేరీజు వేసుకోమని, మంచి జరిగిందని భావిస్తే, ఒక బిడ్డగా ఆశీర్వదించమని ప్రజలను కోరుతున్నారు జగన్.
YSJagan పుట్టినరోజుపై ప్రత్యేక కథనం
Comments
Please login to add a commentAdd a comment