Andhra Pradesh Chief Minister YS Jagan Birthday Celebrations - Sakshi
Sakshi News home page

CM YS Jagan Birthday: ఊరూవాడా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు

Published Wed, Dec 21 2022 5:49 AM | Last Updated on Thu, Dec 22 2022 12:46 PM

CM YS Jagan birthday Celebrations All Over Andhra Pradesh - Sakshi

Updates:

అనంతపురం:
రాప్తాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మెగా రక్తదాన శిబిరం ప్రారంభించి కేక్ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా:
మాడుగుల మండలం ఎ.కోడూరులో సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మొక్కలు నాటారు. సీఎం జగన్‌  ప్రజా నాయకుడు అని, ప్రజల  ఆకాంక్ష మేరకు పాలన అందిస్తున్నారన్నారు.

నెల్లూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో..
నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి  కేక్ కట్ చేశారు. అనంతరం ధన లక్ష్మీపురంలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

కృష్ణా జిల్లా :
పెడన నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మంత్రి జోగి రమేష్‌ రక్త దానం చేశారు.

ప్రకాశం జిల్లా:
సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలను ఒంగోలు నగరంలోని 34 వార్డులో కార్పొరేటర్ డాకా సుజాత, హనుమారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా
సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు నెల్లూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. చెముడుగుంటలో కేక్‌ కట్‌ చేసిన మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి.. సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని అన్నారు. ఆయన శాశ్వత సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.

పల్నాడు జిల్లాలో
పల్నాడు జిల్లా దాచేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కోట కృష్ణ, ఎంపీపీ బ్రహ్మనాయుడు, జెడ్పీటీసీ ప్రకాష్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, కొణతం సూర్య నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

గోదావరి జిల్లాల్లో..
గోదావరి జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం జన్మదిన సందర్భంగా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో మహిళలకు ఇప్పటికీ ముగ్గులు పోటీలు నిర్వహించామని విజేతలకు బహుమతులు అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని జగ్గిరెడ్డి అన్నారు.

విశాఖపట్నంలో..
విశాఖ నగర వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ నేతలు కేక్ కట్ చేసి సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

తిరుపతిలో..
వైఎస్సార్‌ విగ్రహం సర్కిల్ వద్ద సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు, భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. 

అనంతపురం జిల్లాలో..
సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. అనంతపురం కేఎస్ఆర్ కళాశాలలో విద్యార్థులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ మామయ్య అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అమ్మ ఒడి, నాడు- నేడు వంటి పథకాలతో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న వైఎస్ జగన్‌కు అంతా మంచే జరగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

సాక్షి, నెట్‌వర్క్‌: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలతో­పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్న­దానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు.

రెడ్‌క్రాస్‌ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజుకు సంబంధించి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఇంతకుముందే వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

కృతజ్ఞత చాటుకుంటున్న ప్రజలు..
దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే నెరవేర్చారు. మూడున్నరేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రూ.1,77,585.51 కోట్లను జమ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా నాన్‌ డీబీటీ రూపంలో రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి ఇప్పటివరకు రూ.3,19,227.86 కోట్లను అందించారు.

వివిధ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సగటున 89 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. దీంతో లబ్ధిదారులు గత రెండు రోజులుగా జరుగుతున్న సీఎం జన్మదిన వేడుకల్లో భారీగా పాల్గొంటున్నారు. తద్వారా సీఎం వైఎస్‌ జగన్‌కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోమవారం నిర్వహించిన క్రీడల పోటీల్లోనూ.. మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమంలోనూ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement