సాక్షి, నల్గొండ : జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ రెగ్యులేటరీ గేట్ విరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతుంది. ఈ నేపథ్యంలో మూసీ డ్యామ్ వద్దకు చేరుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు.. గేట్ విషయమై నీటిపారుదల అధికారులతో సమీక్ష చేపట్టారు. విరిగిన గేట్‌కు సంబంధించి నిపుణులు రూపొందించిన మ్యాప్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. గేట్‌ను తిరిగి యథావిధిగా అమర్చేందుకు అధికారులతో మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనే గేట్‌ను యథావిధిగా అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment