musi project
-
హైదరాబాద్ 2.o.. అభివృద్ధి ఖాయం!
‘మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ బృహత్తర ప్రాజెక్ట్‌లతో హైదరాబాద్ అభివృద్ధి ఖాయం. ఏ నగరంలోనైనా సరే ప్రభుత్వం, డెవలపర్లు సంయుక్తంగా ప్రజా కేంద్రీకృత విధానాలతో నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టిస్తారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, నీరు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ప్రభుత్వం కల్పిస్తే.. కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలపర్లు చేపడతారు’ అని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్(టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోసబర్బన్ పాలసీ అవసరం.. విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం, వినోదం ఇలా ప్రతీ అవసరం కోసం ప్రజలు ప్రధాన నగరానికి రావాల్సిన, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏటా 3 లక్షల మంది నగరానికి వలస వస్తున్నారు. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోతే కోర్ సిటీలో జన సాంద్రత పెరిగి, బెంగళూరు, ఢిల్లీ మాదిరిగా రద్దీ, కాలుష్య నగరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే శివారు ప్రాంతాలు మెరుగైన మౌలిక వసతులతో అభివృద్ధి చెందేందుకు సబర్బన్ పాలసీ అవసరం. మెట్రో విస్తరణతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనుసంధానం కావడంతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శరవేగమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. అందుకే హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో ఈ ఏడాది రూ.5 వేల కోట్ల నిధులతో నాలాల పునరుద్ధరణ పూర్తి చేయాలి.ఆదాయంలో 25–30 శాతం వాటా.. ప్రస్తుతం గ్రేటర్లో 1.1 కోట్ల జనాభా ఉంది. మెరుగైన మౌలిక వసతులతో దేశంలోనే నివాసితయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. వ్యవసాయం తర్వాత రెండో అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమ రియల్ ఎస్టేట్ రంగం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టీ, నిర్మాణ అనుమతుల రుసుము, ఇంపాక్ట్ ఫీజు, ఆదాయ పన్ను ఇలా స్థిరాస్తి రంగం నుంచి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ఆదాయంలో 25–30 శాతం వాటా స్థిరాస్తి రంగానిదే.‘యూజర్ పే’తో గ్రోత్ కారిడార్‌లో రోడ్లు.. ఓఆర్ఆర్ నిర్మాణ సమయంలోనే గ్రోత్ కారిడార్‌కు రెండు వైపులా రహదారులను ప్లాన్ చేశారు. కానీ.. ఇప్పటికీ వేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆయా రోడ్లను ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీతో హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకొని, రైతుల నుంచి భూములను సేకరించి రహదారులను నిర్మించాలి. ఇందుకైన వ్యయాన్ని ఈ రోడ్లను వినియోగించుకునే డెవలపర్ల నుంచి వసూలు చేస్తారు. ఉదాహరణకు టోల్ మాదిరిగా ఏ నుంచి బీ రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయాన్ని బిల్డర్లు ‘యూజర్ పే’ రూపంలో చెల్లిస్తారు. దీంతో ప్రభుత్వంపై వ్యయ భారం తగ్గడంతో పాటు మెరుగైన రోడ్లతో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ రోడ్లలో కొన్ని రీజినల్ రింగ్ రోడ్ అనుసంధానించబడి రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చెందుతాయి.వాక్ టు వర్క్‌తో.. ఫోర్త్ సిటీ.. తెలంగాణ ప్రభుత్వం 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని తలపెట్టింది. అయితే.. ఈ పట్టణం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ప్లాన్ చేయాలి. వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌లతో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా, వైద్య, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతో ఫోర్త్ సిటీ స్వయం సమృద్ధి చెందుతుంది. ఈ మోడల్‌ను హైదరాబాద్‌లోని మిగతా మూడు వైపులకూ విస్తరించాలి.నివాస, వాణిజ్య స్థిరాస్తికి డిమాండ్.. హైడ్రా దూకుడుతో కొంత కాలంగా స్థిరాస్తి రంగం మందగమనాన్ని ఎదుర్కొంది. అయితే నిర్మాణ అనుమతులు ఉన్న ప్రాజెక్ట్‌ల జోలికి వెళ్లమని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రస్తుతం మార్కెట్లో నిలకడ వాతావరణం నెలకొంది. దీంతో కొత్త కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేరాఫ్ హైదరాబాద్. ఆయా రంగాల్లో 1.50 లక్షల కొత్త ఉద్యోగాలతో రాబోయే కాలంలో నివాస, వాణిజ్య స్థిరాస్తి రంగానికి డిమాండ్ తప్పకుండా ఉంటుంది. ఉప్పల్ నుంచి నారాపల్లి, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట, పరేడ్ గ్రౌండ్ నుంచి కొంపల్లి ఫ్లై ఓవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మూడు మార్గాలతో పాటు ఆదిభట్ల నుంచి లేమూరు మార్గంలో నివాస కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతికి అందుబాటులో ధరల్లో ఇళ్లు లభ్యమవుతాయి. -
వేలాదిమంది పేదలనుఎక్కడకు వెళ్లగొడతారు?
అంబర్‌పేట/మలక్‌పేట: దశాబ్దాల తరబడి మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తూ..కష్టపడి కట్టుకున్న ఇళ్లను ప్రభుత్వం కూలగొడితే తామంతా ఎక్కడకు వెళ్లాలి అనే ఆవేదనలో అక్కడి ప్రజలు ఉన్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరీవాహక ప్రాంత ప్రజలపై కక్షపూరిత ధోరణి అవలంభిస్తుందని మండిపడ్డారు. వేలాదిమంది పేద ప్రజలను నిరాశ్రయులను చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ బాధితుల కోసం బీజేపీ చేపట్టిన మూసీనిద్ర కార్యక్రమంలో భాగంగా గోల్నాక డివిజన్ పరిధిలోని తులసీరామ్‌నగర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిద్రించారు. ఆదివారం ఉదయం నిద్ర లేచినంతరం బస్తీ వాసులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. బస్తీల్లో పర్యటించి అక్కడి ప్రజల జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు మూసీతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని తాను గమనించినట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. వందేళ్ల క్రితం మూసీనదికి నిజాం రాజు ప్రహరీ నిర్మించారని, ప్రస్తుతం అలాంటి ప్రహరీ నిర్మించి పేదల ఇళ్ల జోలికి వెళ్లరాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తాను మూసీ పక్కన నివసించే శంకరమ్మ ఇంట్లో నిద్రించి వారి ఇబ్బందులను తెలుసుకున్నానని, ఇలాంటి శంకరమ్మలు ఎంతో మంది ఆవేదనతో ఉన్నారన్నారు. పేదల ఇళ్లకు ఇబ్బంది లేకుండా మూసీ సుందరీకరణ చేస్తామంటే బీజేపీ శ్రేణులు శ్రమదానం చేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, గౌతమ్‌రావు, అజయ్‌కుమార్, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు. లగచర్ల ఘటన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం : డాక్టర్ లక్ష్మణ్ లగచర్ల ఘటన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మూసారంబాగ్ శాలివాహననగర్‌లో మూసీనిద్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ బాధితులకు భరోసా కల్పించడానికి చేపట్టిన మూసీనిద్ర కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తూ అధికార మదంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు.మూసీనీటిని శుద్ధి చేయాలని, పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేసి నల్లగొండ, భాగ్యనగర్ ప్రజలకు ఉపశమనం కలింగించాలన్నారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్‌రెడ్డి, కొత్తకాపు అరుణా రవీందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్‌చందర్ పాల్గొన్నారు. -
మూసీపై మూడు నెలల పోరాటం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో పేదలను బాధితులుగా చేయవద్దన్న డిమాండ్‌తో ‘మూసీ నిద్ర’కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ.. ఈ పోరాటాన్ని ఒక్కరోజులోనే ముగించాలని భావించటంలేదు. మూసీ నిద్ర కార్యక్రమంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ పోరాటాన్ని నెలపాటు లేదంటే మూడు నెలల వరకు కూడా కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. మూసీ సమీపంలో మూడు నెలలు నివసించాల ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా గతంలో సవాల్ చేసిన నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. మూసీ నది ప్రవహించే మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని 8 అసెంబ్లీ స్థానాల్లో 20 చోట్ల బీజేపీ నేతలు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు మూసీ నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రక్షాళన చేయండి.. ఇళ్లు మాత్రం కూల్చొద్దు ప్రభుత్వపరంగా మూసీ పునరుజ్జీవం, ప్రక్షాళన వంటి ఏ కార్యక్రమం చేపట్టినా పేదల ఇళ్లు కూల గొట్టకుండా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో బీజేపీ ముందుకు సాగుతోంది. ఇంకా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా సిద్ధం కాకముందే పేదల ఇళ్ల కూల్చివేత ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. తాము చేపట్టే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం స్పందించే తీరును బట్టి ‘మూసీ ప్రక్షాళన చేయండి.. కానీ పేదల ఇళ్లు కూలగొట్టకండి’అనే నినాదంతో దీర్ఘకాల పోరాటం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాలు చూపకుండా వారి నివాసాలను ఎలా కూల్చుతారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై మున్ముందు ప్రభుత్వం తీసుకొనే చర్యలను బట్టి పోరాట విధానాన్ని నిర్ణయించనున్నట్లు చెబుతున్నారు. నిజానికి శనివారం చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమాన్ని ఒకరోజుకే పరిమితం చేయాలని బీజేపీ నాయకత్వం భావించింది. కానీ, ఈ కార్యక్రమంపై మంత్రులు, అధికార కాంగ్రెస్‌పార్టీ నేతలు విమర్శలు గుప్పించా రు. ‘మూసీ కంపులో 3 నెలలు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరితే కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నేతలు ఒకరోజు షో చేస్తున్నారు. ఒక్కరాత్రి నిద్రతో ఏం సాధిస్తారు’అని ప్రశ్నించారు. దీంతో బీజేపీ నే తలు వ్యూహం మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రజల ఇళ్లు కూలగొట్టే బదులు మూసీలోకి మురుగునీరు చేరకుండా కట్టడి చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. నదికి రెండువైపులా భారీ రిటైనింగ్ వాల్ నిర్మిస్తే భారీ వరదల నుంచి కూడా ప్రజలను కాపాడవచ్చని, ఆ పనులు చేయకుండా 30– 40 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేయటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. -
మూసీ పేరిట లూటీకే వ్యతిరేకం
మల్లాపూర్ (హైదరాబాద్): మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, అభివృద్ధికి తాము, తమ పార్టీ వ్యతిరేకం కాదని, దానిపేరిట లూటిఫికేషన్‌కు మాత్రమే వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరు చెప్పి ఢిల్లీ పెద్దల కోసం లక్షన్నర కోట్ల రూపాయల అవినీతి చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలను పక్కనపెట్టి మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చుపెడతామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెబుతోందని, కేవలం రూ.1,100 కోట్లతో గోదావరి నీళ్లు మూసీకి తీసుకువస్తే సుందరీకరణ పూర్తి అవుతుందని చెప్పారు. నాచారంలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) పనితీరును పార్టీ నేతలతో కలిసి ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.రూ.3,866 కోట్లతో ఎస్టీపీల నిర్మాణంబీఆర్ఎస్ హయాంలోని పదేళ్లలో రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని మాజీమంత్రి కేటీఆర్ చెప్పారు. మురుగునీటి శుద్ధి కోసం రూ.3,866 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామని తెలిపారు. పేద ప్రజల ఇళ్లు కూలగొట్టి షాపింగ్ మాల్స్ కట్టేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకుంటామని, పేదలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ చెప్పారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.ఆవు పంచకంతో ఎస్టీపీ శుద్ధికేటీఆర్ నాచారం ఎస్టీపీ సందర్శన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు చేతులకు నల్ల బ్యాడ్జీలను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేటీఆర్ తిరిగిన ప్రదేశంలో ఆవు పంచకంతో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆ నిర్మాణాలపై ‘హైడ్రా’ కొరడా తప్పదు: భట్టి విక్రమార్క
సాక్షి,హైదరాబాద్: అనుమతులు లేకుండా చేసిన నిర్మాణాలపై హైడ్రా కొరడా తప్పదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. శనివారం(అక్టోబర్ 26)హైటెక్స్‌లో జరిగిన ప్రాపర్టీ షోలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు,హైడ్రాలను భట్టి ప్రస్తావించారు.‘ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ పునరుజ్జీవం జరుగుతుంది. మూసీ పునరుజ్జీవం వల్ల హైదరాబాద్‌కు, రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది.మూసీలో నివసిస్తున్నపేదల జీవితాలు మెరుగుపడతాయి.హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోంది.అనుమతులు ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చదు’అని భట్టి తెలిపారు.ఇదీ చదవండి: దొరా.. మా భూములు లాక్కోవద్దు -
ఇందిరా పార్క్ ధర్నా చౌక్.. నేడు బీజేపీ నేతల ధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ ప్రాంత ప్రజలకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద నేడు బీజేపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు.తెలంగాణ బీజేపీ నేతలు రెండు రోజుల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం, వారికి మద్దతుగా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు బీజేపీ నేతలు ధర్నా చేయనున్నారు. బీజేపీ ధర్నాకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కానున్నారు. -
మూసీని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకోం
లక్డీకాపూల్: బీఆర్ఎస్ ప్రభుత్వంలా మూసీనదిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకోబోమని, దానిని పూర్తిస్థాయిలో పునరుజ్జీవింపజేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని హామీనిచ్చారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మూసీ పరీవాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.17 మూసీ పునరావాస మహిళా సంఘాలకు రూ.3.33 కోట్ల ఆర్థిక సహాయాన్ని మలక్‌పేట్, కార్వాన్ ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ బలాల, కౌసర్ మొహియుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డిలతో కలసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ...ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్ వంటి ప్రాంతాలు వరదల వల్ల నష్టపోయాయని, మూసీ మురికి నీటి కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ నీటిని తాగే స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజ్, మూసీ జేడీఎం గౌతమి, శ్రీనివాస్‌రెడ్డి, మూసీ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు. -
చాలెంజ్ చేస్తున్నా.. వస్తా పద
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్.. నేను చాలెంజ్ చేస్తున్నా. సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావు కదా. పోదాం పదా..డేట్, టైమ్ మీరే చెప్పండి. నేను కారు డ్రైవ్ చేస్తా. మీరు నేను పోదాం. లేదంటే నేను రేపు 9 గంటలకు మీ ఇంటికి వస్తా. ముందు మూసీ బాధితులను కలిసిన తర్వాత మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ కట్ట మీదకు వెళ్లి నిర్వాసితులతో మాట్లాడుదాం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చాం ’అంటూ సీఎం రేవంత్‌రెడ్డి గురువారం చేసిన సవాల్‌పై మాజీమంత్రి టి.హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు.‘మూసీ ఫ్రంట్ పేరిట రూ.లక్షన్నర కోట్లతో సుందరీకరణ, పునరుజ్జీవం చేస్తామని ప్రజల మధ్య ప్రకటించిన సీఎం రేవంత్ అలా ఎవరు అన్నారంటూ మాట మారుస్తున్నాడు. మెగాస్టార్లు సూపర్స్టార్లను మించి నటిస్తున్నాడు. శత్రుదేశాల మీద దాడి చేసినట్టుగా పేదల ఇళ్లపై జరుగుతున్న కూల్చివేతలను ప్రశ్నిస్తే మల్లన్నసాగర్ నిర్వాసితుల గురించి మాట్లాడుతున్నాడు’అని చెప్పారు. తెలంగాణభవన్‌లో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, నాయకులు పి.కార్తీక్‌రెడ్డి, దేవీప్రసాద్‌తో కలిసి హరీశ్‌రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం పదవిని దిగజార్చేలా.. ‘ఎన్నికల హామీలను విస్మరించి సీఎం పదవి స్థాయిని దిగజార్చేలా రేవంత్ మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌తోపాటు అనేక నగరాల మీదుగా అనేక నదులు ప్రవహిస్తున్నాయనే జ్ఞానం లేదు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 4వేల ఇళ్లు ఇవ్వడంతోపాటు 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న పరిహారం కంటే ఎక్కువే ఇచ్చాం. (పునరావాసకాలనీ ఫొటో చూపిస్తూ).. మూసీ తలంలో ఉన్న ఇళ్లు కూల్చి బాధితులకు పరిహారం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. డీపీఆర్, పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పేరిట ఇల్లు కూల్చే అధికారం లేదు. నదితలంలో ఉన్న నిర్వాసితులకు కూడా 2013 భూ సేకరణ చట్టాన్ని వర్తింపచేయాలి.ఏఐ టెక్నాలజీ వీడియోలతో స్టంట్లు మూసీ రివర్‌ఫ్రంట్ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తయారు చేసిన వీడియోలు చూపుతూ రేవంత్ స్టంట్లు చేస్తున్నాడు. బీఆర్ఎస్ పాలనలో 31 ఎస్టీపీలతో మూసీ పునరుజ్జీవంకు ప్రయత్నాలు చేశాం. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను మూసీకి తరలించేలా వ్యాప్కోస్ సంస్థ డీపీఆర్ కూడా ఇచి్చంది. కానీ మల్లన్నసాగర్‌కు ప్లాన్ మార్చి కాంట్రాక్టర్లకు రూ.4వేలు లాభం చేసేలా రేవంత్ కుట్ర పన్నాడు. ఫార్మాసిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమిలో ఫోర్త్‌సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నాడు. ఫార్మాసిటీతో కాలుష్యాన్ని తగ్గించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు మూసీ పునరుజ్జీవం కూడా సాధ్యమవుతుంది. సబర్మతి నది తరహాలో గైడ్‌వాల్ నిర్మించి వరదలు నివారించొచ్చు. అఖిలపక్ష భేటీకి పిలవలేదు ‘నేను ఉద్యమకారుడిని, ప్రజల కోసం పోరాడేవాడిని. పదివేల కుటుంబాల్లో సంతోషం చూసేందుకు మూసీలో ఉండడానికి నేను సిద్ధం. 15 రోజుల క్రితమే మూసీ ప్రక్షాళనపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేసినా స్పందన లేదు. నాకు ఎమ్మెల్యే పదవి లేకుండానే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చిందని రేవంత్ చేసిన ఆరోపణ అర్థరహితం. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నా శిష్యుడిగా కారు ముందు డ్యాన్స్ చేసిండు. మంత్రి పదవికి రాజీనామా చేసి గన్‌పార్కు వద్ద మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నా వెనక ఉండి నక్కి చూసిండు’అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. -
మూసీపై రేవంత్‌వి పచ్చి అబద్ధాలు
సాక్షి, హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అంచనా వ్యయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గజినీలా మారి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరిట రూ. లక్షన్నర కోట్ల ప్రజాధనం దోపిడీ ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవడంతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం తంటాలు పడుతున్నాడన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని, రాహుల్‌గాం«దీకి డబ్బు కావాల్సినప్పుడల్లా తెలంగాణ గుర్తుకు వస్తోందన్నారు. ప్రాజెక్టు అంచనాలను రెట్టింపు చేయడంలో దిట్ట అయినందునే నిషేధిత కంపెనీ మెయిన్‌హార్ట్‌కు మూసీ డిజైన్ బాధ్యతలు అప్పగించారని చెప్పారు.మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని, వేలాది మందిని నిరాశ్రయులను చేయడానికి అంగీకరించబోమన్నారు. గరిష్టంగా రూ.25వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు పేదల కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు దోచుకునేలా రూ.లక్షన్నర కోట్లు వెచ్చిస్తే తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమక్షంలో శుక్రవారం తెలంగాణభవన్ వేదికగా ‘మూసీ ప్రాజెక్టు’పై గంటకు పైగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి వివరాలు కేటీఆర్ మాటల్లోనే...‘మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపైనా పునరుజ్జీవం, సుందరీకరణ, ప్రక్షాళన, నల్లగొండకు శుద్ధమైన నీరు అంటూ సీఎం రేవంత్ పూటకో మాట చెబుతున్నాడు.రెండు వేల కిలోమీటర్ల పొడవైన నమామి గంగే ప్రాజెక్టుకు రూ.40వేల కోట్లు ఖర్చయింది. 56 కిలోమీటర్ల పొడవైన మూసీ ప్రాజెక్టుకు కిలోమీటరుకు రూ.2700 ఖర్చు చేస్తామని సీఎం చెబుతున్నాడు. ప్రపంచంలో ఇంతకంటే పెద్ద కుంభకోణం మరొకటి ఉండదు. తనపై ఉన్న కేసులకు భయపడి వికారాబాద్ అడవుల్లో నేవీ రాడార్ నిర్మాణానికి రేవంత్ అనుమతి ఇచ్చారు. గతంలో మోదీ ప్రభుత్వం మెడమీద కత్తి పెట్టినా పర్యావరణ వేత్తలతో సూచనతో దామగుండం భూ అప్పగింత జీఓను అమలు చేయలేదు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ద్వారా మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, పునరుజ్జీవం కోసం రూ.16వేల కోట్లతో పేదలను నిరాశ్రయులను చేయకుండా 9 ప్రపంచ స్థాయి కన్సల్టెంట్లతో ప్రణాళికలు సిద్ధం చేశాం. మేము చేసిన పనులు చూపేందుకు శనివారం సిటీ ఎమ్మెల్యేలతో కలిసి నాగోల్‌కు వెళతాం. 31 ఎస్టీపీలు పూర్తయితే నల్లగొండకు స్వచ్ఛమైన నీరు వెళ్తుందనే విషయాన్ని గావుకేకలు, పెడ»ొబ్బలు పెడుతున్న నల్లగొండ మంత్రులు తెలుసుకోవాలి. గూగుల్ ఫొటోలతో ప్రజెంటేషన్ గూగుల్ నుంచి కాపీ కొట్టిన ఫొటోలతో రూ.లక్షన్నర కోట్ల ప్రాజెక్టు అంటూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల అఫిడవిట్లో రూ.30 కోట్లు ఆస్తులు చూపించిన రేవంత్ డిజైన్లు వద్దంటే కన్సల్టెంట్లకు రూ.140 కోట్లు ఆస్తులు అమ్మి ఇస్తా అంటున్నాడు. నోటికొచ్చింది వాగి దొరికిపోవడం సీఎంకు అలవాటు. మూసీ ఒడ్డున బహుళ అంతస్తుల భవనాలు వస్తే మళ్లీ ఫోర్త్ సిటీ ఎందుకు.రీజువెనేషన్ స్పెల్లింగ్‌ను చూడకుండా రాస్తే ఆయనకు రూ.50 లక్షలు పట్టే బ్యాగ్‌ను బహుమానంగా ఇస్తా. మాపై అనేక ఆరోపణలు చేసిన సీఎం ఎందుకు విచారణ జరపించడం లేదు. మూసీ సహా అన్ని అంశాలపై అసెంబ్లీలో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా, మూక మాదిరిగా అధికార పక్షం మా గొంతు నొక్కుతోంది. ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి మీద అనుమానం ఉంది. ఆయన్ను ఆ విధంగా వదిలిపెట్టవద్దని వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి’అని కేటీఆర్ తన ప్రజెంటేషన్ ముగించారు. -
హైకోర్టుకు ‘మూసీ’ బాధితులు..రేపు కీలక విచారణ
సాక్షి,హైదరాబాద్: మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు బాధితులు సోమవారం(అక్టోబర్ 14) హైకోర్టు తలుపుతట్టారు. మూసీ పరివాక ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్నామని, ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం తమ ఇళ్లు కూలగొట్టే అవకాశం ఉందని హైకోర్టులో పిటిషన్ వేశారు.అధికారులు తమ ఇళ్లపై మార్కింగ్ వేసిన విషయాన్ని వీరంతా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తమ ఇళ్లు కూల్చకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. మంగళవారం హైకోర్టు ఈ పిటిషన్లను విచారించనుంది. కాగా, మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న ఇళ్ల కూల్చివేతను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్ -
‘అక్కా..దొంగ ఏడుపులు ఎందుకు?’.. మంత్రులపై కేటీఆర్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో హైడ్రా కూల్చి వేతలు, మూసీ సుందరీకరణతో పాటు ఇతర పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. దేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులా వాడుకోవాలని చూస్తున్నదని అన్నారు. 2,400 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్ట్‌కు రూ.40వేల కోట్లు ఖర్చయితే, 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళనకు రూ.1.5లక్షల కోట్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు.మంత్రులకు ఏం తెలియదుమరోవైపు మూసీ సుందరీకరణపై మంత్రులకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దమ్ముంటే మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలి. అప్పుడు వెంకటరెడ్డికి మూసీ వద్ద ఉన్న ప్రజలు సన్మానం కూడా చేస్తారు. వెంకట్ రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదు. ఆయనకి ఏం తెలవదు. మూసీ పైన ఉన్న సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) లపై కూడా ఆయనకు అవగాహన లేదు. ఎస్టీపీలు పూర్తి అయిన తర్వాత మూసీలో మురికి నీళ్లు ప్రక్షాళణ అవుతాయి.దొంగ ఏడుపులు ఎందుకు?కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి. మా పార్టీ తరఫున ఆమెపై ఎవరు మాట్లాడలేదు. ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా? కొండా సురేఖ గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి. ఈ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకు? కొండా సురేఖ హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్ళు ఏడ్వరా?ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తా. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్‌తో కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలి. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర లేదుప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే సీఎం రేవంత్‌కు దడఅందుకే యూనియన్ బడ్జెట్ మీద బట్టితో మాట్లాడించారుమూసీ డీపీఆర్ అసలు ప్రభుత్వం దగ్గర లేదుడీపీఆర్ గురించి భట్టిని ప్రశ్నిస్తే డీపీఆర్ చూపించలేదుమూసీ కేవలం కాంగ్రెస్ లూటీ కోసమేమూసీ కాంగ్రెస్ రిజర్వు బ్యాంకు లాంటిదితెలంగాణ కరువు నివారణ కోసం కాళేశ్వరం ఏర్పడిందికాళేశ్వరం గురించి అసెంబ్లీలో మూడు గంటలు కేసీఆర్ వివరించారుమూసీ మీద ఒక్క నిమిషం అయినా మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు ఉన్నరామూసీ ప్రాజెక్ట్ ప్రయోజనాల గురించి కాంగ్రెస్ వివరించలగలదా ?త్వరలో మూసీని మేం ఎలా సుందరీకరణ చేయాలి అనుకున్నామో ప్రజలకు నేనే వివరిస్తానుమూసీకి అసలు రూ.1.50వేల కోట్లు ఎందుకు అవుతావో చెప్పండిమూసీకి లక్ష 50 వేల కోట్లు అవుతాయని అభినవ గోబెల్స్ రేవంత్ చెప్పారుఅసలు మంత్రి వర్గ విస్తరణ చేసుకోలేనోడు రాష్ట్రాన్ని బాగు చేస్తా అని బయల్దేరాడువిద్య శాఖ మంత్రి పెట్టండి అని విద్యార్థులే అడుగుతున్నారుమూసీ బాధితుల తరపున తప్పకుండ మేమె పోరాడుతాముమూసీ బాధితులు లంచ్ మోషన్ పిటిషన్లు వందల్లో ఉన్నయాని జడ్జి స్వయంగా చెప్తున్నారు21 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ 23 రూపాయలు రాష్ట్రానికి తేలేదువరద బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదుప్రభుత్వంలో మంత్రులకు పట్టు లేదుసీఎంతో మంత్రులకు సమన్వయము లేదుసీఎం ఒక మాట చెప్తే మంత్రులు ఒక మాట చెప్తారుఫార్మా సిటీ రద్దు అని సీఎం చెప్తారుఅధికారులేమో ఫార్మా సిటీ ఉందని చెప్తారుఇంతవరకు రైతు భరోసా లేదుఅందరిని ఆదుకుంటామని రైతు బందు ఎత్తేశారు రబి సీజన్ ప్రారంభమైంది రైతు బందు పత్తా లేదురైతు బందూకు పైసలు లేనోళ్ళు మూసి అభివృద్ధి చేస్తారని చెప్తున్నారుమూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పెద్ద స్కాంనమామి గంగే ప్రాజెక్ట్ లో కిలో మీటర్‌కు రూ. 17 కోట్లు ఖర్చు చేశారుమూసీ ప్రాజెక్ట్‌లో కిలోమీటర్‌కు రూ.2700 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారుఈ ఒక్క విషయంతో అది ఎంత స్కాం అనేది అర్ధం అవుతుందిప్రభుత్వం అనుముతులు ఇస్తేనే ఇల్లు కట్టుకున్న ప్రజలకు ఇబ్బందులు పడ్తున్నారుఇప్పుడు బ్యాంకు ఈఎంఐలు ప్రభుత్వం కడుతుందా ?ఒక గర్భిణీ ఇల్లు పోతుందని ఏడుస్తుందిఆమె ఆక్రందన ప్రజలకు పట్టదామూసీ ప్రాజెక్ట్ వల్ల ఒక్క రూపాయి కూడా జనాలకు ఒరిగేది కాదుమూసీ దగ్గర వచ్చే ఒక కంపెనీ పేరు చెప్పండిఇల్లు కూలుతుందని గోల్నాకలో ఒకరు గుండె పోటుతో చనిపోయారురాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలు అయిందిచిన్న పిల్లోడు పిలిచినా వస్తా అని చెప్పిన రాహుల్ ఎక్కడ సచ్చిండుఎన్నికలో హామీల పేరుతో రాహుల్ గాంధీ ప్రజలను మోసం చేస్తున్నారుమూసీలో బ్యూటిఫికేషన్ కాదు ఇది లూటిఫికేషన్మూసీ ప్రాజెక్ట్ కేవలం రాహుల్ గాంధీ కోసమే చేస్తున్నారుకేంద్రకు తెలిసే గవర్నర్ హైడ్రా ఆర్డినెన్సుకు ఆమోదం వేశారుఅసెంబ్లీలో చర్చించకుండానే ఎలా ఆర్డినెన్సు తెచ్చారుమూసీ సుందరీకరణ మేము తెచ్చిందేకానీ మేము ఇలా దోపిడీ చేయాలనుకోలేమూసీ ప్రాజెక్ట్ మీరు ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో కూడా తెలుసుత్వరలో ఆ కాంట్రాక్టర్ పేరు బయట పెడుతాం -
బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులు: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా అని ప్రశ్నించారు. మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని సెటైర్లు వేశారు.ఈ మేరకు మంత్రి మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. 2021లో మూసీపై కేసీఆర్ ప్రభుత్వం సమావేశాలు పెట్టిందని తెలిపారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్‌ను నిర్ణయించారన్నారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులను ఫిక్స్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకని బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు. -
బుల్డోజర్ను బొంద పెట్టండి: కేటీఆర్ పిలుపు
సాక్షి,హైదరాబాద్:పేదలు దసరా పండగ సంతోషంగా జరుపుకోలేని దుస్థితికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొచ్చాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం(అక్టోబర్1)అంబర్‌పేట గోల్నాకలోని తులసీరాంనగర్‌లో పర్యటించిన కేటీఆర్ మూసీ కూల్చివేతల బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పది నెలలు అయ్యింది రేవంత్ రెడ్డి వచ్చి. హైదరాబాద్ లో ఒక్క ఓటు కూడా రాలేదని మీ బతుకులు ఆగం చేశాడు. పెన్షన్లు రూ.4వేలు చేస్తా అన్నాడు. ఆరు గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. ఏమీ ఇవ్వలేదు. తులం బంగారం అన్నాడు. తులం బంగారం కాదు కాగా ఇనుము కూడా రాలేదు.మూసీలో దోచుకో, ఢిల్లీలో పంచి పెట్టు అన్నట్టుగా కొత్త దుకాణం తెరిచాడు. ఇక్కడ 38 ఇళ్లకు రంగులు వేసాడట. ఏ ఇంటికి కష్టం వచ్చినా పక్కింటి వాళ్ళు అడ్డుకోవాలి. బుల్డోజర్ను బొంద పెట్టాలి. ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు.ఇందిరమ్మ చెప్పిందా? సోనియమ్మ చెప్పిందా ఇల్లు కూల్చాలని. పేదల ఇల్లు ఎవరికి దోచి పెట్టడానికి కూలుస్తున్నారు. గంగా నది ప్రక్షాళన కోసం 2400 కిలోమీటర్లు ఉన్న ప్రాజెక్ట్ రూ. 20 వేల కోట్లతో కేంద్రం చేపట్టింది. కానీ మూసి నదికి లక్షా 50 వేల కోట్లతో శుద్ధి చేస్తానన్న పేరుతో దోచుకోవడానికి రేవంత్‌రెడ్డి చూస్తున్నాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. -
HYD: చాదర్‌ఘాట్‌లో ‘మూసీ’ కూల్చివేతలు షురూ
సాక్షి,హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి విడత పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇళ్లను అధికారులు కూల్చేస్తున్నారు. చాదర్‌ఘాట్ మూసానగర్, శంకర్‌నగర్‌లో రెడ్‌మార్క్ వేసిన ఇళ్ల కూల్చివేత ప్రారంభమైంది. చాదర్‌ఘాట్ పరిసరాల్లో 20 ఇళ్ళకు మార్కింగ్ చేసిన అధికారులు ఇప్పటికే నిర్వాసితులను తరలించారు. రెవెన్యూ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం(అక్టోబర్1) తొలిసారిగా కూల్చివేతలు జరుగుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని తెలుస్తోంది. ఇదీ చదవండి: మూసీ ప్రాజెక్టు కాంగ్రెస్‌కు రిజర్వు బ్యాంకు -
‘హైడ్రా’ కూల్చివేతలు..మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: ప్రజలను రెచ్చగొట్టేందుకు కొన్ని అవకాశవాద శక్తులు చాలా కష్టపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిపశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో శ్రీధర్‌బాబు ఆదివారం(సెప్టెంబర్29) మీడియాతో మాట్లాడారు.‘చెరువులు,జలాశయాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పరితపిస్తోంది.మూసీ ఆక్రమణలో ఉన్న ప్రతీ ఒక్కిరికీ ప్రత్యమ్నాయ సదుపాయం కల్పిస్తున్నాం.పేదలకు ఏ రోజూ కాంగ్రెస్ అన్యాయం చేయలేదు.చేయదు. ఇళ్లు కోల్పోయిన వారందరికీ 2013 చట్టప్రకారం నష్టపరిహారం అందజేస్తాం. హైడ్రాతో పేదవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మూసీ ఆక్రమణలో ఉన్న పేదలందరికీ డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.మూసీలో మంచి నీరు ప్రవహించాలని మేం ప్రయత్నం చేస్తున్నాం.నందనవనం ప్రాజెక్టు చేపట్టినపుడు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు.కానీ మేం ఈరోజు పేదలందరికీ పక్కా ఇల్లు ఇస్తున్నాం.పేదలను నిలబెట్టే సంస్కృతి కాంగ్రెస్‌ది. పడగొట్టే సంస్కృతి బీఆర్ఎస్ది. బీఆర్ఎస్ది బుల్డోజర్ పాలసీ. మల్లన్నసాగర్ వద్ద బుల్డోజర్లతో పేదలను ఇళ్లను కూల్చారు’అని శ్రీధర్‌బాబు విమర్శించారు.ఇదీ చదవండి: హైడ్రా ముందే మేల్కొంటే బాగుండేది -
‘మూసీ’ ప్రక్షాళన.. నిర్వాసితుల తరలింపు (ఫోటోలు)
-
బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం: రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: మూసీ నది రివర్ బెడ్‌తోపాటు బఫర్ జోన్లో 10,600 ఇళ్లు, నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించామని.. ఆ ఇళ్లను ఖాళీ చేయించి కుటుంబాలను 23 ప్రాంతాలకు తరలిస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ తెలిపారు. రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా గుర్తించిన ఇళ్లను ఖాళీ చేయడం తప్పనిసరి అంటూనే.. ఎవరినీ బలవంతంగా ఖాళీ చేయించబోమని, ఇళ్లు కూల్చబోమని చెప్పుకొచ్చారు. రెండు నెలల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇక ‘‘జీహెచ్ఎంసీ, ఇతర స్థానిక సంస్థల నుంచి అనుమతి పొంది బఫర్జోన్లలో నిర్మించిన ఇళ్లను నేరుగా కూల్చివేయడం లేదని.. ఆ అనుమతులు రద్దు చేసిన తర్వాతే కూలుస్తున్నామని ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో దానకిశోర్, రంగనాథ్ కలసి మీడియాతో మాట్లాడారు. 2026 జూన్ నాటికి మూసీలో మంచినీరు: దానకిశోర్ మూసీ రివర్ ఫ్రంట్‌లో భాగంగా 2026 జూన్ నాటికి మూసీ నదిలో మంచినీరు ప్రవహించాలని సీఎం ఆదేశించారని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ చెప్పారు. ‘‘గోదా వరి నుంచి 5 టీఎంసీల నీటిని మూసీలోకి తరలిస్తాం. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కోసం ఏజెన్సీలను పిలుస్తున్నాం. మూడు నెలల క్రితం మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు మూసీ నది వెంట 55 కిలోమీటర్ల మేర సర్వే చేశారు. అందులో భాగంగా గుర్తించిన ఇళ్లకు వెళ్లి మార్కింగ్ చేసి, రిలొకేషన్ కోసం ఎంపిక చేసిన ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. కొత్తగా వెళ్లే ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలతోపాటు ఉపాధి లభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటివరకు 974 ఇళ్లను సర్వే చేసి.. 576 ఇళ్లకు మార్కింగ్ చేశాం. వారిలో 470 కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. శుక్రవారం 50 మంది పునరావాస ప్రాంతాలకు తరలివెళ్లగా.. శనివారం 200 కుటుంబాల వరకు వెళ్లాయి. 2 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. మూసీని ఖాళీ చేసేందుకు అక్కడి కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి..’’అని దానకిశోర్ వెల్లడించారు. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళతామని చెప్పారు. మూసీ రివర్‌బెడ్‌లో నివసిస్తున్న ఇంటి యజమానులతోపాటు కిరాయిదారులకు పునరావాసం, ఉమ్మడి కుటుంబం కాకుండా వారి వారసులకు ఇళ్లు కేటాయించే అంశం కూడా పరిశీలనకు వచ్చిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఓనర్లకు మాత్రమే ఇళ్లు కేటాయిస్తున్నామని వివరించారు. మూసీలో నిర్మించిన ఎంజీబీఎస్ బస్‌స్టేషన్, మెట్రో రైల్వేస్టేషన్ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. అనుమతులు రద్దయ్యాకే ఇళ్లు కూల్చేశాం: రంగనాథ్ జీహెచ్ఎంసీ, ఇతర పట్టణ స్థానిక సంస్థలు అనుమతులు ఇచ్చిన ఇళ్లను తాము కూల్చలేదని ‘హైడ్రా’కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. బఫర్జోన్లలో నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులను మున్సిపాలిటీలు రద్దు చేసిన తరువాతే కూల్చివేశామని చెప్పారు. ఇప్పటివరకు కూల్చినవన్నీ అనుమతులు లేని నిర్మాణాలు, లేదా అనుమతులు రద్దయిన నిర్మాణాలేనని తెలిపారు. ‘‘బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా బూచి కాదు. భరోసా. హైడ్రా సైలెంట్‌గా లేదు. తన పని తాను చేస్తుంది. ధనవంతుల ఇళ్లు, ఫామ్‌హౌస్‌లు, కట్టడాల జోలికి వెళ్లడం లేదనేది వాస్తవం కాదు. వారి ఆక్రమణల కూల్చివేతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. జన్వాడ ఫామ్‌హౌస్ 111 జీవో పరిధిలో ఉంది. 111 జీవో హైడ్రా పరిధిలోకి రాదు. ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన కాలేజీలపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో.. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతారనే చర్యలు తీసుకోలేదు. ఓఆర్ఆర్ లోపల 565 చెరువులను గుర్తించాం. ఇందులో 136 చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిని గుర్తించాం. మిగతావి కూడా గుర్తించాక అన్ని వివరాలు వెబ్సైట్లో పెడతాం..’’అని రంగనాథ్ తెలిపారు. -
‘హైడ్రా’ బూచి కాదు: రంగనాథ్
సాక్షి,హైదరాబాద్: హైడ్రా బూచి కాదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ అన్నారు. భవిష్యత్ తరాలకోసమే అక్రమ కట్టడాలు కూలుస్తున్నామని స్పష్టం చేశారు. హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు. రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి(ఎంఏయూడీ)శాఖ కార్యదర్శి దానకిషోర్తో కలిసి రంగనాథ్ శనివారం(సెప్టెంబర్28) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గతంలోనూ మూసీ నిర్వాసితులను తరలించారు.చిన్న వర్షానికే సచివాలయం ముందు వరద పోటెత్తుతోంది. భారీగా వర్షపాతం నమోదైతే అధికారులు కూడా ఏమీ చేయలేరు.మూసీని సుందరీకరించడం కోసం కూల్చివేతలు చేయడం లేదు.గతంలో మూసీ సుందరీకరణ కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారు’అని పురపాలక కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే హైడ్రా లక్ష్యం: రంగనాథ్ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా లక్ష్యం, 2 నెలలుగా హైడ్రా కూల్చివేతలు జరుపుతోందిచెరువుల ఆక్రమణలు తొలగించాం.. హైడ్రాపై సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారువరదల నుంచి ప్రజలను కాపాడటమే హైడ్రా లక్ష్యం. ముందుగా నోటీసులు ఇచ్చి కూల్చుతున్నాంఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేసుకుంటూపోతే కట్టడి చేయవద్దా?ఆక్రమణల్లో పేదవాళ్ల ఇళ్లు ఉంటే వాళ్ల జోలికి వెళ్లడం లేదుమేము కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవుభవిష్యత్తులో వరదలతో కోటి మంది ఇబ్బంది పడతారుఆస్పత్రుల్లో పేషెంట్లు లేకపోయినా ఉన్నట్లుగా చూపిస్తున్నారుకొందరి తప్పుడు ప్రచారం వల్ల బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుందిహైడ్రాను భూతంలా చూపిస్తున్నారు. తప్పు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నాంహైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు హైడ్రాపై ఆందోళన వద్దు..నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం: దానకిషోర్వందేళ్ల క్రితమే నిజాం మూసీ నది అభివృద్ధి నమూనాలు రూపొందించారు.ఈ నమూనాలు థేమ్స్ నది కంటే అద్భుతంగా ఉన్నాయి.హైదరాబాద్ నగరంలో ఇటీవల 20 నిమిషాలకే 9.1 సెంటీమీటర్ల వర్షం పడింది.20 నిమిషాల కొద్దిపాటి వర్షానికే నగరం మునుగుతోంది.మరో 20 నిమిషాలు వర్షం పడితే మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితిమూసీ ఒడ్డున కూల్చివేతలు సుందరీకరణ కోసం మాత్రమే కాదు..ప్రమాదం నుంచి కాపాడేందుకు కూడాపేద ప్రజలు నీళ్ళల్లో ఉండొద్దు అనే ఉద్దేశంతోనే మూసీ ప్రక్షాళనప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాల పర్యటన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో అక్టోబర్‌లో ఉంటుంది.మూసీ నీళ్ల శుద్ధి కోసం 3800 కోసం కొత్త ఎస్టీపీలు తీసుకువస్తాం.మూసీ నీళ్లను మంచి నీళ్ళుగా మార్చేందుకు రూ. 10వేల కోట్లతో పలు కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయి.మూసీ పరీవాహక ప్రాంతం ప్రజలు డబుల్ బెడ్ కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు.10వేల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తే వెళ్తామని మాతో చెప్పారు..కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి.మూసీ బాధితులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది.. ఈ విషయమై కమిటీ వేశాం.మూసీ నదీ పరివాహక ప్రాంత వాసులను 14 ప్రాంతాలకు తరలించాలనుకుంటున్నాం.పిల్లల చదువుల కోసం తల్లితండ్రులు ఆందోళన అవసరం లేదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.23 లోకేషన్లలో నిర్వాసితులు మానసికంగా ఆందోళన చెందకుండా కౌన్సెలింగ్ ఇస్తారు.సీనియర్ అధికారులతో కాంప్స్ ఏర్పాటు చేస్తాం.50 కుటుంబాలను ఇప్పటికే షిఫ్ట్ చేశారు... మరో 150 కుటుంబాలు షిఫ్ట్ చేస్తున్నారు.హైడ్రా వస్తుంది కూలుస్తుంది అనేది అవాస్తవం...ప్రజలు ఆందోళన అవసరం లేదు.ఏ కుటుంబాలను బలవంతంగా షిఫ్ట్ చేయించడం లేదు..స్వచ్చందంగా ప్రజలు సహకరించాలినష్టపరిహారం ఇవ్వాల్సిన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం ఇస్తుంది. ఇదీచదవండి: హైడ్రా బాధితుల తరపున కొట్లాడతాం: బీఆర్ఎస్ -
మూసీలో చిక్కుకున్న పశువుల కాపరులు
కేతేపల్లి: ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఇద్దరు పశువుల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాధితులను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భీమారం గ్రామానికి చెందిన పశువుల కాపరులు సురుగు బాలస్వామి, బయ్య గంగయ్య రోజుమాదిరిగానే ఆదివారం పశువులను మేపేందుకు గ్రామ శివారులో ఉన్న మూసీ వాగు ప్రాంతంలోకి తీసుకెళ్లారు. కాగా, హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువన ఉన్న ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరటంతో అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా ప్రాజెక్టు మూడు క్రస్టు గేట్లను పైకెత్తి నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ ప్రాజెక్టు దిగువనున్న భీమారం వద్ద మూసీ వాగులో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో బాలయ్య, గంగయ్య వెంటనే తేరుకుని పశువులతో సహా వాగు మధ్యలో ఉన్న పెద్ద రాతిబండపైకి చేరుకున్నారు. అదే సమయంలో వాగు వద్ద ట్రాక్టర్లోకి ఇసుక ఎత్తుతున్న కూలీలు వరద ఉధృతి పెరగటం గమనించి వెంటనే దూరంగా వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ట్రాక్టర్ మాత్రం వాగులోని నీటిలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, కేతేపల్లి ఎస్ఐ శివతేజ, తహసీల్దార్ ఎన్. మధుసూదన్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూసీ ప్రాజెక్టు అధికారులతో ఫోన్లో మాట్లాడి గేట్లు మూసివేయించారు. ఒక వైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే ప«శువులు నీటిలో ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరాయి. పోలీసులు జేసీబీని వాగులోకి దింపి పశువుల కాపరులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వీలు కాలేదు. సూర్యాపేట ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని తాళ్లు, సేఫ్టీ జాకెట్ల సహాయంతో వాగులోకి వెళ్లి పశువుల కాపరులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
‘మూసీ’ గేట్లు ఎత్తివేత: చుట్టూ నీరు.. మధ్యలో పశువుల కాపరులు
సాక్షి, నల్గొండ జిల్లా: మూసీ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పశువుల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అధికారులు గేట్లు తెరవడంతో ఒక్కసారిగా నీరు చుట్టుముట్టింది. దీంతో మధ్యలో పశువుల కాపరులు చిక్కుకున్నారు. సాయం కోసం గంగయ్య, బాలస్వామి ఎదురు చూస్తున్నారు.వరదలో 26 గేదెలు, ఆవులు కొట్టుకుపోయాయి. ట్రాక్టర్ నీటిలోనే మునిగిపోయింది. ప్రస్తుతం బండరాయిపైనే గంగయ్య, బాలస్వామి కూర్చుకున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసుల చర్యలు ప్రారంభించారు. నల్గొండ డీఎస్పీ శివరామ్‌రెడ్డి ఘటనా స్థలానికి హుటాహుటిన సిబ్బందిని పంపించారు. ప్రొక్లెయినర్ సాయంతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నిస్తున్నారు.ఇదీ చదవండి: కలిసి బతకలేమని.. ప్రేమ ప్రయాణం విషాదాంతం -
శ్రీరాంసాగర్ 41 గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కడెం వాగుతోపాటు ఎగువన గోదావరికి వరద పోటెత్తింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు 1,95,767 క్యూసెక్కుల వరద రాగా, నీటినిల్వ 71.85 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండుకుండలా మారడం, ఎగువ నుంచి ఉధృతంగా వరద వస్తుండడంతో ఉదయం 10:30 గంటలకు 8 గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి వరద పెరుగుతున్న కొద్దీ క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తుతూ వెళ్లారు. రాత్రి పదిగంటలకు 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా, ప్రాజెక్టులో 72.9 టీఎంసీలను నిల్వ చేస్తూ మొత్తం 41 గేట్లు ఎత్తి 2.65లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ⇒ కడెం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా, 49,763 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 5.41 టీఎంసీల నిల్వలు కొనసాగిస్తూ 18 గేట్లు ఎత్తి కిందికి విడుదల చేస్తున్నారు. ⇒ శ్రీరాంసాగర్ నుంచి విడుదలవుతున్న వరదకు కడెం జలాలు తోడుకావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి 2,92,815 క్యూసెక్కులు పెరిగింది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, 15.02 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 2,64,787 క్యూసెక్కు ల నీటిని గేట్ల ద్వారా కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లకు వరద ఉధృతి భారీగా పెరిగింది. సుందిళ్ల బరాజ్‌కు 3.68లక్షలు, అన్నారం బరాజ్‌కు 6.61లక్షలు, మేడిగడ్డ బరాజ్‌కు 6.79లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచి్చంది వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సమ్మక్కసాగర్‌కు 4.45 లక్షలు, సీతమ్మసాగర్కు 3.13లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచి్చనట్టు విడుదల చేస్తున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక చేరువకు వెళుతోంది. సోమవారం రాత్రి 12. గంటల సమాయానికి 12.010 మీటర్లకు చేరింది. తెల్లవారే సరికి మరింత వరద పెరగనుంది. కాగా, మొదటి ప్రమాద హెచ్చరిక 12.210 మీటర్లు, డేంజర్ లెవల్ 13.460 మీటర్లు వరకు నమోదు అయితే లోతట్టు గ్రామాలు జలమయమవుతాయి.1986లో కాళేశ్వరం వద్ద 15.75 మీటర్ల ఎత్తు, 2022 జూలై 14న 16.72మీటర్ల ఎత్తులో నీటిమట్టం నమోదైంది. సింగూరు, నిజాంసాగర్‌కు జలకళ గోదావరి ఉపనది మంజీరలోనూ వరద ఉధృతి మరింతగా పెరగడంతో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 29.917 టీఎంలు కాగా, ప్రస్తుతం 23,942 క్యూసెక్కుల వరద వస్తుండగా, నిల్వలు19.22 టీఎంసీలకు చేరాయి. ⇒ నిజాంసాగర్ నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా 48,800 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 9.16 టీఎంసీలకు చేరాయి. వరద ఇలానే కొనసాగితే మరో ఐదు రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా నిండే అవకాశముంది. మిడ్‌మానేరుకు గ్రావిటీ ద్వారా ఎస్సారెస్పీ జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని మిడ్‌మానేరులోకి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తి పోయాల్సిన అవసరం లేకుండా పోయింది. రెండు పంప్‌హౌస్‌లలో పంపింగ్ బంద్ చేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 7000 క్యూసెక్కుల నీటిని గ్రావిటీతో మిడ్‌మానేరు జలాశయా నికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి అనంతగిరి జలాశయానికి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లకు నీళ్లను ఐదు దశల్లో పంపింగ్ చేస్తున్నారు. ఎగువన శాంతించిన కృష్ణమ్మ... దిగువన ఉగ్రరూపం ⇒ జూరాల 40 గేట్లు, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు, సాగర్ 26 గేట్ల ద్వారా నీటి విడుదల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన కృష్ణమ్మ శాంతించింది. మూడు రోజులుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు తోడు కావడంతో దిగువన కృష్ణానది ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బరాజ్‌కు వస్తున్న 11,27,30 క్యూసెక్కుల వరదను వచ్చింది వచ్చినట్టు గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలోని ఆల్మట్టి జలాశయానికి 70 వేలు, నారాయణపూర్ జలాశయానికి 30 వేల క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది.దీంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు సైతం 3.21లక్షల క్యూసెక్కులకు వరద తగ్గిపోగా, 40 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.89 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని 10 గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 5.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచి్చనట్టు 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 5.48 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 5.43 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న ప్రకాశం బరాజ్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో మంగళవారం నాటికి ప్రకాశం బరాజ్‌కు వరద ఉధృతి తగ్గే అవకాశముంది. అలుగుపారుతున్న డిండి ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దుందుభి వాగు పరవళ్లు తొక్కుతుండడంతో నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు నిండి సోమవారం అలుగు పోసింది. వర్షాధారంపైనే ఆధారపడిన ఈ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి (36 అడుగులు) చేరుకుంది. హైదరాబాద్ – శ్రీశైలం రహదారి మధ్యలో ఉన్న డిండి ప్రాజెక్టు అలుగుపారుతున్న అందాలను తిలకించేందుకు స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత మూసీనదికి వరద పోటెత్తడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యంగల మూసీ రిజర్వాయర్‌లో 3.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
శ్రీశైలం చెంతకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: ఎగువ నుంచి కృష్ణా జలాలు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు 33,499 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 813.7 అడుగుల్లో 36.56 టీఎంసీలకు చేరుకుంది. గరిష్ట నీటి మట్టం 885 అడుగులున్న ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 179.26 టీఎంసీలు అవసరం. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతుండటంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 79 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్కేంద్రం, గేట్ల ద్వారా 69 వేల క్యూసె క్కులను దిగువకు వదులుతున్నారు. నారాయ ణపూర్ డ్యామ్‌లోకి లక్ష క్యూసెక్కులు చేరుతుండగా.. 1,08,860 క్యూసెక్కులను విద్యుత్కేంద్రం, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.దాని దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టులోకి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 90,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 17 క్రస్టుగేట్లను ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. అలాగే ఎగువ, దిగువ జెన్కో జల విద్యుత్కేంద్రంలోని 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టగా ఇందుకోసం 33,084 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, కుడి, ఎడమ కాల్వలతోపాటు నెట్టెంపాడు, భీమా లిఫ్టులకు కలిపి మొత్తం 1,04,416 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, నాగార్జున సాగర్‌లోకి ఎలాంటి వరద ప్రవాహం లేదు.తుంగభద్రలో...కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లోకి 1,03,787 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 68.77 టీఎంసీలకు చేరుకుంది. మరో 37 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తేస్తారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.అటు కృష్ణా ప్రధానపాయ.. ఇటు తుంగభద్ర బేసిన్లలో శనివారం వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆదివారం కూడా వరద ఇదే రీతిలో కొనసాగుతుందని కేంద్ర జలసంఘం (సీడ బ్ల్యూసీ) అంచనా వేసింది. ఎగువన ఆల్మట్టి, నారా యణపూర్ జలాశయాలు ఇప్పటికే నిండగా, మరో మూడు నాలుగో రోజుల్లో తుంగభద్ర జలాశయం సైతం నిండే అవకాశాలున్నాయి. దీంతో మరో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం జలా శయానికి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశముంది. వర్షాలు కొనసాగితే నెలాఖరు లోగా శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశాలున్నాయి.మూసీ ప్రాజెక్టుకు జలకళకేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. హైదరాబాద్‌తోపాటు మూసీ నది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. బిక్కేరు వాగు నుంచి కూడా నీరు వస్తుండటంతో మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. శనివారం ఉదయం ప్రాజెక్టుకు 810 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో.. సాయంత్రానికి ఒక్కసారిగా 1700 క్యూసెక్కులకు పెరిగింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.06 టీఎంసీల నీరు ఉంది. -
మెట్రో రెండోదశకు జైకా నిధులు!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళనకు నిధుల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గురువారం మెట్రో రైల్ విస్తరణ, మూసీనది పరీవాహక ప్రాంత అభివృద్ధికి తక్కువ వడ్డీకి రుణాలు, వివిధ విభాగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సునోరితో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత అంచనాల మేరకు 70 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రెండో దశకు అయ్యే రూ.18,900 కోట్ల వ్యయంలో సుమారు రూ.9,000 కోట్ల వరకు జైకా నుంచి, ఇతర సంస్థల నుంచి రుణాల రూపంలో సేకరించే అవకాశముంది. మెట్రో నిర్మాణ ఒప్పందం మేరకు కేంద్రం 35 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మరో 20 శాతం నిధులు భరించాలి. మిగతా మొత్తాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. ప్రస్తుతం జైకా మాత్రమే అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థపైనే ఆశలు పెట్టుకుంది. మెట్రోతో పాటు, మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి కూడా జైకా నిధులే కీలకం కానున్నాయి. ‘ఆ సంస్థ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఆశించిన స్థాయిలోనే రుణాలు లభిస్తాయని భావిస్తున్నాం.’అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. -
‘మూసీ’కి పెరిగిన ఇన్‌ఫ్లో.. ఒక గేటు ఎత్తివేత
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు 892 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. మూసీ గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 644.10 అడుగులు ఉంది. దీంతో అధికారులు ఒక క్రస్టు గేటును ఒక అడుగు మేర ఎత్తి 609 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా 509 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.22 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
మండే ఎండల్లోనూ నిండుగా నీళ్లు
కేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు సోమవారం ఉదయం ఒక క్రస్టు గేటును పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. జూన్ మొదటి వారంలోనే గేట్లు ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలో ఇదే మొదటిసారని చెపుతున్నారు. గత ఏడాది జూన్ 27న గేట్లు ఎత్తారు. గత నెల రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాలలో కురిసిన అకాల వర్షాలతో ఈ ప్రాజెక్టు వేసవిలోనే నిండుకుండలా మారింది. నెల రోజుల నుంచి మూసీ, బిక్కేరు వాగుల ద్వారా నిరంతరాయంగా నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా సోమవారం ఉదయానికి నీటిమట్టం 644.60 అడుగులకు (4.36 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి మూసీ ప్రాజెక్టులోకి 240 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలోకి రావటంతో డ్యామ్ అధికారులు మూడో నంబర్ క్రస్ట్ గేటును అర అడుగు మేర పైకి ఎత్తి 330 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. 644.5 అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిలకడగా ఉంచుతూ ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.