
సాక్షి,హైదరాబాద్: అనుమతులు లేకుండా చేసిన నిర్మాణాలపై హైడ్రా కొరడా తప్పదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. శనివారం(అక్టోబర్ 26)హైటెక్స్‌లో జరిగిన ప్రాపర్టీ షోలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు,హైడ్రాలను భట్టి ప్రస్తావించారు.‘ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ పునరుజ్జీవం జరుగుతుంది.
మూసీ పునరుజ్జీవం వల్ల హైదరాబాద్‌కు, రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది.మూసీలో నివసిస్తున్నపేదల జీవితాలు మెరుగుపడతాయి.హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోంది.అనుమతులు ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చదు’అని భట్టి తెలిపారు.
ఇదీ చదవండి: దొరా.. మా భూములు లాక్కోవద్దు
Comments
Please login to add a commentAdd a comment