సాక్షి,హైదరాబాద్: మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు బాధితులు సోమవారం(అక్టోబర్ 14) హైకోర్టు తలుపుతట్టారు. మూసీ పరివాక ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్నామని, ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం తమ ఇళ్లు కూలగొట్టే అవకాశం ఉందని హైకోర్టులో పిటిషన్ వేశారు.
అధికారులు తమ ఇళ్లపై మార్కింగ్ వేసిన విషయాన్ని వీరంతా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తమ ఇళ్లు కూల్చకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. మంగళవారం హైకోర్టు ఈ పిటిషన్‌లను విచారించనుంది.
కాగా, మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న ఇళ్ల కూల్చివేతను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.
ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
Comments
Please login to add a commentAdd a comment