సాక్షి,హైదరాబాద్:పేదలు దసరా పండగ సంతోషంగా జరుపుకోలేని దుస్థితికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొచ్చాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం(అక్టోబర్1)అంబర్‌పేట గోల్నాకలోని తులసీరాంనగర్‌లో పర్యటించిన కేటీఆర్ మూసీ కూల్చివేతల బాధితులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పది నెలలు అయ్యింది రేవంత్ రెడ్డి వచ్చి. హైదరాబాద్ లో ఒక్క ఓటు కూడా రాలేదని మీ బతుకులు ఆగం చేశాడు. పెన్షన్లు రూ.4వేలు చేస్తా అన్నాడు. ఆరు గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. ఏమీ ఇవ్వలేదు. తులం బంగారం అన్నాడు. తులం బంగారం కాదు కాగా ఇనుము కూడా రాలేదు.
మూసీలో దోచుకో, ఢిల్లీలో పంచి పెట్టు అన్నట్టుగా కొత్త దుకాణం తెరిచాడు. ఇక్కడ 38 ఇళ్లకు రంగులు వేసాడట. ఏ ఇంటికి కష్టం వచ్చినా పక్కింటి వాళ్ళు అడ్డుకోవాలి. బుల్డోజర్‌ను బొంద పెట్టాలి. ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు.ఇందిరమ్మ చెప్పిందా? సోనియమ్మ చెప్పిందా ఇల్లు కూల్చాలని. పేదల ఇల్లు ఎవరికి దోచి పెట్టడానికి కూలుస్తున్నారు.
గంగా నది ప్రక్షాళన కోసం 2400 కిలోమీటర్లు ఉన్న ప్రాజెక్ట్ రూ. 20 వేల కోట్లతో కేంద్రం చేపట్టింది. కానీ మూసి నదికి లక్షా 50 వేల కోట్లతో శుద్ధి చేస్తానన్న పేరుతో దోచుకోవడానికి రేవంత్‌రెడ్డి చూస్తున్నాడు’అని కేటీఆర్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment