విరిగిపోయిన మూసీ గేటు.. | Musi Project Gate Broken | Sakshi
Sakshi News home page

విరిగిపోయిన మూసీ గేటు..

Published Sat, Oct 5 2019 7:50 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

 భారీ వరద ప్రవాహం తట్టుకోలేక మూసీ ప్రాజెక్టు గేటు విరిగిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ జలాశయంలోకి భారీగా వరద చేరింది. అయితే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శనివారం సాయంత్రం ఆరో నంబర్‌ గేటు ఊడిపోయింది. దీంతో వరద నీరు వృథాగా దిగువ ప్రాంతానికి పోతోంది. మూసీ జలాశయంలో మొత్తం 32 క్రస్ట్‌ గేట్లు ఉండగా.. వివిధ కారణాలతో 7 గేట్లను పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 25 గేట్లు ఉన్నాయి.. గత రెండు రోజులుగా భారీగా నీరు చేరడంలో రెండు గేట్లను ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నిన్న రాత్రి కూడా భారీగా వరద రావడంతో పోటు ఎ‍క్కువై గేటు ఊడిపోయింది. దీంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నీరంతా వృథాగా పోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతు‍న్నారు. పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement