సాక్షి,హైదరాబాద్: హైడ్రా బూచి కాదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ అన్నారు. భవిష్యత్ తరాలకోసమే అక్రమ కట్టడాలు కూలుస్తున్నామని స్పష్టం చేశారు. హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు. రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి(ఎంఏయూడీ)శాఖ కార్యదర్శి దానకిషోర్‌తో కలిసి రంగనాథ్ శనివారం(సెప్టెంబర్28) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘గతంలోనూ మూసీ నిర్వాసితులను తరలించారు.చిన్న వర్షానికే సచివాలయం ముందు వరద పోటెత్తుతోంది. భారీగా వర్షపాతం నమోదైతే అధికారులు కూడా ఏమీ చేయలేరు.మూసీని సుందరీకరించడం కోసం కూల్చివేతలు చేయడం లేదు.గతంలో మూసీ సుందరీకరణ కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారు’అని పురపాలక కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే హైడ్రా లక్ష్యం: రంగనాథ్
- ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా లక్ష్యం, 2 నెలలుగా హైడ్రా కూల్చివేతలు జరుపుతోంది
- చెరువుల ఆక్రమణలు తొలగించాం.. హైడ్రాపై సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు
- వరదల నుంచి ప్రజలను కాపాడటమే హైడ్రా లక్ష్యం. ముందుగా నోటీసులు ఇచ్చి కూల్చుతున్నాం
- ఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేసుకుంటూపోతే కట్టడి చేయవద్దా?
- ఆక్రమణల్లో పేదవాళ్ల ఇళ్లు ఉంటే వాళ్ల జోలికి వెళ్లడం లేదు
- మేము కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవు
- భవిష్యత్తులో వరదలతో కోటి మంది ఇబ్బంది పడతారు
- ఆస్పత్రుల్లో పేషెంట్లు లేకపోయినా ఉన్నట్లుగా చూపిస్తున్నారు
- కొందరి తప్పుడు ప్రచారం వల్ల బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది
- హైడ్రాను భూతంలా చూపిస్తున్నారు. తప్పు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నాం
- హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు
హైడ్రాపై ఆందోళన వద్దు..నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం: దానకిషోర్
- వందేళ్ల క్రితమే నిజాం మూసీ నది అభివృద్ధి నమూనాలు రూపొందించారు.
- ఈ నమూనాలు థేమ్స్ నది కంటే అద్భుతంగా ఉన్నాయి.
- హైదరాబాద్ నగరంలో ఇటీవల 20 నిమిషాలకే 9.1 సెంటీమీటర్ల వర్షం పడింది.
- 20 నిమిషాల కొద్దిపాటి వర్షానికే నగరం మునుగుతోంది.
- మరో 20 నిమిషాలు వర్షం పడితే మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితి
- మూసీ ఒడ్డున కూల్చివేతలు సుందరీకరణ కోసం మాత్రమే కాదు..ప్రమాదం నుంచి కాపాడేందుకు కూడా
- పేద ప్రజలు నీళ్ళల్లో ఉండొద్దు అనే ఉద్దేశంతోనే మూసీ ప్రక్షాళన
- ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాల పర్యటన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో అక్టోబర్‌లో ఉంటుంది.
- మూసీ నీళ్ల శుద్ధి కోసం 3800 కోసం కొత్త ఎస్టీపీలు తీసుకువస్తాం.
- మూసీ నీళ్లను మంచి నీళ్ళుగా మార్చేందుకు రూ. 10వేల కోట్లతో పలు కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయి.
- మూసీ పరీవాహక ప్రాంతం ప్రజలు డబుల్ బెడ్ కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు.
- 10వేల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తే వెళ్తామని మాతో చెప్పారు..కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి.
- మూసీ బాధితులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది.. ఈ విషయమై కమిటీ వేశాం.
- మూసీ నదీ పరివాహక ప్రాంత వాసులను 14 ప్రాంతాలకు తరలించాలనుకుంటున్నాం.
- పిల్లల చదువుల కోసం తల్లితండ్రులు ఆందోళన అవసరం లేదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.
- 23 లోకేషన్‌లలో నిర్వాసితులు మానసికంగా ఆందోళన చెందకుండా కౌన్సెలింగ్ ఇస్తారు.
- సీనియర్ అధికారులతో కాంప్స్ ఏర్పాటు చేస్తాం.
- 50 కుటుంబాలను ఇప్పటికే షిఫ్ట్ చేశారు... మరో 150 కుటుంబాలు షిఫ్ట్ చేస్తున్నారు.
- హైడ్రా వస్తుంది కూలుస్తుంది అనేది అవాస్తవం...ప్రజలు ఆందోళన అవసరం లేదు.
- ఏ కుటుంబాలను బలవంతంగా షిఫ్ట్ చేయించడం లేదు..స్వచ్చందంగా ప్రజలు సహకరించాలి
- నష్టపరిహారం ఇవ్వాల్సిన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం ఇస్తుంది.
ఇదీచదవండి: హైడ్రా బాధితుల తరపున కొట్లాడతాం: బీఆర్‌ఎస్
Comments
Please login to add a commentAdd a comment