సాక్షి,హైదరాబాద్: ప్రజలను రెచ్చగొట్టేందుకు కొన్ని అవకాశవాద శక్తులు చాలా కష్టపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిపశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో శ్రీధర్‌బాబు ఆదివారం(సెప్టెంబర్29) మీడియాతో మాట్లాడారు.
‘చెరువులు,జలాశయాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పరితపిస్తోంది.మూసీ ఆక్రమణలో ఉన్న ప్రతీ ఒక్కిరికీ ప్రత్యమ్నాయ సదుపాయం కల్పిస్తున్నాం.పేదలకు ఏ రోజూ కాంగ్రెస్ అన్యాయం చేయలేదు.చేయదు. ఇళ్లు కోల్పోయిన వారందరికీ 2013 చట్టప్రకారం నష్టపరిహారం అందజేస్తాం. హైడ్రాతో పేదవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
మూసీ ఆక్రమణలో ఉన్న పేదలందరికీ డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.మూసీలో మంచి నీరు ప్రవహించాలని మేం ప్రయత్నం చేస్తున్నాం.నందనవనం ప్రాజెక్టు చేపట్టినపుడు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు.కానీ మేం ఈరోజు పేదలందరికీ పక్కా ఇల్లు ఇస్తున్నాం.పేదలను నిలబెట్టే సంస్కృతి కాంగ్రెస్‌ది. పడగొట్టే సంస్కృతి బీఆర్‌ఎస్‌ది. బీఆర్‌ఎస్‌ది బుల్డోజర్ పాలసీ. మల్లన్నసాగర్ వద్ద బుల్డోజర్‌లతో పేదలను ఇళ్లను కూల్చారు’అని శ్రీధర్‌బాబు విమర్శించారు.
ఇదీ చదవండి: హైడ్రా ముందే మేల్కొంటే బాగుండేది
Comments
Please login to add a commentAdd a comment