ఆదివారంమంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మూసీ ప్రాజెక్టు పరిశీలిస్తున్న స్మితా సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు గేటు విరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పందించారు. తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. ఆదివారం ఉదయం మూసీ గేటు ఘటన పరిస్థితుల తీవ్రతను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎంకు ఫోన్‌లో వివరించారు. దీంతో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో పాటు ఈఎన్‌సీ మురళీధర్‌రావులను మూసీ సందర్శించి, తక్షణ నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్‌తో పాటు ఇంజనీర్లు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో మూసీ ప్రాజెక్టు వద్దకు వెళ్లారు.
స్టాప్‌లాగ్స్ బిగింపునకు 3 రోజులు
అధికారులు మూసీ వద్దకు చేరుకున్నాక అక్కడి పరిస్థితిని సీఎంకు ఫోన్‌లో వివరించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు ఎక్కువగా ఉండటం, గేటు ఊడటంతో 10వేల క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళ్తోందనీ,, దీన్ని నిరోధించేందుకు స్టాప్‌లాగ్స్ అవసరమనీ తెలిపారు. వాటిని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) అధికారులు డిజైన్స్ రూపొందించి తయారు చేయించేందుకు కనీసం మూడు రోజులైనా పట్టవచ్చని వివరించినట్లు తెలిసింది.
అప్పటిలోగా ప్రాజెక్టులో ఉన్న నీరంతా ఖాళీ అయ్యే అవకాశాలే అధికమని ఇంజనీర్ల అంచనా. ఒకవేళ ప్రైవేటు కాంట్రాక్టర్లకు గేటు అమర్చే పని అప్పగించినా మూడు రోజులు పడుతుందని భావిస్తున్నారు. గేటుకు ఒక పక్కభాగంలో కాంక్రీట్ నిర్మాణం దెబ్బతినడం, ఎగువన నుంచి భారీగా వచి్చన వరద ప్రవాహంతో అది విరిగిపోయినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment