
తుర్కపల్లి: ఐకమత్యంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ వాసాలమర్రి ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్ విప్లవాత్మక ఆలోచన వల్లే దళితబంధు పథకం వచ్చిందని, ఆ పథకాన్ని సది్వనియోగం చేసుకొని, అర్థికంగా ఎదిగి పది మందికి ఉపాధి చూపే స్థాయికి చేరుకోవాలని అన్నారు.
బుధవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళితవాడలో సీఎం కార్యదర్శి రాహుల్»ొజ్జ, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలసి పర్యటించారు. అనంతరం రైతు వేదిక భవనంలో దళితబంధు లబ్ధిదారులతో సమీక్ష నిర్వహించారు.
లాబ్ధిదారులు ఏయే యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు, నెలకు ఎంత సంపాదిస్తున్నారు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆమె మాట్లాడుతూ.. ఎర్రవల్లి గ్రామం తరహాలో వాసాలమర్రిని కూడా అభివృద్ధి చేసుకోవాలని వారికి సూచించారు. గ్రామంలో కొత్తగా పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ భవనాలు ఏర్పాటు చేస్తామని, చిన్న పరిశ్రమల ద్వారా పది మందికి ఉపాధి కల్పించాలని అన్నారు.
ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ. వాసాలమర్రి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ఇతర కులాల్లో ఉన్న యువకులకు కూడా వారి నైపుణ్యాన్ని బట్టి ఉపాధి కలి్పంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసాలమర్రి సర్పంచ్ పోగుల ఆంజనేయులు, జెడ్పీ వైస్ చైర్మన్ బీకునాయక్, అదనపు కలెక్టర్ దీపక్‌తివారి తదితరులు పాల్గొన్నారు.