సాక్షి, నల్గొండ జిల్లా: మూసీ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పశువుల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అధికారులు గేట్లు తెరవడంతో ఒక్కసారిగా నీరు చుట్టుముట్టింది. దీంతో మధ్యలో పశువుల కాపరులు చిక్కుకున్నారు. సాయం కోసం గంగయ్య, బాలస్వామి ఎదురు చూస్తున్నారు.
వరదలో 26 గేదెలు, ఆవులు కొట్టుకుపోయాయి. ట్రాక్టర్ నీటిలోనే మునిగిపోయింది. ప్రస్తుతం బండరాయిపైనే గంగయ్య, బాలస్వామి కూర్చుకున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసుల చర్యలు ప్రారంభించారు. నల్గొండ డీఎస్పీ శివరామ్‌రెడ్డి ఘటనా స్థలానికి హుటాహుటిన సిబ్బందిని పంపించారు. ప్రొక్లెయినర్ సాయంతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: కలిసి బతకలేమని.. ప్రేమ ప్రయాణం విషాదాంతం
Comments
Please login to add a commentAdd a comment