Cattle herders
-
‘మూసీ’ గేట్లు ఎత్తివేత: చుట్టూ నీరు.. మధ్యలో పశువుల కాపరులు
సాక్షి, నల్గొండ జిల్లా: మూసీ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పశువుల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అధికారులు గేట్లు తెరవడంతో ఒక్కసారిగా నీరు చుట్టుముట్టింది. దీంతో మధ్యలో పశువుల కాపరులు చిక్కుకున్నారు. సాయం కోసం గంగయ్య, బాలస్వామి ఎదురు చూస్తున్నారు.వరదలో 26 గేదెలు, ఆవులు కొట్టుకుపోయాయి. ట్రాక్టర్ నీటిలోనే మునిగిపోయింది. ప్రస్తుతం బండరాయిపైనే గంగయ్య, బాలస్వామి కూర్చుకున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసుల చర్యలు ప్రారంభించారు. నల్గొండ డీఎస్పీ శివరామ్‌రెడ్డి ఘటనా స్థలానికి హుటాహుటిన సిబ్బందిని పంపించారు. ప్రొక్లెయినర్ సాయంతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నిస్తున్నారు.ఇదీ చదవండి: కలిసి బతకలేమని.. ప్రేమ ప్రయాణం విషాదాంతం -
చూస్తుండగానే రైతును నీళ్లల్లోకి లాక్కెళ్లిన మొసలి
సాక్షి, సంగారెడ్డి: మొసలి దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేట-కోడూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో ఈ ఘటన జరిగింది. ఇసోజిపేట గ్రామానికి చెందిన గొల్ల రాములు (45) మంజీరా నదిలోకి దిగి గేదెలను కడుగుతుండగా ఒక్కసారిగా మొసలి అతనిపై దాడి చేసింది. ఆ సమయంలో ఒడ్డుపై ఉన్న మరికొంత మంది రైతులు గట్టి అరుస్తూ కర్రలతో మొసలిపై దాడి చేసే యత్నం చేయగా విఫలమయ్యారు. వారంతా చూస్తుండగానే మొసలి రాములును నీటిలోకి లాక్కెళ్లింది. కొద్దిసేపటికి నీళ్లలో వెతగ్గా రాములు మృతదేహం లభించింది. చదవండి: పోలీస్‌స్టేషన్‌లో షణ్ముఖ్ రచ్చరచ్చ యాంకర్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి... -
బ్రెజిల్లో ఒంగోలు ఆవు రూ. 14.86 కోట్లు!
బ్రెజిల్ దేశంలో పశుపోషకులు గిర్, ఒంగోలు తదితర భారతీయ జాతుల ఆవులు, గిత్తలను అత్యంత శ్రద్ధాసక్తులతో పెంచి పోషిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ఒంగోలు వంటి దేశీ ఆవులు, గిత్తల ధర కూడా ఔరా అనిపించేలా ఉంటుంది. అక్టోబర్ 28వ తేదీన బ్రెజిల్ సావో పాలోని ఇండియాటుబలో జరిగిన వేలంలో పర్ల ఐవీఎఫ్ ఏజేజే అనే పేరుగల ఒంగోలు ఆవు రూ.14.86 కోట్ల (72 లక్షల బ్రెజిలియన్ రియళ్ల)కు అమ్ముడుపోయింది! బ్రెజిల్లో భారతీయ సంతతి ఆవుకు ఇంతకుముందెన్నడూ ఇంత అధిక ధర పలకలేదట!