చూస్తుండగానే రైతును నీళ్లల్లోకి లాక్కెళ్లిన మొసలి | Cattle Herder Deceased In Crocodile Attack In Sangareddy District | Sakshi
Sakshi News home page

అందరూ చూస్తుండగానే రైతును నీళ్లల్లోకి లాక్కెళ్లిన మొసలి

Published Mon, Mar 1 2021 11:08 AM | Last Updated on Mon, Mar 1 2021 1:43 PM

Cattle Herder Deceased In Crocodile Attack In Sangareddy District - Sakshi

సాక్షి, సంగారెడ్డి: మొసలి దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం ఇసోజిపేట-కోడూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో ఈ ఘటన జరిగింది. ఇసోజిపేట గ్రామానికి చెందిన గొల్ల రాములు (45) మంజీరా నదిలోకి దిగి గేదెలను కడుగుతుండగా ఒక్కసారిగా మొసలి అతనిపై దాడి చేసింది. ఆ సమయంలో ఒడ్డుపై ఉన్న మరికొంత మంది రైతులు గట్టి అరుస్తూ కర్రలతో మొసలిపై దాడి చేసే యత్నం చేయగా విఫలమయ్యారు. వారంతా చూస్తుండగానే మొసలి రాములును నీటిలోకి లాక్కెళ్లింది. కొద్దిసేపటికి నీళ్లలో వెతగ్గా రాములు మృతదేహం లభించింది.

చదవండి:
పోలీస్‌స్టేషన్‌లో షణ్ముఖ్‌ రచ్చరచ్చ
యాంకర్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement