crocodile attack
-
వామ్మో.. పాకాల వాగులో మొసలి.. భయాందోళనలో రైతులు..
వరంగల్: మండల కేంద్రానికి సమీపంలోని పాకాల వాగు నీటిలో ఆదివారం రైతులకు మొసలి కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని వారు తమకు తెలిసిన ఓ ఫొటోగ్రాఫర్‌కు సమాచారం అందించడంతో అతను వీడియోలో బంధించాడు. గూడూరు నుంచి నెక్కొండ, కేసముద్రం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపై పాకాల వాగు బ్రిడ్జికి సమీపంలో పెద్దమర్రి ఉంది. వాగుకు రెండు వైపులా పంటపొలాలు సాగవుతున్నాయి. నిత్యం రైతులు దుక్కులు దున్నిన తరువాత పశువులను వాగు నీటితో శుభ్రం చేస్తారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగిన విషయం తెలిసిందే. ఆ నీటిలో కొట్టుకు వచ్చిన మొసలి గూడూరు సమీపంలోని నీటి గుంతలలో సంచరిస్తోంది. రెండు మూడు రోజులుగా పెద్దమర్రి ప్రాంతంలో నీరు తాగడానికి వెళ్లిన గేదెలు, పశువులను చంపడానికి యత్నించగా అవి బెదిరి బయటికి వచ్చాయి. ఈ ఘటనను చూసిన ఓ రైతు మొసలిగా గుర్తించాడు. ఎవరూ నీటిలో దిగొద్దని సహచర రైతులకు తెలిపారు. -
వామ్మో.. రోడ్లపైకి మొసళ్లు..!
మహబూబ్‌నగర్: మండలంలోని గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు అనుబంధంగా ఉన్న చెరువులు, కుంటల నుంచి రాత్రిళ్లు మొసళ్లు రోడ్లపైకి వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గోవర్ధనగిరి గ్రామ కత్వా, కామదేనుపల్లి ఊరకుంట సమీపంలో రాత్రి వేళల్లో తరుచూ సంచరిస్తూ రోడ్డుపైనే వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురై కిందపడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదని గోవర్ధనగిరి, గోపల్‌దిన్నె, వీపనగండ్ల, రంగవరం గ్రామాల రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్లపైకి రాకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
తల్లిదండ్రుల ఎదుటే బాలుడిని తిన్న మొసలి.. కర్రలతో కొట్టి..
బిహార్: బాలున్ని మొసలి తినేసిందనే కోపంతో కుటుంబ సభ్యులు ఆ మొసలిని కొట్టి చంపారు. ఈ ఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలో జరిగింది. రాఘవాపుర్ దియారా గ్రామానికి చెందిన అంకిత్ కుమార్(14) ఐదవ తరగతి చదువుతున్నాడు. కొత్త బైక్ కొన్న సందర్భంగా బాలుడు బైక్‌కు పూజ చేయించాలనుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి గంగా నది వద్దకు చేరారు. నీటి కోసం నదిలోకి దిగగా.. మొసలి నోట చిక్కాడు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే బాలున్ని మొసలి తినేసింది. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు బాలున్ని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి మొసలిని నది నుంచి బయటకు లాగారు. అనంతరం దాన్ని తాళ్లతో కట్టి, కర్రలతో కొట్టి చంపారు. 'కొత్త బైక్ కొన్నాము.పూజ చేయించడానికి గంగాజలం కోసం నది వద్దకు వెళ్లాము. అక్కడ మొసలి అంకిత్‌ను పట్టి నీళ్లలోకి లాక్కెళ్లింది. బాలున్ని రక్షించే ప్రయత్నం చేశాము.. కానీ కొన్ని శరీర భాగాలు మాత్రమే లభించాయి. ఆ మొసలిని బయటకు లాగి చంపేశాము'అని అంకిత్ తాతయ్య చెప్పారు. ఇదీ చదవండి:సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను చెట్టుకు కట్టేసి..ఆ తర్వాత -
విషాదం.. నదిలో మొసలి దాడిలో భక్తులు మృతి!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నది దాటుతున్న భక్తులపై నీటిలో ఉన్న మొసలి దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు వ్యక్తులు నదిలో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎనిమిది మంది భక్తులు రాజస్థాన్‌లోని కైలా దేవీ ఆలయానికి వెళ్లి మొక్కలు చెల్లించుకునేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో శివపురి జిల్లాలోని చిలవాడ్ గ్రామంలో ఉన్న చంబల్ నది వద్దకు చేరుకున్నారు. అయితే, వారు అక్కడికి వెళ్లిన సమయానికి నది దాటేందుకు వంతెన, పడవ అందుబాటులో లేకపోవడంతో వారు చంబల్ నదిని దాటేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారంతా ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నదిలోకి దిగి గట్టు దాటేందుకు ముందుకు సాగారు. ఇంతలో అక్కడే నాచులో నక్కి ఉన్న మొసలి ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. దీంతో, వారంతా భయంతో నదిలో ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సయమంలో నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. స్థానికంగా ఉన్న వారు మొసలి దాడిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్.. ఎనిమిది మందిలో ముగ్గురు మృతదేహాలను వెలికి తీసింది. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే, వారిలో మొసలి ఎంత మందిని పొట్టనపెట్టుకుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతయ్యారు. -
Viral Video: చిరుతపై మొసలి బీకర దాడి
-
తల్లిదండ్రుల కళ్ల ముందే తల తెగిపడింది! అంతలోనే..
శాన్ జోస్: అభం శుభం తెలియని ఓ చిన్నారి.. జలరాకాసి నోట చిక్కి దారుణ స్థితిలో ప్రాణం కోల్పోయాడు. అదీ అంతా చూస్తుండగానే!. కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ ఘోరాన్ని చూస్తూ ఉండిపోయి.. కడసారి చూపు కోసం బిడ్డ శవం కూడా దొరక్క తల్లడిల్లిపోయారు ఆ తల్లిదండ్రులు. అయితే తాజాగా ఈ విషాదంలో మరో పరిణామం చోటు చేసుకుంది. కోస్టారికా లిమన్ నగరంలో నెల కిందట ఘోరం జరిగింది. బటినా నది దగ్గర కుటుంబం, బంధువులతో పాటు చేపల వేటకు వెళ్లిన ఓ చిన్నారిని.. 12 అడుగుల భారీ మొసలి నోటి కర్చుకుని నీళ్లలోకి లాక్కెల్లే యత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ఆ చిన్నారి తల తెగిపడడంతో.. అక్కడున్నవాళ్లంతా షాక్‌తో కేకలు వేశారు. తలతో పాటు అక్కడి నుంచి నీళ్లలోకి వెళ్లిపోయింది ఆ మొసలి. అక్కడున్నవాళ్లంతా ఆ పరిణామం నుంచి తేరుకునేలోపే.. నిమిషాల వ్యవధిలో మళ్లీ వెనక్కి వచ్చిన మొసలి.. ఈసారి బాలుడి మొండెంను లాక్కెల్లింది. ఈ హఠాత్ పరిణామంతో ఆ పేరెంట్స్ రోదనలు మిన్నంటయ్యాయి. స్థానిక అధికారులు బాలుడి శరీరాన్ని రికవరీ చేసే యత్నం చేసి.. విఫలం అయ్యారు. బాధితుడిని ఎనిమిదేళ్ల జూలియో ఒటేరియో ఫెర్నాండేజ్గా గుర్తించారు. అక్టోబర్ 30వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఇది జరిగి దాదాపు నెల తర్వాత.. మొన్న శనివారం మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఓ వేటగాడు ఒటినా నదిలో పశువుల మీద దాడికి వచ్చిన ఓ మొసలిని కాల్చి చంపాడు. స్థానికులు దానిని ఒడ్డుకు లాక్కొచ్చి పొట్ట చీల్చి చూడగా.. కడుపులో మనిషి జుట్టుతో పాటు ఎముకల శకలాలు బయటపడ్డాయి. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా.. అవి ఎనిమిదేళ్ల చిన్నారి జూలియోకు చెందినవే అని తేల్చారు. దీంతో ఆ మృత శకలాలను జూలియో తల్లిదండ్రులకు అప్పగించారు. ‘‘ఆరోజు మధ్యాహ్న సమయంలో మోకాళ్ల నీతులో జూలియో ఉన్నాడు. కాస్త దూరంలో అతని అన్నదమ్ములు, ఇతర బంధువులు ఉన్నారు. చూస్తుండగానే ఓ మొసలి వచ్చి వాడ్ని లాక్కెళ్లింది. తల తెగి పడడంతో తల్లి మార్గిని ఫ్లోరెస్ కుప్పకూలిపోయింది. మళ్లీ నీటి నుంచి బయటకు వచ్చిన మొసలి మొండెం భాగాన్ని తీసుకెళ్లింది. అక్కడ ఉన్న గుహల్లోకి వెళ్లిపోయింది. అక్కడ చాలా మొసళ్లు ఉన్నాయి. అందుకే శవాన్ని రికవరీ చేయలేకపోయాం’’ అని అధికారులు వెల్లడించారు. మొసళ్ల జోన్‌గా ఆ ప్రాంతంలో చేపల వేటను నిషేధించినప్పటికీ.. కొంత మంది జాలర్ల అక్రమ వేటతో అక్కడున్న వార్నింగ్ ఫెన్సింగ్‌లు తొలగించారని, దీంతోనే చిన్నారి ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇదీ చదవండి: లవర్‌పై అనుమానంతో ఏకంగా.. -
వైరల్ వీడియో : జూ కీపర్‌పై దాడి చేసిన మొసలి
-
జూ కీపర్‌పై దాడి చేసిన భారీ మొసలి.. భయంకర దృశ్యాలు వైరల్
జంతువులతో జోక్స్ చేయడం మంచిది కాదు. చిన్నవైనా, పెద్దవైనా వాటితో సాహసాలు చేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉంటుంది. జంతువులని ఎంత మచ్చిక చేసుకున్నప్పటికీ ప్రతిసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అనేక సార్లు అవి మనుషులకు హాని కలిగించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి భయంకర ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. వైల్డ్ లైఫ్ పార్క్‌లోని ఉద్యోగిపై ఓ భారీ మొసలి అనూహ్యంగా దాడి చేసింది. దీనిని వైల్డ్ హార్ట్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ ఫేస్బుక్లో పోస్టు చేసింది. క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లోని క్రొకోడైల్ క్రీక్ ఫామ్‌లో సెప్టెంబర్ 10న ఈ భయానక సంఘటన జరిగింది. జూకీపర్ సీన్ లే క్లస్ రెండు మొసళ్లతో లైవ్ షో నిర్వహిస్తున్నారు. ఇందులో హన్నిబల్ అనే 16 అడుగుల పొడవైన, 660 కేజీల బరువుండే పెద్ద మొసలి ఉంది. దాని పక్కనే మరో ఆడ మొసలి కూడా ఉంది. క్లస్ గత 30 సంవత్సరాలుగా ఈ భారీ మొసలి బాగోగులు చూసుకుంటున్నాడు. చదవండి: ఇలా కూడా ఉద్యోగాన్ని రిజెక్ట్ చేస్తారా!.. చైనా కంపెనీపై మండుతున్న నెటిజన్లు షోలో భాగంగా జూ కీపర్ ‘ఈ ఆఫ్రికా మొత్తంలో దీనిపై మాత్రమే నేను ఇలా కూర్చోగలను’ అంటూ మొసలి వీపుపై కూర్చున్నాడు. వెంటనే దాని నుంచి దిగి పక్కకు వెళ్తున్న అతనిపై ఆ మొసలి ఒక్కసారిగా ఎదురు తిరిగింది. తన పదునైన పళ్లతో ఆయన తొడను గట్టిగా పట్టేసి విసిరి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని జూ నిర్వాహకులు అంటున్నారు. జూ కీపర్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా నిర్వాహకులు తెలిపారు. కాగా క్రూర జంతువులతో ఇలాంటి సాహసాలు చేయడం మంచిది కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
నీ ఆయువు గట్టిది కాబట్టే తప్పించుకున్నావ్!
బ్రస్సీలియా: సాధారణంగా చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లగానే నీటిని చూసి సంబరపడిపోతుంటారు. నీటిలో దిగి స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడతారు. అయితే, ఇలాంటి సమయాల్లో ఒక్కొసారి షాకింగ్ సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బ్రెజిల్‌లోని క్యాంపో గ్రాండెలోని లాగో డో అమోర్ సరస్సులో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మిస్టర్ కెటానో అనే వ్యక్తి.. గత శనివారం(అక్టోబరు 23)న సాయంత్రం సరదాగా అమోర్ సరస్సులో స్విమ్మింగ్ చేయడానికి దిగాడు. అతగాడు.. స్విమ్ చేస్తూ నిషేధిత ప్రదేశం దాటి నీటిలోపలికి వెళ్లిపోయాడు. కాగా, విల్యాన్ కెటనో అనే మరో వ్యక్తి గట్టుపై నుంచి సరస్సును వీడియో తీస్తున్నాడు. సరస్సులో ఒక వ్యక్తి నిషేధిత ప్రాంతంను దాటి లోపలికి వెళ్లడంను గమనించాడు. అతడిని కదలికలను వీడియో తీస్తున్నాడు. ఆ సరస్సు మొసళ్లకు ప్రసిద్ధి. అక్కడ.. చాలా మొసళ్లు ఉన్నాయి. అందులో ఒక మొసలి.. మిస్టర్ కెటానోవైపు వేగంగా వచ్చి దాడిచేసింది. నీటిలో ఏదో అలజడి రావడంతో వెంటనే వెనక్కు చూశాడు. ఒక మొసలి తన వైపుకు వేగంగా రావడాన్ని గమనించాడు. అతను కూడా.. వేగంగా స్విమ్మింగ్ చేస్తూ సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. అప్పటికి అతని చేతికి, శరీర భాగాలను మొసలి గాయపర్చింది. వెంటనే మిస్టర్ కెటానోను.. స్థానికులు మొబైల్ ఎమర్జెన్సీ అంబూలెన్స్కి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మిస్టర్ కెటానో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వెంట్రుక వాసిలో తప్పించుకున్నావు..’, ‘నీ ఆయువు గట్టిదే..’ ‘వామ్మొ... ఎంత భయంకరంగా ఉందో? అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: మందు.. సోడా.. మంచింగ్.. ఆ కోతే వేరబ్బా! -
చూస్తుండగానే రైతును నీళ్లల్లోకి లాక్కెళ్లిన మొసలి
సాక్షి, సంగారెడ్డి: మొసలి దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేట-కోడూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో ఈ ఘటన జరిగింది. ఇసోజిపేట గ్రామానికి చెందిన గొల్ల రాములు (45) మంజీరా నదిలోకి దిగి గేదెలను కడుగుతుండగా ఒక్కసారిగా మొసలి అతనిపై దాడి చేసింది. ఆ సమయంలో ఒడ్డుపై ఉన్న మరికొంత మంది రైతులు గట్టి అరుస్తూ కర్రలతో మొసలిపై దాడి చేసే యత్నం చేయగా విఫలమయ్యారు. వారంతా చూస్తుండగానే మొసలి రాములును నీటిలోకి లాక్కెళ్లింది. కొద్దిసేపటికి నీళ్లలో వెతగ్గా రాములు మృతదేహం లభించింది. చదవండి: పోలీస్‌స్టేషన్‌లో షణ్ముఖ్ రచ్చరచ్చ యాంకర్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి... -
మొసలితో పోరాడి.. చెల్లెల్ని కాపాడుకున్నాడు!
మొసలిని చూడగానే ఎలాంటి వారైనా భయపడి పరుగులు తీస్తారు. అదే చిన్నపిల్లల గురించైతే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. అటువైపునకు వెళ్లడానికే జంకుతారు. కానీ ఓ బాలుడు మాత్రం అత్యంత సాహసోపేతంగా మొసలిని భయపెట్టి అందరిచేత ఔరా! అనిపించుకుంటున్నాడు. వివరాలు ఫిలిప్పైన్‌కు చెందిన హసీం(15) అనే బాలుడు తన చెల్లెలు హైనా లిసా జొసీ హబి(12)తో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో వారు బాంబో వంతెనను దాటవలసి వచ్చింది. అయితే మొదట హసీం వంతెన దాటి ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడి వెనకాలే వస్తున్న హైనా కూడా వంతెన దాటే క్రమంలో ఒక్కసారిగా కిందకు జారిపోయింది. ఇంతలో ఓ మొసలి హైనా కాలును పట్టుకుని నదిలోకి లాగుతుండటం గమనించిన హసీం.. వెంటనే వంతెన మీద నుంచి ముసలిపై రాళ్లు విసిరి తన చెల్లెలిని రక్షించాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న స్థానికులు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ ఘటన గురించి హైనా మాట్లాడుతూ.. తను వంతెన దాటుతున్నప్పుడు ఏదో తన కాలును పట్టుకుని కిందకి లాగినట్లు అనిపించడంతో వంతెనను పట్టుకున్నాడని చెప్పింది. మొసలి తన కాలును దవడలతో పట్టుకోవండంతో భయంతో బిగ్గరగా అరిచానని, వెంటనే తన సోదరుడు వచ్చి మొసలిని రాళ్లతో కొట్టి.. పైకి లాగాడని తెలిపింది. ఈ సందర్భంగా ‘అన్నయ్య నా ప్రాణాలను కాపాడాడు ఐ లవ్ హిమ్ సో మచ్’ అంటూ సోదరుడిపై ప్రేమ కురిపించింది. కాగా ఈ ఘటనలో హైనా కాలు లోపలికి మొసలి పళ్లు దిగి గాయమైంది. దీంతో బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. -
స్విమ్మింగ్ చేద్దామనుకుంటే.. క్షణాల్లో..
గాంధీనగర్ : సరదాగా ఈత కొడదామని స్నేహితులతో కలిసి చెరువుకు వెళ్లిన బాలుడికి భయానక అనుభవం ఎదురైంది. మొసలి నోటికి చిక్కిన అతడు స్నేహితుల సహాయంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని గుంభకరి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. సందీప్ కమలేష్(14) అనే బాలుడు స్నేహితులతో కలసి సోమవారం చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో వారంతా కలిసి సరదాగా ఈత కొట్టాలనుకున్నారు. అయితే నీళ్లలోకి దిగిన వెంటనే ఓ మొసలి అతడిపై దాడి చేసింది. క్షణాల్లో అతడి కుడి కాలును నోట కరచుకుని నీళ్లల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో భయంతో అతడు కేకలు వేయడంతో.. తోటి పిల్లలంతా పెద్ద పెద్ద రాళ్లు తీసుకువచ్చి మొసలిపై విసిరారు. మరికొంత మంది సందీప్ చేతులు పట్టుకుని బయటికి లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాసేపు పెనుగులాట తర్వాత మొసలి సందీప్‌ను విడిచిపెట్టింది. కాగా సందీప్ ప్రమాదంలో చిక్కుకున్న వెంటనే అతడి స్నేహితులు అంబులెన్సుకు ఫోన్ చేయగా.. వెనువెంటనే అతడిని ఆస్పత్రికి తరలించడం సులువైంది. ప్రస్తుతం అతడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో సందీప్ కుడి కాలులోని ఎముకలు పూర్తిగా విరిగాయని, మోకాలు కూడా పూర్తిగా పాడైపోయిందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇక తోటి పిల్లలు సమయస్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడని.. అతడి స్నేహితులను వైద్యులు అభినందించారు. భయంతో పారిపోకుండా తన కొడుకు ప్రాణాలు కాపాడారంటూ సందీప్ తండ్రి కూడా వారికి ధన్యవాదాలు తెలిపాడు. -
రాత్రివేళ బీచ్‌లో స్నానం చేస్తుండగా..
ఆస్ట్రేలియా: బీచ్‌లో స్నానానికి వెళ్లిన ఇద్దరు మహిళల్లో ఒక మహిళపై మొసలి దాడి చేసింది. అమాంతం ఆమె పిక్కను పట్టి లోపలికి ఈడ్చుకెళ్లింది. తన స్నేహితురాలిని రక్షించేందుకు ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ మొసలి బలం ముందు నిలవలేకపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ సౌత్ వేల్స్ లోని లిత్గో అనే ప్రాంతానికి చెందిన 47 మహిళ, ఆమె స్నేహితురాలు కలిసి క్వీన్స్ లాండ్ రాష్ట్రంలోని డెయిన్ ట్రీ నేషనల్ పార్క్ వద్ద ఉన్న థోర్న్టన్ బీచ్ వద్ద ఆదివారం రాత్రి స్నానం చేసేందుకు వెళ్లారు. నడుం లోతు వరకు ఉన్న నీళ్ల వద్దకు వెళ్లి స్నానం చేస్తున్నారు. ఆ సమయంలోనే ఒక ముసలి దాడి చేసింది. అందులో ఒక మహిళను గట్టిగా నోట కరిచి లోపలికి ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంతో తన స్నేహితురాలిని రక్షించేందుకు ప్రయత్నించినా ఆమెను కూడా ముసలి గాయపరిచింది. ముసలి ఈడ్చుకెళ్లిన మహిళ కోసం అక్కడ రెస్క్యూ టీం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. దీంతో సోమవారం మరోసారి గాలింపు చర్యలు ప్రారంభించారు.