Crocodile Killed Teen Pulled Out Of Water Beaten To Death In Bihar, Goes Viral - Sakshi
Sakshi News home page

Bihar: తల్లిదండ్రుల ఎదుటే బాలుడిని తిన్న మొసలి.. కర్రలతో కొట్టి..

Published Wed, Jun 14 2023 10:52 AM | Last Updated on Wed, Jun 14 2023 11:45 AM

Crocodile Killed Teen Pulled Out Of Water Beaten To Death In Bihar - Sakshi

బిహార్‌: బాలున్ని మొసలి తినేసిందనే కోపంతో కుటుంబ సభ్యులు ఆ మొసలిని కొట్టి చంపారు. ఈ ఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలో జరిగింది. రాఘవాపుర్ దియారా గ్రామానికి చెందిన అంకిత్ కుమార్(14) ఐదవ తరగతి చదువుతున్నాడు. కొత్త బైక్‌ కొన్న సందర్భంగా బాలుడు బైక్‌కు పూజ చేయించాలనుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి గంగా నది వద్దకు చేరారు. నీటి కోసం నదిలోకి దిగగా.. మొసలి నోట చిక్కాడు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే బాలున్ని మొసలి తినేసింది. 

అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు బాలున్ని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి మొసలిని నది నుంచి బయటకు లాగారు. అనంతరం దాన్ని తాళ్లతో కట్టి, కర్రలతో కొట్టి చంపారు. 

'కొత్త బైక్ కొన్నాము.పూజ చేయించడానికి గంగాజలం కోసం నది వద్దకు వెళ్లాము. అక్కడ మొసలి అంకిత్‌ను పట్టి నీళ్లలోకి లాక్కెళ్లింది. బాలున్ని రక్షించే ప్రయత్నం చేశాము.. కానీ కొన్ని శరీర భాగాలు మాత్రమే లభించాయి. ఆ మొసలిని బయటకు లాగి చంపేశాము'అని అంకిత్ తాతయ్య చెప్పారు.

ఇదీ చదవండి:సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను చెట్టుకు కట్టేసి..ఆ తర్వాత    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement