beaten to death
-
బాలికను వేధించాడని.. రైల్వే ఉద్యోగిపై ప్రయాణికుల దాష్టీకం
న్యూఢిల్లీ: రైలులో మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. ఈ ఘటన హమ్సఫర్ఎక్స్ప్రెస్ రైలులో గురువారం వెలుగుచూసింది. వివరాలు.. బిహార్‌లోని సివాన్కుచెందిన కుటుంబం బుధవారం న్యూఢిల్లీకి వెళ్తున్న హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలులోని థర్డ్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు.అయితే రాత్రి 11.30 గంటలల సమయంలో సమయంలో అయితే అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ .. కుటుంబంలోని 11 ఏళ్ల భాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడు. తర్వాత బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా.. చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడుమహిళ వాష్‌రూమ్ నుంచి తిరిగి రాగానే, బాలిక తల్లి వద్దకు పరిగెత్తి, ఆమెను పట్టుకొని ఏడవడం ప్రారంభించింది. తల్లిని వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్‌లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. రైలు లక్నోలోని ఐష్బాగ్ జంక్షన్‌కు చేరుకోవడంతోదీంతో అతడ్ని ఆ కోచ్ డోర్ వద్దకు తీసుకెళ్లారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కదులుతున్న రైలులోనే గంటన్నరపాటు నిందితుడిని కొట్టారు.అనంతరం రైలు ఉదయం 4.35 నిమిషాలకు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సెంట్రల్ చేరుకోగా.. నిందితుడుని రైల్వే పోలీసు అధికారులు అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిని ప్రశాంత్ కుమార్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిది బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని సమస్త్‌పూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.అయితే బాలిక కుటుంబం, ఇతర ప్రయాణికులు కుట్రతో ప్రశాంత్ కుమార్‌ను హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుక్కపిల్లను కొట్టిచంపాడు
భోపాల్: అటుఇటు తిరుగుతూ తన వద్దకు వచి్చన కుక్కపిల్లను ఓ వ్యక్తి అత్యంత నిర్దయగా నేలకేసి కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన ఈ దారుణం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. వీడియో వైరల్‌గా మారడంతో వేలాది మంది.. ఆ వ్యక్తి కర్యశ చర్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లడంతో అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారు. కఠిన శిక్ష పడేలాచూస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం గుణ జిల్లాలోని సుభాష్ కాలనీలో జరిగిన ఈ దారుణ ఘటన తాలూకు వీడియో చూసిన వారంతా వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలంటూ పోస్టులు పెట్టారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి ఆరుబయట కూర్చోగా అక్కడికి రెండు బుల్లి కుక్కపిల్లలు తిండి కోసం తచ్చాడుతూ వచ్చాయి. వాటిల్లో ఒకటి ఇతడి సమీపానికి రాగానే వెంటనే ఆగ్రహంతో కుక్క పిల్లను ఎత్తిపట్టుకుని నేలకేసి బలంగా కొట్టాడు. అక్కడి నుంచి లేచి వచ్చి దానిని కుడికాలితో పలుమార్లు తొక్కిచంపాడు. ఈ హృదయవిదారక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ‘‘ఇది నా హృదయాన్ని కలిచివేసింది. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చౌహాన్ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
ఐదేళ్ల బాలుడిపై అమానుషం.. ఎత్తి నేలకేసి కొట్టి..
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో ఘోర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. యూపీలో తీర్ధయాత్రకు వచ్చిన ఓ యాత్రికుడు ఆదమరచి ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల బాలుడిని పట్టపగలు అందరూ చూస్తుండగా అదేపనిగా ఎత్తి బలంగా నేలకేసి కొట్టాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటిబయటకు రావడంతో నెటిజన్లు, పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తీర్ధ యాత్రికుడు ఓంప్రకాష్(54) అనేక మార్లు నేలకేసి కొట్టాడని.. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు ఆ వ్యక్తిని పట్టుకుని దేహ శుద్ధి చేసి తమకు అప్పగించినట్లు తెలిపారు. స్థానికులు ఆ వ్యక్తిని చితకొట్టడంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడని అతడిని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నిందితుడు స్పృహలోకి వస్తే తప్ప బాలుడిని ఎందుకు చంపాడన్న కారణాలు తెలియవని అన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యాత్రికుడు సప్తకోసి యాత్ర నిమిత్తం అక్కడికి వచ్చాడని బాలుడిని ఎందుకలా కొట్టి చంపాడన్న కారణాలు మాత్రం తెలియడం లేదని అన్నారు. చనిపోయిన బాలుడి తండ్రి అక్కడే ఒక జనరల్ స్టోర్స్ నడుపుతూ ఉంటాడని తెలిపారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి ఇది కూడా చదవండి: 'వండర్లా'లో అపశ్రుతి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి.. -
తల్లిదండ్రుల ఎదుటే బాలుడిని తిన్న మొసలి.. కర్రలతో కొట్టి..
బిహార్: బాలున్ని మొసలి తినేసిందనే కోపంతో కుటుంబ సభ్యులు ఆ మొసలిని కొట్టి చంపారు. ఈ ఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలో జరిగింది. రాఘవాపుర్ దియారా గ్రామానికి చెందిన అంకిత్ కుమార్(14) ఐదవ తరగతి చదువుతున్నాడు. కొత్త బైక్ కొన్న సందర్భంగా బాలుడు బైక్‌కు పూజ చేయించాలనుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి గంగా నది వద్దకు చేరారు. నీటి కోసం నదిలోకి దిగగా.. మొసలి నోట చిక్కాడు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే బాలున్ని మొసలి తినేసింది. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు బాలున్ని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి మొసలిని నది నుంచి బయటకు లాగారు. అనంతరం దాన్ని తాళ్లతో కట్టి, కర్రలతో కొట్టి చంపారు. 'కొత్త బైక్ కొన్నాము.పూజ చేయించడానికి గంగాజలం కోసం నది వద్దకు వెళ్లాము. అక్కడ మొసలి అంకిత్‌ను పట్టి నీళ్లలోకి లాక్కెళ్లింది. బాలున్ని రక్షించే ప్రయత్నం చేశాము.. కానీ కొన్ని శరీర భాగాలు మాత్రమే లభించాయి. ఆ మొసలిని బయటకు లాగి చంపేశాము'అని అంకిత్ తాతయ్య చెప్పారు. ఇదీ చదవండి:సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను చెట్టుకు కట్టేసి..ఆ తర్వాత -
దారుణం.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని..
బెంగళూరు: అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడ్ని దారుణం హత్య చేశారు నలుగురు వ్యక్తులు. కర్రతో కొట్టి అతడ్ని హతమార్చారు. కర్ణాటక బెంగళూరులో ఈ పాశవిక ఘటన వెలుగుచూసింది. మృతుడి పేరు గోవిందరాజు. కొద్దిరోజులుగా ఓ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన అనిల్ అనే వ్యక్తి అతనిపై కక్ష పెంచుకున్నాడు. పథకం పన్ని అతడ్ని ఇంట్లో నుంచి బయటకు పిలిపించాడు. బైక్‌పై అంద్రల్లి తీసుకెళ్లాడు. అనంతరం లోహిత్, భరత్, కిశోర్ కూడా అంద్రల్లి వెళ్లారు. నలుగురు కలిసి గోవిందరాజుపై విచక్షణా రహితంగా కర్రతలో దాడి చేశారు. అతడ్ని చావబాదారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం గోవిందరాజు మృతదేహాన్ని లోహిత్ కారులో దాచారు. తర్వాత తీసుకెళ్లి ఛార్ముడిఘాట్ ప్రాంతంలో పడేశారు. సెల్ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు. అయితే గోవిందరాజు కన్పించడం లేదని అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్లు నేరం అంగీకరించారు. వారు చెప్పిన వివరాలతో గోవిందరాజు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు -
సంబంధంలేని గొడవలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు
సాక్షి, హైదరాబాద్: గొడవతో సంబంధం లేదు... గొడవ పడుతున్న వారితోనూ ఎటువంటి స్నేహం లేదు.. స్నేహితుడి ఇంటి వద్ద దించేందుకని వచ్చిన యువకుడు సంబంధం లేని తగాదాలోకి వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకున్న విషాదకర సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఇన్చార్జి సీఐ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. జిల్లెలగూడ బాలాజీకాలనీలో అద్దెకు ఉండే మణికంఠ తన స్నేహితులైన నరేందర్, నవీన్, సాయికుమార్, జైపాల్‌తో కలిసి శ్రీశైలం వెళ్లి ఆదివారం రాత్రి 11 గంటలకు కర్మన్‌ఘాట్ గ్రీన్‌పార్కు కాలనీకి వచ్చి ప్రవీణ్, భార్గవ (21)లతో కలిసి నిర్మానుష్య ప్రదేశంలో అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. ఆ తర్వాత మణికంఠ తనను ఇంటి వద్ద దించేందుకు టీకేఆర్ కమాన్ వద్ద నివాసముండే మరో స్నేహితుడు శరత్‌కు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. దీంతో శరత్ తన ద్విచక్ర వాహనంపై మణికంఠను తీసుకుని బాలాజీకాలనీలోని ఇంటికి వచ్చి తలుపు ఎంత కొట్టినా మణికంఠ తల్లి సంధ్యారాణి తలుపు తీయలేదు. ఇద్దరి సెల్ఫోన్లలో బ్యాలెన్స్ లేకపోవడంతో అదే వీధిలో నివాసముండే రమాదేవి తన మనువరాలి తొట్టెల శుభకార్యం (21వరోజు) చేసుకుంటున్నారు. దీంతో మణికంఠ, శరత్‌లు అక్కడికి వెళ్లి మా అమ్మపేరు సంధ్యారాణి.. తలుపు ఎంతకూ తీయడం లేదు. మా సెల్ఫోన్లలో బ్యాలెన్స్ అయిపోయిందని ఫోన్ ఇస్తే కాల్ చేసుకుంటామని రమాదేవిని అడిగారు. దీంతో రమాదేవి బంధువు అయిన మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రూపేష్‌కుమార్ ఈ అర్ధరాత్రి వేళ వచ్చి సెల్‌ఫోన్ అడుగుతున్నారు ఎందుకని ప్రశ్నించాడు. శరత్, రూపేష్ కుమార్ల మధ్య మాటమాట పెరిగి వాగ్వివాదం జరగడంతో అందరూ కలిసి కావాలనే అల్లరి చేస్తున్నారని శరత్, మణికంఠను కొట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. చదవండ: వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్ ఇరువర్గాల మధ్య ఘర్షణతో.. అనంతరం ఇద్దరు కలిసి చందన చెరువు కట్ట వద్దకు వెళ్లి అక్కడే జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వారి వద్ద నుంచి.. శరత్ సెల్‌ఫోన్ తీసుకుని బాలాపూర్ సాయినగర్‌కు చెందిన నరేందర్‌కు ఫోన్ చేసి తమపై దాడి చేశారని చెప్పాడు. తనను ఇంటి వద్ద దించేందుకు వెంట వచ్చిన భార్గవతో కలిసి వెంటనే నరేందర్ చెరువు కట్ట వద్దకు చేరుకున్నాడు. దీంతో పాటు శరత్ మరో స్నేహితుడైన ప్రవీణ్ ఇంటికి వెళ్లి బైక్‌పై ఎక్కించుకుని వచ్చాడు. ఐదుమంది కలిసి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో శుభకార్యం జరుగుతున్న రమాదేవి ఇంటికి వెళ్లారు. అంతా మద్యం సేవించి ఉండటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎక్సైజ్ కానిస్టేబుల్ రూపేష్‌కుమార్‌పై ఇటుకతో దాడి చేయగా బంధువులంతా కోపోద్రిక్తులై యువకులను చితకబాదారు. పారిపోతున్న క్రమంలో భార్గవ కిందపడగా తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని ఓవైసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడు భార్గవ సైదాబాద్ వాసి అని, మెడికల్ డిస్ట్రిబ్యూషన్లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తుంటాడని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి దాడికి పాల్పడిన రూపేష్‌కుమార్, రమాదేవితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ యాదయ్య పేర్కొన్నారు. -
కన్న తల్లిపై కర్కశత్వం.. పెనంతో కొట్టి చంపిన కూతురు
లక్నో: నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లిపైనే ఓ కూతురు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. తల్లి మందలించిందన్న కోపంతో 14 ఏళ్ల బాలిక ఆమెను బలంగా కొట్టి చంపింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నొయిడాలో చోటుచేసుకుంది. నోయిడాలోని శాహదరా ప్రాంతానికి చెందిన అనురాధ అనే మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయిదేళ్ల తర్వాత భర్తతో విడాకులు తీసుకొని కూతురు(14)తో కలిసి నొయిడాలోని సెక్టార్-77 అంతరిక్ష కెన్వాల్ సొసైటీలో నివసిస్తోంది. గ్రేటర్ నోయిడాలోని ఒక సంస్థలో సరఫరా విభాగంలో పని చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంట్లో గిన్నెలు శుభ్రం చేయాలని తల్లి కూతురిని కోరింది. కూతురు పనులు చేయకపోవడంతో ఆమెను తిడుతూ చేయిచేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన బాలిక పెనంతో(ఫ్రైయింగ్ పాన్) తల్లిని కొట్టింది. తలకు బలమైన గాయాలవ్వడంతో అనురాధ అనురాధ స్పృహ కోల్పోయింది. అయితే తల్లికి గాయాలవ్వడంతో బాలిక తన చుట్టుపక్కల వారిని పిలిచింది. పొరుగున ఉన్న వారు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మహిళ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కూతురు కొట్టడం ద్వారా అనురాధ చనిపోయినట్లు ఆమె తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. బాలికను కస్టడీలోకి తీసుకుని బాలనేరస్థుల కేంద్రానికి తరలించామని పోలీసులు తెలిపారు. చదవండి: ప్రేమ పెళ్లి.. కడుపులో పెరుగుతున్న బిడ్డ తనది కాదని అనడంతో.. -
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేదు.. చివరగా
బెంగుళూరు: మూఢనమ్మకం ఓ మహిళ ప్రాణాలు తీసింది. అల్లోపతి వైద్యంతో ఫలితం లేదని భూత వైద్యుడిని సంప్రదిస్తే ఆ అభాగ్యురాలి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కూతురు తెలిపిన వివరాల ప్రకారం.. గౌడరహళ్లికి చెందిన పార్వతి (37) గత రెండు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చెకప్‌లు కూడా చేయించుకుంది. అయితే, ఆమెకు అంతా బాగానే ఉందని, ఎటువంటి సమస్యలు లేవని వైద్యులు చెప్పారు. కానీ, పార్వతి తలనొప్పి మాత్రం తగ్గలేదు. చివరగా బంధువుల సూచన మేరకు డిసెంబర్ 2న ఆమెను కుటుంబ సభ్యులు మను అనే భూత వైద్యునికి వద్దకు తీసుకెళ్లారు. బెక్క గ్రామంలో నివసించే మను ఓ నిమ్మకాయ ఇచ్చి కొద్ది రోజుల తర్వాత రమ్మన్నాడు. (చదవండి: గతంలో కోవిడ్.. తాజాగా డెంగ్యూ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి) అతను చెప్పిన ప్రకారం డిసెంబర్ 7న బాధితురాలిని అక్కడకు మరోసారి తీసుకెళ్లారు. తలనొప్పిని తగ్గిస్తానని చెప్పి మను పార్వతి తలపై, ఒంటిపై కర్రతో విపరీతంగా బాదాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను చెన్నరాయపట్నంలోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: West Bengal: ఆహా ఏమి అదృష్టం! ఉదయం కొన్నాడు.. సాయంత్రానికి జాక్‌పాట్ కొట్టాడు!!) -
దారుణం: సిగరెట్లు తీసుకుని వెళ్తుండగా డబ్బులు అడిగినందుకు..
భోపాల్: తీసుకున్న సిగరెట్లకు డబ్బులు చెల్లించాలని అడిగినందుకు షాప్ నిర్వహకుడిని నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. షాడోల్ జిల్లాలోని డియోలాండ్‌లో పట్టణంలో శనివారం రాత్రి నలుగురు వ్యక్తులు (మోను ఖాన్, పంకజ్ సింగ్, విరాట్ సింగ్, సందీప్ సింగ్) అరుణ్ సోనీ అనే వ్యక్తి దుకాణంలోకి వెళ్లి సిగరెట్లు అడిగి తీసుకున్నారు. చదవండి: ఘోరం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌పై.. కజిన్ అత్యాచారం అనంతరం డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్తుండగా.. తీసుకున్న సిగరెట్లకు డబ్బులు చెల్లించాలని యాజమాని అడిగాడు. దీంతో షాప్ నిర్వహకుడితోపాటు తన ఇద్దరు కుమారులపై దాడి చేశారు. తీవ్రంగా గాయాలపాలైన సోనీని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: గొడవ ఆపాలని ప్రయత్నించిన పోలీసు ముఖంపై.. -
వివాహితతో ప్రేమ.. యువకుడిని దారుణంగా కొట్టి
జైపూర్: రాజస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహితతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడనే కారణంగా ఓ యువకుడిపై అత్యంత పాశవీకంగా దాడి చేసి.. కర్రలతో కొట్టి చంపారు కొందరు దుండగులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మరో విషాదకర అంశం ఏంటంటే బాధితుడిని హత్య చేసి.. అతడి ఇంటి ముందే పడేసి వెళ్లారు నిందితులు. ఆ వివరాలు.. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. రాజస్తాన్, హనుమాన్‌ఘఢ్ ప్రేమ్‌పురా ప్రాంతానికి చెందిన జగ్దీష్ మేఘ్వాల్ అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. దీని గురించి సదరు వివాహిత భర్తకు తెలిసింది. అతడు జగ్దీష్పై కోపం పెంచుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జగ్దీష్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న సదరు వివాహిత భర్త.. మరికొందరు తన కుటుంబ సభ్యలతో కలిసి జగ్దీష్ను కిడ్నాప్ చేశాడు. (చదవండి: ఎద్దు దాడితో నుజ్జునుజ్జైన ముఖం.. 11 నెలలు.. 3 సర్జరీలు) అనంతరం అతడిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. దారుణంగా కొట్టారు. ఈ క్రమంలో జగ్దీష్ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకువచ్చి జగ్దీష్ ఇంటి ముందు పడేసి వెళ్లారు నిందితులు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికి దొరకలేదు. (చదవండి: విషాదం: ఊపిరి పోస్తుందనుకుంటే నిలువునా ప్రాణం తీసింది) ఇక జగ్దీష్పై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మృతుడి తల్లితండ్రుల ఫిర్యాదు ఆధారంగా 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులందరినీ అరెస్ట్ చేసే వరకూ ఆందోళన చేపడతామని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు నిరసనలకు దిగారు. చదవండి: భార్య మీద అనుమానం.. 3 నెలలుగా 30కేజీల ఇనుప చైన్‌తో.. -
భూవివాదం.. యువకుడిని కొట్టి చంపిన దుండగులు
భోపాల్: భూతగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిని దుండగులు అతికిరాతకంగా కొట్టి చంపారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న దృశ్యాలు కొందరు మొబైల్లో చిత్రీకరించగా.. దీన్నీ చూసిన నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు. రఈ ఘోర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఉజ్జాయిని జిల్లాలో పశువుల మేతకు సంబంధించిన భూ వివాదంలో 26 ఏళ్ల గోవింద్ అనే యువకుడిని అయిదుగురు దుండగులు కర్రలతో దాడికి తెగబడ్డారు. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లే వరకు అతన్ని చితకబాదుతూనే ఉన్నారు. అయితే నడిరోడ్డుమీదే ఇంత దారుణం జరుగుతున్నా ఎవరూ ఆపకపోవడం బాధకరం ఈ దృశ్యాలన్నీ మొబైల్లో రికార్డయ్యాయి. ఇందులో గోవింద్ రోడ్డు మీద పడుకున్నట్లు చూపిస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. వారిలో ఒకరు అతని భుజాలు పట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నిస్తుండగా అతను కదలటం లేదు. తీవ్రంగా కొట్టి, తన్నిన అనంతరం అతన్ని బైక్‌పై తీసుకుళ్లి వాళ్ల ఇంటి ముందు పడేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ ఇండోర్‌లోని మరో పెద్ద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కాగా గోవింద్‌కు పశువుల పెంపకం, మేత కోసం భూమి విషయంలో కొంతమందితో చాలాకాలంగా వివాదంలో ఉన్నాడు. ఈ విషయంపై కూర్చొని సమస్యను పరిష్కరించుకుందామని నిందితుల్లో గోవింద్‌ను తన ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారని గోవింద్ స్నేహితుడు సూరజ్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుల్లోని అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అనుమానంతో ఓ వ్యక్తిపై 10 మంది దాడి..మృతి తల్లిదండ్రులను మత్తులోకి పంపించి.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే.. -
దారుణం: పోలీసుల దెబ్బలకు బాలుడి మృతి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవో జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్ నిబంధనలు అత్రికమించడనే కారణంతో పోలీసులు కొట్టిన దెబ్బలకు 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు బాలుడి మృతికి కారణమైన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఒక హోంగార్డును విధుల నుంచి తొలగించారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మే 24 ఉదయం 7 గంటల వరకు రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూను విధించింది. ఈ క్రమంలో బంగర్మౌ పట్టణంలో మహ్మద్ ఫైసల్ అనే 17 ఏళ్ల బాలుడు శుక్రవారం మధ్యాహ్నం 3 తరువాత కర్ఫ్యూ సమయంలో మార్కెట్లో కూరగాయలు అమ్ముడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు పోలీసు విజయ్ చౌదరి, హోంగార్డ్ సత్యప్రదేశ్ బాలుడిని తీవ్రంగా కొట్టారు. పోలీసుల దాడిలో బాధితుడు స్పృహ కోల్పోడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతని పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్యం నిమిత్తం బంగార్‌మౌలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే బాలుడు మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి ఇస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకును పోలీసులు కొట్టి చంపారని ఆరపిస్తూ ఉన్నవో పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేశాడు. అంతేగాక బాలుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతిచెందిన బాధితుడి బంధువులు, స్థానికులు నిరసన చేపట్టారు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు బాలుడి మృతికి కారణమయిన కానిస్టేబుల్ విజయ్ చౌదరిని, సస్పెండ్ చేసి హోంగార్డ్ సత్యను తొలగించామని ఉన్నవో అదనపు పోలీస సూపరింటెండెంట్ శశి శేఖర్ తెలిపారు. చదవండి: బ్యుటీషియన్‌పై అత్యాచారం.. నటి బాడీగార్డ్‌పై కేసు -
విచారణ కోసం వెళ్లిన పోలీసుని రాళ్లతో కొట్టి..
ఇస్లామాపూర్: బైక్ చోరీ కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన ఓ పోలీస్ అధికారిని కొట్టి చంపారు స్థానికులు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన అశ్వనీ కుమార్ కిషన్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్‌హౌస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఓ బైక్ చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసమని ఆయన బెంగాల్‌లోని ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాకు వెళ్లారు. నిందితుడు అక్కడి పంజిపరా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నాడని తెలిసి ఆ ప్రాంతంలో గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో గోల్ పొఖారా ప్రాంతంలోని ఓ గ్రామానికి వెళ్లగా.. సదరు గ్రామస్థులు దర్యాప్తు కోసం వచ్చిన అశ్వనీకుమార్‌పై రాళ్లు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దాడి అనంతరం పోలీసు వారు అతన్ని రక్షించేందుకు ఇస్లాంపూర్ సదర్ ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యలో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారు ఫిరోజ్ ఆలం, అబుజార్ ఆలం, సాహినూర్ ఖాటూన్‌లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని పూర్ణియా రేంజ్ ఐజీ తెలిపారు. బిహార్ పోలీసులు స్పందిస్తూ.. కేసు విచారణ నిమిత్తం బెంగాల్ వెళ్లిన అశ్వనీ కుమార్ స్థానిక పోలీసుల సహకారం కోరారు. కానీ బెంగాల్ పోలీసులు అతడి వెంట బృందాన్ని పంపడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ( చదవండి: ఉదయపు దొంగ అరెస్టు ) -
అమానుషం.. ఫ్రెండ్ తల్లిపైనే అఘాయిత్యం
రాయ్‌పూర్ : స్నేహితుడి తల్లిపైనే కన్నేసిన ఓ దుర్మార్గుడు ఆమెపై అఘాయత్యానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన మహిళ (42)ను బండ రాయి మోదీ చంపేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముండ్ జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. బాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 20 ఏళ్ల చింతామణి పటేల్ అలియాస్ చింటూ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఓ స్నేహితుడు ఉన్నాడు. బుధవారం అర్థరాత్రి దాటాక స్నేహితుడి ఇంటికి వెళ్లిన బాధితుడు.. తమ పొలంలో వరి కోసే యంత్రాన్ని చూసి వద్దామని, తోడు తీసుకెళ్లడానికి స్నేహితుడిని పిలివాల్సిందిగా కోరాడు. అయితే ఆ సమయంలో తన కొడుకు ఇంట్లో లేడని, తాను వెంట వస్తానని మహిళ పేర్కొంది. దీన్ని అవకాశంగా మరల్చుకున్న నిందితుడు పొలం నుంచి తిరిగి వచ్చే సమయంలో స్నేహితుడి తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. మహిళ ప్రతిఘటించడంతో అక్కడే ఉన్న బండరాయిని తలపై మోది అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మహిళ కేకలు విన్న కొంతమంది గ్రామస్థులు అక్కడికి చేరుకోవడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి : (దారుణం: కోడలిపై మామ అత్యాచారం, కేసు నమోదు) (పాపులర్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు) -
కత్తులతో డాల్ఫిన్‌పై దాడి, ముగ్గురు అరెస్టు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో కొందరు యువకులు ఒక డాల్ఫిన్‌ను కిరాతకంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూగజీవి అనే కనికరం లేకుండా డాల్ఫిన్ పట్ల క్రూరంగా వ్యవహరిస్తూ కత్తులు, కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ జుగుప్సాకర సన్నివేశం డిసెంబర్ 31న యూపీలోని ప్రతాప్‌ఘర్ జిల్లాలో జరిగింది. వివరాలు.. ప్రతాప్‌ఘర్ జిల్లాలోని కొతారియా గ్రామం సమీపంలో ఉన్న శారద కెనాల్‌కు కొంతమంది యువకులు చేపల వేటకు వచ్చారు. వలలో పెద్ద చేప చిక్కిందన్న సంతోషంలో ఉన్న యువకులు అదే ధోరణిలో దానిపై దాడి చేశారు. ఇదే సమయంలో మరో గుంపు కూడా అక్కడికి చేరుకొని వారికి జత కలిశారు. అయితే వారికి దొరికింది ఒక డాల్ఫిన్ అన్న విషయాన్ని గుర్తించి కూడా దానిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. కత్తులతో డాల్ఫిన్ శరీరాన్ని రెండు బాగాలు చేసి తమ పైశాచిక ఆనందాన్ని పొందారు. అనంతరం దానిని చంపి కెనాల్‌లోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.(చదవండి: ప్రెగ్నెన్సీ కోసం లడఖ్‌కు విదేశీ యువతుల క్యూ) దీనిని ఒక యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 9/51 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ యువకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. On New Year's eve, a #dolphin was brutally murdered by people in Sharda canal of Uttar Pradesh's Pratapgarh area. These are rare dolphins of the Ganges who are on the verge of extinction. Shame 😡 #SaveThePlanet #Nature #Ganga #AnimalCruelty pic.twitter.com/w3zNQbEHu5 — Karan Bhardwaj (@BornOfWeb) January 8, 2021 -
అమ్మాయితో స్నేహం నచ్చక కొట్టి చంపారు
న్యూఢిల్లీ: ఒక యువతితో స్నేహం చేసినందుకు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆమె బంధువులు కొట్టి చంపారు. ఈ నెల 7న ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ ఢిల్లీ ఆదర్శనగర్‌లో ఉంటున్న 18 ఏళ్ల వయసున్న రాహుల్ రాజ్‌పుత్ ఢిల్లీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబాన్ని పోషించడానికి చాలా మందికి ట్యూషన్లు చెబుతూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయితో స్నేహం బాగా బలపడింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి స్నేహం నచ్చక అమ్మాయి తరఫు బంధువులు రాహుల్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు నార్త్‌వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆర్య చెప్పారు. అయిదు మంది కలిసి రాహుల్‌ని తోస్తూ పక్కకి లాగడం, అతనిపై దాడికి దిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ అమ్మాయి సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. పల్లెటూరు నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని రాహుల్ పోషిస్తున్నాడని, అందరికీ సాయపడుతూ ఉండే అతని మృతి ఆ కుటుంబానికి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. దోషుల్ని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ఆమెతో స్నేహం.. యువకుడి ప్రాణాలమీదకు
న్యూఢిల్లీ: చెల్లెలితో స్నేహం చేస్తున్నాడని పగబట్టిన ఓ అన్న 18 ఏళ్ల యువకుడిపై దాడి చేసి హతమార్చాడు. ఢిల్లీలోని ఆదర్శనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ రాజ్‌పుత్ ఢిల్లీ యూనివర్సిటీలో ఓపెన్ విధానంలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాడు. వారు నివాసం ఉంటున్న ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన అమ్మాయితో గత రెండేళ్లుగా స్నేహంగా ఉంటున్నాడు. యువతి కుటుంబ సభ్యులు వారి ఫ్రెండ్షిప్పై పలుమార్లు అభ్యంతరం తెలిపారు. ఈక్రమంలోనే యువతి అన్న గత బుధవారం రాహుల్ రాజ్పుత్ని నందా రోడ్డు వద్దకు పిలిచి గొడవకు దిగాడు. తన చెల్లితో స్నేహం ఆపాలంటూ మరో ముగ్గురితో కలిసి చితకబాదాడు. అనంతరం అక్కడ నుంచి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న రాహుల్ కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. యువతి అన్న, అతని ముగ్గురు స్నేహితులను అరెస్టు చేశామని వాయువ్య ఢిల్లీ డీసీపీ విజయంత ఆర్యా పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని తెలిపారు. (చదవండి: ప్రాణాలు తీసిన ట్రయాంగిల్ లవ్‌స్టోరీ..) పోస్టుమార్టం నివేదికలో రాహుల్‌కు అంతర్గతంగా తీవ్ర గాయాలయ్యాయని తేలిందని వెల్లడించారు. రాహుల్ ప్లీహానికి చీలిక రావడంతో మరణం సంభవించిందని డాక్టర్లు చెప్పినట్టు డీసీపీ తెలిపారు. ఇది రెండు కుటుంబాల మధ్య ఘర్షణ మాత్రమేనని.. దీనిపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. కాగా, తొలుత కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేశారని రాహుల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాడి విషయం తెలియగానే.. నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తమ మాట వినిపించుకోలేదని అన్నారు. రాహుల్ ఒంటిపై చిన్న గాయమైనా లేదని కేసు నమోదు చేయలేదని చెప్పారు. తమ బిడ్డ ప్రాణాలు గాల్లో కలిసిపోయాక పోలీసులు కళ్లు తెరిచారని విమర్శించారు. (చదవండి: పూజ చేయొద్దని మహిళపై దాడి) -
20 రూపాయిల కోసం దారుణం..
న్యూఢిల్లీ: రానురాను మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి దారుణం ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. కేవలం 20 రూపాయలు ఇవ్వనందుకు ఓ వ్యక్తిని అతడి కుమారుడి కళ్ల ముందే దారుణంగా కొట్టి చంపేశారు కర్కోటకులు. వివరాలు.. రూపేష్(38) అనే వ్యక్తి ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో తన భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతం ఘోరమైన నేరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలో రూపేష్ కటింగ్ చేయించుకోవడం కోసం తన ఇంటి పక్కనే ఉన్న బార్బర్ షాప్‌కి వెళ్లాడు. యాభై రూపాయల బిల్లు అయ్యింది. రూపేష్ రూ.30 చెల్లించి మిగతా ఇరవై రూపాయలు తర్వాత ఇస్తా అన్నాడు. దాంతో ఆగ్రహించిన షాపు ఓనర్ తన సోదరుడితో కలిసి అతడిపై దాడి చేశాడు. (చదవండి: పోలీసు ఉన్నతాధికారి దారుణం : వైరల్ వీడియో) ఈ దారుణం జరిగినప్పుడు రూపేష్ కుమారుడు అక్కడే ఉన్నాడు. దాడిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ వారు ఆగలేదు. జనాలు చూస్తూ ఉన్నారు కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. చివరకు అతడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితులు సంతోష్, సరోజ్‌లను అరెస్ట్ చేశారు. -
పోలీసుల ఎదుటే కొట్టి చంపారు
లక్నో: పాఠశాల ఉపాధ్యాయుడిని కాల్చి చంపిన వ్యక్తిని సోమవారం ఉదయం గ్రామస్తులు పోలీసుల సమక్షంలో కొట్టి చంపేశారు. ఉత్తరప్రదేశ్ కుషినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో కొందరు వ్యక్తులు కర్రలతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఈ దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్న పోలీసులు గ్రామస్తులను ఆపడానికి ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. దెబ్బల దాటికి తాళలేక బాధితుడు మరణించాడు. కానీ గ్రామస్తులు మాత్రం అతడిని కొడుతూనే ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గోరఖ్‌పూర్‌కు చెందినవాడు. కొద్ది రోజుల క్రితం అతడు తన తండ్రి తుపాకీతో ఓ ఉపాధ్యాయుడిని కాల్చి చంపాడు. అందుకు ప్రతీకారంగా గ్రామస్తులు అతడిని కొట్టి చంపేశారు. (చదవండి: ఈ అవమానాన్ని భరించలేను.. అందుకే) -
మాస్క్ పెట్టుకోమన్నందుకు ప్రాణం తీశారు
బయోన్నె : బస్సులో ఎక్కిన ప్రయాణికులకు మాస్క్ పెట్టుకోవాలని సూచించిన బస్ డ్రైవర్‌ను ఇష్టం వచ్చినట్లుగా చితకబాదారు. గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. తమ మంచి కోసం చెప్పినా అర్థం చేసుకోకుండా ఒక మనిషి నిండు ప్రాణం అన్యాయంగా తీసిన ఘటన ప్రాన్స్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. 59 ఏళ్ల ఫిలిప్పే మంగీల్లాట్ వృత్తి రిత్యా బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఫ్రాన్స్‌లోని బయోన్నెకు బస్ నడుపుతుంటాడు. ఈ సందర్భంగా వారం కిందట ఫిలిప్పే నడుపుతున్న బస్సులోకి ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. అయితే ముగ్గురు మాస్కులు ధరించకపోవడంతో వెంటనే మాస్కులు ధరించాల్సిందిగా ఫిలిప్పే తెలిపాడు. మీరు మాస్కు ధరించకపోతే బస్సు ముందుకు కదలదని, ఇక్కడే దింపేస్తానని పేర్కొన్నాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు వ్యక్తులు ఫిలిప్పేపై ఇనుపరాడ్‌తో విచక్షణారహితంగా కొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఫిలిప్పేను అక్కడే వదిలేసి ఆ ముగ్గురు పరారయ్యారు.(గొంతు కోసి.. అడవిలో వదిలేసి) సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫిలిప్పేను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ విషయాన్ని అతని కుటుంబసభ్యులకు చేరవేశారు. కాగా చికిత్స పొందుతున్న ఫిలిప్పేకు తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ అయిందని డాక్ఠర్లు పేర్కొన్నారు. శుక్రవారం కుటుంబసభ్యుల అనుమతితో ఫిలప్పేకు వెంటిలేటర్ తొలగించిన కాసేపటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఫిలిప్పేపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులపై మర్డర్ కేసు కింద కేసు నమోదు చేశామని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
దారుణం.. రూ.4వేల కోసం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కేవలం నాలుగు వేల రూపాయల బిల్లు కోసం ఆస్పత్రి యాజమాన్యం ఓ రోజు కూలీని దారుణంగా కొట్టి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాలు.. అలీగఢ్‌కు చెందిన సుల్తాన్ ఖాన్(44) అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో అతడి బంధువు చమన్, సుల్తాన్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యం కోసం ఎంత ఖర్చవుతుందని చమన్ డాక్టర్లును అడిగాడు. అయితే వారు అల్ట్రాసౌండ్ స్కాన్ చేశాక చెప్తాం ముందు రూ.5 వేలు కట్టమని చెప్పారు. చమన్ అలానే చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రి వర్గాలు మరో నాలుగు వేలు చెల్లించాలని చెప్పారు. అప్పుడు చమన్ ముందే ఐదువేలు కట్టామని చెప్పడంతో అవి బెడ్ చార్జెస్ అన్నారు. దాంతో చమన్ తాము అంత డబ్బు చెల్లించలేమని.. డిశ్చార్జ్ చేయమని కోరాడు. అయితే ఆస్పత్రి యాజమాన్యం మిగతా నాలుగువేలు చెల్లిస్తేనే సుల్తాన్‌ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. దాంతో చమన్‌కి, ఆస్పత్రి సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో హస్పటల్ స్టాఫ్ సుల్తాన్‌పై కర్రలతో అమానుషంగా దాడిచేశారు. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆస్పత్రి సీసీటీవీ కెమరాలో రికార్డయ్యాయి. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశాం.. దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
విషాదం : ఆటోలో సీటు కోసం ప్రాణం తీసేశారు
-
విషాదం : ఆటోలో సీటు కోసం ప్రాణం తీసేశారు
జైపూర్ : ఆటోలో సీటు కోసం గొడవ పడి ఒక కశ్మీరీ యువకుడు తన ప్రాణం పోగొట్టుకొన్న విషాద ఘటన జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కశ్మీర్‌కు చెందిన 18 ఏళ్ల బసిత్ జైపూర్ ప్రాంతంలో క్యాటరింగ్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బసిత్ ఫిబ్రవరి 5న అర్ధరాత్రి సమయంలో తన పని ముగించుకొని రూంకు వెళ్లేందుకు కోవర్కర్లతో కలిసి బయలుదేరాడు. కొద్దిసేపటికి రూంకు వచ్చిన బసిత్‌ను గాయాలతో చూసిన అతని స్నేహితులు జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే బసిత్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆసుపత్రిలో మృతి చెందాడు. బసిత్ మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ అతని స్నేహితులు జైపూర్‌లోని హర్మదా టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి బసిత్ మృతి వెనుక గల కారణాలను 24గంటల్లోనే చేధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 'కశ్మీర్‌కు చెందిన బసిత్ జైపూర్‌లో క్యాటరింగ్ బాయ్‌గా పనిచేసేవాడు. ఎప్పటిలాగే ఫిబ్రవరి 5వ తేదీన తన పని ముగించుకొని రూంకు వెళ్లేందుకని సిద్ధమయ్యాడు. ఇంతలో అతనితో పాటు పనిచేసే కోవర్కర్లు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో అక్కడికి ఒక ఆటో రావడంతో బసిత్ ఆటో ఎక్కేందుకు ప్రయత్నించగా అతన్ని నెట్టివేసి మిగతావారు కూర్చున్నారు. ఆటోను నేను ఆపితే మీరు ఎక్కడమేంటని, పైగా నాకు సీటు ఇవ్వకుండా తోసేస్తారా అని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు బసిత్‌ను తీవ్రంగా కొట్టి కింద పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. తర్వాత కాసేపటికి బసిత్ తన రూంకు వచ్చి తన స్నేహితులకు విషయం చెప్పి సృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రికి తరలించారని, కానీ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడని' స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు.ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఇద్దరు నిందితుల్లో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, అతని పేరు ఆదిత్య అని, స్వస్థలం ఢిల్లీ అని పోలీసులు తెలిపారు. కాగా మరొకరి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. బసిత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అతని బంధువులకు అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
ముగ్గుర్ని చిదిమేసిన కారు : డ్రైవర్‌ను కొట్టి చంపిన జనం
సాక్షి, పట్నా: బీహార్‌లోని పట్నాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తు, అతివేగం ముగ్గురు చిన్నారుల ఉసురు తీయగా, గ్రామస్తుల ఆగ్రహం, ఆవేశం డ్రైవర్ చావుకు కారణమైంది. అగం కువాన్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న నలుగురు పిల్లలపై ఒక కారు అతి వేగంగా దూసుకు వచ్చింది. దీంతో ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు డ్రైవర్‌ను కొట్టి చంపేశారు. డ్రైవర్‌తోపాటు కారులో మరో వ్యక్తిపై కూడా దాడి చేయడంతో అతను తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ మద్యం సేవించి వున్నాడని స్థానికులు మండి పడుతున్నారు. మరోవైపు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
ఎస్ఐని దారుణంగా కొట్టి చంపారు..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో గ్యాంగ్స్టర్స్ బీభత్సం సృష్టించారు. అక్రమ మద్యం, డ్రగ్స్ విక్రయాలను అడ్డుకుంటున్నాడనే అక్కసుతో ఢిల్లీ పోలీస్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న రాజ్ కుమార్ (56 ఏళ్ళు)ను వెంటాడి మరీ దారుణగా కొట్టి చంపారు. షాదరా జిల్లాలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు ఉన్నతాధికారి మేఘనా యాదవ్ అందించిన సమాచారం ప్రకారం, నిందితుడు విజయ్ అలియాస్ భరూరి కస్తూర్బా నగర్‌కు చెందినవాడు. ఆదివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన ఎస్ఐ రాజ్‌కుమార్ భోజనానంతరం రోజూలాగానే వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో కొంతమంది ఎస్ఐతో వాదనకు దిగి దుర్భాషలాడారు. దీన్ని వ్యతిరేకించిన ఎస్పై గ్యాంగస్టర్స్ విరుచుకుపడి తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. దీంతో తనను తాను రక్షించుకునేందుకు ఎస్ఐ స్థానిక పోలీసు ఠాణాలోకి పారిపోయారు. అయినా రెచ్చిపోయిన నిందితులు ఎస్ఐను దారుణంగా కొట్టి అక్కడినుంచి పారి పోయారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. స్థానిక కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి, హత్య కేసు నమోదు చేశామని మేఘనా యాదవ్ తెలిపారు. నిందితులపై రెండు డజన్లకు పైగా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఎనిమిది నుంచి తొమ్మిదిమంది తన తండ్రిపైదాడి చేసి కొట్టి చంపేశారని రాజ్‌కుమార్ కుమార్తె వైశాలి కన్నీరు మున్నీరయ్యారు. మద్యం, డ్రగ్స్ అమ్మకాలను వ్యతిరేకించినందుకు తన తండ్రిని చంపేస్తామని ఇప్పటికే చాలా సార్లు బెదరించారనీ ఆమె ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.