
బీడీ ఇవ్వలేదని చంపేశారు!
థానే: బీడీని కలసి తాగడానికి నిరాకరించిన ఓ టీనేజర్‌ను ఇద్దరు టీనేజర్లు తీవ్రంగా కొట్టి చంపారు. ఈ ఉదంతం మహారాష్ట్ర థానేలోని శాంతినగర్‌లో సోమవారం జరిగింది. అన్సారీ(17) పబ్లిక్ టాయిలెట్‌లోకి వెళ్తుండగా 16 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్లు అడ్డుకుని అతడు తాగుతున్న బీడిని అడిగారు. బిలాల్ ఒప్పుకోకపోవడంతో అతణ్ని కొట్టి చంపారు. నిందితులను అరెస్టు చేసి హత్యాభియోగాలు మోపి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.