భోపాల్: అటుఇటు తిరుగుతూ తన వద్దకు వచి్చన కుక్కపిల్లను ఓ వ్యక్తి అత్యంత నిర్దయగా నేలకేసి కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన ఈ దారుణం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. వీడియో వైరల్‌గా మారడంతో వేలాది మంది.. ఆ వ్యక్తి కర్యశ చర్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లడంతో అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారు.
కఠిన శిక్ష పడేలాచూస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం గుణ జిల్లాలోని సుభాష్ కాలనీలో జరిగిన ఈ దారుణ ఘటన తాలూకు వీడియో చూసిన వారంతా వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలంటూ పోస్టులు పెట్టారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి ఆరుబయట కూర్చోగా అక్కడికి రెండు బుల్లి కుక్కపిల్లలు తిండి కోసం తచ్చాడుతూ వచ్చాయి. వాటిల్లో ఒకటి ఇతడి సమీపానికి రాగానే వెంటనే ఆగ్రహంతో కుక్క పిల్లను ఎత్తిపట్టుకుని నేలకేసి బలంగా కొట్టాడు. అక్కడి నుంచి లేచి వచ్చి దానిని కుడికాలితో పలుమార్లు తొక్కిచంపాడు. ఈ హృదయవిదారక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ‘‘ఇది నా హృదయాన్ని కలిచివేసింది. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చౌహాన్ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment