భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల స్టేట్ మ్యూజియంలో చోరీకి వచ్చిన దొంగ తాను ఊహించని రీతిలో పోలీసుల చేతికి చిక్కాడు. మ్యూజియంలోని కోట్లాది రూపాయల విలువైన వందల ఏళ్లనాటి పురాతన వస్తువులతో పారిపోయేందుకు ఆ దొంగ విఫలయత్నం చేశాడు.
ఈ ఉదంతం గురించి పోలీసు కమిషనర్ హరినారాయణచారి మిశ్రా మీడియాకు వెల్లడించారు. స్టేట్ మ్యూజియంలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి రాత్రంతా లోపలే ఉండిపోయాడు. ఉదయం భద్రతా సిబ్బంది అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మ్యూజియంనకు చేరుకుని అతనిని అరెస్టు చేశారు. నాణేలను, ఇతర వస్తువులను దొంగిలించి, మ్యూజియం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ దొంగ గోడపై నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు దీంతో కదలలేకపోయాడు. తరువాత అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఆ దొంగ దగ్గరి నుంచి గుప్తులు, సుల్తానేట్ కాలానికి చెందిన 100 నాణేలతో పాటు పురాతన నగలు, పాత్రలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ నాణేల విలువ దాదాపు రూ.10 నుంచి 12 కోట్ల వరకూ వరకు ఉంటుందని సమాచారం. ఈ సంఘటన నేపధ్యంలో భోపాలోని మ్యూజియం భద్రతా ఏర్పాట్లపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం మ్యూజియంనకు పటిష్టమైన భద్రతను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment