puppy
-
45 కిలోల భారీ ఆకారంలో.. బుజ్జి కుక్క పిల్ల!
‘పెంపుడు కుక్క పిల్ల’.. అనగానే ముద్దుగా మన కాళ్లకు అడ్డుపడే బుజ్జి కుక్కపిల్ల మనకు గుర్తుకువస్తుంది. అయితే దీనికి భిన్నంగా 45 కిలోల బరువైన భారీ కుక్క పిల్లను మీరు ఎప్పుడైనా చూశారా? దాని ఆకారం చూసి కూడా దానిని ఒడిలోకి తీసుకుని దాని యజమాని మురిసిపోతుంటాడు. ఆరడుగుల పొడవు, దాదాపు 45 కేజీల బరువున్న ఈ బుల్ డాగ్ పేరు రోల్ఫ్. భారీ ఆకారం ఉన్నప్పటికీ అది బుజ్జి కుక్క పిల్ల మాదిరిగానే ప్రవర్తిస్తుంటుంది. దాని యజమాని క్రెయిగ్ కూడా దానిని ఒడిలో పెట్టుకుని మురిసిపోతుంటాడు. దాని చేష్టలు చూసి, దీనికి ఇంకా చిన్నతనం పోలేదని అందరికీ చెబుతుంటాడు. క్రెయిగ్ కొన్నేళ్ల క్రితం స్ట్రోక్‌తో నడవలేకపోయేవాడు. అదే సమయంలో రోల్ఫ్ను ఇంటికి తీసుకువచ్చాడు. రోల్ఫ్ రాకతో తన జీవితమే మారిపోయిందని. క్రెయిగ్ చెప్పాడు. రోల్ఫ్ అతని జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకువచ్చేందుకు సహాయపడిందట. తాను అనారోగ్యం నుంచి కోలుకున్నానంటే దానికి రోల్ఫ్ కారణమని క్రెయిగ్ చెబుతుంటాడు. సాధారణంగా శునకాలు వయసే పెరిగేకొద్దీ తమ చేష్టలను తగ్గిస్తుంటాయి. అదే సమయంలో తమ యజమానిపై ప్రేమను కురిపిస్తాయి. అయితే రోల్ఫ్ విషయంలో దాని వయసు, ఆకారం పెరిగినా అది పిల్ల చేష్టలను ఇంకా మానలేదట. -
కుక్కపిల్లను కొట్టిచంపాడు
భోపాల్: అటుఇటు తిరుగుతూ తన వద్దకు వచి్చన కుక్కపిల్లను ఓ వ్యక్తి అత్యంత నిర్దయగా నేలకేసి కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన ఈ దారుణం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. వీడియో వైరల్‌గా మారడంతో వేలాది మంది.. ఆ వ్యక్తి కర్యశ చర్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లడంతో అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారు. కఠిన శిక్ష పడేలాచూస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం గుణ జిల్లాలోని సుభాష్ కాలనీలో జరిగిన ఈ దారుణ ఘటన తాలూకు వీడియో చూసిన వారంతా వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలంటూ పోస్టులు పెట్టారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి ఆరుబయట కూర్చోగా అక్కడికి రెండు బుల్లి కుక్కపిల్లలు తిండి కోసం తచ్చాడుతూ వచ్చాయి. వాటిల్లో ఒకటి ఇతడి సమీపానికి రాగానే వెంటనే ఆగ్రహంతో కుక్క పిల్లను ఎత్తిపట్టుకుని నేలకేసి బలంగా కొట్టాడు. అక్కడి నుంచి లేచి వచ్చి దానిని కుడికాలితో పలుమార్లు తొక్కిచంపాడు. ఈ హృదయవిదారక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ‘‘ఇది నా హృదయాన్ని కలిచివేసింది. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చౌహాన్ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
Disturbing Video: ‘తీవ్రంగా ఖండిస్తున్నా.. కఠినశిక్ష విధిస్తాం’
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో చోటుచేసుకున్న ఓ అనాగరిక ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ స్పందించారు. ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దారుణమైన ఘటన వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణా జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటి మందు కూర్చొని ఉండగా .. అతని వద్దకు రెండు చిన్న కుక్క పిల్లలు వచ్చాయి. Dear CM @ChouhanShivraj sir @MPPoliceDeptt @JM_Scindia ji -- This is a revolting & barbaric video involving cruelty by a man on a puppy that has shocked collective conscience Incident took place in Guna. Sacred texts say dogs have souls of God. 🙏💔pic.twitter.com/RCJ2CM7sO3 — Rohan Dua (@rohanduaT02) December 9, 2023 దీంతో అతను ఓ కుక్క పిల్లను పట్టుకొని విచక్షణరహితంగా నేలకు విసిరికొట్టాడు. అక్కడికి ఆగకుండా ఆ కుక్క పిల్లను కాలుతో నలిపేశాడు. ఈ దారుణ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తన దృష్టికి రావటంతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. ఈ అనాగరికమైన ఘటనకు పాల్పడిన వ్యక్తిపై జరిమానా విధించాలని సీఎం చౌహాన్‌ను ఎక్స్( ట్విటర్) ద్వారా కోరారు. Deeply disturbed by the horrifying incident. Swift and strict action will be taken to ensure justice is served. We unequivocally condemn such acts of barbarism, and the individual responsible will face the consequences. https://t.co/yYdCyKli64 — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 10, 2023 దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ‘అనాగరిక ఘటన తీవ్రంగా కలిచివేసిది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. కచ్చితంగా బాధ్యులు పర్యవసానాలు ఎదుర్కొంటారు’అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. -
శునకానికి సీమంతం
అన్నానగర్: కడలూరు జిల్లా శ్రీముష్ణం తాలూకా కవలక్కుడి గ్రామానికి చెందిన పళనివేల్, అంబుజ వల్లి దంపతుల కుమార్తె పవిత్ర. ఈమె ఒక కుక్కపిల్లని పెంచుతోంది. దానికి లూసీ అని పేరు పెట్టారు. కుటుంబంలో ఒకరిలా చూస్తు న్నారు. ప్రస్తుతం లూసీ గర్భిణి కావడంతో పళనివేల్ కుటుంబం లూసీకి సీమంతం షవర్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. లూసీని ప్రత్యేకంగా అలంకరించి పూలమాల వేసి కుర్చీలో కూర్చోబెట్టారు. బంగారు హారాన్ని ధరించి పసుపు, కుంకుమ పెట్టారు. అలాగే, లూసీకి ఇష్టమైన ఆహార పదార్థాలను దాని ముందు ఉంచి మంచి పిల్లలకు జన్మనివ్వాలని దేవుడిని ప్రార్థించారు. -
నాకు కావాలసినది కుక్కపిల్ల కాదు.. కోడలు పిల్లా..!
నాకు కావాలసినది కుక్కపిల్ల కాదు.. కోడలు పిల్లా..! -
సోనియాకు రాహుల్ సర్ప్రైజ్ గిఫ్ట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియాగాంధీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఒక బుజ్జి కుక్క పిల్లను కానుకగా ఇచ్చారు. ఆ కుక్క పిల్లకి నూరీ అని పేరు పెట్టారు. బుధవారం ప్రపంచ జంతు దినోత్సవాన్ని పురస్కరించుకొని తల్లి సోనియాకు కుక్కపిల్లని ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదంతా వీడియో తీసి యూట్యూబ్‌లో ఉంచారు. అమ్మకి ఒక సర్ప్రైజ్ అంటూ రాహుల్ గాంధీ సోనియాను బయటకు తీసుకురావడంతో వీడియో మొదలవుతుంది. రాహుల్ ఇచ్చిన బాక్స్ తీసి చూసిన సోనియా గాంధీ అందులో బుజ్జి కుక్క పిల్ల ఉండడంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. చాలా క్యూట్‌గా ఉందంటూ మురిసిపోయారు. ఇప్పుడు తమ కుటుంబంలోకి మరో సభ్యురాలు వచ్చిందంటూ రాహుల్ చెబుతున్నారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఈ ఆడకుక్క పిల్లను రాహుల్ గోవా నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చారు. -
రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు.. గోవా వెళ్లి మరీ తీసుకొచ్చారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు వచ్చి చేరాయి. గోవా పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ నుంచి వచ్చేటప్పుడు రెండు కుక్క పిల్లలను ఢిల్లీలోని తన నివాసానికి తీసుకొచ్చారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన మూడు నెలల వయసు రెండు కుక్క పిల్లలను పెంచుకునేందుకు తీసుకున్నారు. కాగా బుధవారం సాయంత్రం గోవా వెళ్లిన రాహుల్ గాంధీ గురువారం ఉదయం మళ్లీ ఢిల్లీ చేరుకున్నారు. తన పర్యటనలో గోవాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ పట్కర్‌తో ఓ హోటల్లో భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై వారితో చర్చించారు. పర్యటన ముగించుకొని మోపాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ముందు షేడ్స్ కెన్నెల్ అనే పెంపుడు జంతువుల విక్రయ సంస్థను సందర్మించారు. శివాని పిత్రే అనే మహిళ తన భర్తతో కలిసి నార్త్ గోవాలోని మపుస ప్రాంతంలో దీనిని నడుపుతోంది. అక్కడ జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఒక మగ, ఒక ఆడ కుక్కను కొనుగోలు చేశారు. అయితే విమానయాన నిబంధనల కారణంగా ఒక కుక్కను మాత్రమే తనతో దిల్లీ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ విమానాశ్రయానికి బయలుదేరే ముందు కొద్దిసేపు కెన్నెల్‌లో కుక్క పిల్లలతో గడిపారని పిత్రే పేర్కొన్నారు. చదవండి: అరుదైన దృశ్యం.. విపక్షాల హామీతో సభలోకి స్పీకర్ అడుగు ఆయన అత్యంత నిరాడంబరుడని, తమతో ఓ స్నేహితుడిలా మాట్లాడారని తెలిపారు. కెన్నెల్‌లో కుక్కపిల్లలతో కలిసి రాహుల్ గాంధీ ఆడుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ రెండు కుక్క పిల్లలను కొనుగోలు చేశారని, వీటిలో ఒక పప్పీని ఆయన ఇంటికి తీసుకెళ్లారని మరో దానిని తరువాత పంపిస్తామని శివాని తెలిపారు. ముందుగా రాహుల్ గాంధీ సిబ్బంది ఒకరు వచ్చి పప్పీల గురించి తెలుసుకున్నారని, అయితే వాటిని కొనుగోలు చేసే ముందు ఆయనే స్వయంగా వాటిని చూసేందుకు ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అజీమ్ ప్రేమ్ జీ, కరీనా కపూర్ వంటి పలువురు ప్రముఖులు ఈ జాతి కుక్కలను కొనుగోలు చేశారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతి శునకాలకు బ్రిటన్‌లో విపరీతమైన జనాదరణ ఉంది. వీటి ఆహార్యం చిన్నగా కన్పించినా.. అవి చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. 4 నుంచి 7 కిలోల బరువుండే ఈ కుక్కలు 25 సెంటీమీటర్ల దాకా ఎత్తు పెరుగుతాయి. వీటి జీవిత కాలం కూడా ఎక్కువే. రష్యాకు చెందిన మందుపాతరలు, బాంబులను పసిగట్టినందుకు ఇదే జాతికి చెందిన పీట్రన్ అనే శునకానికి ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పతకాన్ని బహూకరించారు. చదవండి: అరుదైన దృశ్యం.. విపక్షాల హామీతో సభలోకి స్పీకర్ అడుగు -
మమతా బనెర్జీ ఏం చేస్తుందో చూడండి..!
-
మెక్సికోకు 'కుక్కపిల్ల'ను గిఫ్ట్‌గా ఇచ్చిన టర్కీ!..అదే ఎందుకంటే?..
మెక్సికోకు టర్కీ మూడు నెలల వయసున్న జర్మనీ షెపర్డ్ కుక్కపిల్లను ఇచ్చించి. ఈ మేరకు మెక్సికో సైన్యం బుధవారం టర్కీ గిఫ్ట్‌గా ఇచ్చిన ఆ కుక్క పిల్లను స్వాగతించింది. అసలు టర్కీ ఎందుకు ఆ కుక్కపిల్లనే గిఫ్ట్‌గా ఇచ్చిందంటే..ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయతాండవానికి వేలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనలో భూకంప శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు మెక్సికో రెస్క్యూ డాగ్‌లతో మోహరించింది. ఆ టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రొటీయో అనే జర్మన్ షెషర్డ్ జాతికి చెందిన కుక్క చాలా చురుకుగా సేవలందించింది. ఐతే అది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయింది. ఈ జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క భూకంపాలు, ప్రకృతి వైపరిత్యాలకు గురయ్యే ప్రదేశంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఆయా ప్రదేశంలోని శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి ఆచూకిని కనిపెట్టడంలో ప్రసిద్ధి చెందింది. దీంతో టర్కీ ఆ జాతికి చెందిని మూడు నెలల వయసున్న కుక్క పిల్లను విధి నిర్వహణలో ప్రాణాలొదిలేసిన కుక్క పిల్లకు బదులుగా మెక్కికోకు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ కుక్కపిల్లకు 'ఆర్కాదాస్గా' నామకరణం ఈ కుక్కపిల్లకు మెక్కికో సైన్యం స్వాగతం పలకడమే గాక ఆర్కాదాస్ అని పేరుపెట్టింది. టర్కిష్‌లో ఆర్కాదాస్ అంటే స్నేహితుడు అని అర్థం. మృతి చెందిన ప్రోటియోని సంరక్షించిన ట్రెయినరే ఆర్కాదాస్కి కూడా శిక్షణ ఇస్తారని మెక్సికో సైన్యం తెలిపింది. ఈ మేరకు సదరు కుక్కపిల్ల గ్రీన్‌కలర్ సైనిక యూనిఫాం ధరించి బుధవారం మెక్సికో సైనిక స్థావరంలో జరుగుతున్న అధికారిక వేడుకలో పాల్గొంది. సరిగ్గా మెక్కికో జాతీయ గీతం స్పీకర్ల నుంచి వస్తుండగా.. ఒక్కసారిగా ఆ కుక్కపిల్ల ఉద్వేగభరితంగా మొరిగి తన విశ్వాసాన్ని చాటుకుంది. ఈ నేపథ్యంలో మెక్కికో రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్కాదాస్ తరుఫున ఒక ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్లో.."నన్ను ఎంతో ఆప్యాయంగా స్వాగతించిన మెక్సికోకు చెందిన స్నేహితులకు ధన్యవాదాలు. రెస్క్యూ డాగ్‌గా ఉండేందుకు నావంతుగా కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను ". అని పేర్కొంది రక్షణ శాఖ. కాగా, టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో మరణించిన ప్రోటీయో కుక్కుకు మెక్కికో ఘనంగా సైనిక అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించింది. (చదవండి: మరో ఆప్షన్ లేదు.. లొంగిపోతానన్నా వినొద్దు.. జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందే!) -
కుక్క పిల్లను కిడ్నాప్ చేసిన కోతి.. వీడియో వైరల్
-
వైరల్ వీడియో: ఎయిర్‌పోర్టు అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన శునకం
ప్రయాణాల్లో కొంతమంది తమ పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్తుంటారు. సొంత వాహనాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లడం సులువే కానీ.. ట్రైన్, విమానం వంటి వాటిల్లో తీసుకెళ్లడం కొంచెం కష్టం. అవి ఎదుటి వారికి ఎలాంటి హానీ చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఓ ఎయిర్‌పోర్టులో ఒక శునకం అధికారులు ముప్పుతిప్పలు పెట్టింది. విమానాశ్రయం రన్‌వే అంతా పరుగులు పెట్టించింది. ఈ సంఘటన మెక్సిలో చోటుచేసుకుంది. గ్వడలాజరలో గల మిగ్వుల్ హిడాల్గొ వై కాస్టిల్లా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కను తీసుకొచ్చింది. సరిగ్గా బోర్డిండ్ సమయానికి కుక్కకు కట్టిన తాడు తెగిపోయింది. ఇంకేముంది ఆ కుక్క యాజమాని నుంచి తప్పించుకొని విమానం నుంచి బయటకు వచ్చేసింది. విమానం కింద నుంచి. రన్ వైపే మొత్తం కలియ తిరిగింది. ఉరుకులు పరుగులు తీసింది. దీంతో కుక్క వెంబడి అధికారులు పరుగులు తీశారు. అయినా ఎంతకూ అది దొరకలేదు. అయితే ఆ సమయంలో రన్‌వే పైకి వాహనాలు రాకుండా అధికారలు జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి తిరిగి తిరిగి అలసిపోయిన సిబ్బంది ఎలాగోలా ఆ కుక్కను పట్టుకోవడంతో అందరూ హమ్మాయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిని ప్రత్యక్ష సాక్షి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ వీడియోలో శునకం పరుగు పెట్టించే అంశం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా కుక్క ఎలా తప్పించుకుందనేదానిపై క్లారిటీ లేదు. ఇక పప్పీని పట్టుకునే క్మంలో వారికి ఎలాంటి గాయం కాలేదని తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే 2 లక్షల మంది వీక్షించారు. దీనిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అధికారులకు శునకం మంచి వ్యాయామం చేయించిందని కామెంట్ చేస్తున్నారు. -
కుక్కపిల్లపై మోజుతో ఆ యువకుడు ఏం చేశాడంటే.. చివరికి..
పెనుకొండ(అనంతపురం జిల్లా): కుక్క పిల్ల కోసం చోటు చేసుకున్న ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. పెనుకొండ మండలం మంగాపురంలో రైతు అమరనాథరెడ్డి తన పొలంలోని షెడ్ వద్ద ఆదివారం ఉదయం ఓ కుక్క పిల్లను కట్టి ఉంచాడు. కుక్కపిల్లపై మోజుతో దానిని అదే గ్రామానికి చెందిన యువకుడు శబరీష్ ఎత్తుకెళ్లాడు. కాసేపటి తర్వాత ఈ విషయం తెలుసుకున్న అమరనాథరెడ్డి.. వెంటనే శబరీష్‌ను మందలించాడు. చదవండి: పాపం ఏమైందో గానీ పెళ్లయిన నెలకే జవాను, భార్య ఆత్మహత్య ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా శబరీష్ ఇంటికి వెళ్లి తన సోదరుడు మంజునాథరెడ్డికి విషయం తెలిపి.. అమరనాథరెడ్డి వద్దకు పిలుచుకెళ్లాడు. ఆ సమయంలో ఘర్షణ చోటు చేసుకుని పరస్పరం దాడి చేసుకున్నారు. ముగ్గురికీ గాయాలయ్యాయి. ఘర్షణకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నువ్వే స్టెప్ వేస్తే అదే స్టెప్ వేస్తా!!: వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
ఇటీవలకాలంలో జంతువులు భలే చక్కగా మనుషులను అనుకరిస్తూ రకరకాల పనులను చేస్తున్న వాటిని చూస్తునే ఉన్నాం. పైగా అవి మనం చేసే రోజువారి పనులను చూసి అవి కాపీ కొట్టి చక్కగా చేసేస్తున్నాయి. అంతేందుకు మనం ఎలాంటి భావాలు పలుకుతామో అలానే అనుకరించేస్తున్నాయి కూడా. అలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. అచ్చం అలాంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్) అయితే ఈ వీడియోలో ఒక కుక్కపిల్ల తన యజమాని ఎలా డ్యాన్స్ చేస్తే తాను అలానే చేస్తోంది. పైగా ఈ వీడియోలో సదరు యజమాని ఏ విధంగా గత్తులేస్తూ డ్యాన్స్ చేస్తాడో అది అచ్చం అలానే చేస్తుంది. పైగా ఆ క్కక్కపిల్ల చాల చిన్నగా క్యూట్‌గా ఉంటుంది. అయితే ఈ కుక్కపిల్ల తన యజమానిని భలే అనుకరిస్తుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: నా ముందు నగ్నంగా కూర్చోబెడితేనే గుప్తనిధి కనబడుతుందంటూ..!) Dance battle with a puppy.. pic.twitter.com/i73mqEp9lb — Buitengebieden (@buitengebieden_) November 10, 2021 -
నీరజ్ చోప్రాకి అభినవ్ బింద్రా క్యూట్ గిఫ్ట్..
ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు తొలి వ్యక్తిగత స్వర్ణం గెలిచిన షూటర్ అభినవ్ బింద్రా తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ సందర్భంగా నీరజ్‌ను అభినందించిన బింద్రా.. .తన తరఫునుంచి ‘టోక్యో’ పేరు గల కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చి దానికి తోడుగా ‘పారిస్’ను తీసుకురావాలని ఆకాంక్షించాడు. వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్ ఫైనల్లో సురేఖ బృందం యాంక్టాన్ (యూఎస్ఏ): వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో వెన్నం జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. కాంపౌండ్ విభాగంలో సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియ గుర్జర్ లతో కూడిన జట్టు సెమీ ఫైనల్లో 226–225 తేడాతో అమెరికాపై విజయం సాధించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో కొలంబియాతో భారత్ తలపడుతుంది. అంతకు ముందు భారత జట్టు... ప్రిక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్‌పై, క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌పై గెలుపొందింది. చదవండి: ఇక ‘బ్యాట్స్‌మన్’ కాదు.. బ్యాటర్! -
Viral: కుక్కపిల్లతో సీతాకోకచిలుకల చిలిపి ఆట!
సాధారణంగా సీతాకోకచిలుకలు చెట్ల, జంతువులు మీద వాలుతూ గాల్లో ఎగురుతుంటాయి. గార్డెన్, మైదానాల్లో తిరుగుతూ మనుషులకు దగ్గరగా వస్తుంటాయి. మనం వాటిని పట్టుకోవాలని ప్రత్నించగానే రివ్వున గాల్లోకి ఎగిరిపోతాయి. అయితే తాజాగా ఓ సీతాకోకచిలుక చిన్న కుక్కపిల్లతో చేసిన సందడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. ఈ వీడియోను బ్యూటెంజిబిడెన్ పేరుతో ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిన్న కుక్కపిల్ల బంతిని తన నోటితో ఒక చోటు నుంచి మరోచోటుకి తీసుకువస్తుంది. అదే సమయంలో రెండు సీతాకోకచిలుకలు కుక్కపిల్లలో ఆడుకుంటాయి. ఒక సీతాకోకచిలుక కుక్కపిల్ల ముక్కు మీద వాలుతుంది. అది గ్రహించిన కుక్కపిల్ల వెంటనే దాన్ని పట్టుకోవాలని ప్రత్నించగానే గాల్లోకి ఎగిరి ఆటపట్టిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోను వీక్షించిన నెటిజన్లు.. ‘సూపర్‌గా ఉంది వీడియో!! బుజ్జి కుక్క పిల్ల తీసుకోచ్చిన బంతి కదలకుండా ఉంది. కానీ, సీతాకోకచిలుక మాత్రం గాల్లో ఎగిరింది’.. ‘ ప్రశాంతమైన గార్డెన్లో.. చాలా అద్భుతంగా ఉంది వీడియో’.. ‘కుక్కపిల్లలో సీతాకోకచిలుక చిలపి ఆట బాగుంది’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మంద వీక్షించారు. This is what Twitter is meant for.. pic.twitter.com/wY8r1IWyrw — Buitengebieden (@buitengebieden_) September 2, 2021 -
సూపర్ క్రేజ్.. 1.7 మిలియన్ లైక్స్
కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్‌లకు తాత్కాలికంగా విరామం దొరకడంతో హీరోలు, హీరోయిన్లు ఇళ్ల దగ్గరే తమకు నచ్చిన వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన పెంపుడు కుక్కలతో టైం పాస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు విజయ్. ఇప్పటికే ఈ ఫోటోను 1.7 మిలియన్ల మంది లైక్ చేశారు. దీనిలో విజయ్ తన పెంపుడు కుక్కలు స్టార్మ్, చెస్టర్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ‘చిల్లింగ్ విత్ దిస్ బాయ్స్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. గత నెల తొలిసారి స్టార్మ్ ఫోటోను షేర్ చేశారు విజయ్. (అవకాశాలు అంత తేలికకాదు..) View this post on Instagram Chilling with these boys @thestormdeverakonda and @chester.thesamoyed. A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on Aug 23, 2020 at 9:24am PDT ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమాలో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. -
కూతురికి కోసం తల్లే కుక్క పిల్లలా...
లండన్: ఆ తల్లికి కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం. ఆమె బిడ్డకు శునకాలంటే పిచ్చి. వెరసి తల్లీకూతుళ్లిద్దరూ విచిత్రంగా ప్రవర్తిస్తూ వార్తల్లోకెక్కారు. వినడానికి వింతగా ఉన్న ఈ అలవాటు చాలా ఏళ్ల నుంచి జరుగుతూ వస్తోందట. యూకేకు చెందిన 68 ఏళ్ల మెర్సియాకు 21 ఏళ్ల కూతురు అలినా. ఎంజైమ్ లోపంతో బాధపడుతున్న ఆమెను దత్తత తీసుకున్నప్పటికీ మెర్సియా సొంతబిడ్డకన్నా ఎక్కువగా చూసుకుంటుంది. (కరోనాతో ఆస్పత్రికి.. కట్ చేస్తే పెళ్లి) అయితే అలినాకు కుక్కపిల్లలు పెంచుకోవాలన్నది ఆశ. కానీ అది కుదరలేదు. దీంతో ఆమె తల్లే కుక్కపిల్లలా అవతారం ఎత్తింది. కూతురును నాకుతూనే మెర్సియా నిద్రలేపుతుంది. లేకపోతే ఆమె అస్సలు లేవదట. ఇలా చేయడానికి ముందు ఆమె కుక్కపిల్లలా శబ్ధాలు చేస్తూ కూతురిని సంతోషపెడుతుంది. ఈ దినచర్య కొన్నేళ్ల నుంచి జరుగుతూ వస్తోంది. తల్లి తనను నాకుతూ నిద్ర లేపడం మహా ఇష్టమని ముసిముసి నవ్వులు నవ్వుతోంది అలినా. ఖాళీ సమయాల్లో ఇలా ఒకరినొకరు నాకుతూ కుక్కపిల్లల్లా ఆడుకుంటామని ఈ తల్లీకూతుర్లు చెప్పుకొస్తున్నారు (ఇంతకంటే దారుణమైన ప్రమాదం ఉండదు.. కానీ!) -
వైరల్: కుక్కపిల్లను కొత్త పెళ్లికూతురిలా..
కొత్తగా కుక్కపిల్లను ఇంటికి తీసుకురావటమంటే శునక ప్రేమికులకు చెప్పలేనంత ఆనందం. ఆ ఆనందాన్ని తమకు తోచినట్లుగా తెలియజేస్తూ ఉంటారు. కొంతమందైతే దాన్నో వేడుకలా జరుపుకుంటారు. ఫ్లోరిడాకు చెందిన ఓ కుటుంబం అయితే ఓ కొత్త పెళ్లికూతుర్ని ఇంటికి ఆహ్వానించినట్లు కుక్కపిల్లను స్వాగతించింది. కొత్తగా ఇంటికి తెచ్చుకుంటున్న కుక్కపిల్లకు బెంజీ పాటెల్ అని పేరు పెట్టి, హారతి ఇచ్చి, ఎర్రనీళ్లతో దాని అడుగులను పదిలం చేసి మరీ ఇంట్లోకి ఆహ్వానించారు కుటుంబసభ్యులు. ఈ వీడియోకు ‘కబీ ఖుషీ కబీ గమ్’ బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను జోడించి టిక్‌టాక్‌లో విడుదల చేశారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (క్షమించు సుశాంత్: సన్నీ లియోన్) -
ఒకే కాన్పులో 18 కుక్కపిల్లలు
లండన్: సాధారణంగా కుక్క ఐదు నుంచి ఆరు పిల్లలకు జన్మనిస్తుంది. తల్లి కుక్క వయసు ఆధారంగా కూడా పిల్లల సంఖ్య మారుతుందట. కానీ శునకం గరిష్టంగా 15 మందికి జన్మనివ్వగలదు. అయితే అనూహ్యంగా ఓ కుక్క మాత్రం ఒకే కాన్పులో 18 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన ఇంగ్లండ్‌లోని ప్రిస్టన్‌లో చోటు చేసుకుంది. మూడేళ్ల వయసున్న డాల్మటియన్ జాతి కుక్క నెల్లీ ఒకే కాన్పులో 10 మగ కుక్కలతోపాటు, ఎనిమిది ఆడ కుక్కలను జన్మనిచ్చింది. (ఇంతకీ పులి చిక్కిందా.. లేదా!) ఇవి ఉండాల్సిన పరిమాణం కన్నా రెట్టింపు సైజులో ఉండటం గమనార్హం. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఇక నెల్లీ యజమాని లూయిస్ అప్పుడే పుట్టిన ఒక్క కుక్కపిల్ల మినహా మిగతా అన్నింటినీ దత్తత ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కాగా అత్యధిక మందికి జన్మనిచ్చిన రికార్డు మాత్రం ఇంగ్లండ్‌లోని టియా కుక్క పేరు మీద ఉంది. ఇది 2014 నవంబర్‌లో ఒకే కాన్పులో 24 మందిని కన్నది. (మొదటిసారి డేటింగ్‌కు వెళుతున్నాడు అందుకే..) -
అది కుక్కపిల్ల కాదు: అక్కడే వదిలేయ్!
టోక్యో : దారి తప్పిపోయిన అడవి నక్కపిల్లను కుక్కపిల్ల అనుకున్న ఓ వ్యక్తి దాన్ని యాజమానితో కలపటానికి తీవ్రంగా శ్రమించాడు. చివరకు నిజం తెలుసుకుని కంగుతిన్నాడు. ఈ సంఘటన జపాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మార్సీ.కామ్ అనే ట్విటర్ యూజర్‌కు కొద్దిరోజుల క్రితం రోడ్డుపక్కన ఓ జంతువు కనిపించింది. అది కుక్కపిల్ల అనుకున్న అతడు దాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. కుక్కపిల్ల అనుకుంటున్న నక్కపిల్లను యాజమానితో కలపాలన్న ఉద్ధేశ్యంతో ట్విటర్ ద్వారా దాని యాజమాని ఎవరికైనా తెలిస్తే చెప్పాలని, యాజమాని వద్దకు చేర్చడానికి సహకరించాలని ప్రార్థించాడు. అయితే దీనిపై స్పందించిన ఓ నెటిజన్ ‘‘ అది కుక్కపిల్లకాదు, నక్కపిల్ల. దాన్ని ఎక్కడినుంచి తెచ్చావో అక్కడే వదిలేయ్!’’ అని చెప్పాడు. ( బుల్లోడా! నువ్వు సామాన్యుడివి కాదు..) దీంతో అతడికి అది నక్కపిల్లా? కుక్కపిల్లా? అన్న అనుమానం కలిగింది. వెంటనే దాన్ని దగ్గరిలోని జంతు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. దాన్ని పరీక్షించిన ఆ వైద్యుడు అది కుక్కపిల్ల కాదని, అడవి నక్కపిల్ల అని తేల్చాడు. మార్సీ.కామ్ ట్విటర్ యూజర్ ఇక చేసేదేమీ లేక దాన్ని నక్కల అభయారణ్యంలో వదిలేశాడు. ( ఇలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలి! ) -
కుక్కకు పట్టిన గతే పట్టింది
-
లాక్డౌన్: కుక్కకు పట్టిన గతే పట్టింది
లాక్డౌన్ వల్ల మనుషులేనా, మూగజీవాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. పార్కుల వెంట పరుగులు తీయడం, రోడ్ల వెంట తోకూపుతూ నడవటం, మిగతా జీవులనూ రెచ్చగొడుతూనే యజమానుల ముందు ఏమీ తెలియనట్లు మొహం పెడుతూ కాళ్ల అతనిచ్చే బిస్కట్ కోసం బంతాట ఆడటం, అంతెంతుకు.. వీధి చివర తన ప్రేయసి/ప్రియుడుతో ఆటలాడటం ఇలా ఎన్నింటినో శునకాలు కూడా మిస్ అవుతున్నాయి. బిగ్ పొప్ప అనే మూడేళ్ల ఇంగ్లిష్ బుల్డాగ్ కూడా వీటి గురించే దీర్ఘాలోచనలో పడినట్లుంది. పాపం విచారంగా తల కిందికేసి చూస్తున్న దాని ఫొటోను యజమాని రే ఎల్లీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. (కరోనా : అమ్మా! మీ సేవకు సలాం) "ఇవాళెందుకో నా కుక్కపిల్ల బాధగా కనిపిస్తోంది. బహుశా పిల్లలతో కలిసి ఆడుకోలేకపోతున్నందుకు కావచ్చు" అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇంకేముందీ, నెటిజన్లు అచ్చంగా ఆ కుక్క పరిస్థితే తమది కూడా అంటూ దాని ఫీలింగ్‌ను షేర్ చేసుకుంటున్నారు. కుక్కపిల్లపై సానుభూతి వర్షం కురిపిస్తున్నారు. అలా ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని యజమానురాలు రే ఎల్లీ మాట్లాడుతూ.. దానికి అన్నింటికన్నా పిల్లలే ఇష్టమని, వాటితో ఆడుకుంటే పొప్పకు ఎక్కడలేని సంతోషమని చెప్పుకొచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల అది సాధ్యం కావట్లేదని పేర్కొంది. (మొసలికి ఊపిరాడకుండా చేసి..) -
ఆమె ప్లాన్ అదిరింది.. కుక్కపిల్ల చెడగొట్టింది!
-
ప్లాన్ అదిరింది.. కుక్కపిల్ల చెడగొట్టింది!
మీరు ఈ వీడియోను ప్లే చేయగానే... ఓ యువతి హ్యాండ్‌స్టాండ్ చేయటం. ఆ పక్కనే ఓ ముసలాయన చెక్క బల్లపై కూర్చుని పేపర్ చదవటం గమనిస్తారు. ఆ యువతి ఎంతో నేర్పుగా విన్యాసాలు చేస్తూ మనతో‘ అరే! భలే చేస్తోందే’ అనిపించుకుంటుంది. ఇంతలో ఓ కుక్కపిల్ల సీనులోకి అడుగుపెట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ఓ క్షణం మనకు ఏమీ అర్థం కాదు. కుక్కపిల్ల గోడమీద నడవడమేంటి అనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆ ఇద్దరూ చేసిన జిమ్మిక్కు అర్థమై నవ్వొస్తుంది. ఇంతకీ విషయమేంటంటే.. ఆ యువతి హ్యాండ్‌స్టాండ్ చేస్తున్నట్టు, ఆ ముసలాయన గోడ దగ్గర బల్ల మీద కూర్చుని పేపర్ చదువుతున్నట్లు కెమెరా సహాయంతో మనకు భ్రమ కలిగించారు. అయితే ఆ ఫ్లోర్ మీదకు కుక్క నడుచుకుంటూ రావటంతో వారి ప్లాన్ ఫెయిలయింది. వారి ప్లాన్ ఫెయిలయినా వీడియో మాత్రం పెద్ద హిట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు‘‘ స్పైడర్ డాగ్.. ఆ ముసలాయన కూర్చున్న తీరు, పేపర్ చదవటం నిజంగా భ్రమ కలిగించాయి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
కుక్కతో లైవ్ టెలికాస్ట్ చేసిన జర్నలిస్ట్
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ అనేక దేశాలు లాక్డౌన్ విధించుకున్నాయి. అందులో భాగంగా ప్రజలెవరూ బయటకు రావద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. మరోవైపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాయి. అయితే ఇంట్లో నుంచే పనులు చేయడం అందరికీ అంత సులువు కాదని నిరూపించిందీ సంఘటన. మైక్ స్లిఫర్ అనే జర్నలిస్ట్ ఇంట్లో నుంచే లైవ్ వీడియో చేస్తున్నాడు. వాతావరణ స్థితిగతుల గురించి చెప్తూ ఉండగా.. అతని కుక్క పిల్ల వచ్చి పక్కనే నిలబడింది. అతను వార్తలు చెప్పడం పూర్తవగానే కెమెరా వైపు సంతోషంగా చూసింది. దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌ను మైక్ ట్విటర్లో షేర్ చేశాడు. (ప్లాన్ అదిరింది కానీ, బెడిసి కొట్టింది!) దీంతో నెటిజన్లు ఆ వీడియోకు ఫిదా అయిపోయారు. కుక్కపిల్ల అచ్చంగా నవ్వినట్లే ఉందని అబ్బురపడుతున్నారు. ఈ క్రమంలో తన కుక్కపిల్లతో కలిసి చేసిన వార్తలకు ఎంత రేటింగ్ ఇస్తారని ట్వీట్ చేయగా పదికి పదిచ్చినా తక్కువే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే జర్నలిస్టులకు ఇలాంటి సమస్యలు ఎదురవడం కొత్తేమీ కాదు. జర్నలిస్ట్ లైవ్ రికార్డింగ్ చేస్తుండగా అతని తండ్రి చొక్కా లేకుండా తిరగడం, ఓ మహిళా జర్నలిస్టు వార్తలు చెప్తున్న సమయంలో పిల్లలు పదేపదే అంతరాయం కలిగించడం వంటి ఎన్నో నవ్వు తెప్పించే సంఘటను ఇదివరకే చూశాం. (క్లోరోక్విన్.. మాకూ ఇవ్వండి)