తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన వ్యాపారవేత్త మురళీధరన్‌కు జంతువులంటే చాలా ఇష్టం. అందుకే ఆయన తన ఇంటి వద్ద కోళ్లు, పిల్లులు, కుక్కల్ని పెంచుతున్నారు. ఇటీవల ఆయన ఓ రెండు కోళ్లు ఒకదానితో ఒకటి పోటీపడుతున్న వీడియోను తీశారు. అందులో విశేషం ఎంటని అనుకుంటున్నారా రెండు కోళ్లు పోటీపడుతుంటే ఓ కుక్కపిల్ల మాత్రం వాటిని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.