cock fight
-
కోనసీమలోనూ భీమవరం తరహా పందేల ఏర్పాట్లు
సాక్షి, అమలాపురం: కోడిపందేలంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతమే గుర్తొస్తుంది. ఈసారి భీమవరం తరహా ఏర్పాట్లను తలదన్నేలా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పందేలకు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. సినిమా సెట్టింగ్‌లను తలపించేలా.. పెద్దపెద్ద సినిమాల ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ల మాదిరిగా కోనసీమలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ.పోలవరం మండలం మురమళ్లలో కోడిపందేలు, గుండాటలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో 2014–2019 మధ్య ఇక్కడ పెద్దఎత్తున కోడి పందేలు, పొట్టేలు పందేలు, గుండాటలు నిర్వహించారు. ఈసారి అంతకుమించి మురమళ్లల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) స్వగ్రామం మురమళ్ల కావడం, ఆయన అశీస్సులు పుష్కలంగా ఉండటంతో నిర్వాహకులు రెండు ఫుట్‌బాల్ మైదానాలంత స్థలంలో పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10 ఎకరాల స్థలంలో 10 వేల మందికి పైగా కూర్చుని పందేలు చూసేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే 500 మంది వీవీఐపీల కోసం సోఫా సెట్లు, కూలర్లు ఏర్పాటు చేయనున్నారు. రెండు బరుల్లో పందేలు నిర్వహించనున్నారు. పందేలు అందరికీ కనిపించేలా చుట్టూ భారీ ఎల్సీడీలు ఏర్పాటు పెడుతున్నారు. కోడి పందేలతోపాటు గుండాటలు కూడా పెద్దఎత్తున నిర్వహించనున్నారు. కోనసీమ రుచులను చూపించేందుకు ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలోని పేరొందిన బిర్యానీలు, మాంసాహారం, ఆత్రేయపురం పూతరేకులతో పాటు పలు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.ఆంధ్రా గోవా అంటూ..ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం బీచ్‌ను ‘ఆంధ్రా గోవా’గా అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తరచూ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి పండుగ మూడు రోజులు బీచ్‌వద్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన నాయకులు సమీపంలోనే కోడి పందేలు, గుండాటలకు సిద్ధమవుతున్నారు. ఇందుకు వేలం పాటలు కూడా నిర్వహించినట్టు సమాచారం. ఆంధ్రా గోవా అని పిలుస్తున్నందుకు పండుగ రోజులలో బీచ్‌ను గోవా తరహాలో జూద కేంద్రంగా మారుస్తున్నారని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఆంధ్ర దంగల్‌కు సై అంటున్న.. తెలంగాణ కోళ్లు! ఇంట్రస్టింగ్ విషయాలు
సంక్రాంతి పండుగలో డూడూ బసవన్నలు, రంగవల్లులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటలు ఎంత ప్రాధాన్యత కలిగినవో.. కోడి పందేలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.. గట్టిగా చెప్పాలంటే.. సంక్రాంతి సందడిలో కోడిపందేలే కీలంకంగా మారాయి కూడా.. ఆంధ్రలో సంక్రాంతికి కోడిపందేలకు మహిళలు సైతం వెళ్లి పందేలు కాస్తారంటే ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.. అలాంటి ఆంధ్రా సంక్రాంతి కోడి పందేలకు నగరం నుంచి పందెం రాయుళ్లతో పాటు కోళ్లు కూడా వెళుతున్నాయి.. అంతే కాదు పందేల్లో ప్రత్యర్థి కోళ్లను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సారి పందేల బరిలోకి దిగేందుకు పాతబస్తీలోని కోళ్లు కాలుదువ్వుతున్నాయి. పాతబస్తీలో పందెపు కోళ్ల పెంపకంతోపాటు వాటికి బరిలో పడే విధంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. దీంతో ఇక్కడ పెంచుతున్న కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి నేపథ్యంలో దీనిపైనే ప్రత్యేక కథనం..– సాక్షి, సిటీబ్యూరోసంక్రాంతి కోడి పందేలకు ఇప్పటికే సర్వం సిద్ధమవుతోంది. బరిలో నిలిచే కోళ్లను ఇప్పటికే పందెంరాయుళ్లు జల్లెడపట్టేశారు. మరికొందరు ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఒక్కో కోడి ధర పదివేల నుంచి లక్ష రూపాయల వరకూ పలుకుతోంది. జాతి, రంగును బట్టి కూడా ధరలను నిర్ణయిస్తారు. బరిలో దిగితే చావో రేవో తేల్చుకునేలా వాటికి శిక్షణ ఇస్తున్నారు. కొన్ని రకాల జాతి పుంజులైతే రూ.70 వేల నుంచి లక్ష వరకూ పలుకుతాయి.. అత్యంత ఖరీదుగా ఉండేవి సీతువ జాతి కోడి పుంజులు. ఆ తరువాతి స్థానాల్లో పర్ల, పచ్చకాకి, డేగ, కాకిపుంజు, పెట్టమారు రకాలున్నాయి. మెనూ చాలా ముఖ్యం.. అట్లపెనంపై గుడ్డును వేడిచేసి బాదం, నిమ్మ నూనెతో మసాజ్ చేస్తారు. చికెన్, ఎండు చేప ముక్కలు ధాన్యంలో కలిపి ఇస్తారు. ఇవేకాకుండా జీడి పప్పు, బాదం, పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, మేకపాలు, వీటితోపాటు బలవర్ధకమైన పోషకాలు ఉండే ఆహారం తినిపిస్తారు. గంట్లు, చోళ్ళు, బియ్యం, రాగులు మినప, శనగపప్పు, గోధుమ మిశ్రమాన్ని రోజూ తినిపిస్తారు. దీంతో పాటు మధ్యాహ్నం మటన్ కీమా, సాయంత్రం స్నాక్స్‌గా జొన్నలు, కోడిగుడ్లు పెడతారు. ప్రతి మూడు గంటలకూ ఓ సారి జీడిపప్పు, బాదం పిస్తా మిశ్రమాన్ని వడ్డిస్తారు. పుంజులకు బలమైన ఆహారం ఇస్తూనే కఠినమైన వ్యాయామం శిక్షణ ఇస్తారు. ఎంపికే కీలకం... కోడిపుంజు ఎంపిక నుంచి దానికి ఇచ్చే ఆహారం వరకూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కోడిపందెం కోసం అన్ని రకాల జాతులూ పనికిరావు. ప్రత్యేకంగా సూచించిన వాటినే కోడిపందేలకు ఉపయోగిస్తారు. వీటిలో డేగా, నల్లకాకి, తెల్లపర్ల, నెమలి కాకి, కాకిడేగ, కత్తిరాయి, జుమర్, నూరీ, కగర్, డుమర్, యాకూద్, కాకిడేగ, అబ్రాస్, పచ్చ కాకి, సీతువా, అసీల్ ప్రధానమైనవి. సాధారణ కోడిపుంజుల కంటే పందెంకోళ్లు భిన్నంగా ఉంటాయి. 24 గంటలు వాటిపై ప్రత్యేక నిఘా పెడతారు. పోటీకి ప్రత్యేక శిక్షణ.. ప్రత్యర్థి దెబ్బలు తట్టుకుని సత్తా చాటేలా కోడి పుంజులకు తర్ఫీదు ఇస్తున్నారు. కోడి బలిష్టంగా తయారు కావడానికి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. పిల్లగా ఉన్నప్పటి నుంచే పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రోజువారీ మెనూ, కసరత్తు, మాసాజ్తో వాటిని కుస్తీకి సిద్ధం చేస్తారు. నాలుగు నెలల శిక్షణా కాలాన్ని విభజించి పోటీకి తీర్చిదిద్దుతారు. ఉదయాన్నే వాటికి మౌత్ వాష్ చేయిస్తారు. ట్రైనర్ నోటిలో నీళ్లు పోసుకుని కోళ్ల ముఖంపై స్ప్రే చేస్తాడు. ఈ ప్రక్రియను కల్లె కొట్టడం అంటారు. పుంజు కండరాలు బిగుతుగా ఉండేందుకు వాకింగ్ చేయిస్తారు. వేడి నీళ్లు, స్పెషల్ షాంపూతో కోడికి స్నానం చేయిస్తారు. రెండు గంటల సమయం తర్వాత మళ్లీ శిక్షణ మొదలవుతుంది. మరో పుంజును బరిలో దించడం ద్వారా పోటీకి రెచ్చగొట్టేలా ట్రిక్స్ ఉపయోగిస్తారు. తద్వారా రెండు పుంజులూ పోటాపోటీగా పోరాడేలా చేస్తారు. ఈ పోటీ తర్వాత పుంజులకు మసాజ్ సెషన్ ఉంటుంది. అంతేకాదు.. తిన్నది ఒంటబట్టేవిధంగా కసరత్తులు ఉంటాయి. చెరువులో ఈత కొట్టిస్తారు. పందెం కోడి నిర్వహణకు నెలకు ఐదు నుంచి ఆరు వేల వరకూ ఖర్చు అవుతుంది భారీ డిమాండ్ ఉంది.. గత కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రాంతానికి మా కోళ్లు పెందేలకు తీసుకెళుతున్నారు. దీంతో భారీ డిమాండ్ ఏర్పడింది. అప్పటి నుంచి మేము పందెం కోళ్లను పెంచుతున్నాం.. వాటికి ప్రత్యేక ఆహారంతో పాటు, శిక్షణ కూడా ఇస్తాం. కోడి బ్రీడ్, జీవనశైలిని బట్టి వాటి ఆహారం, శిక్షణ ఉంటుంది. ఇప్పటికే పలువురు మా కోళ్లను కొనుగోలు చేశారు. ఆల్ బొగ్దాది అండ్ స్కోర్ ఆసీల్ పేరుతో ఇన్‌స్టా అకౌంట్ నిర్వహిస్తున్నాము. దీని ద్వారా కోళ్లు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. – హబీబ్ జైన్, పందెం కోళ్ల ఫామ్ యజమాని . -
సంక్రాంతి పందెం పుంజులకు స్పెషల్ ట్రైనింగ్!
సాక్షి, భీమవరం: సంక్రాంతి పేరు చెబితే గుర్తొచ్చేవి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలే. పండుగ మూడు రోజులు నిర్వహించే కోడి పందేల్లో రూ.కోట్లు చేతులు మారతాయి. పందేల బరిలో ప్రత్యర్థి పుంజును మట్టి కరిపించేందుకు సంక్రాంతికి 3 నెలల ముందు నుంచే పందెం పుంజుల సన్నద్ధతకు పెద్ద కసరత్తే మొదలవుతుంది.కోడి పందేలకు ఉన్న క్రేజ్‌కు తగ్గట్టుగానే పుంజుల పెంపకంలో పందెంరాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు తమ ఇళ్లు, చెరువులు, పొలాలు వద్ద పుంజులను పెంచితే.. ఎక్కువ మంది నాటుకోళ్ల కేంద్రాల్లో పుంజులను ఎంచుకుని వాటిని పందేలకు సిద్ధం చేసే పనిని పెంపకందారులకే అప్పగిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు విదేశాల నుంచి సంక్రాంతికి వచ్చే ఔత్సాహికులు ఆన్లైన్లో పుంజులను ఎంపిక చేసుకుని పెంపకందారులకు ముందే అడ్వాన్స్‌లు చెల్లిస్తుంటారు. పందెం పుంజులకు ఉన్న డిమాండ్‌తో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకోడేరు, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో 200కు పైగా నాటుకోళ్ల పెంపక కేంద్రాలు ఉన్నాయి.అత్యంత గోప్యంగా..కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతులకు చెందిన ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు వినియోగిస్తుంటారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వీటి పాత ఈకలు ఊడిపోయి కొత్త ఈకలు వస్తుంటాయి. అనంతరం వీటికి శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు శిక్షణ ప్రారంభిస్తారు. అందుకోసం ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తారు. పుంజులకిచ్చే ఆహారం, మందులు నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తాము ఎలా పెంచుతున్నదీ ఇతరులకు తెలియకుండా గోప్యత పాటిస్తారు. మకాంలోని ఐరన్ కేజ్‌లలో ఉండే పందెం కోళ్లను బయటకు తీసి ఆరుబయట కట్టడం మొదలుపెడతారు. అప్పటి నుంచే వీటి శిక్షణ మొదలవుతుంది.చదవండి: ఆయ్.. ఇంకా పట్టా‘లెక్కలేదండి’ప్రస్తుతం చాలా మకాంల వద్ద పుంజులను బయట కట్టడం ప్రారంభించారు. రోజు ఉదయాన్నే వేడి నీటిని పట్టిస్తారు. బరిలో చురుగ్గా కదిలేందుకు వీలుగా కాళ్లల్లో చురుకుదనానికి నెలరోజులు పాటు రోజు విడిచి రోజు సమీపంలోని చెరువులు, నీళ్ల తొట్టెల్లో ఈత కొట్టిస్తారు. తర్వాత ‘వీ’ ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగే విధంగా బేటా (నిర్ణీత పద్ధతిలో వాకింగ్) కొట్టిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ వాకింగ్ చేయిస్తారు. మేత పెట్టి 11 గంటల సమయం వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మార్చేస్తారు. పండుగలు దగ్గర పడుతున్నకొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్లపోతలు, శాఖలు చేయిస్తారు.5 వేలకు పైగా కోళ్లుకోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజును సిద్ధం చేసేందుకు మూడు నెలల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ఇలా పెంచిన పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్షల్లో అమ్ముతుంటారు. వీటిపై భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. సంక్రాంతి పందేల కోసం 5వేలకు పైగా పందెం కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటిద్వారా రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.మేత దర్జానే వేరుశిక్షణలో శక్తి, సామర్థ్యం పెంచేందుకు, శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు పందెం పుంజులకు ఈ మూడు నెలలు ప్రత్యేక మేత అందిస్తారు. కోడి సైజును బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మేక మాంసం, 5 వరకు బాదం గింజలు, రెండు వెల్లుల్లి రేకలు, ఒక ఎండు ఖర్జూరం, కోడిగుడ్డును ముక్కలు చేసి పెడతారు. తిరిగి సాయంత్రం చోళ్లు, గంట్లు, రాగులు మొదలైన వాటిని ఆహారంగా ఇస్తారు. -
Sankranti Festival 2023: కాకినాడలో రామ్‌గోపాల్ వర్మ సందడి
-
RGV: కాకినాడలో రామ్‌గోపాల్ వర్మ సందడి..
సాక్షి, కాకినాడ: సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో రెండో రోజు కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. బరులలో కోడి పుంజులు కాళ్లు దువ్వుతున్నాయి. పందాల కోసం ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు తరలివచ్చారు. కాగా, సంక్రాంతి పండగ నేపథ్యంలో కాకినాడలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సందడి చేశారు. వలసపాకలో కోడిపందాలను ఆయన తిలకించారు. పందెంలో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రామ్‌గోపాల్‌వర్మతో పాటు నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు. ఆర్జీవీ రాకతో కాకినాడలో సందడి వాతావరణం నెలకొంది. స్థానికులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాసానికి చేరుకున్న ఆర్జీవీ.. అక్కడ అల్పహారం స్వీకరించారు. అనంతరం కోడిపందాలను ఆసక్తిగా తిలకించారు. చదవండి: హైదరాబాద్ అల్లుడు.. భీమవరం మామ.. 173 రకాలతో.. -
ఇంతకీ ఏమిటా కుక్కుట శాస్త్రం.. అది ఏం చెబుతోంది?
సంక్రాంతి పర్వదినాన కోడి పందేలు హోరెత్తుతాయి. పుంజును బరిలో దించడానికి కూడా పలువురు పందేల రాయుళ్లు శాస్తాన్ని నమ్ముతారు. దాని ప్రకారమే నడుచుకుంటారు. ఆ శాస్త్రం పేరే కుక్కుట శాస్త్రం. ఇది కోడి పుంజుల పోరుకు దిశా నిర్దేశం చేసే పంచాంగం వంటిది. ఏళ్ల తరబడి కోడి పందేలు నిర్వహించే పలువురికి ఇదే ప్రామాణికం. సాక్షి, అమరావతి: నక్షత్ర బలంపైనే బరిలోకి దిగిన కోళ్ల గెలుపోటములు ఆధారపడి ఉంటాయని వారి నమ్మకం. బరిలో పోరుకు దిగిన పుంజుకు పిక్క బలంతో పాటు దాని యజమాని పేరు బలం కూడా తోడవుతుందని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే కోడి పందేల్లో సీనియర్లయిన వారంతా కుక్కుట శాస్త్రాన్ని ఔపోసన పట్టి మరీ.. వారం, తిథి, దిశను బట్టి అందుకు అనుగుణమైన రంగుల పుంజులను బరిలోకి దించుతారు. ఇంతకీ ఏమిటా కుక్కుట శాస్త్రం.. అది ఏం చెబుతోందంటే.. ఈకల రంగును బట్టి పేర్లు నల్లని ఈకలున్న పుంజును కాకి అని, తెల్లని ఈకలుంటే సేతు అని పిలుస్తారు. మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా గల కోడి పుంజును పర్ల అంటారు. మెడపై నల్లని ఈకలు గలవాటిని సవలగా పిలుస్తారు. నల్లటి శరీరం, 2, 3 రంగుల ఈకలు గలవి కొక్కిరాయి(కోడి). ఎర్రటి ఈకలుంటే.. డేగ, రెక్కలపై, వీపుపై పసుపు రంగు ఈకలుంటే.. నెమలి. నలుపు, ఎరుపు, పసుపు ఈకలుంటే.. కౌజు. ఎరుపు, బూడిద రంగుల ఈకలున్నవాటిని మైలగా పిలుస్తారు. ఒక్కో ఈకపై నలుపు, తెలుపు, ఎరుపు రంగులుంటే.. పూల. తెలుపు రెక్కలపై అక్కడక్కడా నలుపు రంగు, లేత గోధుమ రంగు ఈకలు గల కోడి పుంజు పింగళి. లేత బంగారు రంగు ఈకలు గలవి అబ్రాసు. ముంగిస జూలు రంగు గల పుంజు ముంగిస. తెలుపు, లేత ఎరుపు ఈకలు గల పుంజు గేరువా. నలుపు, తెలుపు ఈకలు గలవి తెల్లగౌడు. నలుపు, ఎరుపు ఈకలున్న ఎర్రగౌడు. తెల్లని ఈకలపై నల్ల మచ్చలుంటే.. సేతు. రెక్కలపై నల్ల మచ్చలుంటే.. నల్ల సవల. వీటితో పాటు కోడి నెమలి, కాకి నెమలి, పచ్చ కాకి వంటి మిశ్రమ రకాలున్నాయి. కోడి పుంజుల్లో కాకి, పచ్చ కాకి, కాకి నెమలి, డేగ ప్రసిద్ధమైనవి. సంక్రాంతి పండగ రోజుల్లో పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారా బలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేసి పందేలు వేస్తారు. భోగి రోజున గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు, సంక్రాంతి రోజున యాసర కాకి డేగ, కాకి నెమలి, పసిమగల్ల కాకి, కాకి డేగ, కనుమ రోజున డేగ, ఎర్రకాకి డేగలు విజయం సాధిస్తాయని నమ్ముతారు. నక్షత్రాన్ని బట్టి కోడి పోరు నక్షత్ర ప్రభావం మనుషుల మీదే కాకుండా పక్షులు, జంతువుల మీద కూడా ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా కోడి పుంజుల్లో రక్త ప్రసరణపై గ్రహ ప్రభావం ఉంటుందని విశ్వసిస్తారు. దీంతో నక్షత్రాన్ని బట్టి ఆయా రంగుల కోడి పుంజులను బరిలోకి దించేందుకు దాని యజమాని పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి జాతకాన్ని జోడించి లెక్క చూసి మరీ పోటీకి దిగుతారు. 27 నక్షత్రాలు, పందెం కోళ్లపై ప్రభావం చూపిస్తాయని, నక్షత్రాలను బట్టి అనుకూలమైన రంగుల కోళ్లను బరిలోకి దించితే గెలుపు ఖాయమని నమ్ముతారు. ‘దిశ’తో దశ తిరుగుతుంది కుక్కుట శాస్త్రం ప్రకారం.. ఏ రోజు ఏ దిశలో కోడిపుంజును పందేనికి వదలాలనే దానిపై స్పష్టమైన అంచనా ఉంటుంది. ఆది, శుక్రవారాల్లో ఉత్తర దిశలో, సోమ, శనివారాల్లో దక్షిణ దిశలో, మంగళవారం తూర్పు దిశలో, బుధవారం, గురువారం పడమర దిశలో బరిలో దించుతుంటారు. వారాలను, పక్షాలను అనుసరించి కొన్ని జాతుల కోడి పుంజుల జీర్ణశక్తి మందగించి అవి ఓటమిపాలవుతాయని, వాటి ప్రత్యర్థులు విజయం సాధిస్తాయని అంటారు. చదవండి: పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పాదపూజ ఎనిమిది దిక్కుల్లో వారాన్ని బట్టి ఏ దిశలో ఉండే బరిలో.. పోటీకి పుంజును దించితే విజయం దక్కుతుందో కూడా చూస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల సమయాన్ని అనుసరించి అవస్థా భేదాలు లెక్కిస్తుంటారు. ఇదే తరహాలో పక్షి జాతుల్లో పగటి సమయంలో గల ఐదు జాములకు ఐదు అవస్థలుగా ప్రస్తావించారు. భోజవావస్థలో కోడి పుంజును బరిలోకి దించితే విజయం దక్కుతుందని, రాజ్యావస్థలో పుంజు సులభంగా గెలుస్తుందని, గమనావస్థలో పందేనికి దించితే సామాన్య లాభం మాత్రమే వస్తుందని, నిద్రావస్థలో అపజయం పాలవుతుందని, జపావస్థలో బరిలోకి దించితే మృతి చెందుతుందని నమ్ముతారు. -
కోడి రె‘ఢీ’..!
సాక్షి, అమరావతి: కోడి పందేలు జరగనివ్వబోమని పోలీసులు.. జరిపి తీరుతామని నిర్వాహకులు.. ఇలా ఏటా సంక్రాంతి ముందు జరిగే తంతే. ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. కానీ, ఈసారి ఒకింత ఉత్కంఠ నెలకొంది. ఉభయ గోదావరి జిల్లాలు సంక్రాంతి మూడు రోజులపాటు కోడి పందేలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వాటిని నిర్వహించడాన్ని ప్రతిష్టగా భావించే వాళ్లంతా మళ్లీ రంగంలోకి దిగారు. ఏదో రకంగా ఒత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చుకుంటామనే ధీమాతో నిర్వాహకులు బరి గీస్తున్నారు. ఇందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని వందల గ్రామాల్లో కోడి పందేల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లోని భీమవరం, వెంప, జువ్వలపాలెం, ఐ.భీమవరం, యండగండి, కేశవరం, జంగారెడ్డిగూడెం, పోలవరం, ఎదుర్లంక, కేశనకుర్రు, గోడితిప్ప తదితర 60కి పైగా ప్రాంతాల్లో భారీ పందేల బరులు సిద్ధంచేసుకున్నారు. మరో 400 ఓ మోస్తరు బరులు సిద్ధంచేస్తున్నారు. కొనసాగుతున్న పోలీసుల దాడులు కోడి పందేలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పోలీసులు వాటిని అడ్డుకునేందుకు గట్టి చర్యలు చేపట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఆదివారం వరకు పోలీసులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు పెద్దఎత్తున దాడులు చేసి శనివారం వరకు 638 కేసులు నమోదు చేశారు. 2,730 మందిపై బైండోవర్ కేసులు కట్టారు. కత్తులు కట్టే వారిపై కూడా కేసులు నమోదు చేశారు. పందేలు నిర్వహించకుండా ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులతో కమిటీలు వేశారు. మద్యం, పేకాటపై ఉక్కుపాదమే.. సంప్రదాయం పేరుతో ఒత్తిడి తెచ్చి కోడి పందేలు నిర్వహించుకోవడానికి పోలీసులు అనధికారికంగా అనుమతిస్తే అవి మూడు రోజులపాటు జరుగుతాయి. ప్రతి బరి వద్ద మద్యం విక్రయాలతోపాటు, పేకాట, గుండాట తదితర ఆటలు పెద్దఎత్తున జరిగేవి. వీటిని నిర్వహించుకునేందుకు గాంబ్లింగ్ నిర్వాహకుల వద్ద నుంచి కోడి పందేల నిర్వాహకులకు లక్షల్లో డబ్బులు ముట్టేవి. ఇదే ధైర్యంతో ఈసారి పెద్ద బరుల వద్ద జూదం నిర్వహణకు, మద్యం విక్రయాలకు అనేకమంది వేలం పాట పాడి పెద్ద మొత్తాల్లో డబ్బులు ఇచ్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉదా.. తూర్పుగోదావరి జిల్లాలోని ఎదుర్లంక బరికి రూ.65 లక్షలు, గోడితిప్ప రూ.50లక్షలు, కేశనకుర్రు రూ.20లక్షలు చొప్పున చెల్లించి ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. ఇలా అనేక బరుల వద్ద పేకాట, మద్యం అమ్మకాలకు ఒప్పందాలు జరిగాయి. అయితే, ఈసారి కోడి పందేలకు ఒకవేళ అనుమతిచ్చినా అక్కడ పేకాటలు, మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మేకింగ్ ఆఫ్ పందెం కోళ్లు
-
గోదారోళ్ల పందెం కొళ్ళు
-
కళ్లల్లో కారం కొట్టి.. ఇనుపరాడ్లతో..
సాక్షి, తూర్పుగోదావరి : అమలాపురంలో కోడిపుంజులకై నెలకొన్న వివాదం కలకలం రేపింది. రోళ్లపాలెంలో కోడిపుంజుల విషయంలో వాగ్వాదం తలెత్తడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై మహిళలు కారం కొట్టారు. మరికొందరు ఇనుపరాడ్లతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురు గాయాలపాలు కాగా ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాలుదువ్వుతున్న కోడి పుంజులు
పల్లెల్లో సందడే సందడి.. సత్తుపల్లి: సరదాల సంక్రాంతి పండగ వచ్చేసింది... భోగి మంటలు.. పిండివంటలు.. గొబ్బెమ్మ లు.. రంగవల్లులతో పండగ వాతావరణం నెలకొంది. మరో వైపు సంస్కృతి పేరిట కోడిపందేలకు వెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. సరిహద్దుల్లో సంక్రాంతి కోడిపుంజుల కొట్లాట కోసం పందెం రాయుళ్లు ఆంధ్రావైపు పరుగులు పెడుతున్నారు. పోలీసుల ఆంక్షలతో ఈసారి పందేలు జరుగుతాయో.. లేదోనంటూ పందెం రాయుళ్లు తెగ హైరానా పడ్డారు. సత్తుపల్లి నియోజకవర్గం తెలంగాణ–ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో కోడిపందేల సంస్కృతి బాగా ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లా శీతానగరం, ఐ.భీమవరం, పాలకొల్లు, వేల్పులచర్ల, కొప్పాక, దెందులూరు, కృష్ణాజిల్లా తిరువూరు, కాకర్ల ప్రాంతాలలో పందెం బిర్రులు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే.. పందెం రాయుళ్లు ఉదయం నుంచే పందేలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటూ ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. సీతానగరం, తిరువూరు ప్రాం తాలలో కోడిపందేలు జరుగుతాయో, లేదో అనే ప్రచారం జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట వర కు పందేలు జరగకపోవటంతో పందెం రాయుళ్లలో నిరాశ నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు అనుమతి వచ్చిందని సమాచారం అందటంతో సత్తుపల్లి చుట్టు పక్కల ప్రాంతా ల నుంచి తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సంక్రాంతిపండగ మూడురోజులు పందేలు చూసేందుకు.. కాసేందుకు ఉత్సాహం చూపిస్తారు. సంకలో కోడిపుంజు ను పెట్టుకొని కారు, ద్విచక్రవాహనాలపై ఆంధ్రా వైపు పందెం రాయుళ్లు పరుగులు పెట్టడం పరిపాటిగా మారింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, స్నేహితులతో పందెం బిర్రుల వద్దకు వెళ్లి సరదా తీర్చుకుంటున్నారు. తోటల్లో మద్యం.. ముక్క రెడీ.. కోడిపందేల కోసం మామిడితోటలు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. పలావ్ బిర్యాని, చికెన్ ఫ్రైతో మాంసం ప్రియులను ఆకట్టుకుంటున్నారు. మద్యం, మాసం ఒకే చోట దొరుకుతుండటంతో అక్కడక్కడ ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో జనరేటర్ సౌకర్యం కల్పించి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. కోడి పందేల మాటున జూదం.. కోడి పందేల మాటున రూ.లక్షల్లో పేకాట జూదం నడుస్తుంది. ఓ వైపు కోడి పందేలు జరుగుతుండగానే మరో వైపు కోసాట (లోనాబయట), గుండు పటాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. రూ.లక్షల్లో జూదం నడుస్తుండటంతో ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. కోడిపందేలు నియంత్రించేందుకు పోలీసులు నిఘా ముమ్మరం చేసి హె చ్చరికలు జారీ చేసినప్పటికీ పందెం రాయుళ్లు ఖా తరు చేయటం లేదు. పోలీసులు సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నా పందెంరాయుళ్లు కోడిపుంజులను వేరే దారిన పంపించి పందేల స్థావరాలకు చేరుకుంటున్నారు. ఆంధ్రా బిర్రుల్లో ‘పేట’ పందెం కోళ్లు.. అశ్వారావుపేట: స్థానిక ఎన్నికలకోసం కాలు దువ్వుతున్న అభ్యర్థులు, వాళ్లను ఎన్నుకోవాల్సిన ఓటర్లు సోమవారం అశ్వారావుపేట సరిహద్దులో ఆంధ్రా కోడిపందేల బిర్రులకు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడిగూడెం మండ లం శ్రీనివాసపురం, దేవులపల్లి, జీలుగుమిల్లి మండలంలోని పలు గ్రామాల్లో 90 శాతం వరకు అశ్వారావుపేట మండల వాసులే ఉన్నారు. తెలంగాణ జూదరుల కోసం ఆంధ్రా నిర్వాహకులు సదుపాయాలు, రక్షణ కల్పించేందుకు పోటీలు పడుతున్నారు. బిర్రుల వద్ద ఫెన్సింగ్, కుర్చీలు, బల్లలు, ఉచితంగా స్నాక్స్, బిర్యాని, మంచినీటి సౌకర్యం కల్పించారు. పేకాట, గుండు పట్టాలు, మూడు ముక్కలాట, పెద్ద మేడ, చిన్న మేడ జూద క్రీడల్లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. గ్రామాల సమీపంలోనే ఉన్న పామాయిల్, మామిడి, కొబ్బరి తోటలే కోడి పందేలకు అడ్డాలయ్యాయి. తెలంగాణలో కోడిపందేలు, జూద క్రీడలకు అనుమతులు లేనందున ఆంధ్రా బిర్రులకు పోయి, పదిశాతం కేబుల్ (నిర్వహణ ఫీజు) చెల్లించి జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నా రు. ఒక్కొక్క పందెం బిర్రులో ఇరువైపులా రూ. 50వేలు, గెలిచినవారికి రూ.90వేలు వస్తే వీటిలో పదిశాతం కేబుల్ ఫీజు చెల్లించాలి. బిర్రు లోపల ఒక్కొక్కొ పందెం రూ.లక్ష చేతులు మారితే బిర్రు బయట పై పందేల రూపంలో రూ.5 లక్షలకు పైగానే చేతులు మారుతున్నాయి. ఆరుగాలం శ్రమించి కూడబెట్టుకున్నదంతా ఆంధ్రా బిర్రుల్లో డబ్బును ధారబోస్తున్నారు. జూదరులు సరిహద్దు లు దాటకుండా నిలుపుదల చేయడంలో పోలీసు ల పాత్ర నామమాత్రంగా ఉండటంతో ఆంధ్రా బిర్రుల్లో ‘పేట’ పందేలు జోరందుకున్నాయి. విద్యుత్ దీపాల వెలుగులో పందేలు కొనసాగిస్తున్నారు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పండగ శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ చేస్తే కొందరి ఫోన్లు స్వీచ్‌ఆఫ్, అంతా ఏకాగ్రత తో పందేల్లో పాల్గొన్నారు. -
కో‘ఢీ’ పందాలకు సర్వం సిద్ధం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. డూడూ బసవన్నలు, హరిదాసులు పల్లెటూర్లలో సందడి చేస్తున్నారు. ఇంటిముందు తీర్చిదిద్దిన రంగ వల్లులతో ప్రతి పల్లె కలర్ ఫుల్ గా కనపడుతోంది. సంక్రాంతి పండుగ స్పెషల్ కోడి పందాలకు నిర్వాహకులు బరులు సిద్ధం చేసుకుంటున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో నిర్వహించే కోడి పందాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా జనాలు తరలివస్తున్నారు. వీఐపీల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భీమవరం, ఏలూరు, నరసాపురం, అమలాపురం, కాకినాడ ప్రాంతాల్లోని హోటల్ గదులు ఇప్పటికే బుక్ అయిపోయాయి. కోడి పందాలతో పాటు గుండాట, పేకాటకు కూడా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పందాలను నిర్వహించడానికి ఫ్లడ్ లైట్లను కూడా వాడుతున్నారు. పోలీసులు తమ జోలికి రాకుండా చూడాలంటూ అధికార పార్టీ నేతలపై పందెం రాయుళ్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ సారి పందేలు 100 కోట్ల రూపాయలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు పందాలు జరగకుండా అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. పొట్టేళ్లు, కోడి పందాలకు బరులు సిద్ధం.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో పొట్టేళ్లు, కోడి పందాలకు బరులు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో పందాలు నిర్వహణకు సర్వం సిద్దమయ్యాయి. పందాలకు హైదరాబాద్ నుంచి అంపాపురంకు పొట్టేళ్లు చేరుకున్నాయి. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి పందెం కోళ్లను తరలించారు. దివిసీమలో ఘనంగా పడవ పోటీలు.. సంక్రాంతి పండుగను పురస్కరించుకోని కృష్ణా జిల్లా నాగాయలంకలో దివిసీమ సంప్రదాయ పడవ పోటీలు ప్రారంభం అయ్యాయి. మండలి చైర్మన్ బుద్ధప్రసాద్ ఆదివారం ఈ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు నాటు(కోల) పడవల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో 40 టీమ్‌లు పాల్గొన్నాయి. తెలంగాణలోను కోడి పందాలు.. ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఖమ్మంతో పాటు.. తెలంగాణలోని పలు పల్లెల్లో కూడా కోడి పందాలు నిర్వహణకు రంగం సిద్దమైంది. సత్తుపల్లిలో పందెం రాయుళ్లు కోడి పందాలకు బరులు సిద్ధం చేశారు. పండుగ సంబరాల పేరుతో చేపడుతున్న ఈ పందాలను ఎలాగైనా అడ్డుకుని తీరుతామని పోలీసులు చెబుతున్నారు. -
కోళ్ల పందాల శిబిరాలపై పోలీసుల దాడి
-
కోడిపందెం శిబిరంపై పోలీసుల దాడి.. ఇద్దరు మృతి
సాక్షి, చిత్తపూరు : కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గొల్లగూడెంలో విషాదం చోటుచేసుకుంది. కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందెం శిబిరంపై దాడి చేశారు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నూతిలో పడిపోయి మృతిచెందారు. మృతులు చిట్టూరి శ్రీనివాసరావు(20), మేకల చెన్నకేశవరావు(26)గా గుర్తించారు. పండుగ రోజుల్లో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ముందే సంకురాత్రి!
సాక్షి ప్రతినిధి ఏలూరు: జిల్లాలో ముందే కోడి కూసింది. 13రోజుల ముందే సంక్రాంతి వచ్చేసింది. కోడి పందేలకు తెరలేచింది. సాధారణంగా ప్రతి ఏడాది సంక్రాంతి మూడు రోజులపాటు జిల్లాలో పెద్ద ఎత్తున పందేలు నిర్వహిస్తుంటారు. సంక్రాంతి పండుగకు ఇంకా 13 రోజులు ఉండగానే జిల్లాలో పందేలు జోరందుకున్నాయి. ఇవి రాత్రుళ్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వీటికి పోలీసు అధికారులు తెరవెనుక సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాత్రుళ్లు.. ఊరికి దూరంగా.. ప్రస్తుతం కోడిపందేల నిర్వహణ రాత్రి సమయాల్లోనే నిర్వహిస్తున్నారు. ఊరికి చివర ఉండి పోలీసులు రావడానికి సమయం పట్టే ప్రాంతాలను కోడి పందేల కోసం ఎంచుకుంటున్నారు. తాజాగా లింగపాలెం మండలం కలరాయనిగూడెం ప్రగతిపురంలో ఓ ఆయిల్‌పామ్ తోటలో అధికార పార్టీకి చెందిన నేత ఆధ్వర్యంలో సోమవారం రాత్రి భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఏటా ఆ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహించే ఓ నేత ముందుగానే పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుని పందేలకు తెరలేపినట్లు సమాచారం. స్థానిక ఎస్సై విజయవాడ బందోబస్తులో ఉండటంతోపాటు పోలీసులు నూతన సంవత్సర వేడుకల హడావుడిలో ఉండటంతో జూదరులు యథేచ్ఛగా పందేలు నిర్వహించారు. చేతులు మారిన రూ.లక్షలు సోమవారం రాత్రి ప్రగతిపురంలోని ఓ ఆయిల్‌పామ్ తోటలో నిర్వహించిన కోడి పందేల్లో లక్షలాది రూపాయిలు చేతులు మారి నట్లు సమాచారం. జిల్లా నుంచే కాకుండా కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు ఈ కోడి పందేలకు హాజరయ్యారు. పందేలు జరిగే ప్రాంతానికి సుమారు 150 వరకూ కార్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ముందస్తుగానే ప్రణాళిక ప్రకారమే ఈ పందేలు నిర్వహించారని, అందుకే పెద్ద సంఖ్యలో జూదరులు వచ్చారని సమాచారం. సోమవారం రాత్రి మొత్తం ఐదు పందేలు నిర్వహించగా వాటి ద్వారా సుమారు రూ. 40 లక్షల వరకు చేతులు మారినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ప్రగతిపురంలో కోడి పందేలు నిర్వహిస్తున్న సమాచారం జిల్లా పోలీసు బాస్‌కు అందడంతో ఆయన ఆదేశాలతో టి.నరసాపురం ఎస్సై ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. సుమారు 60 కిలోమీటర్ల దూరం నుంచి సదరు పోలీసులు పందేలు జరుగుతున్న ప్రదేశానికి వచ్చే సరికి జూదరులు ఆ ప్రదేశం నుంచి జారుకున్నారు. కొద్దిసేపట్లో దాడులు జరుగుతాయని అధికార పార్టీకి చెందిన సదరు నిర్వాహకుడికి ఓ పోలీసు అధికారే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లేలోగానే జూదరులు జారుకున్నారు. కోడి పందేలకు స్థానిక పోలీసు అధికారులే సహకారం అందించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా పోలీసు బాస్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి! -
ఉద్రిక్తత నడుమ పల్నాటి కోడిపోరు
కారంపూడి (మాచర్ల): పల్నాటి వీరారాధనోత్సవాల్లో ప్రధానమైన కోడిపోరు ఉత్సవం సందర్భంగా ఆదివారం గుంటూరు జిల్లా కారంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. కోడిపోరు ఉత్సవ వేదికగా టీడీపీ నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టే చర్యలకు దిగారు. తోపులాటలు చోటుచేసుకున్నాయి. గొడవలు జరగకుండా వీరులగుడి ఆవరణలోకి ఎవరూ పార్టీ జెండాలతో ప్రవేశించకుండా, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా అధికారులు చర్యలు చేపట్టగా వైఎస్సార్సీపీ కట్టుబడింది. ఆ ప్రకారమే వైఎస్సార్సీపీ శాసన సభ పార్టీ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ గురజాల నాయకులు ఎనుముల మురళీధరరెడ్డి పార్టీ శ్రేణులు జెండాలను గుడి బయటే ఉంచి వీరులగుడి ప్రాంగణంలోని కోడిపోరు గరిడీకి చేరుకున్నారు. పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి సహా ఏడుగురిని గరిడీలోకి అనుమతించారు. ఎమ్మెల్యే పీఆర్కే.. బ్రహ్మనాయుడు పక్షం వైపు పోటీకి దిగి పీఠాధిపతి పిడుగు తరుణ్‌చెన్నకేశవతో ఆశీనులయ్యారు. కొద్దిసేపటికి మాచర్ల టీడీపీ ఇన్చార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి డీజే ర్యాలీతో వీరులగుడి వరకు వచ్చారు. అయితే కొందరు పార్టీ నేతలు మెడలో పార్టీ కండువాలు, జెండాలతో గుడిలోకి నినాదాలతో దూసుకొచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన వైఎస్సార్సీపీ శ్రేణులు తాము కూడా జెండాలతో వస్తామని బయలుదేరడం, రెండు పార్టీల వారు వందలాదిగా ఎదురుపడడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాహాబాహీ తలపడే పరిస్థితి వచ్చింది. ఉత్సవాల పవిత్రతను దెబ్బతీస్తారా? అని వైఎస్సార్ సీపీ శ్రేణులు టీడీపీ నేతలపై ఆగ్రహించారు. టీడీపీ నేతలు దౌర్జన్యానికి సిద్ధపడ్డారు. పార్టీ జెండాలతో వస్తున్న టీడీపీ కార్యకర్తలు సీఐ, ఎస్ఐ, పోలీసులకు పరిస్థితిని అదుపు చేయడం కష్టమైంది. పోలీసులు ఎంత యత్నించినా టీడీపీ నాయకులు ఒకటిరెండు జెండాలు ప్రాంగణంలో ప్రదర్శించారు. అప్పటిదాకా మిన్నకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు జైజగన్ అంటూ నినదించారు. ప్రతిగా టీడీపీ నాయకులు ఎవరికి నచ్చిన నాయకునికి వారు జిందాబాద్‌లు కొట్టారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ పార్టీ శ్రేణులకు సర్దిచెప్పి, ఉద్రిక్తత తగ్గేలా చూశారు. అనంతరం బ్రహ్మనాయుడు పుంజు చిట్టిమల్లుతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నాగమ్మ పుంజు శివంగిడేగతో చలమారెడ్డి పోటీలకు సిద్ధమయ్యారు. అంతకు ముందు వీరవిద్యావంతులు కోడిపోరు కథాగానం చేశారు. -
కొట్టుకోవద్దు.. ప్లీజ్ ఆపండి..!
కోయంబత్తూరు: ముద్దు ముద్దుగా ఉండే కుక్కపిల్లలను చాలా మంది ఇష్టపడతారు. అలాంటి ఓ కుక్కపిల్ల చేసిన ప్రయత్నం మాత్రం నెటిజన్లకు విపరీతంగా నవ్వు తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన వ్యాపారవేత్త మురళీధరన్‌కు జంతువులంటే చాలా ఇష్టం. అందుకే ఆయన తన ఇంటి వద్ద కోళ్లు, పిల్లులు, కుక్కల్ని పెంచుతున్నారు. ఇటీవల ఆయన ఇంటి వద్ద ఉన్న ఓ రెండు కోళ్లు ఒకదానితో ఒకటి పోటీపడుతున్న క్రమంలో వీడియోను తీశారు. అందులో విశేషం ఎంటని అనుకుంటున్నారా రెండు కోళ్లు పోటీపడుతుంటే ఓ కుక్కపిల్ల మాత్రం వాటిని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. వాటితో కలిసి పెరగడం వల్లనో ఎమో తెలియదుగానీ రెండు కోళ్లను వీడదీయడానికి ఆ కుక్కపిల్ల విశ్వప్రయత్నం చేసింది. ‘కొట్టుకోవద్దు.. ప్లీజ్ ఆపండి’ అని అర్థం వచ్చేలా ఆ కొట్లాటను ఆపడానికి తన వంతు ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కొట్టుకోవద్దు.. ప్లీజ్ ఆపండి..
-
షాక్: కోడిపందేల రాయుళ్లకు జైలు
సాక్షి, తణుకు: కోడిపందేల రాయుళ్లకు న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. జైలు శిక్ష, జరిమానా విధించింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా తణుకు సర్కిల్ పరిధిలో కోడిపందేలు నిర్వహించిన 93 మందిని పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష, రూ. 200 చొప్పున జరిమానా విధించించారు. నిందితులను తణుకు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. కోడిపందేలపై పోలీసులు దాడి పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపేట గ్రామంలో కోడిపందేలపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ. 2010 నగదు, 2 కోళ్లు, 2 కత్తులును స్వాధీనం చేసుకున్నారు. -
పేర్లు ఇవ్వకుంటే ఫుటేజీ తెప్పిస్తాం
సాక్షి, హైదరాబాద్: కోడి పందేలు జరగడానికి వీల్లేదంటూ తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పందేలు నిర్వహించిన ప్రజాప్రతినిధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడి పందేలు నిర్వహించి తీరుతామంటూ సవాళ్లు విసిరిన ప్రజా ప్రతినిధులను తాము టీవీల్లో చూశామని, వారి పేర్లను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పేర్లు ఇవ్వ కుంటే టీవీల నుంచి ఫుటేజీ తెప్పించుకుని వారిని ప్రతి వాదులుగా చేరుస్తామంది. పందేలు జరిపిన నిర్వాహకుల్లో ప్రజా ప్రతినిధులు ఎంతమంది? ఎంతమందిపై కేసులు పెట్టారో చెప్పాలంది. తాము కోరిన వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగ నాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సీఎస్ దినేష్ కుమార్ సోమవారం విచారణకు హాజరై నివేదిక సమర్పించారు. -
అంతా అయిపోయాక మందలింపు డ్రామా
-
ఆదేశాలను అపహాస్యం చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా కోడి పందేలు జరగడానికి వీల్లేదంటూ తాము ఇచ్చిన ఆదేశాలను కేవలం కాగితాలకే పరిమితం చేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది తమ ఆదేశాలను అపహాస్యం చేయడమేనని, ఇది అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. కోడి పందేలు జరగడానికి వీల్లేదని ఆదేశించినా పందేలు యథాతథంగా జరిగాయని, స్వయంగా ప్రజా ప్రతినిధులే పందేలకు హాజరయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. జరిగిన కోడి పందేలను ప్రపంచమంతా చూసిందని పేర్కొంది. అరుదుగా టీవీలు చూసే తమకే, టీవీల్లో కోడి పందేల దృశ్యాలు పదే పదే కనిపించాయని తెలిపింది. ‘కోడి పందేల విషయంలో ఏమీ చేయలేమంటూ మీరు నిస్సహాయత వ్యక్తం చేస్తే, ఆ విషయాన్ని మాకే చెప్పాలి.. అప్పుడు మిగిలిన సంగతులను మేం చూసుకుంటాం’ అని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), ఏపీ డీజీపీలను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మా ఆదేశాలను సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు కోడి పందేలు జరిగిన తీరును చూస్తుంటే మా ఆదేశాలను అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోడి పందేలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికలు ఇవ్వాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. నివేదికలు ఇవ్వకపోవడమే కాక, మరింత గడువు కోరడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. తమ ఆదేశాల ప్రకారం నివేదికలు సమర్పించనందుకు అటు సీఎస్ దినేష్‌కుమార్, ఇటు డీజీపీ ఎం.మాలకొండయ్యను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఎందుకు నివేదికలు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని వారికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం, వెంప, శ్రీరాంపురం గ్రామాలలో కోడి పందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహించారని, ఈ సంక్రాంతి సందర్భంగా ఇవేమీ జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కలిదిండి రామ చంద్రరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
కోడి పందాలపై హైకోర్టు ఆగ్రహం
-
‘పచ్చ’నేతల సాక్షిగా హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన
సాక్షి, అమరావతి : కోడి పందేలను తీవ్రంగా పరిగణిస్తామని, ఈసారి ఎక్కడైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు చేసిన హెచ్చరికలు ఫలించలేదు! అధికార పార్టీ నేతల అభయంతో మూడు రోజుల పాటు విచ్చలవిడిగా జరిగిన కోడి పందేల జాతరలో సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు సమాచారం. ఇందులో సింహభాగం వాటా ఉభయ గోదావరి, కృఇష్ణా జిల్లాలదే. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి టీడీపీ ప్రజాప్రతినిధులే దగ్గరుండీ మరీ కోడిపందేలు నిర్వహించటం గమనార్హం. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో భోగి రోజు బహిరంగంగానే కోడి పందాలకు శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లా మురమళ్లలో కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, గొల్లపల్లి సూర్యారావు, దాట్ల బుచ్చిబాబు, బొండా ఉమా, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, కొప్పాకలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమక్షంలో కోడి పందేలు జరిగాయి. టీడీపీ పెద్దల ఆశీస్సులతోనే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మరోవైపు బరుల నిర్వాహకులైన టీడీపీ నేతలు ఒక్కో పందెంపై 10 శాతం కమీషన్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కమీషన్ల రూపంలోనే రూ.100 కోట్లు వసూలైనట్లు అంచనా. అమరావతిలో 150 బరులు న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా సంక్రాంతి మూడురోజుల పాటు సాగిన కోడిపందేలను ప్రభుత్వం ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పందేల వరద కట్టలు తెంచుకోగా కృష్ణా జిల్లాలో 100, గుంటూరు జిల్లాలో 50 బరులు ఏర్పాటయ్యాయి. చాలాచోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే పందేలను ప్రోత్సహించారు. బరుల వద్దే మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. ఎమ్మార్పీపై 30 శాతం అధిక ధరలతో మద్యం విక్రయించారు. మద్యం అమ్మకాల్లో టీడీపీ నేతలు 20 శాతం కమీషన్ కింద వసూలు చేశారు. బరుల నిర్వాహకులు జూదంపై 10 శాతం కమీషన్‌గా వసూలు చేశారు. వేల సంఖ్యలో వాహనాలు బరుల వద్ద బారులు తీరటంతో ఒకరోజు పార్కింగ్‌కు కారుకు రూ.100 చొప్పున వసూలు చేశారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో సుమారు 35 ఎకరాల్లో భారీబరులు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్లతో పాటు పలువురు టీడీపీ నేతలు దగ్గరుండి పందేలను నిర్వహించారు. ఇక్కడ మూడు రోజుల వ్యవధిలో సుమారు రూ.3 కోట్ల మేర డబ్బులు చేతులు మారినట్టు సమాచారం. విజయవాడ భవానీపురంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ బహిరంగంగా కోడిపందేలకు మద్దతుగా నిలిచారు. తూర్పు గోదావరిలో.. రూ.75 కోట్ల పందేలు తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు చేతులెత్తేయడంతో ఈ ఏడాది కొత్త ప్రాంతాల్లో కూడా పందేలు జోరుగా సాగాయి. జిల్లాలో మూడు రోజుల్లో సుమారు రూ.75 కోట్ల మేర చేతులు మారినట్టు అంచనా. మురమళ్లలోనే రూ.పది కోట్ల మేర పందేలు కాశారు. సోమ, మంగళవారం తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యాపారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పందేలు కాయడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ మంగళవారం గుండాటలో పాల్గొని రూ.నాలుగు లక్షల వరకు పందెం గెలవడం గమనార్హం. మలికిపురం మండలంలో అశ్లీల నృత్యాలు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వేట్లపాలెంలో రూ.ఆరు కోట్ల మేర పందేలు జరిగాయని అంచనా. ఇదే మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలో రూ.4 కోట్ల మేర పందేలు కాసినట్లు సమాచారం. మలికిపురం, లక్కవరం, రాజోలు మండలం శివకోడు, ఆత్రేయపురం, మండపేట, రాయవరం, పిఠాపురం, పెద్దాపురం, రాజానగరం మండలం దివాన్‌చెరువు, పుణ్యక్షేత్రం, రంపచోడవరం, దేవీపట్నం, చింతూరుల్లో పందేలు జోరుగా సాగాయి. కేశనపపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెంలో బహిరంగంగా అశ్లీల నృత్యాలు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఊపందుకున్న పందేలు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సమక్షంలో ఆరిలోవలో కత్తులు కట్టి కోడి పందాలను నిర్వహించారు. విశాఖ నగరం మొత్తంమ్మీద ఆరిలోవలో రెండంటే రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు. 3 కోడిపుంజులు, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లావాప్తంగా 145 మందిపై కేసులు నమోదు చేశారు. 77 కోడి పుంజులు, రూ.1,48,637 నగదును స్వాధీనం చేసుకున్నారు. పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల్లో పందాలు సాగాయి. 77 మందిపై కేసులు నమోదు చేసి రూ.1,39,018 స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో రూ.3 కోట్లు వరకూ పందేలు కాసినట్లు సమాచారం. అనామకులపై పెట్టీ కేసులు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెంలో 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఐదు కోళ్లు, కత్తులు, రూ.10,580 నగదు స్వాధీనం చేసుకున్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 3 కోళ్లు, రూ.1,500 స్వాధీనం చేసుకున్నారు. హనుమంతునిపాడు మండలం హాజీపురం వద్ద కొత్తూరులో ఏడుగురు పందెంరాయుళ్లను అరెస్టు చేసి రూ.3,350 నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలు, జూదాలను అడ్డుకోలేకపోయిన పోలీసులు కేసుల లెక్కలు చెప్పేందుకు మాత్రం ఏర్పాట్లు చేసుకున్నారు. 700 వరకూ పెట్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. పలు గ్రామాల్లో అనామకులపై కేసులు దాఖలైనట్లు సమాచారం. మంత్రి ఆది సొంతూరులో జోరుగా జూదం సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలో మంత్రి ఆదినారాయణరెడ్డి స్వగ్రామం దేవగుడిలో కోడి పందేలు, పేకాట విచ్చలవిడిగా సాగాయి. రూ.లక్షల్లో పందేలు సాగినట్లు తెలుస్తోంది. పోలీసులు తనిఖీలు జరిపినా ముందే సమాచారం అందటంతో పందెంరాయుళ్లు జాగ్రత్త పడ్డారు. -
పందెం కోళ్లు
నక్కాయపాలెంలో అఖిల భారత కోళ్ల మహాసభ జరుగుతుంది. చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపు గౌడ, తెలుపు గౌడ...ఒక్కటనేమిటి రకరకాల కోళ్లు వేల సంఖ్యలో ఈ మహాసభకు విచ్చేశాయి. కోళ్ల సంఘం ప్రెసిడెంట్ కొక్కిరాయి కోడి మైక్ అందుకొని మాట్లాడటం మొదలుపెట్టింది...‘‘డియర్ ఫ్రెండ్స్, ముందు మీకో జోకు చెప్పి నా ప్రసంగాన్ని మొదలుపెడతాను’’ జోక్ అనే మాట వినగానే సభలోని కోళ్లన్నీ ‘కొక్కరో...కొక్కరో’ అని పెద్దగా నవ్వాయి. ఆ నవ్వులు విని ప్రెసిడెంట్ కోడికి కోపం వచ్చింది. గొంతు పెంచి ఇలా అరిచింది...‘కోడి మెదడు అని మనుషులు ఇందుకే వెటకారం చేస్తుంటారు. నేను ఇంకా జోక్ చెప్పనే లేదు. క్కోక్కోక్కో అని తెగ నవ్వేస్తున్నారు’’ ఈ మాట విని వైస్ ప్రెసిడెంట్ కోడికి కోపం వచ్చింది.‘‘సరే చెప్పి చావండి’’ అని విసుక్కొంది. అప్పుడు అధ్యక్ష కోడి ఇలా చెప్పడం మొదలు పెట్టింది...‘‘ఒక డాక్టర్ దగ్గరికి ఒకాయన వెళ్లాడు. ఏమిటండీ మీ ప్రాబ్లం అని డాక్టర్ అడిగాడు. నాకు నేను మనిషిలా అనిపించడం లేదు అన్నాడు. మరి ఎలా అనిపిస్తుంది? అని డాక్టర్ అడిగాడు. ఆ వ్యక్తి కొక్కరోకో...అని అరిచి...అచ్చం కోడిలా అనిపిస్తుంది అని చెప్పాడు. ఎప్పటి నుంచి ఇలా అని అడిగాడు డాక్టర్. రెండు సంవత్సరాల నుంచి అన్నాడు ఆయన. రెండు సంవత్సరాల నుంచా? మరి అప్పటి నుంచి హాస్పిటల్‌కు ఎందుకు రావాలనిపించలేదు అడిగాడు డాక్టర్. రావాలనే అనుకున్నాను... కాని మా ఆవిడ వద్దు అని చెప్పింది అన్నాడు ఆయన. ఎందుకు? అని ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్. నువ్వు ఏదో ఒకరోజు తప్పకుండా గుడ్డు పెడతావు. ఫ్యూచర్లో మనం ఏకంగా గుడ్ల ఫ్యాక్టరీనే పెట్టి లక్షలు గడించవచ్చు. ఆ చాన్స్ వదులుకొని హాస్పిటల్‌కు వెళ్లడం ఎందుకు? అని అంది. నాకు కూడా ఆమె చెప్పింది నిజమే అనిపించింది. కాని రెండు సంవత్సరాలు గడిచినా సింగిల్ గుడ్డు కూడా పెట్టలేకపోయాను. అందుకే ఇలా వచ్చాను అని చెప్పాడు ఆ మనిషి’’సభలోని కోళ్లు క్కో...క్కో...క్కో...అని పెద్దగా నవ్వాయి,అధ్యక్ష కోడికి మళ్లీ కోపం వచ్చింది.‘‘నేను జోకు చెప్పింది మీరు నవ్వడానికి కాదు’’ అరిచింది ప్రెసిడెంట్ కోడి.‘‘జోకు చెప్పి... నవ్వొద్దంటారేమిటండీ! మీరు కోడా? మనిషా?’’ ఆవేశంగా అరిచింది చవల కోడి. అప్పుడు ప్రెసిడెంట్ కోడి గొంతు పెంచి ఇలా అంది...‘‘ఈ మనుషులున్నారే... వాళ్లు మన మాంసం తిన్న కృతజ్ఞత కూడా లేకుండా మన మీద రకరకాల జోక్స్ వేస్తుంటారు. మన జీవితాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. మనకు ఫ్రైడే అంటే తెగ భయమట. ఎందుకంటే అందులో ‘ఫ్రై’ ఉంది కాబట్టి. ఇలాంటి జోకులను ఇక ముందు సహించేది లేదని అఖిల భారత కోళ్ల సంఘం అధ్యక్షుడిగా ఈ మనుషుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. పరువు నష్టం దావా వేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నాను. ఇక ఈరోజు మన ఎజెండాలో ముఖ్యమైన అంశం: హౌ టు స్టాప్ కోళ్ల పందేలు. సంక్రాంతి వచ్చిందంటే మనకు చావు ముంచుకొస్తుంది. మనకు మనల్నే శత్రువులను చేసి కోడి పందేల పేరుతో వినోదిస్తున్నారు. క్యాష్ గడిస్తున్నారు ఈ మనుషులు. అందుకే ‘హౌ టు స్టాప్ కోడి పందేలు’ అని అడుగుతున్నాను’’కొక్కిరాయి కోడి మైక్ అందుకొని...‘‘కోడిపందేలను ఆపడం గవర్నమెంటోళ్లకే సాధ్యపడటం లేదు. ఇక మన వల్లేం అవుతుంది..’’ అంది.‘‘మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం తప్పు మిత్రమా... ఒక మహాకవి మన గురించి ఏమన్నాడో తెలుసా? కోడి అంటే... కరకరలాడే పకోడి కాదు.తళతళలాడే సిక్స్‌ప్యాక్ బాడీ’’ అని చెప్పింది రసంగి కోడి.‘‘వాహ్వా...వాహ్వా... ఇంతకీ ఎవరా మహాకవి?’’ అని సభికుల్లో ఒకరు అడిగారు.‘‘నేనే’’ అని వినయంగా బదులిచ్చింది రసంగి కోడి. చర్చ మళ్లీ మొదలైంది. ఈ చర్చల సంగతి ఎలా ఉన్నా కొన్ని రోజుల తరువాత సంక్రాంతి పండుగ రానే వచ్చింది. కోళ్లపందేలు మొదలయ్యాయి. మరుసటి రోజు మీడియాలో...‘వెల వెలబోయిన కోడిపందేలు’, ‘కోడిపందేల్లో మునుపటి జోష్ లేదు’, ‘ఈసారి ఎందుకు ఇలా చప్పగా జరిగాయి’లాంటి బ్రేకింగ్, షాకింగ్ న్యూస్‌లు వచ్చాయి. హైదరాబాద్‌లో ఉండే అప్పారావు అనకాపల్లిలో ఉండే సుబ్బారావుకు ఫోన్ చేసి ‘కోడిపందేలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి?’ అని అడిగాడు. దానికి సుబ్బారావు ఇలా బదులిచ్చాడు. ‘‘కోడిపందేలు అంటే ఎలా ఉంటాయి? రెండు కోళ్లు రెండు సింహాలై నువ్వా నేనా అన్నట్లు ఫైట్ చేస్తాయి. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఒక కోడి ఇంకో కోడికి గంధం పూస్తున్నట్లుగా ఉంది. పందెం కోళ్లలో ఏ కోడికి చిన్న గాయం కూడా కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది’’.కోడిపందేల్లో కోళ్లు పౌరుషం ఎందుకు కోల్పోయాయి? అనే మిస్టరినీ ఛేదించడానికి మీడియా ప్రఖ్యాత కోడిజాలిస్ట్ కోట హెన్రీని చుట్టుముట్టింది. పెద్దగా ఆలోచించకుండానే క్షణాల్లో ఈ మిస్టరీని ఛేదించాడు హెన్రీ. ఇంతకీ హెన్రీ ఏం చెప్పాడంటే... ‘‘డియర్ ఫ్రెండ్స్... మ్యాచ్‌ఫిక్సింగ్ అనేది క్రికెట్లోనే ఉంటుందని, మనుషులు మాత్రమే చేస్తారని అనుకుంటాం. కాని ఇది తప్పు. కోళ్లు కూడా మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడతాయి. ఈసారి కోడిపందేల్లో కోళ్లు ‘నువ్వు నన్ను గాయపరచవద్దు... నేను నిన్ను గాయపరచను. ఫైట్ చేస్తున్నట్లు నటిద్దాం... అనే కాన్సెప్ట్‌తో ముందుకువెళ్లాయి. అలా మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడి తమను తాము రక్షించుకున్నాయి. అదీ సంగతి!’’ – యాకుబ్ పాషా -
కోడి పందేలపై నేడు విచారణ
-
కోడి పందేల నిర్వహణపై నేడు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కోడి పందేల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించనుంది. పిటిషనర్ కనుమూరు రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది గల్లా సతీష్ ఈ పిటిషన్‌ను గురువారం ప్రస్తావించగా సోమవారం విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే అప్పటికి పండుగ పూర్తవుతుందని న్యాయవాది నివేదించగా శుక్రవారం విచారణ చేపట్టేందుకు అనుమతిచ్చారు. -
గాలిపటమా.. పద.. పద.. పద!
సంక్రాంతి.. తెలుగు నేలపై ఒక్కోచోటా ఒక్కో తీరుగా జరిగే పండుగ.. కొత్త అల్లుళ్లు, కొంటె మరదళ్లు.. కోడిపందేలు, డూడూ బసవన్నలు.. రంగవల్లులు, పిండివంటలు.. ఇలా సంక్రాంతి సంబరం అంబరాన్ని తాకుతుంది. వీటన్నింటితో పాటు సంక్రాంతికి కొత్త శోభ తీసుకొచ్చేది పతంగులే. సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్నా, పెద్దా గాలిపటాలైపోతారు.. పతంగ్‌లు ఎగరేస్తూ సందడి చేస్తుంటారు.. ఇక పతంగ్‌లు ఎగరేయడంలో హైదరాబాద్ స్టైలే వేరు.. రంగురంగుల్లో.. రకరకాల ఆకృతుల్లో గాలిపటాలు నగరంలో హల్చల్ చేస్తుంటాయి. గోల్కొండ కోటలో అయితే 400 ఏళ్ల నుంచి బసంత్‌లో పతంగులు ఎగరవేస్తుండటం గమనార్హం. అసలు పతంగుల చరిత్ర ఏమిటి? రంగుల గాలిపటాల వెనుక కార్మికుల కష్టం ఎంత? ఇప్పుడు వీటికి ఆదరణ ఎలా ఉంది..? ఈ అంశాలపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. – సాక్షి హైదరాబాద్ గాలిపటం.. గతం ఘనం.. 400 ఏళ్ల క్రితం గోల్కొండ కోటలో కుతుబ్‌షాహీ పాలకులు బసంత్ నెలలో పతంగులు ఎగురవేశారు. నగరం ఏర్పాటు తర్వాత ఆసిఫ్‌జాహీ పాలనాకాలంలో గాలిపటాల పోటీలు నిర్వహించారు. ఇక ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పాలనలో అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా పతంగ్‌ల పోటీలు నిర్వహించి బహుమతులు సైతం అందజేసేవారు. రాను రాను ఈ పతంగ్‌ల ఉత్సవం తారస్థాయికి చేరింది. 80వ దశకం తర్వాత పతంగ్‌లకు ఆదరణ తగ్గిపోయింది. టీవీలు, వీడియోగేమ్స్, స్మార్ట్ మొబైల్స్ మొదలైన వాటి ప్రభావంతో పెద్దవారే కాదు.. పిల్లలు సైతం.. గాలిపటాలను ఎగరవేయడం తగ్గించేశారు. దీంతో పతంగులు తయారు చేసే కుటుంబాలు వ్యాపారాలు లేక ఇక్కట్లు పడుతున్నాయి. తగ్గుతున్న పతంగుల తయారీ.. నగరంలో సరైన మైదానాలు లేక పతంగులు ఎగరవేయడానికి పిల్లలు ఆసక్తి చూపడంలేదు. గత పదేళ్లుగా వీడియోగేమ్స్, స్మార్ట్ఫోన్లు కూడా వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏదో పండుగ రోజు కాసేపు గాలిపటాలు ఎగరేసి మమ అనిపించేస్తున్నారు. దీంతో తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని బతుకుతున్న వందలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. 150 ఏళ్ల క్రితం వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి పతంగులు తయారీ చేయడానికి వందలాది కుటుంబాలు వచ్చాయి. గతంలో సంక్రాంతితో పాటు వేసవి సెలవులు, ఇతర సీజన్లలోనూ పతంగుల విక్రయాలు జోరుగా ఉండేవి. నాలుగు తరాలుగా ఇదే వృత్తిలో ఉన్న వందలాది కుటుంబాలు.. పతంగులకు ఆదరణ లేక ప్రస్తుతం పదుల సంఖ్యకు చేరుకున్నాయి. ధూల్‌పేట మాంజాకి గిరాకీ.. పతంగిని ముందు నడపాలన్నా.. గురిచూసి ప్రత్యర్థి పతంగిని పడగొట్టాలన్నా.. దాని మాంజా చాలా ముఖ్యం. మాంజాగా పిలిచే ఈ దారాన్ని ఓల్డ్‌సిటీలోనే తయారు చేస్తున్నారు. హైదరాబాదీ దూల్‌పేట మాంజాకు దేశమంతటా క్రేజ్ ఉంది. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించడంతో లోకల్ మాంజాకు ఈ ఏడాది గిరాకీ పెరిగింది. రూ.50 నుంచి రూ.300 వరకు ధర పలుకుతోంది. దీంతో గాలిపటాల కంటే మాంజా తయారీదారుల్లో కాస్త సంతోషం కనిపిస్తోంది. పతంగి.. ఎంతో ప్రత్యేకం.. పొలిటికల్ లీడర్.. సినిమా స్టార్స్.. కార్టూన్స్.. తదితర 25 రకాల ఫ్యాన్సీ పతంగుల కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ప్లాస్టిక్ పేపర్‌తో తయారయ్యే పతంగులూ మార్కెట్లో ఉన్నాయి. డిమాండ్‌కు అనుగుణంగానే వీటి రేట్లు ఉన్నాయి. రకాన్నిబట్టి రూ.300 నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతున్నాయి. గాలిపటం ఓ జ్ఞాపకమైపోతుంది.. నిజాం కాలంలో సంక్రాంతికి నాలుగు నెలల ముందు నుంచే పతంగుల తయారీ మొదలయ్యేది. యావత్ తెలంగాణకు ఇక్కడి నుంచే సరఫరా అయ్యేది. సంక్రాంతి సీజన్లో రాత్రి, పగలు పనిచేసినా డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేకపోయే వారు. తరతరాలుగా వీటినే తయారు చేస్తున్నాం. గాలిపటాలకు ఆదరణ కరువైతే భవిష్యత్‌లో ఇది కూడా ఓ జ్ఞాపకంగా మారిపోతుంది. చేనేతకు చేయూత ఇచ్చినట్లే మమ్మల్నీ ప్రభుత్వం ఆదుకోవాలి. – లక్ష్మీబాయి, పతంగుల తయారీదారు -
పశ్చిమ బరిలో రూ. 200 కోట్లు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోడి పుంజులకు కత్తులు కట్టి పందేలు నిర్వహించరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా తెర వెనుక ఏర్పాట్లు మాత్రం యథావిధిగానే సాగిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది కూడా 50కి పైగా బరులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భోగి నాటి నుంచి ప్రారంభం అయ్యే పందేలు, జూదాల్లో జిల్లావ్యాప్తంగా సుమారు రూ.రెండు వందల కోట్లు చేతులు మారతాయని అంచనా. జాతరే జాతర.. కోడి పందేల బరుల వద్దే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టు షాపులు వెలిసి జాతరలను తలపిస్తాయి. వీటిని నిర్వహించుకునేందుకు ఇప్పటికే వేలం పాటలు మొదలయ్యాయి. పందేల మాటున పేకాట, గుండాట, కోతాట, జూదం నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప, శ్రీరాంపురం గ్రామాల్లో కోడి పందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం జరగకుండా చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కలిదిండి రామచంద్రరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణను హైకోర్టు జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది. దగ్గరుండి ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో 2014 తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక సాంప్రదాయం పేరుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ముందుండి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వెంప, భీమవరం ఆశ్రమతోట, లోసరి, ఐ భీమవరం, సీసలి, మహదేవపట్నం, గుండుగొలను, జంగారెడ్డిగూడెం, కొప్పాక తదితర చోట్ల పెద్ద ఎత్తున కోడిపందేలు జరుగుతున్నాయి. భోగి పండుగ నుంచి కనుమ వరకూ రాత్రి పగలు తేడా లేకుండా ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. పండగ మూడు రోజులు కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించారు. కేసులు నమోదు చేస్తామని పోలీసుల హెచ్చరిక గత ఏడాది జాయింట్ యాక్షన్ టీములను ఏర్పాటు చేసి కోడి పందేలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించినా ఎక్కడా అమలు కాలేదు. ఈసారి కోడి పందేల బరులు ఏర్పాటు చేసేవారు, కోళ్లకు కత్తులు కట్టేవారు, పందెం కోళ్లు పెంచేవారితోపాటు పందేలను ప్రోత్సహించే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోడిపందేలపై ఇటీవల జరిగిన సమీక్షలో ఎస్పీ రవిప్రకాష్ అ«ధికారులకు సీరియస్‌గా ఆదేశాలు జారీ చేశారు. కోడిపందేలు ఎక్కడ జరిగినా అక్కడి స్టేషన్ ఆఫీసర్‌ను బాధ్యుడిగా చేసి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. -
కోడి పందేలు.. ఏడుగురి అరెస్టు
చెన్నూర్: కోడి పందేల స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్మండలం వెంకంపేట గ్రామంలో చోటుచేసుకుది. పందెం కాస్తోన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదు కోళ్లు, రూ. 2500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చెన్నూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో కోడి పందేలు
7వేల కోళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు లాస్ ఏంజిలెస్(అమెరికా): కోనసీమ కొబ్బరి తోటల్లో కోడి పందెం గురించి మనకు తెలుసు. కానీ అమెరికాలో కోడి పందెం గురించి తెలుసా? అమెరికాలో కోడిపందెమేంటి.. అనుకుంటున్నారా? అవును అక్కడ కూడా కోడిపందేలు జరుగుతుంటే అధికారులు రైడ్ చేసి మరీ 7వేల కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన పోలీసు దాడుల్లో ఇది అతిపెద్దదట. వివరాల్లోకెళ్తే.. లాస్ ఏంజిలెస్‌లోని వాయవ్య ప్రాంతంలో సోమవారం ఈ రైడ్ జరిగింది. మొత్తం ఏడువేల కోళ్లు, మొబైల్ ఫోన్లు, పందెంలో వాడే కత్తులు, రెండు గన్స్, 50 కాపలా కుక్కలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే కొన్ని కోళ్లు చనిపోయాయని, స్వాధీనం చేసుకున్న శునకాలను జంతు సంరక్షణ కేంద్రాలకు అప్పగించామని అధికారులు తెలిపారు. పందెం కోళ్ల పెంపకం ఈ ప్రాంతంలో జోరుగా సాగుతోందని, మరికొన్ని ప్రాంతాల్లో కూడా కోడి పందేలు నిర్వహిస్తున్నారని, ఇందుకు కారకులైన 8 మందిని అదుపులోకి తీసుకున్నామని సీనియర్ అధికారి బాబ్ బోస్ తెలిపారు. -
పందెం రాయుళ్లకు ఎమ్మెల్యేల అండ !
-
కోళ్లకు విషాదం.. కోట్లలో జూదం
-
జూదాల్లో జోరుగా దొంగనోట్లు
ఆకివీడు(ఉండి) : జూదాల్లో దొంగనోట్లు జోరుగా చలామణి అయ్యాయి. అయిభీమవరం గామంలోని ఎఫ్‌సీఐ గిడ్డంగి ప్రాంతంలోని కోడి పందేల బరిలో ఏర్పాటు చేసిన పేకాట కేంద్రంలో సోమవారం నకిలీ రూ.2వేల నోట్లు బయటపడ్డాయి. కోతాట ఆడుతుండగా కృష్ణా జిల్లా పెదలంక గ్రామానికి చెందిన ఒక యువకుడు రూ.2వేల నోటును పందెంగా కాశాడు. దీనిని దొంగనోటుగా గుర్తించిన తోటì జూదరులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అప్పటికే పేకాట కేంద్రంలో సుమారు రూ.లక్షకుపైగా దొంగనోట్లు చలామణి అయ్యాయని తెలుస్తోంది. దీంతో అందరూ తమకు వచ్చిన నోట్లను చూసుకోగా, చాలామంది వద్ద దొంగనోట్లు కనిపించాయి. వారంతా లబోదిబోమన్నారు. ఇదే అదునుగా పేకాట కేంద్రాన్ని ఒక్కసారిగా ఎత్తివేసి కోతాటలో జూదరులు పందెంగా కాసిన రూ.3 లక్షలను నిర్వాహకులు స్వాహా చేశారు. భీమవరం గ్రామానికి చెందిన ముదుండి గణపతిరాజు మాట్లాడుతూ.. కోతాట కేంద్రాన్ని ఎత్తివేయడంతో తాను రూ.లక్షా50 వేలు నష్టపోయాయని ఆవేదన చెందాడు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామానికి చెందిన చోడదాసి గంగయ్య కూడా దొంగనోట్లతో నష్టపోయినట్టు చెప్పాడు. పేకాట కేంద్రంలో గత మూడు రోజులుగా సుమారు రూ.10 లక్షల విలువైన దొంగనోట్లు చలామణి అయిపోయాయని సమాచారం. పట్టుబడిన వ్యక్తి ఏమయ్యాడు? దొంగనోటు పందెం కాసి పట్టుబడిన కృష్ణాజిల్లాకు చెందిన వ్యక్తి ఏమయ్యాడో ఎవరికీ తెలియడం లేదు. అతనికి దేహశుద్ధి చేసిన నిర్వాహకులు పంపించివేశారని కొందరు చెబుతుండగా, పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చామని ఇంకొందరు చెబుతున్నారు. కొంత మంది కష్ణాజిల్లా పోలీసులు వచ్చి తీసుకువెళ్లారని మరికొందరు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారమంతా జాద క్రీడ నిర్వాహకుల కన్నుసన్నల్లోనే జరిగిందని జూదరులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉం డగా కోతాటలో ఉండి మండలం పాందు వ్వకు చెందిన వ్యక్తి రూ.వెయ్యి పందెం కాయగా, రూ. 2 వేలు నోటు ఇచ్చారు. అది దొంగనోటని తరువాత తెలిసింది. దీంతో అతను లబోదిబోమంటున్నాడు. దొంగనోటు ఇలా.. పట్టుబడిన దొంగనోటులో తెల్లభాగం వద్ద గాంధీ బొమ్మ వాటర్ మార్క్ లేదు. కాగితం మధ్య భాగంలో మెరిసే థ్రెడ్(ఆర్బీఐ) సిల్కు దారం కూడా లేదు. కాగితం ఫోటోస్టాట్ పేపరుగా ఉంది. -
ధిక్కారం మన హక్కా?
విశ్లేషణ సమాజానికి సంప్రదాయాలుంటాయి. కానీ మనం చట్టాలకు లోబడి వ్యవ హరించాలి. మూకుమ్మడిగా చట్టాన్ని ధిక్కరించి కోడిపందేలు, జల్లికట్టు నిర్వహించదలిచే వారిలో ఎంతమందిపై కోర్టు ధిక్కార నేరం మోపగలరు? దేశం ప్రస్తుతం నోట్ల రద్దు నిర్ణయం గురించి చర్చి స్తోంది. నలుపు, తెలుపుల గురించిన ఈ గొడవ మధ్య మనం పట్టించుకోని మరో ముఖ్య సమస్య ఉంది. చట్టం, న్యాయ వ్యవస్థల పట్ల, అధికారం పట్ల చూపాల్సిన గౌరవం వార్తా శీర్షికల్లోనో, టీవీ ‘బ్రేకింగ్ న్యూస్’లోనో తప్ప మరెక్కడా కనబడక పోవడం ఒక ప్రధాన ధోరణిగానే ఉంది. దీనికీ, నోట్ల రద్దుకు ఎలాంటి సంబంధమూ లేదు. తమిళనాడులో ప్రజలు జల్లికట్టు సమస్యపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించకపోవడం వీటిలో తాజాది. చెదురు మదురుగానే అయినా ఆ క్రీడను నిర్వహించడానికి, సంప్రదాయం పేరిట జంతువుల పట్ల చూపే క్రూరత్వాన్ని చెల్లుబాటు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అలాంటిదే మరో ధిక్కారం ఆంధ్రప్రదేశ్‌లోని కోడి పందేలు. ఇక మన జవాన్లు... అధ్వాన మైన తిండి, సుదీర్ఘమైన పనిగంటలు, సీని యర్ అధికారుల కుక్కలను తిప్పుకురావడం తదితర విషయాలలోని తమ దుస్థితిని నేరుగా బహిరంగ ప్రసారం చేయడానికి పూనుకోవడం మరొకటి. ఇది, స్థావరాల స్థాయిలోని బలగాల అధికార వ్యవస్థ దౌష్ట్యం కావచ్చు. కానీ శ్రేణులు ఆ విషయాన్ని బహిరంగంగా మాట్లాడాలని భావించడం ఆందోళనకరం. అధికారులు ప్రతిసారీ కోర్టుల ఆదేశానుసారం చట్టాన్ని గౌరవించేలా చేయడానికి హామీని కల్పిం చడం కృషి చేయాల్సి రావడం అత్యంత విషాదకరం. అందులోనూ వారు ప్రతిసారీ సఫలం కారు. కోర్టు తీర్పుపై అసమ్మతిని తెలపడం ఆమోదనీయమే గానీ, ధిక్కరించడం కాదనే విషయాన్ని ప్రజలు విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది. నేడు మన పార్లమెంటుకు లభిస్తున్న గౌరవం కంటే ఎక్కువ గౌరవం కోర్టులపట్ల చూపాల్సి ఉంది. పార్లమెంటు వెసులుబాటుకు తగినంత అవకాశాన్ని కల్పిస్తుంది. హడావుడిగానో లేక హఠాత్తుగానో నిర్ణ యాలు జరగవు. కోర్టు ఆదేశాలు చెల్లకుండా చేయ డానికి ఆర్డినెన్స్‌ను తెమ్మని కోరడం రాజకీయవేత్త లకు సులువైపోయింది. ఒక వర్గంగా వారంతా తమ తమ భావజాలానికి అనుగుణంగా... షాబానో కేసులో జరిగినట్టుగానే కోర్టు తీర్పులకు అడ్డుపడు తూనే ఉంటారు. ఇది సమాజంలోని మన నడవ డికపై ప్రభావం చూపే తీవ్ర సమస్య. సమాజానికి సంప్రదాయాలుంటాయి. కానీ మనం నియమ నిబంధనలకు లోబడి, మరీ ముఖ్యంగా చట్టాలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరంకుశ చట్టాన్ని ధిక్కరించవచ్చు, కాకపోతే ఆ పని చేయా ల్సింది కోర్టులలోనే. మరో సమస్యాత్మకమైన పరిణామాన్ని మనం పట్టించుకోకుండా తోసిపుచ్చవచ్చు. కానీ అది మనకే ప్రమాదకరం. అది, సరిహద్దు భద్రతా బలగం, కేంద్ర రిజర్వు పోలీసు, సశస్త్ర సీమా బల్, సైన్యం జవాన్లు తమ అసంతృప్తిని గురించి బహిరంగంగా వ్యక్తంచేయడం. అందుకు వారు సామాజిక మాధ్య మాలను వాడటం పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచి స్తుంది. సాయుధ బలగాలలోని అసంతృప్తి ప్రమాద కరమైనది. సందేశాన్ని పంపినవారిని శిక్షించడానికి ముందు... వారి ‘క్రమశిక్షణా రాహిత్యానికి’ కారణా లేమిటో చూసి, వాటిని పరిష్కరించే పనిచేయాలి. సిబ్బంది సమస్యల పరిష్కార యంత్రాంగం సక్ర మంగా పనిచేయడంలేదనేది స్పష్టమే. పదవీ విర మణ చేసిన సీనియర్లు ‘ఒక ర్యాంకుకు ఒకే పెన్షన్’ కోరిక సాధన కోసం వీధుల్లోకి వచ్చిన తీరును చూసి వారు ధైర్యం తెచ్చుకుని ఉండొచ్చు. ‘పౌర జీవితం’లో, అంటే దేశంలోని సైనికేతర విభాగాలలో ఏం జరుగుతోందనేది జవాన్లకు తెలియ కుండా అడ్డుకోవడం అసాధ్యం. సుదీర్ఘమైన ఆ ఆందోళన గురించి సైనికులకు తెలిసింది. వారు ఆందోళన చేయాల్సి రావడం వల్ల బ్యారక్‌లలోని జవాన్లకు... భారత అధికార వ్యవస్థ అమర జవాన్ల పట్ల బహిరంగంగా గౌరవాన్ని ప్రదర్శిస్తుందే తప్ప సజీవంగా ఉన్న హీరోలను మాత్రం పట్టించుకోదని స్పష్టం చేసి ఉంటుంది. దురదృష్టవశాత్తూ, ఇలా బహిరంగంగా మాట్లాడటం ద్వారా వెలుగులోకి వచ్చిన చెడుగులను నిర్మూలించడం కంటే వాటిని బయటపెట్టిన వారిని లక్ష్యం చేసుకుని శిక్షించడమే సులువు. ఎంతైనా వారు క్రమశిక్షణారాహిత్యంతో ప్రవర్తించాలని అనుకున్న వ్యక్తులు. కాబట్టి బలగాలు వారిని సహించలేవు. మరైతే సామూహికంగా చట్టాన్ని, కోర్టులను ధిక్కరించి కోడిపందేలు, జల్లికట్టు నిర్వహించాలనుకునే సమూహాల మాటేమిటి? వారిలో ఎంత మందిపై కోర్టు ధిక్కార నేరం మోపు తారు లేదా మోపగలరు? అందరికీ తెలియక పోయినా ఇలా విస్మరించిన కోర్టు తీర్పులు బహుశా చాలానే ఉండి ఉంటాయి. ఉదాహరణకు, ట్రక్కు లలో నుండి బయటకు పొడుచుకు వచ్చే చువ్వలు పలువుర్ని హతమార్చాయి. ఈ విషయంలో అత్యు న్నత న్యాయస్థానం అధికారులను హెచ్చరించింది. ఆ ఆదేశాల ధిక్కరణను మీలో ఎందరు చూసి ఉండరు? మనం జీవితాన్ని మనకు అనువైన విధంగా గడపాలని నిర్ణయించుకున్నామా? మహేష్ విజాపృకర్ ఈమెయిల్: mvijapurkar@gmail.com -
శివపల్లిలో కోడిపందేల నిలువరింత
ఎలిగేడు: మండలంలోని శివుపల్లిలో గత కొన్నేళ్లుగా సంక్రాంతిరోజు జరుగుతున్న కోడిపందేలను నిలువరించగలిగారు. గ్రామంలోని నాలుగు దిక్కులుగా ఉండే ప్రధాన రహదారుల వెంబడి పోలీసులను మోహరించి , అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. దీంతో సంక్రాంతిరోజున నిర్వహించే కోడిపందేల బెట్టింగ్‌లను నిరోధించగలిగారు. ఎలాగైన కోడిపందేలను నిర్వహించి తీరుతామని బెట్టింగ్‌రాయుళ్లు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఐతే గ్రామంలో తుపాకులతో పోలీసుల గస్తీ, ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయంతో ఉండగా, సంకాంత్రి రోజున కోడిపందేలు జరగకపోవడం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు శివుపల్లి గ్రామంలో కోడిపందేలకు పేరుగాంచినప్పటికి అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారయంత్రాంగం కోడిపందాలను నిరోధించడం విశేషంగా జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు. గ్రామంలో పోలీసు పికెంటింగ్ త్వరలో ఎత్తివేయనున్నట్లు ఎస్సై దేవేందర్ పేర్కొన్నారు. -
కోళ్లకు విషాదం.. కోట్లలో జూదం
జిల్లాలో యథేచ్ఛగా కోడిపందేలు బరుల పక్కనే పేకాట, గుండాట శిబిరాలు ఈడుపుగల్లుకు భారీగా తరలివచ్చిన పందెంరాయుళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రాత్రిళ్లు సైతం పందేలు కాళ్లకు కత్తులు తప్పలేదు..నెత్తుటి ధారలు ఒలికించక తప్పలేదు..చట్టాలు ఉన్నా..కోర్టు తీర్పులు చెప్పినా పందెంరాయుళ్ల కాంక్షకు కోళ్లు బలికాక తప్పలేదు. సంప్రదాయం ముసుగులో గిరిగీసి బరులు ఏర్పాటు చేయగా, కోట్లాది రూపాయలు చేతులు మారాయి... వేల కోళ్లు నెలకొరిగాయి. మచిలీపట్నం : సంక్రాంతి పండుగ మూడు రోజులు జిల్లాలో కోడిపందేలు, పేకాట, గుండాట భారీ స్థాయిలో సాగాయి. సంప్రదాయం ముసుగున పెద్ద ఎత్తున జూదానికి తెరలేపారు. కోడిపందేల బరుల వద్ద పేకాట యథేచ్ఛగా సాగింది. రాత్రిళ్లు సైతం ఫ్లడ్ లైట్ల వెలుతురులో పేకాట, కోడిపందేలను నిర్వహించారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే జిల్లాలో అత్యధికంగా కోడిపందేల బరులు కొనసాగాయి. చేతులు మారిన రూ. కోట్లు : పండుగ మూడు రోజలు జిల్లావ్యాప్తంగా కోడిపందేలు, పేకాట కొనసాగటంతో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. బరుల వద్దే పెద్ద ఎత్తున పేకాట, గుండాటలను నిర్వహించారు. మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి భోజన సదుపాయాలను సైతం కల్పించారు. స్టాల్ యజమానులు చెప్పిందే రేటుగా పందెంరాయుళ్లు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ► పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో గోదావరి జిల్లాలకు దీటుగా సంక్రాంతి బరులు నడిచాయి. సువిశాల ప్రాంగణంలో కోడిపందేలు, జూదం ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. వీటిని తిలకించేందుకు, పాల్గొనేందుకు తెలంగాణ, ఆంధ్రతో పాటు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఈడుపుగల్లులో సంక్రాంతి బరిని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈనెల 12వ తేదీ నుంచి కోడిపందేలు, పెద్ద బజారు–చిన్నబజారు, కోతముక్క నడిచాయి. వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. నాలుగు రోజులపాటు నడిచిన పందేలలో రోజూ 50 వేల నుంచి 70 వేలకు పైగా జనం ఇక్కడికి తరలివచ్చినట్లు ప్రాథమిక అంచనా. రోజుకు రూ. 2 కోట్లు నుంచి రూ. 3 కోట్లు మేర నగదు చేతులు మారినట్లు తెలిసింది. ► మచిలీపట్నం నియోజకవర్గం గోపువానిపాలెం, మేకవానిపాలెం, శ్రీనివాసనగర్, రుద్రవరం, గోకవరం, పట్టణంలోని ఓ పాఠశాల పక్కనే కోడిపందేల శిబిరాలను మూడు రోజుల పాటు నిర్వహించారు. పేకాట శిబిరాలను ఏర్పాటు చేయటంతో పందెం రాయుళ్లు జేబులు ఖాళీ చేసుకున్నారు. మందుబాబులు కోడిపందేల శిబిరాల వద్ద కొట్లాటలకు దిగారు. ► గన్నవరం నియోజకవర్గం అంపాపురం, అప్పనవీడు ప్రాంతాల్లో భారీస్థాయిలో కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనుచరులు తమదైన శైలిలో బరులను నిర్వహించారు. ► నూజివీడు నియోజకవర్గంలో తుక్కులూరు, పోతిరెడ్డిపల్లి, సీతారామపురం, రావిచర్ల, జనార్ధనవరం, ఈదర, శోభనాపురంలలో బరులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పందేలు నిర్వహించారు. ► అవనిగడ్డ నియోజకవర్గంలోని వెంకటాపురం, కొడాలి, నక్కవానిదారి, శ్రీకాకుళం ప్రాంతాల్లో భారీస్థాయిలో బరులను ఏర్పాటు చేశారు. మొవ్వ, పెదకళ్లేపల్లి, దిండి, నాగాయలంక, సొర్లగొంది, పాగోలులలో పేకాట శిబిరాలు, చిత్తులాటలు జోరుగా సాగాయి. ► కైకలూరు నియోజకవర్గంలోని భుజబలపట్నం, కొల్లేటికోటలలో మూడు రోజుల పాటు భారీగా పేకాట శిబిరాలు నిర్వహించారు. భైరవపట్నం, బొమ్మినంపాడు, తాడినాడ, గొల్లనపాలెంలో కోడిపందేల శిబిరాలు శని, ఆదివారాల్లో జోరుగా సాగాయి. ► పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో పగలు, రాత్రి తేడాలేకుండా పేకాట శిబిరాలను నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాకు దీటుగా పేకాట, కోడిపందేల శిబిరాలను ఏర్పాటు చేశారు. మునిపెడ, పల్లెపాలెం, నాగేశ్వరరావుపేట, అర్తమూరు, పెదతుమ్మిడి, మల్లంపూడి, గూడూరు, కొంకేపూడి, బల్లిపర్రులలో కోడిపందేలు, పేకాట శిబిరాలు జరిగాయి. ► తిరువూరు నియోజకవర్గంలో మునికుళ్ల, పెనుగొలను, ముష్టికుంట్ల, కాకర్ల, తిరువూరు టౌన్ ప్రాంతాల్లో పెద్దఎత్తున కోడిపందేల శిబిరాలను ఏర్పాటు చేశారు. గుడివాడ నియోజకవర్గంలోనూ జోరుగా కోడిపందేలు కొనసాగాయి. -
కత్తి కట్టిన కో‘ఢీ’
వందల కోట్లు చేతులు మారిన వైనం సాక్షి నెట్వర్క్: అధికార పార్టీ అండ, పోలీసుల ఉత్తుత్తి ఆంక్షలతో కోర్టు నిషేధం నీరుగారి పోయింది. సంక్రాంతి సంప్రదాయం పేరిట పందెంరాయుళ్లు పేట్రేగి పోయారు. కోడి జూలు విదిల్చింది. కత్తి కట్టి మరీ కాలు దువ్వింది. చాలాచోట్ల అధికార పార్టీ నేతలే పందాలకు నేతృత్వం వహించి ప్రారంభించారు. బరుల వద్ద వెలసిన శిబిరాల్లో జూదం జోరుగా సాగింది. మద్యం ఏరులై పారింది. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల నగదు చేతులు మారింది. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే భోగి నుంచి మొదలుకుని మూడురోజుల్లో రూ.200 కోట్ల మేర పందేలు జరిగినట్లు అంచనా. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో ఆదివారం రాత్రి కూడా కోడిపందేలు కొనసాగాయి. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఈ నెల 13 నుంచి 25 వ తేదీ వరకు జిల్లాలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. ఈ హెచ్చరికలేవీ పందేలకు వందలాదిగా తరలివచ్చినవారిని ఆపలేకపోయాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పందేలకు అనుమతి ఇవ్వక పోవడంతో అక్కడి నుంచి జూదరులు జిల్లాకు భారీగా తరలివచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ ఏడాది కోడి పందేలు నిర్వహించడం గమనార్హం. ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి కృష్ణా, గోదావరి జిల్లాల్లోని కోడిపందేల్లో పాల్గొంటే.. ఆయన తమ్ముడు, ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రిలో కోడి పందేలను ప్రారంభించారు. ఉత్సాహంగా జల్లికట్టు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో పశువుల పండుగ (జల్లికట్టు)ను అత్యంత వైభవంగా నిర్వహించారు. జల్లికట్టులో దూసుకువస్తున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు యువకులు పోటీపడ్డారు. -
పందెం కోడి కత్తులు దూసింది
-
బరిలో బుక్కైన హోం మంత్రి రాజప్ప!
-
కోళ్ల పందేల్లో టీడీపీ ఎంపీల హల్చల్
-
బరులు రె‘ఢీ’ ..
జిల్లాలో కోడి పందేలకు పక్కా ఏర్పాట్లు వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు.. పేకాటకు గదులు భోగి పండుగనాడు ప్రారంభించాలని ఉవ్విళ్లు పోలీస్, రెవెన్యూ అధికారులకు మామూళ్లు మచిలీపట్నం : సంక్రాంతికి జిల్లాలో కోడిపందేలు, పేకాటకు తెర తీస్తున్నారు. కోడి పందేలపై హైకోర్టు నిషేధం విధించడంతో గురువారం సాయంత్రం వరకు పరిస్థితి తుపాను ముందు ప్రశాంతతలా ఉంది. పోలీసులు కోడిపందేలు వేసేందుకు అనుమతులు లేవని చెబుతుండడంతో పందెంరాయుళ్లు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం ఉదయానికి పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని పందెం రాయుళ్లు ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం భోగి పండుగ కావటంతో ఆ రోజు నుంచి పందేలు వేసేందుకు బరులు సిద్ధం చేస్తున్నారు. కోడిపందేల శిబిరాల వద్ద పేకాట తదితర జూదాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నిర్వాహకులకు టీడీపీ నేతల అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు అప్పనవీడులో కోడిపందేలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ బరిలో వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, పేకాట ఆడేందుకు ప్రత్యేక గదులను సిద్ధం చేస్తున్నారు. కోడిపందేలకు సంబంధించి ఒక్కొక్క బరికి రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు నగదు చేతులు మారుతోంది. నిర్వాహకులు రెవెన్యూ, పోలీస్ అధికారులకు మామూళ్లు అందజేస్తున్నట్టు సమాచారం. దీంతో కోడిపందేలు నిర్వహించే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండానే బరులను ఏర్పాటు చేయటం గమనార్హం. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు కత్తులు కట్టకుండా కోడిపందేలు వేసుకోవచ్చని సూచనప్రాయంగా చెబుతుండడం గమనార్హం. పెనమలూరు నియోజకవర్గం ఈడ్పుగల్లులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పెదపులిపాకలో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కోడిపందేలను గురువారమే ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా బరులు సిద్ధం ► నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి, తుక్కులూరు, సీతారామపురం, రావిచర్లతోపాటు చాట్రాయి మండలం జనార్ధనవరం, ఆగిరిపల్లి మండలం ఈదర, శోభనాపురంలలో బరులను ఏర్పాటు చేసి పందేలకు సిద్ధమవుతున్నారు. ► అవనిగడ్డ నియోజకవర్గంలోని వెంకటాపురం, నడకుదురు, కొడాలి, శ్రీకాకుళం, మొవ్వ, పెదకళ్లేపల్లి, బార్లపూడి, భట్లపెనుమర్రులలో ఇప్పటికే బరులను సిద్ధం చేశారు. ► బందరు మండలం గోపువానిపాలెం, మేకవానిపాలెం, శ్రీనివాస నగర్లలో బరులను సిద్ధం చేశారు. మచిలీపట్నంలోని ఓ పాఠశాల పక్కనే బరిని సిద్ధం చేశారు. ► కైకలూరు మండలం కొల్లేటికోట, భుజబలపట్నంలలో బరులను సిద్ధం చేశారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు కైకలూరులోనే మకాం చేయడంతో కోడిపందేల బరులను శుక్రవారం ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైందని సమాచారం. ► పెడన మండలం కొంకేపూడి, బల్లిపర్రు, కూడూరు, గూడూరు – పెడన అడ్డరోడ్డు సెంటరులలో, బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట, పెందుర్రు, ఆర్తమూరు, నాగన్న చెరువులలో కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. -
’కట్టలు’ తెగాయ్
పందెం కోడి గెలిచింది జూదం జూలు విదిల్చింది పనిచేయని కోర్టు ఉత్తర్వులు, పోలీస్ ఆంక్షలు నేడు, రేపు ఇదే జోరు సెక్షన్ 144 విధిస్తున్నట్టు ప్రకటించిన కలెక్టర్ కనిపించని జాయింట్ యాక్షన్ టీమ్‌లు మార్టేరులో పొట్టేలు పందేలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : పండగ వేళ పందెం కోడి గెలిచింది. కోర్టులిచ్చిన ఉత్తర్వులు అపహాస్యం పాలయ్యాయి. సంప్రదాయం పేరిట రాజకీయ పార్టీల నేతలు దగ్గరుండి మరీ కోడి పందేలు వేయించారు. ఒకరోజు ముందువరకూ హడావుడి చేసిన జాయింట్ యాక్షన్ టీములు, పోలీసులు పత్తా లేకుండా పోయారు. శుక్రవారం సాయంత్రానికి కోడి పందేలు నిర్వహించే చోట 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ ప్రకటించగా, ఎక్కడా దాని ప్రభావం కనపడలేదు. కోడిపందేల ముసుగులో జూదం యథేచ్ఛగా సాగింది. మద్యం ఏరులై పారింది. మీడియాను అనుమతించకుండా పోటీలు జరుపుకోవచ్చని ప్రభుత్వం నుంచి అనధికారికంగా అనుమతులు రావడంతో పందేలరాయుళ్లు చెలరేగిపోయారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఖమ్మం జిల్లా జూబ్లీపుర గ్రామానికి చెందిన గంగవరపు లక్ష్మీదయాకర్ అనే వ్యక్తి తన లైసెన్స్ రివాల్వర్‌తో మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి మరీ తన అనందాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పందేల రాయుళ్ల మధ్య బెట్టింగ్‌లు జరిగాయి. గాల్లోకి కాల్పులు జరిపిన దయాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుమంట్ర మండలం మార్టేరులో పొట్టేలు పందేలు నిర్వహించారు. ఎక్కడ చూసినా పందేలే భీమవరం మండలం వెంపలో ఫ్లడ్ లైట్ల వెలుగుల నడుమ రేయింబవళ్లు పందేలు వేస్తున్నారు. ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామంలో ప్రధాన బరిగా ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్ల ప్రాంతంలో కోడి పందేలు వేయరాదంటూ పోలీసులు, రెవిన్యూ యంత్రాంగం అడ్డుకుంది. ఒక దశలో పందేల రాయుళ్లు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. చివరకు ఉండి ఎమ్మెల్యే కలవూడి శివ వత్తిడితో మధ్యాహ్నం నుంచి అనుమతి ఇచ్చారు. పోలేరమ్మ గుడివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డింకీ పందాలను ఎమ్మెల్యేతో బీజేపీ నేతలు కనుమూరి రఘురామకృష్ణంరాజు, శ్రీనివాస వర్మ తిలకించారు. భీమవరం మండలం వెంప, తోకతిప్ప గ్రామాల్లో భారీ పందేలు వేస్తుండగా దిరుసుమర్రు, ఈలంపూడి, వీరవాసరం మండలంలోని కొణితివాడ, నవుడూరు, ఉత్తరపాలెం, అండలూరు, వీరవాసరం, నందమూరు గరువు తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. వీరవాసరం మండలం కొణితివాడ చుట్టుపక్కల గ్రామాల ఏడు గ్రామాల్లోని సంఘ పెద్దలు ఉత్తరపాలెంలో నిర్వహించే కోడి పందాలకు పోటీగా మరొక బరిని సిద్ధం చేయడంతో మహిళలు అడ్డుకున్నారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, చిన్నాయిగూడెం, పల్లంట్ల, త్యాజంపూడి, లక్ష్మీపురం గ్రామాల్లో భారీ పందేలు నిర్వహించారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, వెంకటాపాలెం, కొవ్వూరుపాడు, వాదాలకుంట గ్రామాల్లో పందేలు జరిగాయి. నల్లజర్ల మండలం నల్లజర్ల, అనంతపల్లి, చోడవరం, పోతవరం, ద్వారకాతిరుమల మండలంలో రాళ్లకుంట, వెంకటకృష్ణాపురం, దోసన్నపాడు, తిమ్మాపురం గ్రామాల్లో భారీగా పందేలు ప్రారంభించారు. తొలిరోజు పందేలకు ప్రముఖులు ఎవరూ హాజరుకాకపోయినప్పటికీ మండల స్థాయి టీడీపీ నాయకులు బాధ్యతలు తీసుకుని జోరుగా నిర్వహించారు. దెందులూరులో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దగ్గరుండి మరీ పందేలను నిర్వహిస్తున్నారు. పెదవేగి మండలం కొప్పాకలో పోటీల వద్దకు పోలీసులు, మీడియా రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొగల్తూరులో పందేలు నిర్వహించే బరికి వేలం నిర్వహించారు. నిడమర్రు మండలం పత్తేపురంలో భారీ పందేలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వీటిని ప్రారంభించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. ఈ బరిని స్థానిక నాయకుడొకరు రూ.32 లక్షలు చెల్లించి వేలంలో దక్కించుకున్నట్టు సమాచారం. జూలు విదిల్చిన జూదం.. ఏరులై పారిన మద్యం కోడి పందేల బరులకు అనుబంధంగా కోతాట, గుండాట పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. అక్కడే మద్యం లూజు విక్రయాలు భారీగా సాగుతున్నాయి. నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో భీమేశ్వరస్వామి ఆలయం వద్ద పందేలు జరుగుతున్నాయి. బువ్వనపల్లి, తోకలపల్లి గ్రామాల్లో చిన్న బరులు ఏర్పాటు చేఽశారు. ఇక్కడ పందేల కంటే పేకాట, గుండాట వంటి జూదాలకే అధిక ప్రాధాన్యత ఉంది. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని 14 గ్రామాల్లో కోడి పందాల శిబిరాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ ఎటువంటి అనుమతులు ఇవ్వకపోవడంతో బరులు ఏర్పాటు చేసే ప్రాంతాల వద్ద పోలీసులు పికెట్లు ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించారు. 11గంటల తరువాత పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనధికారిక అనుమతులు రావడంతో పోలీసు గప్‌చిప్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మార్టేరు, ఆలమూరు, పెనుమంట్ర, వడలి, సిద్ధాంతం, దొంగరావిపాలెం, ములపర్రు, ఆచంట, కొడమంచిలి, వల్లూరు గ్రామాలలో కోడి పందేలు, జూదం నిర్వహించారు. ఆచంట మండలం వల్లూరులో పందేల బరిని వేలం వేయగా, గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ.2 లక్షలకు దక్కించుకున్నట్టు సమాచారం. చింతలపూడి మండలం వెంకటాపురం, సీతానగరం, నాగిరెడ్డిగూడెం, లింగపాలెం మండలంలోని కొణిజర్ల, ములగలంపాడు, కామవరపుకోట మండలం రావికంపాడు, కళ్లచెర్వు, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో భారీగా పందేలు నిర్వహించారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో ఉదయం 10 గంటలకే కోడి పందేలు, గుండాట, కోతాట తదితర జూద క్రీడలు ప్రారంభించారు. పాలకొల్లు మండలంలో టీడీపీ నేత ఆధ్వర్యంలో పూలపల్లి బైపాస్ రోడ్డులో కోడి పందేలు వేశారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని గుంజవరం, గూటాల, పి.రాజవరం, పి.అంకంపాలెం, కామయ్యపాలెం, రాచన్నగూడెం, ములగలంపల్లి, తాటియాకులగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, బూసరాజుపల్లి, దొరమామిడి, వెలుతురువారిగూడెం, టి.నరసాపురం, బందంచర్ల, రామవరం, తిరుమలదేవిపేట, అప్పలరాజుగూడెం, రామానుజపురం, బయ్యనగూడెం, కుక్కునూరు మండలం వీరవల్లి, వేలేరు గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి. -
కోడిపందేల్లో రివాల్వర్ కాల్పుల కలకలం.
-
కోడిపందేల్లో రివాల్వర్ కాల్పుల కలకలం
సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్న కోడి పందేల వద్ద ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. తాడేపల్లిగూడెం మండలం శ్రీనివాసపురం వద్ద ఈ ఘటన జరిగింది. శ్రీనివాసపురం బరి వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అక్కడ పోటాపోటీగా కోడిపందేలు జరుగుతున్నాయి. బెట్టింగులు కూడా జోరందుకున్నాయి. ఇంతలో ఖమ్మం జిల్లాకు చెందిన దయాకర్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న లైసెన్సుడు రివాల్వర్‌తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దాంతో ఏం జరిగిందో తెలియక అంతా కంగారు పడ్డారు. మధ్యాహ్నం సమయంలో పందేలు జరుగుతుండగా ఒక్కసారిగా అతడు కాల్పులు జరపడంతో కాసేపు కలకలం రేగింది. దయాకర్ ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడని తెలిసింది. అయితే ఇంత జరిగినా పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోవడం గానీ, అతడిని అదుపులోకి తీసుకోవడం గానీ జరగలేదు. -
సంక్రాంతికి బరులు రెడీ
-
సంక్రాంతికి బరులు రెడీ
సాక్షి, అమరావతి: సంక్రాంతికి పందెం కోళ్లు సిద్ధమయ్యాయి. పందెంరాయుళ్లు పెద్దమొ త్తాలతో బరిలో దిగేందుకు సన్నాహాలు ఏస్తున్నారు. హైకోర్టు నిషేధం విధించినా ఎవరూ పట్టించుకోవడంలేదు. అధికార పర్టీ నేతలే పోటీలకు నేతృత్వం వహిస్తున్నారు. కృష్ణాజిల్లాలో గురువారమే కోడిపందేలు మొదలయ్యాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కోడిపందేలు మొదలుపెట్టేందుకు బరులు సిద్ధం చేశారు. ప్రధానంగా ఈ జిల్లాల్లో మూడురోజులు రూ.వందల కోట్ల పందేలు జరగనున్నాయి. సంక్రాంతి సమయంలో తమిళనాడులో జల్లికట్లు, ఏపీలో కోడి పందేలపై సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆంక్షలు పెట్టిన సంగతి తెల్సిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వులను కాదని తమిళనాడులో గురువారం జల్లికట్టు నిర్వహించడంతో పోలీసులు దాడిచేసి నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. మన రాష్ట్రంలో కోడిపందేలను హైకోర్టు నిషేధించడం, సుప్రీం ఆంక్షలను కొనసాగించడంతో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నేతలు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పందేలు ప్రారంభించిన టీడీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పెనమలూరు/కంకిపాడు/కైకలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రెండు బరుల్లో గురువారం కోడిపందేలు మొదలయ్యాయి. పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో ఎమ్మెల్సీ యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్, కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎంపీపీ దేవినేని రాజావెంకటేశ్వరప్రసాద్ కోడిపందేలను ప్రారంభించారు. -
పంతం కోడి
-
‘పుంజు’కుంటున్న బరులు
కేసులకు బెదరని పందేలరాయుళ్లు హైకోర్టు ఆదేశాలను పాటించాలంటూ పోలీసుల ఫ్లెక్సీలు మూడు రోజుల అనుమతి వస్తుందని నిర్వాహకుల ఆశ పెద్దనోట్లు రద్దు ప్రభావం పెద్దగా ఉండదని భరోసా సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోడి పందేలపై హైకోర్టు నిషేధం విధించగా.. ఆ నిషేధాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. దీంతో పందేలను అడ్డుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నా రు. అయినా.. పశ్చిమ గోదావరి జిల్లాలో పందేల రాయుళ్లు వెనుకంజ వేయకుండా పందేల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. సంప్రదాయం పేరుతో కోళ్లకు కత్తులు కట్టకుండా పోటీలు నిర్వహిస్తామని చెబుతున్నారు. పండగ మూడు రోజులు అనుమతులు ఇచ్చే విషయం ప్రభుత్వం ఆలోచిస్తోందని ఇంటిలిజెన్స్ ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించిన నేపథ్యంలో పందెంరా యుళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు. పందేలు సంక్రాంతి పండగ ఆనవాయితీ అని.. దీన్ని అడ్డుకోవడం ఎవరి తరంకాదని నిర్వాహ కులు తేల్చి చెబుతున్నారు. కోడిపందేలకు ప్రసిద్ధిగాంచిన భీమవరం, పరిసర గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. తణుకు మండలం తేతలి, వేల్పూరు గ్రామాల్లో ఇప్పటికే నిర్వాహకులు బరులు సిద్ధం చేయగా ఇరగవరం, అత్తిలి మండలాల్లో బరుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పెనుమంట్ర మండలం మార్టేరు, ఆలమూరు, పెనుమంట్ర, పెనుగొండ మండలం వడలి, సిద్ధాంతం, పెళ్లికూతురమ్మ చెరువు, ఆచంట మండలం ఆచంట, వల్లూరు గ్రామాలలో కోడి పందేల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. నరసాపురం పట్టణ శివారు రుస్తుంబాద, నరసాపురం మండలం వేములదీవి, లక్ష్మణేశ్వరం, సీతారామపురం, మొగల్తూరు మండలం మొగల్తూరు, కేపీ పాలెం, పేరుపాలెం, కాళీపట్నం గ్రామాల్లో అప్పటికప్పుడు పందేలు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమం, ఐ.భీమవరం, వెంప ఖరీదైన పందేలకు పెట్టింది పేరు. ఇక్కడి పోటీలు తిలకించేందుకు సినీ స్టార్లు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి రాజకీయ ప్రముఖులు వస్తుంటారు. ఈ మూడు ప్రాంతాల్లో ఇంకా సన్నాహాలు ప్రారంభం కాకపోయినా చివరి మూడు రోజులు ఎట్టిపరిస్థితుల్లో నిర్వహిస్తా మని పందెం కాసి మరీ చెబుతున్నారు. మెట్టలో ముఖ్యంగా చింతలపూడి మండలం పోతునూరు, సీతానగరం, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం, పంగిడి గూడెం, కామవరపుకోట మండలం కళ్లచెర్వు, రావికంపాడు, సాగిపాడు, కామవరపుకోట, లింగపాలెం మండలంలో ములగలంపాడు, కొణిజర్ల, కలరాయనగూడెం గ్రామాల్లో ఏటా భారీ పందాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ములగలంపాడు, కళ్లచెర్వు గ్రామాల్లో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి మరీ డే అండ్ నైట్ పందే లు నిర్వహిస్తారు. కోసాట, పేకాట, గుండాట వంటి జూదాలను కూడా యథేచ్ఛగా నిర్వహిస్తా రు. కొవ్వూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లోనూ పందేలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు పందేలా రాయుళ్లు బరులు సిద్ధం చేస్తుంటే జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. పందేలు జరిగే ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను పెంచి జూదరులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కోళ్లకు కత్తులు కట్టేవారు, గతంలో కోడిపందేల కేసులు ఉన్నవారిపై నిఘా ఉంచి బైండోవర్ కేసులు పెడుతున్నారు. బరులు సిద్ధం చేసిన చోట హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడి పందేలు నిర్వహించరాదని, బరుల కోసం స్థలం ఇచ్చినవారిపై కూడా కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కానీ ఏటా వచ్చినట్లే భోగిరోజు ఉదయం తొమ్మిది గంటల తర్వాత మూడు రోజులకు అనధికార అనుమతులు వచ్చేస్తాయని నిర్వాహకులు భరోసాగా ఉన్నారు. పెద్దనోట్లు రద్దు ప్రభావం కోడిపందేలపై పెద్దగా ప్రభావం చూపదని భావిస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీల వైపు పందెంరాయుళ్లు మొగ్గు చూపడం లేదు. వారంతా ఇప్పటికే నోట్లు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. -
’పుంజు’కుంటున్న బరులు
కేసులకు బెదరని పందేలరాయుళ్లు హైకోర్టు ఆదేశాలను పాటించాలంటూ పోలీసుల ఫ్లెక్సీలు మూడు రోజులూ అనుమతి వస్తుందని ఆశ సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందేలపై హైకోర్టు నిషేధం విధించగా.. సుప్రీం కోర్టు సమర్ధించింది. పందేలను అడ్డుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. అయినా.. పశ్చిమ గోదావరి జిల్లాలో పందేల రాయుళ్లు వెనుకంజ వేయకుండా పందేల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. సంప్రదాయం పేరుతో కోళ్లకు కత్తులు కట్టకుండా పోటీలు నిర్వహిస్తామని చెబుతున్నారు. పండగ మూడు రోజులు అనుమతులు ఇచ్చే విషయం ప్రభుత్వం ఆలోచిస్తోందని ఇంటిలిజెన్స్ ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించిన నేపథ్యంలో పందెంరాయుళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు. పందేలు పండగ ఆనవాయితీ అని.. దీన్ని అడ్డుకోవడం ఎవరి తరంకాదని నిర్వాహకులు కోడిపందేలకు ప్రసిద్ధిగాంచిన భీమవరం, పరిసర గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తకావచ్చాయి. తణుకు మండలం తేతలి, వేల్పూరు గ్రామాల్లో ఇప్పటికే నిర్వాహకులు బరులు సిద్ధం చేయగా ఇరగవరం, అత్తిలి మండలాల్లో బరుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పెనుమంట్ర మండలం మార్టేరు, ఆలమూరు, పెనుమంట్ర, పెనుగొండ మండలం వడలి, సిద్ధాంతం, పెళ్లికూతురమ్మ చెరువు, ఆచంట మండలం ఆచంట, వల్లూరు గ్రామాలలో కోడి పందేల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. నరసాపురం పట్టణ శివారు రుస్తుంబాద, నరసాపురం మండలం వేములదీవి, లక్ష్మణేశ్వరం, సీతారామపురం, మొగల్తూరు మండలం మొగల్తూరు, కేపీ పాలెం, పేరుపాలెం, కాళీపట్నం గ్రామాల్లో అప్పటికప్పుడు పందేలు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమం, ఐ.భీమవరం, వెంప ఖరీదైన పందేలకు పెట్టింది పేరు. ఇక్కడి పోటీలు తిలకించేందుకు సినీ స్టార్లు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి రాజకీయ ప్రముఖులు వస్తుంటారు. ఈ మూడు ప్రాంతాల్లో ఇంకా సన్నాహాలు ప్రారంభం కాకపోయినా చివరి మూడు రోజులు ఎట్టిపరిస్థితుల్లో నిర్వహిస్తామని పందెం కాసి మరీ చెబుతున్నారు. మెట్టలో ముఖ్యంగా చింతలపూడి మండలం పోతునూరు, సీతానగరం, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం, పంగిడిగూడెం, కామవరపుకోట మండలం కళ్లచెర్వు, రావికంపాడు, సాగిపాడు, కామవరపుకోట, లింగపాలెం మండలంలో ములగలంపాడు, కొణిజర్ల, కలరాయనగూడెం గ్రామాల్లో ఏటా భారీ పందాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ములగలంపాడు, కళ్లచెర్వు గ్రామాల్లో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి మరీ డే అండ్ నైట్ పందేలు నిర్వహిస్తారు. కోసాట, పేకాట, గుండాటవంటి జూదాలను కూడా యథేచ్ఛగా నిర్వహిస్తారు. కొవ్వూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లోనూ పందేలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు పందేలా రాయుళ్లు బరులు సిద్ధం చేస్తుంటే జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. పందేలు జరిగే ప్రాంతాల్లో పోలీస్పికెట్లను పెంచి జూదరులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కోళ్లకు కత్తులు కట్టేవారు, గతంలో కోడిపందేల కేసులు ఉన్న వారిపై నిఘా నిఘా ఉంచి బైండోవర్ కేసులు పెడుతున్నారు. బరులు సిద్దం చేసిన చోట హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడి పందేలు నిర్వహించరాదని, బరుల కోసం స్థలం ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఏటా చివరి నిముషంలో.. ఏటా పందేలకు అనుమతుల విషయంలో చివరి వరకూ టెన్షన్ తప్పదు. భోగి రోజు ఉదయం 9 గంటల తర్వాత అనుమతి వస్తుంది. ఏటా 3 రోజులకు మాత్రమే అనధికార అనుమతులు ఉంటాయి. పెద్దనోట్లు రద్దు ప్రభావం కోడిపందేలపై పెద్దగా ప్రభావం చూపదని భావిస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీల వైపు పందెంరాయుళ్లు మొగ్గు చూపడం లేదు. వారంతా ఇప్పటికే నోట్లు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. -
కత్తులు కట్టేద్దాం.. ’డింకీ’ కొట్టిద్దా
కోడి పందేలరాయుళ్ల వ్యూహం బరిలోకి టీడీపీ నేతలు ఆటల పోటీల పేరుతో డెల్టాలో బరులు సిద్ధం భీమవరం : ’కోర్టు ఆదేశాలు.. లోకాయుక్త ఉత్తర్వులు.. పోలీసుల ఆంక్షలు ఇవన్నీ మామూలే. పండగ ముందు వరకూ ఆ మాత్రం హడావుడి ఉంటుంది. భోగి రోజున మొదలెట్టి ముక్కనుమ రోజైన సోమవారం వరకు పందేలు వేసుకోండి. ఏమైనా ఇబ్బందులొస్తే మేం చూసుకుంటాం’ డెల్టాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి పందేల రాయుళ్లకు ఇచ్చిన భరోసా ఇది. ఆ నేత ఒక్కరే కారు.. డెల్టా ప్రాంతంలో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులంతా పందేల నిర్వాహకులకు ఇదేవిధంగా వత్తాసు పలుకుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు ఇవ్వాలంటూ.. ఎప్పటిలా తమకు ముట్టజెప్పాల్సిన మొత్తాన్ని ముందే ఇచ్చేయాలని కోరుతున్నారు. నేతల భరోసాతో సంక్రాంతి కోడి పందేలకు భీమవరం పరిసర ప్రాంతాల్లో బరులు సిద్ధమవుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో టీడీపీ నేతలు ఎక్కడికక్కడ పందేల నిర్వహణకు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. గతంలో భీమవరంలోని ప్రకృతి ఆశ్రమ ప్రాంతం, వెంప, ఐ.భీమవరం, మహదేవపట్నం, పెదఅమిరం, చెరుకువాడ, కొణితివాడ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున పందేలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతోపాటు మహిళలు సైతం పందేలు తిలకించడానికి తరలివచ్చారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి చెందిన వారే భారీ స్థాయిలో పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ’కత్తులు కట్టకుండా’ అంటూ.. కోడి పుంజులకు కత్తులు కట్టకుండా డింకీ పందేలు వేస్తామని.. ఇలా చేయడం నేరం కాదని నిర్వాహకులు చెబుతున్నారు. పైకి డింకీ పందేలు వేస్తామని చెబుతున్నా.. బరిలోకి దిగాక ఎప్పటిలా పందేలు నిర్వహించేందుకు కత్తులు నూరుతున్నారు. ఇప్పటికే కొందరు రాజకీయ నేతల భరోసాతో బరులను సిద్ధం చేయగా.. కొందరు మాత్రం కబడ్డీ, వాలీబాల్ పోటీల పేరుతో తెరవెనుక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చివరి క్షణంలో పందేలకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని.. ఆ వెంటనే క్రీడల పోటీలకు బదులు కోడి పందేలు వేయొచ్చనే ఉద్దేశంతో ఉన్నారు. లాడ్జిలు ఫుల్.. జిల్లాలో దాదాపు అన్నిచోట్లా కోడి పందేలు వేయడం పరిపాటే అయినా.. భీమవరం పరిసర ప్రాంతాల్లో నిర్వహించే పందేలకు జనం పెద్దఎత్తున వస్తుంటారు. ఇక్కడ పండగ మూడు రోజుల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. ఇక్కడి పందేలను చూసేందుకు వచ్చేవారి కోసం భీమవరం పట్టణంలోని అన్ని లాడ్జిల్లో గదులన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. పట్టణంలో పేరుమోసిన హోటల్స్, లాడ్జిలు 20 వరకు ఉండగా ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ముందుగానే రూమ్‌లను బుక్ చేసుకున్నారు. రెస్టారెంట్లలో ’సముద్ర’ వంటకాలు భీమవరం పట్టణానికి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అతిథులు వచ్చే అవకాశం ఉండటంతో పట్టణంలోని పేరెన్నికగన్న రెస్టారెంట్లల్లో సరికొత్త వంటకాలను సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రధానంగా సముద్ర చేపలతో ఎక్కువ రకాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలోని తీరంతోపాటు కాకినాడ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి సముద్ర చేపల్ని పెద్దఎత్తున కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారు. -
కాలు దువ్వుతున్న పందెం కోడి
♦ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రజాప్రతినిధులు ♦ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకే వ్యూహం .. ♦ కత్తులు కట్టేందుకు పొరుగు జిల్లాల నుంచి రాక.. ♦ భోగినాడు రహస్య ప్రదేశంలో బరిలోకి.. ♦ ఇక మూడు రోజులు పందేలే పందేలు ... ♦ జిల్లాలో రూ. 100 కోట్లు చేతులు మారతాయని అంచనా సాక్షి, అమరావతిబ్యూరో : పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కోడి పందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. జిల్లాకు చెందిన కీలక నేతతోపాటు ఇద్దరు ప్రజాప్రతినిధులు భరోసా ఇవ్వడమే ఇందుకు కారణం. ఇటీవల పరిణామాల నేపథ్యంలో కొందరు నిర్వాహకులు అధికార పార్టీ కీలక నేతతోపాటు ఇద్దరు ప్రజాప్రతినిధులను సంప్రదించినట్లు తెలుస్తోంది. పందేల నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని ఆ నేతలు భరోసా ఇచ్చారు. దీనిపై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వివాదాస్పద ఎమ్మెల్యేను కూడా వారు ఫోన్లో సంప్రదించారు. రెండు జిల్లాల్లో కోడి పందేల నిర్వహణకు ఒకే వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణరుుంచారు. పోలీసులు ఇబ్బంది పెట్టకుండా పండుగ మూడురోజులు పందేలకు పరోక్షంగా సహకరించేలా చూస్తామని నిర్వాహకులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా చేద్దాం.. ఎవరు అడ్డుకుంటారో చూద్దాం ప్రజాప్రతినిధుల వ్యూహం ప్రకారం కోడిపందేలకు ఏర్పాట్లు ఊపందుకున్నారుు. ప్రధానంగా గుడివాడ, గన్నవరం, కై కలూరు, పెనమలూరు, బందరు, పామర్రు నియోజకవర్గాల్లో నిర్వాహకులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో బరులు సిద్ధం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కోళ్లను రప్పించి రహస్య ప్రదేశంలో ఉంచారని తెలుస్తోంది. కోళ్లకు కత్తులు కట్టకూడదన్న నిబంధనను కూడా వ్యూ హాత్మకంగా నీరుగార్చడానికి యత్నిస్తున్నారు. స్థానికులను కాకుండా కత్తులు కట్టేందుకు పొరుగు జిల్లాల వారిని రప్పిస్తున్నారు. ఎందుకంటే కోళ్లకు కత్తులు కట్టే స్థానికులను పోలీసులు ముందుగానే గుర్తించి నిఘా ఉంచుతారు. పాత కేసులు తిరగేసి బైండోవర్ కేసులు నమోదు చేస్తారు. దాంతో జిల్లా పోలీసులకు తెలియని పొరుగు జిల్లాలకు చెందిన వారిని రప్పించి కత్తులు కట్టించాలన్నది వ్యూహంగా ఉంది. ఈ నెల 12 వరకు ఎక్కడా హడావుడి చేయకుండా వ్యూహాత్మకంగా మౌనం పాటించనున్నారు. సరిగ్గా భోగి నాడు ముందుగా నిర్ణరుుంచిన ముహూర్తానికి ఓ రహస్య ప్రదేశంలో తొలి పందెం కోళ్లను బరిలోకి వదలాలని నిర్ణరుుంచారు. అంతవరకు పందేలు అడ్డుకోవడానికి కఠినంగా వ్యవహరించే పోలీసులు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతారన్నది ప్రజాప్రతినిధుల ముందస్తు వ్యూహం. దాంతో అదే ఊపుతో మిగిలిన బరుల్లో కూడా కోళ్లను దింపాలని భావిస్తున్నారు. ఇలా మూడురోజులపాటు పందేలు సాగేందుకు పక్కా స్కెచ్ వేశారు. రూ.100 కోట్లు.. ! అంతా అనుకున్నట్లు సాగితే... పండుగ మూడురోజులు జిల్లాలో రూ.100కోట్ల వరకు కోడిపందేలు సాగవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో రూ.70 కోట్ల వరకు పందేలు జరిగారుు. ఈసారి అంతకుమించి పందేలు సాగుతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జిల్లాకు రానున్నారని తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా విజయవాడలోని హోటళ్లతోపాటు శివారుప్రాంతాల్లోని రిసార్టులు అన్నీ ముందుగానే బుక్ అరుుపోయారుు. నగదు సమస్య ఏర్పడకుండా ఆన్లైన్ చెల్లింపులు, స్వైపింగ్ మెషిన్ల ద్వారా చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. -
పందేలకు రెఢీ
నిడమర్రు: గ్రామీణ ప్రాంతాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి, సంక్రాతి పండుగ సమీపించడంతో పందేల రాయయళ్లు సమరానికి సన్నద్దమవుతున్నారు. ప్రతీ ఏటా సంప్రదాయ ముసుగులో కోడిపందాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల్లో పందాల నిర్వహణకు గ్రామాల్లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి, ఈ కోడి పందాల నిర్వహణ పండుగ ఆనవాతీ అని దీన్నిఅడ్డుకోవడం ఎవరి తరంకాదని పందేం రాయుళ్లు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు పందాలు వేసి తీరుతామనిబరులు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే పందాలకు అవసరమైన కోళ్లును పలువరు నిర్వహకులు సామూహికంగా పెంచి పందాలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ’ఓ సామాజిక వర్గం ఆధిపత్య గ్రామాల్లోనే... గణపవరం, నిడమర్రు మండలాల్లో ఓ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న గ్రామాల్లోనే కోడి పందాలు నిర్వíßంచేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. గణపవరం మండలంలో అర్ధవరం, నిడమర్రు మండలంలో పత్తేపురంగ్రామాల్లో పెద్ద బరులు సిద్దంచేస్తున్నారు. పత్తేపురంలో ఈ పందేల నిర్వహణకు చేపల చెరువును ఎండగట్టి నట్లు తెలుస్తుంది. దీని కోసం చెరువు యజమానికి సుమారు రూ 3లక్షలు నిర్వహకులు చెల్లిస్తున్నట్లు సమాచారం. అలానే గుండాటలు, పేకాటలు, కోడిమాసం పకోడి, ఫాస్ట్ ఫుడ్, ఐస్‌క్రీం, మధ్యం దుకాణాల సముదాయాలకు పాటలు నిర్వహించడం లేదా మూడు రోజులకు కలిపి కొంత మొత్తంలో అద్దె తీసుకోవడం నిర్వహకులు చేస్తుంటారు. అలానే చిన్న బరులు ప్రతీ ఏటా నిడమర్రు మండంలో పెదనిండ్రకొలను, బువ్వనపల్లి, తోకలపల్లి, మందలపర్రుగ్రామాల్లో ఉంటాయి. గణపవరం మండలంలో గణపవరం, సరిపల్లె, కొమ్మర, జగన్నాధపురం, పిప్పిర గ్రామాల్లో ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏడాదికూడా ఆయా గ్రామాల్లో నిర్వహించేందుకు స్థానిక పందెంరాయుళ్లు అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ’ ప్రతీఏటా చివరి నిముషంలో.. ప్రతీ ఏటా పందాలకు అనధికార అనుమతులవిషయంలో పందెంరాయుళ్లకు చివరి నిముషం వరుకూ టెక్షన్గా ఉంటారు. ప్రతీ ఏటా భోగి రోజు ఉదయం 9 నుండి 11 గంటలకు అనుమతి లభిస్తుంది. ప్రతీ ఏటా 3 రోజులకు మాత్రమే అనధికార అనుమతులు ఉంటాయి, కానీ గతేడాది బోగి, సంక్రాతి, కనుమతోపాటు ముక్కనమ కలుసుకుని 4 రోజులకు అనధికారఅనుమతులతో పందాలు నిర్వహించారు. దీంతో అప్పట్లో పాలకులు,పోలీసుల తీరును అనేమ మంది తప్పు పట్టారు. ’ఆన్లైన్ వద్దు నోట్లే ముద్దు పెద్దనోట్లు రద్దు ప్రభావం కోడిపందాల నిర్వహణపై పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తుంది. ఆన్లైన్ లావాదేవీల వైపు పందెంరాయుళ్లు మగ్గుచూపడంలేదు. పందాలకు నోట్లు సిద్దం చేసుకోవలని నిర్వహకుల నుండి పందాల్లో పాల్గునేవారిని సమాచారం అందుతుంది. మొత్తం మీద ప్రస్తుతానికి కోడిపందాల నిర్వహణ వ్యవహారంలో గతేడాదితో పోల్చితే వెనకబడినట్లూ కనిపిస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇంకా 3 రోజులు సమయం ఉండటంతో పందాల నిర్వహణలో పోలీసులా, పందెంరాయళ్లా అనే విషయం తేలాల్సి ఉంది. -
కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి
ఆచంట: కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 19 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 కోళ్లు, రూ. 2,650 నగదు, 9 ద్విచక్రవాహనాలు, 12 నాటు కత్తులు, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పడమంచలలో ఆదివారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. కోడి పందాలు ఆడుతున్న వారితో పాటు బెట్టింగ్ నిర్వహించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. -
ఇక పావురాలతో పందేలు
నెల్లూరు జిల్లాలో చెన్నైకి చెందిన జూదరులు.. రూ. లక్షల్లో పందేలు చావలి (పెళ్లకూరు): సంక్రాంతి పండుగ వస్తే కోడి పందేలు నిర్వహించడం చూశాం. అయితే ఇప్పుడు కొందరు జూదరులు పావురాల పందేలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చావలి గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. నాయుడుపేట– పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలో ఎగువచావలి, దిగువచావలి గ్రామాల మధ్యలో చెన్నైకి చెందిన కొందరు రెండు లారీల్లో అక్కడకు చేరుకున్నారు. లారీల్లోని ప్రత్యేక పెట్టెల్లో ఉంచిన పావురాలను కిందకు దించి వాటి కాళ్లకు దారాలు కట్టి వందల కొద్ది పావురాలను గాల్లోకి విడిచిపెట్టారు. అవి గుంపులు గుంపులుగా చెన్నై వైపు ఎగిరిపోయాయి. వెంటనే వాటిని అనుసరిస్తూ జూదరులు వచ్చిన వాహనాల్లో చెన్నైవైపు వెళ్లిపోయారు. కాగా ఎవరి పావురాలు తిరిగి అవి ఉంటున్న ప్రదేశానికి వెళతాయో వారు పందెం గెలిచినట్టని, ఇందుకు సంబంధించి రూ. లక్షల్లో పందేలు కాస్తున్నారని సమాచారం. -
ఉత్సాహ‘బరి’తంగా..
కోడిపందేలకు సై సిద్ధమవుతున్న బరులు యుద్ధప్రాతిపదికన పనులు కోడి పందేలు వలదంటూ సర్వోన్నత న్యాయస్థానాలు ఉత్తర్వులిచ్చినా.. సర్కారు ఉదాసీన వైఖరి నిర్వాహకుల్లో ఉత్సాహం నింపుతోంది. ఫలితంగా జిల్లాలో పందేల నిర్వహణకు భారీ ఎత్తున బరులు సిద్ధమవుతున్నాయి. క్రీడా ప్రాంగణాలను తలపించేలా సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్నాయి. తణుకు టౌన్ : పందేలకు కోళ్లు సిద్ధమవుతున్నాయి. బరులు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఒకవైపు కోడి పందేలను నిషేధిస్తూ.. రాష్ట్ర అత్యుతన్న న్యాయస్థానం ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. అయితే అధికారులు చేసే దాడులు, తనిఖీలకు కొన్ని షరతులు విధించింది. దీనిని సాకుగా చేసుకుని సర్కారు ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. ఇది నిర్వాహకుల్లో ఉత్సాహం నింపుతోంది. ఫలితంగా పందేలకు బరులు భారీ ఎత్తున సిద్ధమవుతున్నాయి. బరుల చదును పనులను నిర్వాహకులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. రెండు రోజులుగా తణుకు మండలంలోని తేతలి గ్రామంలో బరులను నిర్వాహకులు శుభ్రం చేస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడ భారీస్థాయిలో కోడి పందేలు జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా పందేల నిర్వహణకు నిర్వాహకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం పండగ నాలుగు రోజులూ పందేలకు అనుమతులు ఇస్తోందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ బరుల వద్ద గుండాట, పేకాట, కోతాట నిర్వహణకూ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ బరులు సిద్ధమవుతున్నాయి. అనుమతివ్వకుంటే ఎద్దుల పోటీ ఒక వేళ కోడి పందేలకు సర్కారు అనుమతి ఇవ్వకపోతే ఎద్దుల పోటీలను నిర్వహించేందుకు తణుకు మండలం తేతలి గ్రామంలో బరిని నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. దీని కోసం నిర్వాహకులు ఇప్పటికే గుంటూరు, నరసరావుపేట వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ జరిగే ఎద్దుల పోటీలను పరిశీలించి వచ్చారు. ఎద్దుల పోటీకి తగ్గట్టుగా భారీ ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. వెయ్యి కిలోల బరువు గల సిమ్మెంట్ దిమ్మెను తయారు చేశారు. కోళ్లకు పౌష్టికాహారం పందేల కోసం జిల్లాలోని జూదరులు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. వాటికి వేల రూపాయలు ఖర్చు చేసి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఏదేమైనా కోడి పందేలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే బరులను ఏర్పాటు చేస్తుండడం వల్ల జూదరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
షరతులు వర్తిస్తాయ్
కోడి పందేలపై హైకోర్టు ఆదేశాలను సమర్థించిన సుప్రీం కోర్టు కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని.. ఎక్కడబడితే అక్కడ దాడులు చేయొద్దని ఆదేశాలు కోర్టు ఆదేశాలు అమలు చేస్తాం : ఎస్పీ భాస్కర్ భూషణ్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందేలను నిరోధించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే, కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని.. ఎక్కడబడితే అక్కడ దాడులు చేయొద్దని ఆదేశించింది. ఇలాంటి మినహాయింపులను అడ్డం పెట్టుకుని సంక్రాంతి రోజుల్లో పందేలు వేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పందేల సందర్భంగా కోళ్లకు కట్టే కత్తులను స్వాధీనం చేసుకోవచ్చని చెప్పిన సుప్రీం కోర్టు పందెం కోళ్లను మాత్రం స్వాధీనం చేసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. పోలీసులు దీని కోసం ఎక్కడబడితే అక్కడ దాడులు చేయకూడదని, ఈ పందేలకు గుర్తింపు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే తనిఖీలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. కోడి పందేలను నిరోధించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఆ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ జిల్లాకు చెందిన నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు పైవిధంగా ఉత్తర్వులిస్తూ.. కేసు విచారణను నెల రోజులపాటు వాయిదా వేసింది. ఆచితూచి అడుగులు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోడి పందేలు నిర్వహించే వారితోపాటు కోళ్లకు కత్తులు కట్టేవారిపై పోలీసులు బైండోవర్ కేసులు పెడుతూ వచ్చారు. గతంలో పందేలపై దాడులు చేసినపుడు కోళ్లను కూడా స్వాధీనం చేసుకునేవారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని స్పష్టం చేసింది. కోర్టు ఆంక్షల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పోలీసులు కసరత్తు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, దానికి అనుగుణంగా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ’సాక్షి’కి తెలిపారు. మరోవైపు కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా సంప్రదాయం పేరుతో కోడిపందేలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోడి పందేలకు అనుమతి ఇవ్వకపోయినా, కోర్టులు అక్షింతలు వేసినా ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆఖరి నిముషంలో ఇచ్చే ఆదేశాలతో జిల్లాలో ఏటా కోడిపందేలు నిరాంటంకంగా సాగిపోతున్నాయి. బరుల వద్దే గుండాట, పేకాట, కోతాట వంటి జూదాలకు కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బరుల ఏర్పాటు అధికార పార్టీ నేతలే చేస్తుండటంతో సంక్రాంతి మూడు రోజులైనా అనుమతి వస్తుందన్న ఆశతో పందేల రాయుళ్లు ఉన్నారు. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు కోడిపందేలపై దాడుల కోసం జాయింట్ యాక్షన్ టీమ్‌ల ఏర్పాటుకు శనివారం చివరి రోజు కావడంతో ఆ దిశగా జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. -
కోడిపందాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సంక్రాంతి కోడిపందాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. కోడిపందాలకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై శుక్రవారం విచారణ ప్రారంభించింది. కోళ్లను నిర్బంధించడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. సంక్రాంతికి కోళ్ల పందాలను నిషేధిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో నాలుగో అంశంపై స్టే విధించింది. కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని, కోడి పందాలకు వాడే ఆయుధాలను సీజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. సంక్రాంతి కోడిపందాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
కోడిపందాలపై సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: సంక్రాంతి కోడిపందాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోడిపందాలకు అనుమతి నిరాకరిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, కోడిపందాలు కోనసీమ సంప్రదాయమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నెల 5 లేదా 6 తేదీల్లో దీనిపై విచారణ జరిగే అవకాశముంది. కోడిపందాలకు బ్రేక్ వేస్తూ డిసెంబర్ 26న హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోడిపందాల పేరుతో జంతువులను హింసిస్తున్నారని పేర్కొంటూ.. పీపుల్ ఫర్ యనిమల్ ఆర్గనైజేషన్, యనిమల్ వెల్ఫేర్ బోర్డు వేసిన పిటిషన్ ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలిచ్చింది. కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. -
‘కోడిపందాలపై కోర్టు ఆదేశాలు పాటిస్తాం’
విజయవాడ: కోడిపందాలపై హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని ఏపీ డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. ఆయన శనివారం పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లోనే నేరాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. నేరాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఏపీ భవన్ లో మావోయిస్టుల రెక్కిపై తమకు సమాచారం లేదని మీడిమా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
‘కోడిపందాలపై కోర్టు ఆదేశాలు పాటిస్తాం’
-
కోర్టు వద్దన్నా.. కోఢీ కూస్తోంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందేలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎక్కడా వీటిని నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. కోడి పందేల పేరుతో జూద క్రీడలు, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడి పందేల పేరుతో జంతువులను హింసిస్తున్నారని పీపుల్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్, యాని మల్ వెల్ఫేర్ బోర్డు దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. వీటిని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఉత్తర్వు లిచ్చింది. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ ఆదేశాలు ఏమేరకు అమలవుతాయన్నదే ప్రశ్నార్థకంగా మారింది. కొన్నేళ్లుగా సంప్రదాయం పేరుతో ప్రజాప్రతినిధులే ముందుండి కోడిపందేలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో ప్రధానంగా భీమవరంలో ప్రకృతి ఆశ్రమం, వెంప, లోసరి, ఆకివీడు మండలం ఐ.భీమవరం, కాళ్ల మండలం సీసలి, ఉండి మండలం మహదేవపట్నం తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహించేందుకు బరులను సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం, లింగపాలెం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో భోగి రోజు నుంచి కనుమ వరకు రాత్రీపగలు తేడా లేకుండా.. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ‘ఉత్త’ర్వులేనంటూ.. గత ఏడాది కూడా హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలను తోసిరాజని ప్రజాప్రతి నిధులు స్వయంగా కోడిపందేలు వేశారు. కత్తులు కట్టకుండా డింకీ పందేలు ఆడిస్తున్నామంటూ.. ఎడాపెడా పందేలు వేయించారు. ఈ ఏడాది కూడా అదేవిధంగా జిల్లావ్యాప్తంగా భోగి రోజు మొదలు కోడి పందేలు ఆడించేందుకు బరులు సిద్ధం చేస్తున్నారు. మెట్ట, డెల్టా ప్రాంతాల్లో 50కి పైగా బరులను ఇప్పటికే రెడీ చేసినట్టు సమాచారం. హైకోర్టు ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఈసారి మాత్రం కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని ఏలూరు రేంజి డీఐజీ పీవీ రామకృష్ణ, ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలో 325 మందిపై బైండోవర్ కేసులను నమోదు చేశామని వివరించారు. కోడి పందేల బరులు ఏర్పాటు చేసేవారు, కోళ్లకు కత్తులు కట్టేవారు, పందెం కోళ్లు పెంచేవారితో పాటు పందేలను ప్రోత్సహించే వారిని గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. గేమింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువార్డ్స్ యానిమల్స్.. సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోడిపందేల నేపథ్యంలోనే జిల్లాలో సీఐల బదిలీలకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. అయితే. బదిలీ రేసులో ఉన్న ప్రతి సీఐలు తమకు కావాల్సిన ప్రాంతం కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి లేఖలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు అధికార పార్టీ నేతలను కాదని కోడి పందేలను ఏ మాత్రం అడ్డుకుంటారో తేలాల్సి ఉంది. మూడు రోజులపాటు సాగే పందేలు, జూదాల్లో సుమారు రూ.200 కోట్లు చేతులు మారతాయని అంచనా. ఏది ఏమైనప్పటికీ సంక్రాంతికి మూడు వారాల ముందే హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో పందేలరాయుళ్లలో కలకలం మొదలైంది. స్వైపింగ్ యంత్రాలు సిద్ధం! పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు కష్టాలు తలెత్తడంతో పందేల్లోనూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు స్వైపింగ్ మెషిన్లు సమకూర్చుకున్నట్టు భోగట్టా. నగదు సమకూరని పరిస్థితుల్లో వీటిని వినియోగించాలన్నది నిర్వాహకుల ఉద్దేశం. ఇదిలావుంటే భీమవరం పరిసర ప్రాంతాల్లో కొన్ని బ్యాంకుల నుంచి కొందరు నెల రోజులుగా రూ.2 వేల నోట్ల సేకరణలో నిమగ్నమయ్యారు. రూ.100 నోట్లనూ అందుబాటులో ఉంచుకుంటున్నారు. కోడిపందేల సమయానికి రూ.500 కొత్త నోట్లు ఎలాగూ అందుబాటులోకి వస్తాయని, తద్వారా పందేల జోరు మరింత ఎక్కువగా ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. చిన్న పందేల్లో కూడా రూ.2 వేలకు తగ్గకుండా ఉంటుందని అంటున్నారు. జూద క్రీడలకు వేలం పాటలు కోడిపందేల బరుల ఏర్పాటు చేసే నిర్వాహకులు ఇప్పటికే గుండాట, కోతాట వంటి జూద క్రీడల కోసం స్థలాలు కేటాయించి వేలం నిర్వహిస్తున్నారు. గతేడాది పూలపల్లి, యలమంచిలి, భీమవరం, ఉండి, వెంప తదితర ప్రాంతాల్లో ఒక్కో బరి వద్ద జూదక్రీడా శిబిరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు బరులు సమకూర్చిన వారికి రూ.28 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చెల్లించారు. అదే విధానం కొనసాగిస్తూ ఇప్పుడు కూడా వేలం మొదలైంది. -
ప్రాణం తీసిన జూదం
కామవరపుకోట: జూదం అతని పాలిట మృత్యువయ్యింది. కోడి పందాల్లో జరిగిన గొడవ నిండు ప్రాణాలను బలిగొంది. కామవరపుకోట శివారు కొండగూడెం వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి చింతలపూడి సీఐ జి.దాసు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. మండలంలోని ఉప్పలపాడు పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంకు చెందిన వీరవల్లి వీరాస్వాములు (45)కు కోడి పందాలు ఆడే అలవాటు ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పందాలకు వెళ్లాడు. అక్కడ వీరాస్వాములుకు, మరికొందరితో గొడవ జరగ్గా కొద్దిసేపటికి ఎవరికి వారు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సాయంత్రం కామవరపుకోట శివారు కొండగూడెం వాటర్ ప్లాంట్ వద్ద వీరు మళ్లీ ఘర్షణకు దిగారు. ఈ సమయంలో వీరాస్వాములు తలపై ప్రత్యర్థి వర్గం వారు బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితులను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలి పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు తరలించారు. ఇదిలా ఉండగా వీరాస్వాములు ఉదయం పచ్చిమిరపకాయల బస్తా వేసుకుని కామవరపుకోట వెళ్లాడని స్థానికులు చెబుతున్నా రు. మృతునికి భార్య జ్ఞానేశ్వరి, వివాహిత అయిన కుమార్తె, కుమారుడు నాగరాజు ఉన్నారు. కుటుంబ పెద్ద అకాల మరణంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
కోడి పందాలపై పోలీసుల దాడి
కాణిపాకం: చిత్తూరు జిల్లా ఐరాల మండలం మద్దిపట్లపల్లె గ్రామంలో కోడిపందాల అడ్డాలపై శనివారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేశారు. గ్రామ సమీపంలోని ఓ తోటలో జోరుగా సాగుతున్న పందాలపై ఎస్సై నరేష్‌బాబు ఆధ్వర్యంలో దాడి చేశారు. పందాల్లో పాల్గొన్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 9 పుంజులను ఏడు బైక్‌లను స్టేషన్‌కు తరలించారు. -
కోడిపందాలపై దాడులు: పలువురి అరెస్టు
గుంటూరు: గుంటూరు జిల్లాలో కోడిపందాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని చిలకలూరి పేట మండలం, బొప్పూడి లో జరుగుతున్న కోడిపందాలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, 7 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. -
పందేల జాతర
-
నగరంలో కోడిపందేలు: ఇద్దరి అరెస్ట్
హయత్‌నగర్ : సంక్రాంతి వచ్చిందంటే.. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల సందడి అంతా ఇంతా కాదు. క్రమక్రమంగా ఆ సంస్కృతి మిగతా తెలుగు ప్రాంతాలకు కూడా పాకుతుంది. తాజాగా గురువారం సాయత్రం నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదిరాజ్ కాలనీలో కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు పందెం రాయుళ్లతోపాటు, 2 ద్విచక్రవాహనాలు, 6 పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. -
కృష్ణా,గుంటూరు జిల్లాల్లో కోడిపందేల జోరు
బంటుమిల్లి (కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లా బంటుమిల్లిలో కోడిపెందేలు జోరుగా సాగుతున్నాయి. గురువారం కోడి పందేలతోపాటు గుండాట, మూడుముక్కలాట వంటివి కూడా ఆడుతున్నారు. పెందూరులో కోడిపందేల్ని నిర్వహించరాదని వైసీపీ, సీపీఎం నేతలు మాదాసు వెంకటేశ్వరరావు, ప్రత్తి భోగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు పక్కనే ఉన్న బంటుమిల్లిలో కోడిపందేల్ని నిర్వహిస్తున్నారు. అయితే బంటుమిల్లి కోడిపందేల స్థావరం దగ్గర 'పెందూరు కోడి పందేల బరి' అని బోర్డులు పెట్టుకున్నారు. బొబ్బర్లంకలో కోడిపందేల జోరు అలాగే గుంటూరు జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంకలో కోడిపందేలు భారీగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు సమక్షంలో పందేలు సాగాయి. గ్రామం పరిధిలో గురువారం మధ్యాహ్నం వరకు రూ.2 కోట్ల మేర చేతులు మారాయని సమాచారం. పందేలకు తోడు మూడుముక్కలాట వంటివి, మద్యం, గుట్కా విక్రయాలకు అడ్డులేకుండా పోయింది. పోలీసులు ఆ దరిదాపులకు కూడా రాలేదు. -
పశ్చిమగోదావరిలో కోడి పందేల సందడి
-
మాగంటి సై.. గోకరాజు నో
ఏలూరు : కోడిపందేల నిర్వహణపై జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు వేరు వేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాటన్ పార్కులో జరిగిన సభలో బహిరంగంగానే వారి అభిప్రాయాలను స్పష్టం చేశారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ కోడిపందెం ఆటకు తాను పూర్తి వ్యతిరేకమన్నారు. దీనివల్ల కష్టపడి సంపాదించిన డబ్బు అంతా పోగొట్టుకోవలసి వస్తుందన్నారు. జూదం అసలు ఆడవద్దని చెప్పారు. వ్యసనాలకు ఖర్చుపెట్టడం సరికాదన్నారు. తాను గాంబ్లింగ్‌కు పూర్తి వ్యతిరేకమని చెప్పారు. సంపాదించండి, ఎవరికైనా సహాయం చేయండి అంటూ గోకరాజు తన మనోభావాన్ని వ్యక్తం చేశారు. కోడిపందేలు ఆడవద్దని చెబితే తనకు ఓట్లు పోతాయన్న భయం లేదన్నారు. ఇలా చెప్పడం వల్ల 60 శాతం ఓట్లు ఉన్న మహిళలు తనవైపే ఉంటారని చెప్పారు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) మాట్లాడుతూ సంప్రదాయంగా వస్తున్న కోడిపందేలు ఆడటం తప్పేమీ కాదన్నారు. ఆ నాలుగు రోజులూ కోడి పందేలు ఆడుకోవాలన్నారు. డింకీలు ఆడుకోండి అంటూ కోడిపందేల రాయుళ్లకు హితబోధ చేశారు. జూదం ఆడవద్దని చెప్పారు. ఎంపీల వేరు వేరు అభిప్రాయాలను వ్యక్తంచేయడంతో హాజరైన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవాక్కయ్యారు. -
ఆ నాలుగు రోజులు ఆడేద్దాం
''హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు.. ఇవన్నీ ఎప్పుడూ మామూలే.. పండగ ముందు ఆ మాత్రం హడావుడి ఉంటుంది.. ఈసారి పండగ మూడురోజులతో పాటు ముక్కనుమ ఆదివారం వచ్చింది.. ఆ నాలుగు రోజులు కోడి పందేలు వేసుకోండి. ఏమైనా జరిగితే మేం చూసుకుంటాం..'' తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి కోడిపందేల నిర్వాహకులకు ఇచ్చిన భరోసా ఇది. ఆ నేత ఒక్కరే కాదు డెల్టా ప్రాంతంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పందేలరాయుళ్లకు వత్తాసు పలుకుతూ బరులు వేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ఏలూరు ఎంపీ మాగంటిబాబు అయితే బహిరంగంగానే కోడిపందేలు నిర్వహిస్తామని, అవసరమైతే జీవో కూడా తెస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కోడిపందేల నిర్వహణకు జీవో తెప్పించడమేమిటనేది ఎవరికీ అర్థం కాకపోయినా మాగంటి బాబు తమకు అండగా ఉన్నారనేది పందేలరాయుళ్లకు బాగానే అర్థమైంది. ఇక ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అండ ఎటూ ఉంటుంది. డెల్టా ప్రాంతంలో సెంటిమెంట్, గ్రామాల అభివృద్ధి పేరుతో ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ పందేలరాయుళ్లకు ఎప్పుడూ వత్తాసు పలుకుతారు. మిగిలిన టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకపోయినా ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు అవసరమైతే నానాయాగీ చేయగలరనేదానికి గత ఏడాది జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు చేసిన హల్చల్ తార్కాణం. సరిగ్గా ఆ ధైర్యంతోనే పందేల నిర్వాహకులు ఇప్పుడు బరులు సిద్ధం చేసేస్తున్నారు. బరులు రెడీ నిడదవోలులో భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించేందుకు రెండు బరులను స్థానిక టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. విజ్జేశ్వరం, ముప్పవరం, తాడిమళ్ళ, సింగవరం, పెండ్యాల గ్రామాల్లో కూడా బరులు తయారు చేస్తున్నారు. పెరవలి మండలంలో ఖండవల్లి గ్రామంలోని కొబ్బరితోటలో భారీ పందెం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీస్థాయి పందేల నిర్వాహకుల్లో చాలామంది ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అనుచరులే ఉన్నారని అంటున్నారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేల్పూరు, తేతలి, మండపాక, దువ్వ గ్రామాలతో పాటు ఇరగవరం, సూరంపూడి, తూర్పువిప్పర్రు, రేలంగి, అత్తిలి ప్రాంతాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేస్తున్నారు. ఆడుకోండి... మరి నాకేంటి: టీడీపీ నేత బేరసారాలు ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం అర్ధవరం, నిడమర్రు మండలం పత్తేపురం, ఉంగుటూరు మండలం నారాయణపురం, భీమడోలు మండలం గుండుగొలను గ్రామాల్లో పందేలు నిర్వహించేందుకు ఇటీవలే సమావేశం నిర్వహించారు. పోలీసులతో ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా... మరి నాకేంటి అని ఓ టీడీపీ నేత బేరసారాలు అడినట్టు తెలుస్తోంది. పెద్ద బరులకు ఒక రేటు, చిన్న బరులకు మరో రేటు ఇచ్చేందుకు నిర్వాహకులు అంగీకరించడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. గూడెంలో గుట్టుచప్పుడు కాకుండా.. తాడేపల్లిగూడెంలో గుట్టుచప్పుడు కాకుండా బరులు సిద్ధం చేస్తున్నారు. విమానాశ్రయ ప్రాంతం, లింగారాయుడుగూడెం, ఆరుగొలను, పెంటపాడు మండలం అల్లంపురం, పెంటపాడు, గూడెం మండలం పెదతాడేపల్లి, కొమ్ముగూడెం ఊళ్లల్లో పందేలు వేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఉండి నియోజకవర్గం అయిభీమవరం, సిద్ధాపురం, దుంపగడప, అప్పారావుపేట, కోళ్లపర్రు, కుప్పనపూడి, జువ్వలపాలెం, ఏలూరుపాడు, బొండాడపేట, చినమిరం, పెదమిరం, కొమటిగుంట గ్రామాల్లో భారీ ఎత్తున పందేల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి, శేరేపాలె, మొగల్తూరు, పేరుపాలెం, మోళ్ళపర్రు, కొత్తోట గ్రామాల్లో కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం, దూబచర్ల, పోతవరం గ్రామాల్లో భారీగా పందేలు నిర్వహించటానికి టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, చిన్నాయగూడెం, యర్నగూడెం, లక్ష్మీపురం, గోపాలపురం మండలంలో గోపాలపురం, గుడ్డిగూడెం, వెంకటాయపాలెం, కరిచర్లగూడెం, కొవ్వూరుపాడు గ్రామాల్లోనూ, ద్వారాకాతిరుమల మండలం మారంపల్లి, పంగిడిగూడెం గ్రామాల్లోనూ కోడిపందేల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. -
పోరు బరులు రె‘ఢీ’
జిల్లాలో కోడిపందేలకు చురుగ్గా సన్నాహాలు మురమళ్లలో పదెకరాల విస్తీర్ణంలో నిర్వహణ ఫ్లడ్ లైట్లు, ఐరన్ గ్రిల్స్‌తో ప్రత్యేక ఏర్పాట్లు కోనసీమలో పలు ప్రాంతాల్లో భారీ బరులు అమలాపురం టౌన్ : కోర్టు కాదన్నా, ఖాకీ వ్యవస్థ ‘ఖబడ్దార్’ అన్నా పెద్ద పండక్కి ‘యుద్ధ’భూములు సిద్ధమవుతున్నాయి. సంప్రదాయం పేరిట సమరభేరి మోగనుంది. జిల్లాలో.. ముఖ్యంగా కోనసీమలో భారీస్థారుులో కోడిపందేల బరులు తయూరవుతున్నాయి. గతంలో మాదిరిగానే చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులే.. వాటి నిర్వహణకు వెన్నుదన్ను గా నిలుస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో తయూరుతిండి తింటూ, ప్రత్యేక తర్ఫీదు పొందిన పుంజుల కాళ్లకు కత్తులు మెరవనున్నాయి. వాటి నులివెచ్చని నెత్తుటితో బరులు తడవనున్నాయి. వాటిలో కొన్ని విజయూనికీ, కొన్ని వీరమరణానికీ నోచుకోనున్నాయి. జిల్లాలో కోనసీమతో పాటు మెట్ట ప్రాంతంలో కూడా కోడి పందేలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే పందేల్ని చట్టబద్ధం చేయాలంటున్న క్రమంలో కొందరు ఎమ్మెల్యేలు సంక్రాంతి పండగ మూడు రోజులూ దగ్గరుండి పందేల్ని ఆడించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సారి పందేల బరులను గతంలోకన్నా భారీగా, పటిష్టమైన ఏర్పాట్లతో సిద్ధం చేస్తున్నారు. ఐ.పోలవరం మండలం మురమళ్లలో పదెకరాల పంట భూమిని పందేల నిర్వహణకు ఎంపిక చేశారు. కేవలం ఈ పందేల కోసమే ఆ భూమికి పంట వేయకుండా ఖాళీగా ఉంచేశారు. దాదాపు రూ.30 లక్షల వ్యయంతో ఈ బరిని తయూరు చేస్తున్నారు. గత పది రోజులుగా పొక్లెయిన్లతో నేల చదును చేయించడం, ఇసుక పరిపించడం వంటి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పందేలు జరిగే సమయంలో జనం ముందుకు తోసుకురాకుండా బరి చుట్టూ కొత్తగా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పందేలకు వీలుగా భారీ ఫ్లడ్ లైట్లు అమరుస్తున్నారు. మురమళ్ల బరిలో కేవలం కోడి పందేలే కాక అదే స్థాయిలో పేకాట ఆడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తరలిరండి మా బరికి.. కోనసీమ ప్రాంతానికి చెందిన కొందరు ధనికులు వ్యాపారాల రీత్యా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారిలో కొందరికి ఏటా సంక్రాంతికి కోనసీమకు రావడం, కోడి పందేలు ఆడడం, చూడడం రివాజు. వారి ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈసారి పందేల నిర్వాహకులు అలాంటి సుదూర ప్రాంతాల్లో ఉండే వ్యాపారవేత్తలకు, సంపన్నులకు ఆహ్వానాలు పంపించారు. వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా పందేల బరుల వద్ద సదుపాయాలను, వినోద కార్యక్రమాలను వివరించారు. లక్షల్లో గుండాట, మద్యం దుకాణాల వేలం కోనసీమలో మురమళ్లతో పాటు అల్లవరం మండలం గోడి, గోడితిప్ప, మలికిపురం మండలం వి.వి.మెరక, సఖినేటిపల్లిలంక, రామరాజులంక, అంబాజీపేట మండలం వాకలగరువు, రావులపాలెం మండలం దేవరపల్లిల్లో, సామర్లకోట మండలం వేట్లపాలెం తదితర ప్రాంతాల్లో కోడి పందేల బరులు సిద్ధమవుతున్నాయి. బరుల వద్ద గుండాట బోర్డులు, మద్యం, పలావు, మిరపకాయ బజ్జీ, మాంసం పకోడీ దుకాణాల ఏర్పాటుకు పందేల నిర్వాహకులు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. గుండాట, మద్యం దుకాణాల వేలం రూ.లక్షల్లో ఖరారు కావటం గమనార్హం. పండగ మూడు రోజుల్లో ఒక్కో బరిలో పందేల నిర్వాహకులకు ఇలాంటి వేలం ద్వారా రూ.రెండు లక్షల నుంచి రూ. పది లక్షల వరకూ ఆదాయం సమకూరనుంది. మురమళ్లలో రూ.60 లక్షల పేకాట టోర్నీ! పండగ చివరి రోజు మురమళ్ల బరి వద్ద 40 మంది పేకాటగాళ్లు ఒక్కొక్కరు రూ.1.50 లక్షల వంతున డిపాజిట్ చేసి ఆడే భారీ పేకాట టోర్నమెంట్లో ఫైనల్ విజేతకు రూ.18 లక్షల కారును బహుమతిగా ఇవ్వనున్నారు. తర్వాతి రెండు స్థానాల్లో నిలిచే వారికీ ఖరీదైన బహుమతులు అందనున్నాయి. 40 మందీ కొన్ని బృందాలుగా పేకాడతారనీ, చివరికి అతి తక్కువ పాయింట్లు కోల్పోయిన వారు విజేతగా నిలుస్తారని, ఈ తరహా టోర్నమెంట్లు తమిళనాడులో జరుగుతాయని చెపుతున్నారు. కాగా పందేలు ఆడేందుకు, వీక్షించేందుకు వచ్చే సంపన్నుల కార్ల కోసం సువిశాలమైన పార్కింగ్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఈసారి మురమళ్లే పందేల్లో ‘అగ్రతాంబూలం’ అందుకునేలా సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ ఒక్క బరిలోనే పండగ మూడు రోజుల్లో రూ.50 కోట్లు చేతులు మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పందెం పుంజుల్ని రెండు రోజుల ముందే మురమళ్లకు తీసుకు రానుండగా వాటికి అవసరమైన సదుపాయూలు పందేల నిర్వాహకులే కల్పించనున్నారు. -
కోడి పందేల స్థావరంపై మెరుపు దాడి
బెజ్జూరు (ఆదిలాబాద్ జిల్లా) : దహెగాం మండలం కర్ధి అటవీ ప్రాంతంలో కోడి పందేల స్థావరంపై పోలీసులు శనివారం ఆకస్మిక దాడి నిర్వహించారు. 45 మందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సుమారు రూ.60 వేల నగదు, 3 ఆటోలు, 32 కత్తులు, 14 బైక్‌లు, 30 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు దహెగాం ఎస్ఐ రమేశ్ తెలిపారు. పట్టుబడిన వారిలో దహెగాం, భీమిని, బెజ్జూరు మండలాలకు చెందిన వారున్నారు. -
'కోడి పందాలకు బ్రేక్ వేస్తున్నాం'
-
'కోడి పందాలకు బ్రేక్ వేస్తున్నాం'
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల నిర్వహణ అంశంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కోడి పందాలు నిర్వహించకుండా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కోడి పందాల నిర్వహణకు ఎవ్వరికీ అనుమతినిచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు గత విచారణలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందాలను నిర్వహించినా, జూదం ఆడినా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి సంక్రాతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పెందాలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీల్లో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అదే జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరగా, కోడి పందాల నిర్వహణకు తాము ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని, పందాలు నిర్వహించినా, జూదం ఆడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిని రికార్డ్ చేసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణను ముగిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఆ వ్యాజ్యంలో పిటిషనర్ మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. సంక్రాంతి సందర్భంగా మళ్లీ కోడి పందాల నిర్వహణకు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, పోలీసులు తగిన విధంగా స్పందించడం లేదని పిటిషనర్ వివరించారు. ఈ నేపథ్యంలో కోడి పందాలు నిర్వహించకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. -
కోడిపందాల నిర్వహణకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల నిర్వహణకు ఎవ్వరికీ అనుమతినిచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందాలను నిర్వహించినా, జూదం ఆడినా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ బొసాలే, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి సంక్రాతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పెందాలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీల్లో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అదే జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరగా, కోడి పందాల నిర్వహణకు తాము ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని, పందాలు నిర్వహించినా, జూదం ఆడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిని రికార్డ్ చేసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణను ముగిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఆ వ్యాజ్యంలో పిటిషనర్ మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. సంక్రాంతి సందర్భంగా మళ్లీ కోడి పందాల నిర్వహణకు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, పోలీసులు తగిన విధంగా స్పందించడం లేదని పిటిషనర్ వివరించారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం కోడి. -
కోడిపందేలపై పోలీసుల దాడి
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వేలంకలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కోడిపందేలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కోడిపందేల నిర్వాహకులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 20 బైక్ లు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. (కిర్లంపూడి) -
కోడిపందాలు నిర్వహిస్తున్న 49 మంది అరెస్టు
గట్టు: కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడిచేసి 49 మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గట్టు మండలం చాగదూల శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 49 మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.10 వేలు నగధు, 9 బైక్ లు, 20 సెల్ఫోన్లు, 9 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
'కోడిపందాలకి అనుమతి ఇవ్వలేదు'
భీమవరం: కోడి పందాలకు ప్రభుత్వ పరంగా అనుమతులు ఎప్పుడూ ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప అన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా కోడిపందాలు నిర్వహించడంపై ఆయన పై విధంగా స్పందించారు. తమ దృష్టికి వచ్చిన కొంత మందిపై కేసులు నమెదు చేస్తామని చిన రాజప్ప చెప్పారు. -
ఖాకీలు కామ్.. పందేలు ధూమ్‌ధామ్
కొద్ది రోజులుగా ‘ఖాకీ’తో జరిగిన పోరులో చివరికి కోడే గెలిచింది. అత్యున్నత న్యాయస్థానాల సూచనలను, పోలీసుల ఆంక్షలను ఏ మాత్రం లెక్క చేయకుండా.. సంప్రదాయం ముసుగులో.. తెరవెనుక నేతలు ఇచ్చిన మద్దతుతో.. కోడి కత్తుల సమరానికి నిర్వాహకులు ఊహించినట్టుగానే ‘బరి’ తెగించారు. పందెగాళ్లపై ఉక్కుపాదం మోపుతామన్న పోలీసులు ఆ దరిదాపుల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో సంక్రాంతి పండగ మూడు రోజులూ జిల్లావ్యాప్తంగా కోడిపందేలు యథేచ్ఛగా సాగాయి. అమలాపురం టౌన్ :సంక్రాంతి పండగ మూడు రోజులూ జిల్లాలో ఎక్కడ చూసినా కోడిపందేల సందడే కనిపించింది. మంత్రులు, ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయో తెలీదు కానీ.. భోగి పండగనాటి ఉదయం వరకూ బరుల వద్ద కాపలా కాసిన ఖాకీలు.. చివరకు పత్తా లేకుండా పోయారు. దీంతో పందేల నిర్వాహకులు చెలరేగిపోయారు. వేలాదిగా తరలివచ్చిన జనాలు.. ఖరీదైన కార్లు, బైకులతో గ్రామాలు జాతర్లను తలపించాయి. ముఖ్యంగా కోనసీమ కొబ్బరి తోటల్లోని నల్లరేగడి మట్టి.. కోళ్ల ఎర్రని రక్తంతో తడిసింది. పచ్చని చేలు, కొబ్బరితోటల దారులన్నీ జనంతో కిక్కిరిశాయి. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో దాదాపు 45 చోట్ల భారీ పందెంబరులు.. 50 చోట్లకు పైగా ఓ మాదిరి బరులు వెలిశాయి. మొత్తం రూ.25 కోట్ల మేర సొమ్ము పందెంగాళ్ల చేతులు మారిందని అంచనా. ముమ్మిడివరం నియోజకవర్గం ఎదుర్లంక, కేశనకుర్రు, రాజుపాలెం; అమలాపురం నియోజకవర్గం గోడిలంక, గుండెపూడి, ఎన్.కొత్తపల్లి, చల్లపల్లి; పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం, మేడపాడు; రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లిలంక, అప్పనరామునిలంక, వీవీ మెరక; ఇంకా పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, జగ్గంపేట మండలాల్లో పలుచోట్ల కోడిపందేల జోరుగా జరిగాయి. పందేలకు తోడు గుండాట, మద్యం పేరుతో కోట్లలో వ్యాపారం జరిగింది. రూ.10 లక్షల వరకూ పందెం కొట్టిన పుంజులు కొన్నిచోట్ల పందెంకోళ్లు వీరపోరాటం చేసి పందెగాళ్లకు రూ.లక్షల ఆదాయం తెచ్చిపెట్టాయి. ఎదుర్లంక బరిలో ఓ పుంజు పలు పందేల్లో ప్రత్యర్థి పుంజులను మట్టి కరిపించి రూ.10 లక్షల వరకూ పందేలు కొట్టింది. గోడిలంక బరిలో కూడా ఓ పుంజు రూ.5 లక్షల దాకా పందేలను కొట్టింది. ఇంకా వేట్లపాలెం, పల్లిపాలెం, సఖినేటిపల్లి తదితర బరుల్లో కొన్ని పుంజులు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ పందేలు కొట్టాయి. రూ.కోట్లలో మద్యం, జూదం వ్యాపారాలు పలు బరులవద్ద అనధికార మద్యం దుకాణాలు, గుండాట, పేకాట స్థావరాల ద్వారా కూడా రూ.కోట్ల వ్యాపారం సాగింది. మద్యం అక్రమంగా అమ్మితే కేసులు నమోదు చేసే ఎక్సైజ్ అధికారులు బరుల్లో అనధికారికంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసినా పట్టించుకోలేదు. జిల్లాలో పందేల బరుల వద్ద ఏర్పాటు చేసిన మద్యం, జూదాల వల్ల రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకూ వ్యాపారం సాగిందని అంచనా. పలుచోట్ల రూ.500, రూ.1000 నోట్లే చెలామణి అయ్యాయి. బరులవద్ద మాంసపు పకోడీలు, మిరపకాయ బజ్జీల దుకాణాలు కూడా రూ.లక్షల్లో వ్యాపారం చేశాయంటే పందేలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. కోసకు యమగిరాకీ పందేల్లో మరణించిన కోడి మాంసాన్ని ‘కోస’ అంటారు. గత మూడు రోజుల్లో నాలుగు వేలకు పైగా కోళ్లు బరిలో తలపడితే దాదాపు మూడు వేల కోళ్లు నేలకొరిగినట్టు ఒక అంచనా. ఇలాంటి కోళ్ల కోసం కోస మాంసం ప్రియులు వేలాదిగా కాచుకుని ఉంటారు. ఇటువంటి కోళ్లు బరి సమీపంలో.. కొద్ది క్షణాల్లోనే అమ్ముడైపోతాయి. ఈ విధంగా ఒక్కో కోడి రూ.మూడు వేల నుంచి రూ.ఆరు వేల వరకూ ధర పలికింది. ఈవిధంగా గత మూడు రోజుల్లో సుమారు రూ.కోటి మేర ‘కోస’ వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది. కోనసీమలోని ఎదుర్లంక, గోడిలంక వంటి ప్రధాన బరుల్లోనే కోస మాంసం వ్యాపారం గత మూడు రోజుల్లో రూ.20 లక్షలకు పైగా సాగినట్టు సమాచారం. కొన్ని బరులవద్ద పందెంలో ప్రాణాలు కోల్పోయిన కోళ్లను కాల్చి.. మాంసంగా మార్చి కిలో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు విక్రయించారు. పందెంలో విజేతగా నిలిచి కత్తి వేట్లకు పందెం తర్వాత చనిపోయిన కోడికి మరింత డిమాండు ఏర్పడింది. ఇటువంటి కోడి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ పలికింది. ప్రజాప్రతినిధులు సాక్షిగా.. పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు సాక్షిగా కోడిపందేలు సాగాయి. పిఠాపురం, అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు తొలి రోజు తమ తమ నియోజకవర్గాల్లో పందేలను లాంఛనంగా ప్రారంభించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పండగ మూడు రోజులూ ఎదుర్లంక బరిలో ఉండి ఆద్యంతం పందేలను తిలకించారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పుట్టిన రోజు వేడుకలను అభిమానులు వేట్లపాలెంలోని కోడిపందేల బరిలోనే నిర్వహించారు. ఆయన కూడా పందేలను వీక్షించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి వాడ్రేవుపల్లిలో శుక్రవారం జరిగిన కోడిపందేల్లో పాల్గొన్నారు. కొద్దిసేపు దగ్గరుండిమరీ పందేలు ఆడించారు. ఈ సందర్భంగా జరిగిన ఆర్కెస్ట్రాలో గాయకులు పాడిన పాటలకు ఆయన స్టెప్పులు కూడా వేశారు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అనేకమంది దగ్గరుండి మరీ పందేలను పర్యవేక్షించారు.