ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కోడి పందాలు | TDP MLAs support on cock fight | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కోడి పందాలు

Published Thu, Jan 15 2015 3:38 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కోడి పందాలు - Sakshi

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కోడి పందాలు

ఉండి : మండలంలో బుధవారం ఎక్కడ చూసినా పందెంరాయుళ్ల హడావిడే కనిపించింది. కోడిపుంజులను చేతపట్టుకుని వాహనాలపై కోడి పందాల బరులకు వచ్చారు. మండలంలోని మహదేవపట్నం, ఉండి, కోలమూరు, యండగండిలో కోడిపందాలు, గుండాట, కోతాట వంటి జూదాలు యథేచ్ఛగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వేటూకూరి వెంకటశివరామరాజు మహదేవపట్నంలో దగ్గరుండి కోడిపందాలు నిర్వహించారు.
 
 యండగండిలో సినీనటుడు శ్రవణ్
 సినీనటుడు(ప్రతి నాయకుడి పాత్రధారి) శ్రవణ్ కోడిపందాలకు హాజరయ్యారు. యండగండికి చెందిన అతని స్నేహితుడు ఇందుకూరి అప్పలనరసింహరాజు ఆహ్వానం మేరకు వచ్చారు. తులసి, సింహ, లెజెండ్, ఏక్‌నిరంజన్ తదితర చిత్రాలతో శ్రవణ్ ప్రేక్షకులకు సుపరిచితుడు కావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆయనతో కరచాలనానికి స్థానికులు పోటీపడ్డారు. శ్రవణ్ మాట్లాడుతూ పల్లె వాతావరణం చాలా అద్భుతంగా వుందన్నారు. షూటింగులతో బిజీగా ఉండే తాను సంక్రాంతి సందర్భంగా పల్లె వాతావరణం ఆస్వాదిస్తున్నానన్నారు. సంక్రాంతి పండగను ఈప్రాంతంలోనే చేసుకోవాలనిపిస్తుందని చెప్పారు. ఇక్కడకు మళ్లీమళ్లీ రావాలనిపిస్తోందని పేర్కొన్నారు. శ్రవణ్‌తోపాటు సినీపరిశ్రమకు చెందిన పాల్, క్రాంతి, శశి ఈ సంబరాలలో పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement