అతిగా రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా.. : ఎమ్మెల్యే గుమ్మనూరు | TDP MLA Gummanur Warns Media Representatives Over Circulating News On Him, More Details Inside | Sakshi
Sakshi News home page

నాకు మీడియా అంటే లెక్కలేదు: ఎమ్మెల్యే గుమ్మనూరు

Published Thu, Jan 30 2025 5:19 AM | Last Updated on Thu, Jan 30 2025 11:15 AM

TDP MLA Gummanur warns media representatives

అతిగా రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా.. 

ఇలాంటివి ఎన్నో చేసి ఈ స్థాయికి వచ్చా 

మీడియా ప్రతినిధులకు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు హెచ్చరిక

సాక్షి ప్రతినిధి, అనంతపురం/గుంతకల్లు: పత్రికల్లో ఇష్టమొచ్చినట్టు రాసుకుంటూ వెళితే రైలు పట్టాల­పై పడుకోబెడతానని అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌ పాత్రికేయులను హెచ్చరించారు. గుంతకల్లులో టీడీపీ ప్రతినిధుల సమక్షంలో ఆయన మాట్లాడిన వీడియో టేపులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

ఇటీవల ఒక టీవీ చానల్‌ (సాక్షి టీవీ కాదు)­లో గుమ్మనూరు జయరాం సోదరులు రైలు పట్టాల­పై పడుకోబెట్టి చంపుతున్నారన్నట్టుగా వార్తలొచ్చాయని, వాటిని నిరూపించాలని అన్నారు. తనకు మీడియా అంటే లెక్కలేదని, ఏదైనా అతిగా రాస్తే నిజంగానే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ‘నేను అన్నీ చేసి వచ్చాను. ఇది నాకు పెద్ద లెక్క కాదు’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 

తన సోదరులు రాజకీయ పెత్తనం చేస్తున్నారని చాలామంది అంటున్నారని, అవసరమైతే వారిని పక్కనపెట్టి తానే రాజకీయం చేస్తానని అన్నారు. తనపై వార్తలు రాస్తే తాట తీస్తానని వార్నింగ్‌ ఇచ్చా­రు. తనపై కొంతమంది పనిగట్టుకుని వ్యతి­రేక వార్తలు రాస్తున్నారని, వాటిని నిరూపించలేకపోతే నిజంగానే రైలు పట్టాలపై పడుకోబెడతానని అన్నారు. తాను ఫ్రెండ్లీగానే అడుగుతున్నానని, ఏదైనా రాసేట్ట­యితే చెప్పండని, తాను వెళ్లిపోయాక ఏవేవో రాయొద్దని అన్నారు. 

బుధవారం సాయంత్రం గుంతకల్లులో మీడియాతో మాట్లాడుతూ.. తనపై మీడి­యా చానళ్లు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని, రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానంటూ ప్రసారాలు చేయడం కరెక్ట్‌ కాదని అన్నారు. ఇలాంటి ప్రసారాలను చేస్తే ఇదే తరహాలో ప్రవ­ర్తించాల్సి వస్తుందని మీడియాకు వార్నింగ్‌ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement