పందేలకు రెఢీ
పందేలకు రెఢీ
Published Mon, Jan 9 2017 9:44 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM
నిడమర్రు: గ్రామీణ ప్రాంతాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి, సంక్రాతి పండుగ సమీపించడంతో పందేల రాయయళ్లు సమరానికి సన్నద్దమవుతున్నారు. ప్రతీ ఏటా సంప్రదాయ ముసుగులో కోడిపందాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల్లో పందాల నిర్వహణకు గ్రామాల్లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి, ఈ కోడి పందాల నిర్వహణ పండుగ ఆనవాతీ అని దీన్నిఅడ్డుకోవడం ఎవరి తరంకాదని పందేం రాయుళ్లు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు పందాలు వేసి తీరుతామనిబరులు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే పందాలకు అవసరమైన కోళ్లును పలువరు నిర్వహకులు సామూహికంగా పెంచి పందాలకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
’ఓ సామాజిక వర్గం ఆధిపత్య గ్రామాల్లోనే...
గణపవరం, నిడమర్రు మండలాల్లో ఓ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న గ్రామాల్లోనే కోడి పందాలు నిర్వíßంచేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. గణపవరం మండలంలో అర్ధవరం, నిడమర్రు మండలంలో పత్తేపురంగ్రామాల్లో పెద్ద బరులు సిద్దంచేస్తున్నారు. పత్తేపురంలో ఈ పందేల నిర్వహణకు చేపల చెరువును ఎండగట్టి నట్లు తెలుస్తుంది. దీని కోసం చెరువు యజమానికి సుమారు రూ 3లక్షలు నిర్వహకులు చెల్లిస్తున్నట్లు సమాచారం. అలానే గుండాటలు, పేకాటలు, కోడిమాసం పకోడి, ఫాస్ట్ ఫుడ్, ఐస్‌క్రీం, మధ్యం దుకాణాల సముదాయాలకు పాటలు నిర్వహించడం లేదా మూడు రోజులకు కలిపి కొంత మొత్తంలో అద్దె తీసుకోవడం నిర్వహకులు చేస్తుంటారు. అలానే చిన్న బరులు ప్రతీ ఏటా నిడమర్రు మండంలో పెదనిండ్రకొలను, బువ్వనపల్లి, తోకలపల్లి, మందలపర్రుగ్రామాల్లో ఉంటాయి. గణపవరం మండలంలో గణపవరం, సరిపల్లె, కొమ్మర, జగన్నాధపురం, పిప్పిర గ్రామాల్లో ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏడాదికూడా ఆయా గ్రామాల్లో నిర్వహించేందుకు స్థానిక పందెంరాయుళ్లు అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
’ ప్రతీఏటా చివరి నిముషంలో..
ప్రతీ ఏటా పందాలకు అనధికార అనుమతులవిషయంలో పందెంరాయుళ్లకు చివరి నిముషం వరుకూ టెక్షన్‌గా ఉంటారు. ప్రతీ ఏటా భోగి రోజు ఉదయం 9 నుండి 11 గంటలకు అనుమతి లభిస్తుంది. ప్రతీ ఏటా 3 రోజులకు మాత్రమే అనధికార అనుమతులు ఉంటాయి, కానీ గతేడాది బోగి, సంక్రాతి, కనుమతోపాటు ముక్కనమ కలుసుకుని 4 రోజులకు అనధికారఅనుమతులతో పందాలు నిర్వహించారు. దీంతో అప్పట్లో పాలకులు,పోలీసుల తీరును అనేమ మంది తప్పు పట్టారు.
’ఆన్‌లైన్ వద్దు నోట్లే ముద్దు
పెద్దనోట్లు రద్దు ప్రభావం కోడిపందాల నిర్వహణపై పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తుంది. ఆన్‌లైన్ లావాదేవీల వైపు పందెంరాయుళ్లు మగ్గుచూపడంలేదు. పందాలకు నోట్లు సిద్దం చేసుకోవలని నిర్వహకుల నుండి పందాల్లో పాల్గునేవారిని సమాచారం అందుతుంది. మొత్తం మీద ప్రస్తుతానికి కోడిపందాల నిర్వహణ వ్యవహారంలో గతేడాదితో పోల్చితే వెనకబడినట్లూ కనిపిస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇంకా 3 రోజులు సమయం ఉండటంతో పందాల నిర్వహణలో పోలీసులా, పందెంరాయళ్లా అనే విషయం తేలాల్సి ఉంది.
Advertisement