'కోడి పందాలకు బ్రేక్‌ వేస్తున్నాం' | taking all measures against conduct of cock fights, says ap govt | Sakshi
Sakshi News home page

'కోడి పందాలకు బ్రేక్‌ వేస్తున్నాం'

Published Thu, Jan 7 2016 1:11 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

'కోడి పందాలకు బ్రేక్‌ వేస్తున్నాం' - Sakshi

'కోడి పందాలకు బ్రేక్‌ వేస్తున్నాం'

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల నిర్వహణ అంశంపై  హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కోడి పందాలు నిర్వహించకుండా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. కోడి పందాల నిర్వహణకు ఎవ్వరికీ అనుమతినిచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు గత విచారణలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందాలను నిర్వహించినా, జూదం ఆడినా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్‌పీలకు గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి సంక్రాతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పెందాలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీల్లో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అదే జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరగా, కోడి పందాల నిర్వహణకు తాము ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని, పందాలు నిర్వహించినా, జూదం ఆడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్‌పీలకు ఆదేశాలిచ్చామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిని రికార్డ్ చేసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణను ముగిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఆ వ్యాజ్యంలో పిటిషనర్ మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. సంక్రాంతి సందర్భంగా మళ్లీ కోడి పందాల నిర్వహణకు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, పోలీసులు తగిన విధంగా స్పందించడం లేదని పిటిషనర్ వివరించారు. ఈ నేపథ్యంలో కోడి పందాలు నిర్వహించకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement