nidamarru
-
జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లా (నిడమర్రు): నిడమర్రు మండల జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి మైలవరపు సురేంద్ర జూదం కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బావాయిపాలెం గ్రామ శివారు చేపల చెరువు షెడ్ వద్ద పేకాట ఆడుతున్న 10 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు నిడమర్రు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. వీరి నుంచి రూ.79,200 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో నిడమర్రు జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి మైలవరపు సురేంద్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
అయ్యో లోకేషా... ఎంత పని జరిగింది?
సాక్షి, మంగళగిరి : ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్‌కు అనుకోని సంఘటన ఎదురైంది. అనుకోకుండా తనకు లభించిన ఆత్మీయ స్వాగతానికి అయ్యగోరు బిత్తరపోయారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలం నిడమర్రు గ్రామంలో నిన్న రాత్రి లోకేష్ ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తున్న సమయంలో పై నుంచి హోల్డింగ్ పడింది. ‘ అయ్యో పసిబిడ్డను చంపేస్తారా ఏంటి, అయ్యగోరికి అనుకోని ఆత్మీయ స్వాగతం, నారా లోకేషా మజాకా, ప్రసంగానికి బోర్డే కుప్పకూలింది, మామ సిల్వర్ స్క్రీన్ మీద తన ప్రతాపం చూపిస్తే....అల్లుడు రియల్‌గా చూపించాడబ్బా, దీన్ని కూడా ప్రతిపక్షం కుట్ర అంటారేమో’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ విషయంలోకి వస్తే... మంత్రి నారా లోకేష్ గ్రామంలోని సద్గుణ టిఫిన్ సెంటర్ వద్ద మాట్లాడుతుండగా అక్కడ హోటల్ బోర్డు ఒక్కసారిగా కూలింది. అయితే ప్రచార సభలో పాల్గొన్న కార్యకర్తలపై ఈ బోర్డు పడింది. లోకేష్‌తో పాటు ఎంపీ గల్లా జయదేవ్...మిగతా నేతలు అంతా కొద్ది దూరంలో ఉన్నా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. చిన్న పిల్లలతో ఇదేమీ పని? మరోవైపు.... ఎదుట వాళ్లకు చెప్పేందుకే నీతులు ఉంటాయనేది.. టీడీపీ నేతల విషయంలో రుజువైంది. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించి.... నానా హంగామా చేసే పచ్చ తమ్ముళ్లకు మాత్రం ఈ విషయం ఏమాత్రం పట్టదనే దానికి ఈ సంఘటనే ఉదాహరణ. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో అధికారాన్ని, అధికారులను, పోలీసులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, గెలుపే లక్ష్యంగా ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్నారు. అది చాలదన్నట్లు చిన్న పిల్లలతో పనులు చేయిస్తూ ప్రమాదకరమైన మందుగుండు సామాగ్రిని మోపించారు. లోకేష్ నిన్న మంగళగిరి మండల పరిధిలోని కురగల్లులో పర్యటించారు. ఆ గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో నాయకులు తప్ప, కార్యకర్తలు ఎవరూ ఆయన వెంట లేకపోవడంతో పాఠశాలల విద్యార్థుల చేత బాణాసంచా మోయించారు. ఆయన పర్యటన అయ్యేంతవరకూ చిన్నారులు బాణాసంచాను తన భుజాలపై మోసుకుంటూ తిరిగారు. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులంటూ స్థానికులతో పాటు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గట్టిగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం.. వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, నిడమర్రు/పశ్చిమ గోదావరి : తెలుగు తమ్ముళ్ల అధికార దాష్టికానికి ఓ వ్యక్తి బలయ్యాడు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఓ కుంటుంబాన్ని రోడ్డున పడేయంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబ పెద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిడమర్రు మండలంలోని క్రొవ్విడి పంచాయతీ పరిధిలో గల ఉప్పరగూడెంలో చోటుచేసుకుంది. వివరాలు.. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పేరుతో యడవల్లి తాతారావు కుటుంబం నివాసముంటున్న స్థలం ఇవ్వాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేశారు. తాతారావు ససేమిరా అనడంతో బెదిరింపులకు దిగారు. బలవంతంగా అయినా స్థలం ఖాళీ చేయిస్తామని హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తాతారావు విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందే ముందు కొందరి టీడీపీ నేతల పేర్లు వెల్లడించినట్టు సమాచారం. టీడీపీ నేతల జోక్యంతో కేసు నమోదులో పోలీసులు తీవ్రజాప్యం ప్రదర్శించారని విమర్శలొస్తుచ్చాయి. -
పగలు నైటీ ధరిస్తే ఫైన్!
నిడమర్రు: కొల్లేటి గ్రామాల్లో న్యాయ పరమైన విషయాలను వారి కుల పెద్దలు విచారించి నిర్ణయం తీసుకుంటారు. మిగిలిన వారంతా వారి తీర్పునకు కట్టుబడి ఉంటారు. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారం ఇది.. అయితే మహిళలు నైటీలు వేసుకునే విషయంలోనూ వారు ఆంక్షలు పెట్టడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలోని పెద్దలు.. మహిళలు పగటిపూట నైటీలు ధరించి ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, వస్తే రూ.2 వేలు జరిమానా అంటూ దండోరా వేయించారు. రాత్రి పూట మాత్రమే వాటిని ధరించాలని షరతు పెట్టారు. పగటి పూట నైటీలు ధరించిన మహిళలను చూపినవారికి రూ.1,000 నజరానా ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. గ్రామ బహిష్కరణకు సైతం వెనుకాడేదిలేదని కుల పెద్దలు హెచ్చరించారు. గడిచిన ఆరు నెలలుగా గ్రామంలోని సామాజిక భవనం మైక్ ద్వారా దండోరా వేయిస్తున్నట్లు గ్రామస్తులు చెపుతున్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్ణయం మంచిదే.., ఇదేం నిర్ణయం! మహిళలు నైటీలతోనే స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్పత్రులకు, మార్కెట్లకు వచ్చేస్తున్నారని.. పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదేనని కొందరు సమర్థిస్తున్నారు. మహిళల దుస్తుల విషయంలో గ్రామ పెద్దల ఆంక్షలేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. పగటిపూట నైటీ వేసుకుని పొరపాటున బయటికొస్తే.. పెద్దల మాటను ధిక్కరించినట్లా? దానికే గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తారా? అని మండిపడుతున్నారు.. వారి మనోభావాలను బయటపెడితే గ్రామ పెద్దలను ఎదిరించినట్లవుతుందని సర్దుకుపోతున్నట్లు తెలుస్తోంది. కుల పెద్దల నిర్ణయమే ఫైనల్ తోకలపల్లి గ్రామంలో న్యాయవ్యవస్థ గ్రామ కమ్యునిటీహాల్ వద్దే ఉంటుంది. గ్రామంలో వడ్డీల కులపెద్దల నిర్ణయమే ఫైనల్. వారే న్యాయమూర్తులు. వడ్డీలంతా ఏకమై ఏటా 9 మంది కులపెద్దలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఒక్కసారి పెద్దగా ఎన్నికయ్యాక తిరిగి పదేళ్ల వరకూ తీర్పులిచ్చే పీఠం ఎక్కే అవకాశం ఉండదు. ఎన్నికైన నాటి నుంచి ఏడాది వరకూ వారు ఆ పదవిలో ఉంటారు. గ్రామంలో ఏదైనా సమస్య వస్తే.. దానిపై కుల పెద్దలు ఇచ్చిన తీర్పును ఆచరించాల్సిందే. నచ్చినా.. నచ్చకపోయినా.. తీర్పును శిరసావహించాల్సిందే. మహిళల నైటీ విషయంలో గ్రామ పెద్దలు తీసుకున్న ఆంక్షలు మింగుడుపడని పలువురు మహిళలు.. పెద్దల ఆంక్షలను తొలగించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారుల విచారణ మహిళలు నైటీలు ధరించడంపై ఆరు నెలలుగా బహిరంగంగా మైక్‌లో ప్రచారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామ కట్టుబాట్ల విషయంలో వారిని కాదని ఎవ్వరూ ఏ విధమైన ఫిర్యాదు చెయ్యకపోవడం వల్లే తమకు తెలియదని అధికారులంటున్నారు. గురువారం నైటీలపై ఆంక్షల సమాచారం అందుకున్న తాహసీల్దార్ ఎం.సుందర్రాజు, ఎస్ఐ ఎం.విజయ్‌కుమార్ గ్రామంలో ఇంటింటికీ తిరిగి విచారణ జరిపి వివరాలు సేకరించారు. ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు అందించినట్లు తెలిసింది. గ్రామ కట్టుబాటును గౌరవిస్తాం.. గ్రామ పెద్దల మాటకు కట్టుబడి ఉంటాం. పగటి పూట మహిళలు నైటీలు ధరించి తిరడం వల్ల మిగిలిన మహిళలు ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో ఆరు నెలల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ నైటీ వేసుకుంటే గ్రామ బహిష్కరణ అనేది అబద్ధం. – గణసల మహాలక్ష్మి, తాజా మాజీ సర్పంచ్ మైక్‌లో దండోరా వేయించారు పగటిపూట గ్రామంలోని మహిళలు నైటీలు ధరించవద్దని.. జరిమానా విధిస్తామని గ్రామ పెద్దల నిర్ణయంగా మైక్‌లో దండోరా వేయించి హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన వారు గ్రామ పెద్దల నిర్ణయానికి మద్దతిస్తున్నారు. – జి.జ్యోతి, తోకలపల్లి మా కులం కట్టుబాట్లు గౌరవించాలి మహిళలు పగటిపూట నైటీలు ధరించొద్దని కుల పెద్దలు తీర్మానించడం వాస్తవమే. నా చిన్నప్పటి నుంచి మా కుల పెద్దల నిర్ణయం మేరకు నడుచుకుంటున్నాం. గ్రామానికి సంబంధించి సమస్యలుంటే.. గ్రామ పెద్దల సమక్షంలోనే పరిష్కరించుకుంటాం. లేని పక్షంలో న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తాం. – గణసల ఆదినారాయణ, గ్రామపెద్ద, తోకలపల్లి మహిళల కోరిక మేరకే నైటీలు రాత్రి వేళలోనే ధరించేలా గ్రామంలోని అందరూ కట్టుబడి ఉండేలా నిర్ణయం తీసుకోవాలని పలువురు మహిళలు కోరారు. వారి కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలనే జరిమానా అని హెచ్చరిస్తున్నాం తప్ప.. నేటికీ ఏ ఒక్కరికీ జరిమానా విధించలేదు. గ్రామ బహిష్కరణ అనేది మేము ఎక్కడా అనలేదు. – బలే సీతారాముడు, కుల పెద్ద -
ఆమెది గుండెపోటు కాదు.. హత్యే!
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని నిడమర్రు మండలం అడవికొలను గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కట్నం కోసం, పిల్లలు లేరనే కారణంగా పాపోలు నాగలక్ష్మి (25)అనే వివాహితను అత్తమామలు, భర్త హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఆదివారం ఉదయం నాగలక్ష్మి అనుమానస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటు కారణంగానే నాగలక్ష్మి చనిపోయిందంటూ నమ్మించిన అత్తింటివారు.. కంగారుగా ఆమె మృతదేహాన్ని ఖననం చేశారనీ... కట్నం కోసం నాగలక్ష్మిని ఆమె భర్త కిరణ్ తరచూ వేధించేవాడని బంధువులు అంటున్నారు. పోస్టుమార్టం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు ఆందోళనకు దిగారు. కాగా, తహసీల్దార్, పోలీసుల సమక్షంలో ఖననం చేసిన మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొంతకాలం క్రితం భార్య పేరు మీద కిరణ్ 12 లక్షల రూపాయల బీమా చేయడం గమనార్హం. -
అ‘ధర’గొడుతున్న మల్లెలు
సాక్షి, అమరావతి: సువాసనలు వెదజల్లుతూ మధురానుభూతులు పంచే మల్లెలు పెరిగిన ధరలతో వినియోగదారుల ముక్కుపుటాలను అ‘ధర’గొడుతున్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో వాటి ధర పెరగడంతో కొనడానికి వినియోగదారులు జంకుతున్నారు. పూల కొట్ల వద్ద మూర మల్లెపూలను రూ.30 నుంచి రూ.35కి, పూల మార్కెట్లో కిలో రూ.1000కి అమ్ముతున్నారు. గతంలో మూర రూ.10 నుంచి రూ.20లోపు, కిలో రూ.500 వరకూ ఉండేది. పండుగలు, శుభకార్యాల సమయంలో మాత్రం కొంచెం డిమాండ్ ఉండేది. ప్రస్తుతం అవేమీ లేకపోయినా మల్లెపూల ధరలు షాక్ కొడుతున్నాయి. మల్లెపూలు ఎక్కువగా సాగయ్యే రాజధానిలో ప్రభుత్వ భూసమీకరణ వల్ల సాగు తగ్గి ఉత్పత్తి పడిపోయింది. దీంతో డిమాండ్‌తోపాటు పూలకు రేటూ పెరిగింది. గతంలో రాష్ట్రంలో 12 వేల నుంచి 15 వేల ఎకరాల్లో మల్లె సాగు జరిగేది. ప్రస్తుతం 7 వేల ఎకరాలకే పరిమితమైంది. రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి మండలంలో నిడమర్రు, కురగల్లు, బేతపూడి మల్లె సాగుకు పెట్టింది పేరు. గతంలో ఈ మూడు గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో మల్లె తోటలుండేవి. ప్రస్తుతం అది 700 ఎకరాలకు పడిపోయింది. నిడమర్రులోనే గతంలో 1500 ఎకరాల్లో మల్లె తోటలుండేవి. ప్రస్తుతం 500 ఎకరాల్లో కూడా సాగు లేకుండాపోయింది. రాజధానికి భూములు తీసుకోవడంతో మల్లె తోటల స్థానంలో బీడు భూములు దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి తగ్గిందని రైతులు అంటున్నారు. గతంలో ఎకరానికి వెయ్యి క్వింటాలు మల్లెపూల దిగుబడి వచ్చేదని, కానీ ఇప్పుడు తగ్గిందని చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు గతంలో తోటల్లో రైతులు కిలో మల్లె పూలను రూ.200కి వ్యాపారులకు అమ్మేవారు. వ్యాపారులు పూల కొట్లకు రూ.300 నుంచి రూ.400కి విక్రయించేవారు. మూర ధర రూ.10, రూ.15 ఉండేది. కానీ తోటలు తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగిపోయింది. గతంలో విజయవాడ, గుంటూరుతోపాటు హైదరాబాద్, బెంగళూరుకు ఇక్కడి నుంచే పూలు పంపేవారు. ప్రస్తుతం విజయవాడకే పూలు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో వడ్లపూడి, చీరాల, మైలవరం, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో మల్లె సాగు జరుగుతున్నా డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రాజధాని పరిధిలో మూడు గ్రామాలతోపాటు పరిసర గ్రామాల్లో పూల సాగు తగ్గిపోవడంతో రైతులు, కూలీలు, ఉపాధి కోల్పోయారు. తోటలన్నీ పోయాయి మల్లె తోటలతో మా ఊరు కళకళలాడేది. అందరికీ పని దొరికేది. రాజధానికి చాలావరకూ భూములు పోవడంతో పనే లేకుండా పోయింది. గతంలో కిలో మల్లెలు రూ.150 నుంచి రూ.200కి అమ్మినప్పుడు బాగా లాభాలు వచ్చేవి. ఇప్పుడు రూ.500కి అమ్ముతున్నా గిట్టుబాటు కావడంలేదు. – భద్రారెడ్డి, మల్లె తోట రైతు, నిడమర్రు పనులు లేక కష్టాలు రోజూ రెండు, మూడు గంటలు పూలు కోసి రూ.80 సంపాదించేవాళ్లం. ఆ తర్వాత వేరే పని చేసుకునేవాళ్లం. ఇప్పుడు మల్లె తోటల్లో పని లేకుండాపోయింది. అరకొర పనితో ఏమీ ఉపయోగం ఉండడం లేదు. ఇతర పనులు కూడా లేక చాలా కష్టాలు పడుతున్నాం. –సుజాత, కూలీ, నిడమర్రు -
కౌలు రైతు పొలం ధ్వంసం చేసిన అధికారులు
-
మీసేవ... నకిలీ సేవ
వేగం, పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు సేవలందించేందుకు ప్రవేశపెట్టిన మీసేవ కేంద్రాలు అక్రమాలకు వేదికవుతున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు నిర్వాహకులు, కాసులకు కక్కుర్తి పడే అధికారులతో కుమ్మక్కై నకిలీ దందా సాగిస్తున్నారు. ఆధార్‌కార్డుల్లో పుట్టినతేదీ, వయసు మార్చడం, జనన, మరణ పత్రాలు, ఆక్వా చెరువుల అనుమతులు, దుకాణాల అనుమతులు.. ఇలా ఏదైనా నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేస్తున్నారు. జిల్లాలో జరిగిన ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిడమర్రు: అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడంతో జిల్లాలో ప్రతి ఇంటర్నెట్ సెంటరు మీ సేవాకేంద్రంగా మారిపోతోంది. ప్రస్తుతం 1,570 కేంద్రాలు ఉండగా, వీటి ద్వారా 22 ప్రభుత్వ శాఖలకు చెందిన 316 రకాల పౌరసేవలు అందుతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల ఫీజులు తదితర సేవలతో కలిపి మొత్తం 350 సేవల వరకూ మీసేవా కేంద్రాలు అందిస్తున్నాయి. జిల్లాలో నాలుగు ఏజెన్సీలకు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్లు ద్వారా మీసేవ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ సర్వీసుల్లో ప్రైవేటు భాగస్వామ్య విషయంలో అధికారులు పర్యవేక్షణ కొరడవడంతో నిర్వాహకులు అక్రమాలకు పాల్పడేందుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. 1.20లక్షలకు పైగా లావాదేవీలు ప్రతినెలా మీసేవా కేంద్రాల ద్వారా 1.20 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని సమాచారం. వీటిలో రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయం, మున్సిపల్, విద్యుత్ సేవల లావాదేవీలే అధికం. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మన జిల్లాలో మొత్తం 44.21 లక్షల దరఖాస్తులు అందితే 3.88 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో రెవెన్యూవి 30 లక్షలు. నకిలీని కనిపెట్టేయొచ్చు నకిలీధ్రువీకరణ పత్రాలపై ప్రజల్లో అధికారులు అవగాహన కనిపించడం లేదు. మీసేవా కేంద్రం ద్వారా జారీ అయిన సర్టిఫికెట్ అసలా, నకిలీనా అనేది ఎవరైనా తెలుసుకోవచ్చు. మీ సేవా అధికారిక వెబ్సైట్లో లాగిన్ పేజీలో కనిపించే ముఖ చిత్రంపై మీ మీసేవ కేద్రం నుంచి పొందిన అప్లికేషన్ నంబర్ నమోదు చేసి మీ దరఖాస్తు వివరాలతోపాటు, జనరేట్ అయిన సర్టిఫికెట్‌ను పరిశీలించవచ్చు. గతంలో తీసుకున్న పత్రాల డేటానూ పరిశీలించవచ్చు. రెండో పద్ధతి స్మార్ట్ ఫోన్ ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి రేటింగ్ ఉన్న బార్కోడ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని మీ వద్ద ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్‌పై ఉన్న బార్‌కోడ్‌ను స్కానింగ్ చేస్తే సర్టిఫికెట్ డేటా కనిపిస్తుంది. ఇవిగో.. ఉదాహరణలు గత ఏడాది నకిలీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్న ఆకివీడులోని లక్ష్మీ మీసేవా కేంద్రాన్ని అధికారులు రద్దు చేశారు. నిర్వాహకురాలికి రూ.50 వేలు జరిమానా విధించారు. తాడేపల్లిగుడెం కొబ్బరితోటలోని మీసేవ కేంద్రం నిర్వహకుడు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కోసం ఏకంగా ఆర్డీఓ సంతకాన్నే ఫోర్జరీ చేసి చిక్కాడు. నిడమర్రు మీసేవా కేంద్రం నిర్వాహకుడు చేపల చెరువుల తవ్వకానికి నకిలీ అనుమతి పత్రాలు తయారు చేసి ఇచ్చి అధికారులకు పట్టుపడ్డాడు. దీంతో అధికారులు ఆ కేంద్రాన్ని సీజ్ చేశారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. వీటన్నిటికంటే ముందు పెనుగొండ కేంద్రంగా నకిలీ ఓటర్ ఐడీల స్కామ్ బయటపడింది. తాజాగా శనివారం నకిలీ రెవెన్యూ, విద్యా ధ్రు«వీకరణ పత్రాల స్కామ్‌ను కుదిపేసింది. దీనిపై నిడమర్రు తహసీల్దార్ సుందర్రాజు స్పందిస్తూ.. అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. -
చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు
పెదనిండ్రకొలను (నిడమర్రు): సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ విమర్శించారు. శుక్రవారం పెదనిండ్రకొలనులో జరిగిన గడప గడపకూ వైఎస్సార్‌లో ఆయన పాల్గొని స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరిపై పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. పాలనపై అసహనంతో ఉన్న యువత సోషల్ మీడియా ద్వారా తమ భావాలను ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. అది కూడా నేరంగా వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా ఖండిస్తే ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్‌పై వస్తున్న సోషల్ మీడియా పోస్టులపై యువత స్పందన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. పొలిటికల్ సెటైర్ డిజైనర్ అరెస్ట్ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందన్నారు. మే 1,2 తేదీల్లో జగన్ దీక్ష మద్దతు ధర లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, వారి సమస్యలపై జగన్ పోరాడతారని భరోసా ఇచ్చారు. వచ్చే నెల 1,2 తేదీల్లో గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఈనెల 26, 27 తేదీల్లో జరగాలి్సన దీక్ష వాయిదాపడిందన్నారు. రైతు దీక్షకు అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. శ్రీధర్ వెంట ఆపార్టీ ఉంగుటూరు కన్వీనర్ పుప్పాల వాసుబాబు , మండల కన్వీనర్లు సంకు సత్యకుమార్, రావిపాటి సత్యశ్రీనివాస్, మరడా వెంకట మంగారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కచ్చాల నాగేశ్వరరావు, తుమ్మగంటి రంగ, రామిశెట్టి శ్రీను, పులిచర్ల కృష్ణారావు, ఎంపీటీసీలు కోడూరి రాంబాబు, సునీత మానసింగ్, ఆర్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
జన పథం - నిడమర్రు
-
‘పశ్చిమ’లో రేవ్ పార్టీ
16 మంది యువకులు, 10 మంది యువతుల అరెస్ట్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: రేవ్ పార్టీల సంస్కృతి పశ్చిమగోదావరి జిల్లాకు పాకింది. నిడమర్రు మండలం పత్తేపురం శివారు ఆముదాలపల్లి గ్రామంలో చేపల చెరువుల మధ్యగల అతిథి గృహంలో ఆదివారం అర్ధరాత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా.. పోలీసులు మెరుపు దాడి చేశారు. మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న 16 మంది యువకులు, 10 మంది యువతులను నిడమర్రు ఎస్సై ఎం.వీరబాబు నేతృత్వంలో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక్కడకు వచ్చిన యువకులంతా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. 15 రోజులకు ఒకసారి పార్టీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం డీఎస్పీ జి.వెంకటేశ్వర రావు ఏలూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవ్ పార్టీలో పాల్గొన్న 16 మంది యువకులు, 9మంది యువతులతో పాటు ఏలూరు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడకు తీసుకొచ్చిన హేమ అనే మహిళను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. గెస్ట్‌హౌస్‌లో రూ.లక్ష నగదు, మద్యం బాటిళ్లు, కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులు చినమూర్తిరాజు, గిరిరాజు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితులపై వ్యభిచారం కేసు, హేమపై ఐటీపీ (ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రొహిబిషన్) యాక్ట్ కింద కేసు నమోదు చేశామని వివరించారు. 9మంది మహిళలను ఏలూరులోని స్వధార్‌హోంకు తరలిస్తామని తెలిపారు. సమావేశంలో గణపవరం సీఐ దుర్గాప్రసాద్, ఎస్సైలు హరికృష్ణ, వీరబాబు పాల్గొన్నారు. -
ప.గో.జిల్లాలో రేవ్ పార్టీ గుట్టు రట్టు
-
‘రాజధానిలో ఇల్లు కొనుక్కుని ఉంటా’
నిడమర్రు: తాము అధికారంలోకి రాగానే ప్రజా రాజధాని నిర్మిస్తామని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజధానిలో మంచి జరగాలంటే ఒక్క వైఎస్సార్ సీపీ ద్వారానే అవుతుందని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నిడమర్రులో రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ... రాజధానిని తామే కడతామన్నారు. చంద్రబాబు ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నారని, రాబోయే రోజుల్లో తాను ఇల్లే కొనుక్కుని ఇక్కడ ఉంటానని ప్రజల హర్షద్వానాల మధ్య జగన్ ప్రకటించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆక్షేపించారు. రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. తన బినామీల భూములున్న ప్రాంతాలను రియల్ ఎస్టేట్ జోన్ లో పెట్టి, రైతుల భూములను మామూలు జోన్ లో పెట్టారని ఆరోపించారు. రైతులకు ఇచ్చే వాణిజ్య స్థలాల్లో మాల్స్ పెట్టకూడదని ఆంక్షలు విధించడం అన్యాయమని అన్నారు. చంద్రబాబుకు భూములు ఇచ్చిన వారు మాత్రం 22 అంతస్థులు కట్టుకుని మాల్స్ పెట్టేందుకు అనుమతి ఇస్తున్నారని చెప్పారు. రైతులకు ఏదైనా ఆదాయం వచ్చేట్టు చేయాలి కానీ, ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయమని ప్రశ్నించారు. చంద్రబాబు రైతుల కళ్లల్లో కన్నీళ్లు చూస్తున్నాడని, ఈ పరిస్థితి మారుస్తామన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగనీయబోమని, ప్రతి రైతుకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. మరో రెండేళ్లు ఎలాగోలా భూములు కాపాడుకుంటే తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమని జగన్ అన్నారు. తర్వాత ఎవరూ భయంతో బతకాల్సిన అవసరముండదని భరోసాయిచ్చారు. రైతులకు అన్ని రకాలుగా వైఎస్సార్ సీపీ తోడుగా ఉంటుందని హామీయిచ్చారు. -
పందేలకు రెఢీ
నిడమర్రు: గ్రామీణ ప్రాంతాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి, సంక్రాతి పండుగ సమీపించడంతో పందేల రాయయళ్లు సమరానికి సన్నద్దమవుతున్నారు. ప్రతీ ఏటా సంప్రదాయ ముసుగులో కోడిపందాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల్లో పందాల నిర్వహణకు గ్రామాల్లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి, ఈ కోడి పందాల నిర్వహణ పండుగ ఆనవాతీ అని దీన్నిఅడ్డుకోవడం ఎవరి తరంకాదని పందేం రాయుళ్లు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు పందాలు వేసి తీరుతామనిబరులు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే పందాలకు అవసరమైన కోళ్లును పలువరు నిర్వహకులు సామూహికంగా పెంచి పందాలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ’ఓ సామాజిక వర్గం ఆధిపత్య గ్రామాల్లోనే... గణపవరం, నిడమర్రు మండలాల్లో ఓ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న గ్రామాల్లోనే కోడి పందాలు నిర్వíßంచేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. గణపవరం మండలంలో అర్ధవరం, నిడమర్రు మండలంలో పత్తేపురంగ్రామాల్లో పెద్ద బరులు సిద్దంచేస్తున్నారు. పత్తేపురంలో ఈ పందేల నిర్వహణకు చేపల చెరువును ఎండగట్టి నట్లు తెలుస్తుంది. దీని కోసం చెరువు యజమానికి సుమారు రూ 3లక్షలు నిర్వహకులు చెల్లిస్తున్నట్లు సమాచారం. అలానే గుండాటలు, పేకాటలు, కోడిమాసం పకోడి, ఫాస్ట్ ఫుడ్, ఐస్‌క్రీం, మధ్యం దుకాణాల సముదాయాలకు పాటలు నిర్వహించడం లేదా మూడు రోజులకు కలిపి కొంత మొత్తంలో అద్దె తీసుకోవడం నిర్వహకులు చేస్తుంటారు. అలానే చిన్న బరులు ప్రతీ ఏటా నిడమర్రు మండంలో పెదనిండ్రకొలను, బువ్వనపల్లి, తోకలపల్లి, మందలపర్రుగ్రామాల్లో ఉంటాయి. గణపవరం మండలంలో గణపవరం, సరిపల్లె, కొమ్మర, జగన్నాధపురం, పిప్పిర గ్రామాల్లో ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏడాదికూడా ఆయా గ్రామాల్లో నిర్వహించేందుకు స్థానిక పందెంరాయుళ్లు అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ’ ప్రతీఏటా చివరి నిముషంలో.. ప్రతీ ఏటా పందాలకు అనధికార అనుమతులవిషయంలో పందెంరాయుళ్లకు చివరి నిముషం వరుకూ టెక్షన్గా ఉంటారు. ప్రతీ ఏటా భోగి రోజు ఉదయం 9 నుండి 11 గంటలకు అనుమతి లభిస్తుంది. ప్రతీ ఏటా 3 రోజులకు మాత్రమే అనధికార అనుమతులు ఉంటాయి, కానీ గతేడాది బోగి, సంక్రాతి, కనుమతోపాటు ముక్కనమ కలుసుకుని 4 రోజులకు అనధికారఅనుమతులతో పందాలు నిర్వహించారు. దీంతో అప్పట్లో పాలకులు,పోలీసుల తీరును అనేమ మంది తప్పు పట్టారు. ’ఆన్లైన్ వద్దు నోట్లే ముద్దు పెద్దనోట్లు రద్దు ప్రభావం కోడిపందాల నిర్వహణపై పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తుంది. ఆన్లైన్ లావాదేవీల వైపు పందెంరాయుళ్లు మగ్గుచూపడంలేదు. పందాలకు నోట్లు సిద్దం చేసుకోవలని నిర్వహకుల నుండి పందాల్లో పాల్గునేవారిని సమాచారం అందుతుంది. మొత్తం మీద ప్రస్తుతానికి కోడిపందాల నిర్వహణ వ్యవహారంలో గతేడాదితో పోల్చితే వెనకబడినట్లూ కనిపిస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇంకా 3 రోజులు సమయం ఉండటంతో పందాల నిర్వహణలో పోలీసులా, పందెంరాయళ్లా అనే విషయం తేలాల్సి ఉంది. -
20 వేల ఎకరాలకు కంది విత్తనాల పంపిణీ
పెదనిండ్రకొలను (నిడమర్రు) : జిల్లావ్యాప్తంగా 20 వేల ఎకరాల విస్తీర్ణానికి çసరిపడా కంది విత్తనాలు ఉచితంగా రైతులకు పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్షీశ్వరి అన్నారు. ఆదివారం పెదనిండ్రకొలనులో కంది పంట క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో వ్యవసాయశాఖ, ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 100 ఎకరాల చేపల చెరువు గట్లపై సాగు చేసిన కంది పంట దిగుబడిని రైతులకు ప్రదర్శించారు. జిల్లాలో చేపల చెరువుల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో చెరువు గట్లపై కంది సాగు చేయాలని ఆత్మ చైర్మ¯ŒS పసల గంగరామచంద్రం సూచించారు. చెరువు గట్టుపై కంది పంట యాజమాన్య పద్ధతులను అధికారులు వివరించారు. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, సర్పంచ్ వంగా సీతాకుమారి, తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మ¯ŒS పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
పొక్లెయిన్ డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడి బలి
నిడమర్రు: పొక్లెయిన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒడిసా యువకుడు మృతిచెందిన ఘటన శనివారం నిడమర్రులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం నిడమర్రు నుంచి కొల్లేరు వెళ్లే మార్గంలో చేర్చి ఉన్న పొలాలను చేపల చెరువులుగా మార్చేందుకు పొక్లెయిన్‌తో తవ్వుతున్నారు. గ్రామానికి చెందిన రైతు కొమ్ముల యేసు చెందిన చెరువు గట్టు పనులు పూర్తి చేసుకుని కన్నాజీ ఆదినారాయణ చెరువు తవ్వేందుకు పొక్లెయిన్‌ను తీసుకువెళుతున్నారు. ఈ సమయంలో పొక్లెయిన్ డ్రైవర్ గుగ్గిన వీరబాబు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగిస్తున్న సమయంలో పొక్లెయిన్ సహాయకుడు వికాస్ మాలిక్, రైతు కన్నాజీ ఆదినారాయణపై చెట్టు కొమ్మ పడింది. దీంతో వికాస్ మాలిక్ (21) అక్కడిక్కడే మృతి చెందగా ఆదినారాయణ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ఎస్ఐ ఎ.వీరబాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. డ్రైవర్ వీరబాబుది తూర్పుగోదావరి జిల్లా గోకవరం అన్నారు. -
చుట్టూ చెరువులు.. చేలు కుదేలు
నిడమర్రు : నిడమర్రు బాడవ ఆయకట్టులోని 250 ఎకరాల్లో ఖరీఫ్ వరినాట్లు పడలేదు. ఆ పొలాల చుట్టూ చేపల చెరువులు విస్తరించడమే ఇందుకు కారణమైంది. పొలాల్ని కౌలుకు పొలం ఇద్దామన్నా సాగుకు ఎవరూ ముందుకు రాలేదు. చేపల చెరువుల తవ్వకానికి అనుమతుల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో సరిహద్దు రైతులు నష్టపోతున్నారు. పొలాన్ని చెరువు తవ్వుకునేందుకు అనుమతి మంజూరు చేసేప్పుడు జీవో నంబర్ 7 ప్రకారం సరిహద్దు రైతుల అభ్యంతరాలు పరిగణలో తీసుకోవాలి. చెరువు చుట్టూ బోదె నిర్మించాలి. ఈ బోదె గట్టుకు వరి పొలం గట్టుకు మధ్య దూరం 3 మీటర్లు ఉండాలి. రొయ్యల సాగుకు ఎటువంటి అనుమతి లేదు. ఈ విషయాలు పరిశీలించకుండానే దరఖాస్తుదారులకు అనుమతులు లభిస్తున్నాయని రైతులు చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితులే బాడవ ఆయకట్టుకు ముప్పు తెచ్చాయి. ఈ ఆయకట్టులో సుమారు 400 ఎకరాల్లో వరి పొలాలు ఉన్నాయి. ఆయకట్టుకు పడమరవైపు చేపల చెరువులు తవ్వేశారు. తూర్పు వైపు ఏలూరు రోడ్డు వద్ద చెరువులు తవ్వేందుకు అనుమతుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. 32 మంది సరిహద్దు రైతులు ఈ ఏడాది ఫిబ్రవరి 22న కలెక్టర్‌ను కలిసి చుట్టూ చెరువులు విస్తరిస్తే భవిష్యత్‌లో పొలాలకు వెళ్లేం దుకు మార్గం ఉండదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిశీలించి న్యాయం చేస్తామన్న మత్స్యశాఖ అధికారులు స్పందించలేదు. మే నెలలో 2 ఎకరాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఐదు రోజుల్లో అక్కడ చెరువులు తవ్వి బోర్లు వేసి రొయ్యల సాగు ప్రారంభించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బాలల పరిరక్షణకు ప్రత్యేక చట్టం
నిడమర్రు : బాలల సంరక్షణకు భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. జువనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్)-2015 పేరుతో 2016 జనవరి 15 నుంచి అమల్లోకి తెచ్చింది. మనదేశంలో 1997లో చేసిన చట్టప్రకారం.. 16 ఏళ్లలోపు బాలలను జువనైల్స్గా గుర్తించేవారు. 1992 డిసెబర్ 11న భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి చేపట్టిన బాలల హక్కుల పరిరక్షణ ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వామిగా మారింది. దీనిప్రకారం 2000లో కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చి బాలల వయసును 16 నుంచి 18 ఏళ్లకు పెంచింది. తాజాగా నిర్భయ కేసులో మహిళలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ వయసును 18 ఏళ్లుగానే ఉంచి నేరాలను స్వల్ప, తీవ్ర, క్రూర నేరాలుగా వర్గీకరించి 16 నుంచి 18 ఏళ్లలోపు వారు క్రూర నేరాలకు పాల్పడితే మేజర్లకు విధించే శిక్షలే అమలు చేసేలా చట్టంలో సవరణలు చేశారు. ఈచట్టంలో బాలనేరస్తులకు సంబంధించే కాకుండా శిశు క్రయ, విక్రయం, దత్తత, అనాథ బాలలకు సంబంధించిన అంశాల్లోనూ మార్పులు చేశారు. చట్టంలో ముఖ్యాంశాలు నేరాలను మూడు రకాలుగా విభజించారు. స్వల్ప శిక్షనేరాలు (మూడేళ్లలోపు జైలు), తీవ్ర శిక్ష నేరాలు (ఏడేళ్లలోపు జైలు), క్రూర శిక్ష నేరాలు (ఏడేళ్లకు పైబడి జైలు)గా వర్గీకరించారు. ప్రతి జిల్లాలో బాలల నేర కేసులను విచారించడానికి జువనైల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు చేయాలి. బోర్డులో ఫస్ట్‌క్లాస్ స్థాయి మెజిస్ట్రేట్, ఇద్దరు సభ్యులను నియమించాలి. ఆ ఇద్దరి సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా మహిళా సభ్యురాలై ఉండాలి. 18 ఏళ్లలోపు బాలలపై కేసు నమోదై, విచారణ తేదీకి 18 ఏళ్లు దాటినా ఈ చట్టం కిందే విచారణ చేస్తారు. బాలనిందితుడిని లాకప్లోగానీ, జైల్లోగానీ పెట్టకూడదు. బెయిలబుల్ నేరాలు లేదా నాన్‌బెయిలబుల్ నేరాల్లో బాలలు వెంటనే పోలీసుల వద్దే బెయిల్ పొందే అవకాశం ఉంది. కానీ నిందితుడు మళ్లీ నేరం చేస్తాడని, చెడు ప్రవర్తనకు అలవాటు పడతాడని పోలీసులు భావిస్తే స్టేషన్‌బెయిల్ ఇవ్వకపోవచ్చు. బాలనేరాల విచారణ బోర్డు నాలుగు నెలల్లోపు ముగించాలి. కారణాలు చూపించి మరో రెండు నెలలే పొడిగించే అవకాశం ఉంది. ఆరు నెలల తర్వాత విచారణ ముగించలేకుంటే విచారణ రద్దవుతుంది. తీవ్ర, క్రూర నేరాల్లో విచారణ కాలం ఆరునెలలు తర్వాత కూడా పెంచుకునే అధికారం బోర్డుకు ఉంది. 16ఏళ్లలోపు స్వల్ప, తీవ్ర నేరాల్లో బాలలకు ఎటువంటి శిక్షలూ వేయకూడదు.ప్రొటెక్షన్ హోమ్‌లో 21 ఏళ్లు దాటిన తర్వాత ఉంచకూడదు. 16 ఏళ్లు దాటిన బాలలు క్రూర శిక్ష నేరాలకు పాల్పడినప్పుడు చిల్డ్రన్ కోర్టు వేసిన శిక్షను 21ఏళ్లు నిండిన తర్వాత అమలు చేయాలి. 21 ఏళ్ల వరకూ ప్రొటెక్షన్ హోమ్‌లో ఉంచాలి. బాలనేరస్తులకు జీవిత ఖైదుగానీ మరణ శిక్షగానీ విధించకూడదు. స్వల్ప, తీవ్ర నేరాలకు పాల్పడిన బాలలను ఉద్యోగాలకు, రాజకీయాలకు అనర్హులుగా చూడకూడదు. బాల నేరస్తుల పేర్లను, వారి చిరునామాలను పత్రికల్లోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వెల్లడించకూడదు. బాలలను బాధ పెడితే శిక్షలు, జరిమానాలు బాలలను సంరక్షించాల్సిన బాధ్యత గల వ్యక్తులు, సంస్థలు ఉద్దేశపూరకంగా వారిని పట్టించుకోకపోయినా, మానసికంగా, శారీరకంగా బాధకు గురిచేసినా వారికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు. ఆ సంస్థల నిర్లక్ష్యం వల్ల బాలలకు శారీరక , మానసిక వైకల్యం కలిగినట్లు రుజువైతే పదేళ్ల జైలు శిక్ష, రూ. ఐదులక్షల వరుకూ జరిమనా విధించవచ్చు బాలలను భిక్షాటనకు ప్రోత్సహిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. 18 ఏళ్లలోపు వారిని మద్యం, సిగెరెట్లు, మారక ద్రవ్యాల రవాణాకు ఉపయోగించినా, వాటిని తాగేందుకు ప్రోత్సహించినా, అమ్మేందుకు, కొనుగోలుకు వారిని వినియోగించినా ఏడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. బాలలను పనికి పెట్టుకున్నా.. వారితో వెట్టిచాకిరీ చేయించి వారి జీతభత్యాలను స్వలాభం కోసం వాడుకున్నా, బాలలను అమ్మినా, కొన్నా ఐదేళ్ల వరకూ జైలు, రూ.లక్ష వరకూ జరిమానా విధిస్తారు. ఆస్పత్రులు, బాలల వసతిగృహాల నిర్వాహకులు లేదా యజమానులు బాలలను అమ్మితే మూడేళ్ల నుంచి ఏడేళ్ల ఏళ్ల వరుకూ శిక్ష విధిస్తారు. బాల సంరక్షణ సంస్థలు బాలలను శారీరకంగా దండిస్తే, మొదటి తప్పుకు రూ.10వేలు జరిమానా తర్వాత నేరానికి మూడు నెలల వరుకూ జైలు శిక్ష విధించవచ్చు. -
అనంతవరం, నిడమర్రులో పారిశ్రామిక జోన్లు
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రతిపాదిత ఏపీ రాజధాని నగరంలో రెండు పారిశ్రామిక జోన్లు ఏర్పాటు కానున్నాయి. రాజధాని నగరానికి సమీపంలో గుంటూరు జిల్లాలో ఉన్న అనంతవరం, నిడమర్రు ప్రాంతాల్లో ఇందుకోసం అనువైన భూములు కూడా సిద్ధమయ్యాయి. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో ఈ భూములను పారిశ్రామిక జోన్ల కింద పేర్కొంటూ మార్కింగ్ చేశారు. దీని ప్రకారం తుళ్లూరు మండలం అనంతవరం పరిధిలో రెండు వేల ఎకరాలు, మంగళగిరి మండలం నిడమర్రు ప్రాంతంలో 1,200 ఎకరాల స్థలాలను రిజర్వు చేసిన సీఆర్డీఏ అధికారులు అక్కడ ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందనే విషయాలపై అధ్యయనం చేస్తున్నారు. సింగపూర్, జపాన్, చైనాతోపాటు స్వదేశీ కార్పొరేట్ కంపెనీలను ఈ జోన్లలో పారిశ్రామిక టౌన్‌షిప్‌లు నిర్మించేందుకు ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం చైనాకు చెందిన డాలియన్ వాండా గ్రూపునకు ఈ రెండు ప్రదేశాలను చూపించి భవిష్యత్తులో ఇవి ఆకర్షణీయమైన పారిశ్రామిక కేంద్రాలుగా మారతాయని వివరించారు. గతంలో సింగపూర్, జపాన్‌కు చెందిన పలు కంపెనీలు కూడా ఈ స్థలాలను పరిశీలించాయి. టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలు ముందుకు వస్తే ఈ జోన్లలో వారికి భూమిని లీజుకివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ జోన్లలో కాలుష్య రహిత ప్రాజెక్టులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. రాజధాని నగరం కాలుష్యం బారిన పడుతుందనే ఉద్దేశంతో కేవలం గ్రీన్ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
'చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీకే ప్రాధాన్యత'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన చుట్టూ ఉన్న కోటరీకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాజధాని కమిటీలో రెవెన్యు మంత్రికి చోటు కల్పించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజధాని నిర్మాణంపై ఏకపక్ష నిర్ణయం తగదన్నారు. గుంటూరు జిల్లా నిడమర్రులో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో రామకృష్ణతో పాటు సీపీఎం కార్యదర్శి మధు పాల్గొన్నారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని మధు ఆరోపించారు. రైతులు, కౌలు రైతులు, కూలీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. -
'భూముల కోసం ప్రాణాలైనా ఇస్తాం'
-
భూముల కోసం ప్రాణాలైనా ఇస్తాం'
గుంటూరు: రాజధానికి భూములు ఇచ్చేది లేదని గుంటూరు జిల్లాలోని పలుగ్రామాలకు చెందిన రైతులు కరాకండీగా చెబుతున్నారు. తమ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకంగా మంగళగిరి మండలం నిడమర్రులో మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. కావాలంటే తామందరం రూ.లక్ష చొప్పున ప్రభుత్వానికి డబ్బు ఎదురిస్తామని, తమ భూముల జోలికి రావొద్దంటూ అధికారులపై అన్నదాతలు మండిపడ్డారు. బలవంతంగా భూములు లాక్కుంటే పురుగుల మందు తాగి చస్తామని రైతులు హెచ్చరించారు. అప్పటివరకు రైతులపై చిందులు తొక్కిన గంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు అన్నదాతల ఆందోళనతో అక్కడి నుంచి జారుకున్నారు. -
మేమే... బాబు ప్రభుత్వానికి చందాలిస్తాం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో భూములిచ్చేది లేదని మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలోని రైతులు స్పష్టం చేశారు. అవసరమైతే తామే ఎకరాకు ప్రభుత్వానికి రూ. లక్ష చొప్పున చందాలు ఇస్తామని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని రైతు, కూలీల పరిరక్షణ కమిటీ గురువారం మంగళగిరి మండలంలోని నిడమర్రులో పర్యటించింది. ఈ సందర్భంగా రాజధానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని వారు తెలిపారు. తామంతా ఈ భూమినే నమ్ముకున్నామని చెప్పారు. పంట భూమి తమ కుటుంబంతో పెనవేసుకుని పోయిందని తెలిపారు. అలాంటి భూమిని రాజధాని నిర్మాణానికి ఇవ్వాలంటే మనస్సు అంగీకరించడం లేదని అన్నారు. రైతులు అభిప్రాయాలు వెల్లడించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని రైతు, కూలీల పరిరక్షణ కమిటీ కన్వీనర్ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... రైతులు చంద్రబాబును నమ్మడం లేదన్నారు. రుణమాఫీ అంశంలో చంద్రబాబు ఏం చేశారో రైతులు ఇప్పటికే గుర్తించారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును రైతులు నమ్మె పరిస్థితి లేదని ధర్మాన వెల్లడించారు. -
మళ్లీ మొదలైంది ఆపరేషన్ కొల్లేరు
నిడమర్రు : ఆక్రమణల చెరలో చిక్కు కున్న కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం మళ్లీ మొదలైంది. ‘ఆపరేషన్ కొల్లేరు’ కార్యక్రమానికి అధికార యంత్రాంగం చడీచప్పుడు లేకుండా శ్రీకారం చుట్టింది. నిడమర్రులోని వెంకటాపురం ప్రాంతంలో కొల్లేరు అభయారణ్యం పరిధిలో అక్రమంగా తవ్విన చేపల చెరువుల గట్లను ధ్వంసం చేసే పనులను అటవీ శాఖ అధికారులు శనివారం ప్రారంభించారు. పొక్లెయిన్ సాయంతో చెరువు గట్లకు గండ్లు కొడుతున్నారు. అధికారుల చర్య నిడమర్రు మండలంలోని కొల్లేరు ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. చేపల చెరువుల రైతులు హడావుడిగా పట్టుబడులు పట్టేందుకు ఉపక్రమిస్తున్నారు. ఇదిలావుండగా, శనివారం ఒక్కరోజే 70 ఎకరాల్లో విస్తరించి వున్న మూడు చెరువులకు నాలుగు వైపులా గండ్లు కొట్టారు. అటవీ శాఖ అధికారులు టీజే బెనర్జీ, టి.నాగమణేశ్వరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా, సుమారు 30మంది బేస్ క్యాంప్ సిబ్బంది సహకరిస్తున్నారు. ఉన్నతస్థాయి నిర్ణయం మేరకే.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 2006 సంవత్సరంలో ప్రభుత్వం రెండు నెలలపాటు ‘ఆపరేషన్ కొల్లేరు’ పేరిట చెరువులను ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టింది. తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అదే కార్యక్రమాన్ని చాపకింద నీరులా చేపట్టడం కొల్లేరు ప్రాంతంలో చర్చనీయూంశమైంది. ఇదిలావుండగా, చెరువుల్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని వారుుదా వేయూలని పలువురు రైతులు అధికారులను కోరుతున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించవద్దని అధికారులు వారికి నచ్చచెబుతున్నారు. మాటవినని రైతులపై కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నిడమర్రులోని వెంకటాపురంలో 130 ఎకరాల్లో అక్రమంగా తవ్విన చెరువులను మాత్రమే ధ్వంసం చేస్తామని అధికారులు పైకి చెబుతున్నా.. తెరవెనుక మాత్రం కొల్లేరును పూర్తిగా ప్రక్షాళను చేసే వరకూ దశల వారీగా ఈ కార్యక్రమం జరుగుతుం దని తెలుస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఐదో కాంటూర్ పరిధిలో గల అన్ని చేపల చెరువుల్ని ధ్వంసం చేయూలని పర్యావరణవేత్తలు కోరుతుండగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యంత్రాంగం సైతం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తీవ్రంగా నష్టపోతున్న లీజుదారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అటవీ శాఖ అధికారులు చేపల చెరువుల గట్లకు గండ్లు పెడుతుండటంతో చెరువుల్ని లీజుకు తీసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడుల్లో 20 శాతం కూడా రాని పరిస్థితి నెలకొంది. చెరువుల్లో చేప పిల్లలు వేసి రెండుమూడు నెలలు మాత్రమే అరుు్యంది. ఈ దృష్ట్యా వాటిలోని చేపలు పూర్తిగా ఎదగదలేదు. దీనివల్ల పిల్ల చేపలను అమ్ముకునే పరిస్థితి కూడా లేదని లీజుదారులు వాపోతున్నారు. ఒకవేళ వాటిని అప్పటికప్పుడు పట్టించి అమ్ముకుందామన్నా సరిపడినంత స్థాయిలో మత్స్యకారులు అందుబాటులో లేరు. దీంతో చేపల పట్టుబడులు పట్టే అవకాశం లేక టన్నులకొద్దీ చేపలు చనిపోతున్నాయి. వీటిని స్థానికులు పట్టుకెళుతున్నారు.