చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు
చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు
Published Sat, Apr 22 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
పెదనిండ్రకొలను (నిడమర్రు): సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ విమర్శించారు. శుక్రవారం పెదనిండ్రకొలనులో జరిగిన గడప గడపకూ వైఎస్సార్‌లో ఆయన పాల్గొని స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరిపై పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. పాలనపై అసహనంతో ఉన్న యువత సోషల్ మీడియా ద్వారా తమ భావాలను ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. అది కూడా నేరంగా వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా ఖండిస్తే ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్‌పై వస్తున్న సోషల్ మీడియా పోస్టులపై యువత స్పందన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. పొలిటికల్ సెటైర్ డిజైనర్ అరెస్ట్ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందన్నారు.
మే 1,2 తేదీల్లో జగన్ దీక్ష
మద్దతు ధర లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, వారి సమస్యలపై జగన్ పోరాడతారని భరోసా ఇచ్చారు. వచ్చే నెల 1,2 తేదీల్లో గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఈనెల 26, 27 తేదీల్లో జరగాలి్సన దీక్ష వాయిదాపడిందన్నారు. రైతు దీక్షకు అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. శ్రీధర్ వెంట ఆపార్టీ ఉంగుటూరు కన్వీనర్ పుప్పాల వాసుబాబు , మండల కన్వీనర్లు సంకు సత్యకుమార్, రావిపాటి సత్యశ్రీనివాస్, మరడా వెంకట మంగారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కచ్చాల నాగేశ్వరరావు, తుమ్మగంటి రంగ, రామిశెట్టి శ్రీను, పులిచర్ల కృష్ణారావు, ఎంపీటీసీలు కోడూరి రాంబాబు, సునీత మానసింగ్, ఆర్.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement