ఫ్రైడే ఫీలింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా | Anand Mahindra Friday Feeling Video | Sakshi
Sakshi News home page

ఫ్రైడే ఫీలింగ్ అంటూ అద్భుతమైన వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Published Fri, Oct 27 2023 8:19 PM | Last Updated on Fri, Oct 27 2023 8:43 PM

Anand Mahindra Friday Feeling Video - Sakshi

ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ వీడియో షేర్ చేశారు.

ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. దేవుని సొంత దేశం వయనాడ్ వండరింగ్స్ అంటూ 'ఫ్రైడే ఫీలింగ్' అని ట్యాగ్ చేసారు. ఇందులో  అందమైన ప్రకృతిలో ఏపుగా పెరిగిన చెట్లు, మధ్యలో రోడ్డు కనువిందు చేస్తాయి. ఈ వీడియోని ఇప్పటికి వేలమంది వీక్షించారు, కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఇదీ చదవండి: భారత్ నుంచి విదేశాలకు ఐఫోన్స్.. చరిత్ర సృష్టించనున్న టాటా గ్రూప్

ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి వయనాడ్. కేరళలోని వయనాడ్ పచ్చని వాతావరణం, పర్వతాలు, నదులతో సందర్శకులను మంత్ర ముగ్దుల్ని చేస్తాయి. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పురాతనమైన అలవాట్లు, ఆచారాలలు ఇప్పటికి కూడా కనిపిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement