తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం.. వ్యక్తి ఆత్మహత్య | Man Committed Suicide Due To TDP Leaders Warnings West Godavari | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 20 2018 11:37 AM | Last Updated on Thu, Dec 20 2018 1:21 PM

Man Committed Suicide Due To TDP Leaders Warnings West Godavari - Sakshi

సాక్షి, నిడమర్రు/పశ్చిమ గోదావరి : తెలుగు తమ్ముళ్ల అధికార దాష్టికానికి ఓ వ్యక్తి బలయ్యాడు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఓ కుంటుంబాన్ని రోడ్డున పడేయంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబ పెద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిడమర్రు మండలంలోని క్రొవ్విడి పంచాయతీ పరిధిలో గల ఉప్పరగూడెంలో చోటుచేసుకుంది. వివరాలు.. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పేరుతో యడవల్లి తాతారావు కుటుంబం నివాసముంటున్న స్థలం ఇవ్వాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేశారు. తాతారావు ససేమిరా అనడంతో బెదిరింపులకు దిగారు. బలవంతంగా అయినా స్థలం ఖాళీ చేయిస్తామని హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తాతారావు విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందే ముందు కొందరి టీడీపీ నేతల పేర్లు వెల్లడించినట్టు సమాచారం. టీడీపీ నేతల జోక్యంతో కేసు నమోదులో పోలీసులు తీవ్రజాప్యం ప్రదర్శించారని విమర్శలొస్తుచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement