![TDP Leaders Change Colour of Community Hall Building - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/6/building.jpg.webp?itok=V4nJ2Mcg)
గాజువాక: సామాజిక భవనం కబ్జాకు యత్నించిన టీడీపీ నేతలపై ఎన్నికల సంఘం అధికారులు కన్నెర్రజేశారు. భవనం రంగును వెంటనే మార్చకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల హుకుంతో పచ్చనేతలు ఆగమేఘాలపై సామాజిక భవనం రంగును మార్చారు. వివరాల్లోకి వెళ్తే... జీవీఎంసీ 60వ వార్డు పాతగాజువాక దరి చిట్టినాయుడు కాలనీలోని జీవీఎంసీ సామాజిక భవనాన్ని టీడీపీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్ కబ్జా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ‘సాక్షి’ పత్రి క వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
సామాజిక భవనం ఆక్రమణపై ‘కమ్యూనిటీ హాల్‌పై కన్ను’ శీర్షికన గత నెల 10న కథనం ప్రచురించినప్పటికీ జీవీఎంసీ అధికారులు స్పందించలేదు. దీంతో సంబంధిత మాజీ కౌన్సిలర్ హయాంలో టీడీపీ నాయకులు ఆ సామాజిక భవనానికి పసుపు రంగు వేసి టీడీపీ కార్యాలయంగా మార్చడానికి ప్రయత్నం చేశా రు. ఈ విషయంపై ‘పచ్చనేతల బరితెగింపు’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 3న మరో కథనం ప్రచురించింది. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు స్పందించి సంబంధిత భవనాన్ని పరిశీలించారు. టీడీపీ నాయకులను గట్టిగా మందలించడంతోపాటు వెంటనే దాని రంగును మార్చాలని ఆదేశించడంతో పచ్చనేతలు దిగిరాక తప్పలేదు. సామాజిక భవనం రంగు మార్చడంపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment