community hall
-
Fact Check: రెండు వర్గాల ఘర్షణపై కుట్రపూరిత రాతలా?
సాక్షి ప్రతినిధి కర్నూలు: తన కలం నిండా నిలువెల్లా విషం నింపుకున్న రామోజీరావు.. ప్రభుత్వానికి దళితులను దూరం చేయాలనే కుట్రపూరిత రాతలను నిరంతరం కొనసాగిస్తున్నారు. ఆ పరంపరలోనే.. దళితుల్లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను ఎలాంటి సంబంధం లేకపోయినా అధికార వైఎస్సార్సీపీకి అంటగట్టేందుకు ప్రయత్నించారు. ‘దళిత న్యాయవాదిపై వైకాపా కార్యకర్తల దాష్టీకం’ శీర్షికతో ఓ తప్పుడు కథనాన్ని తన ‘ఈనాడు’లో మంగళవారం అచ్చేశారు. దళితులపై వైఎస్సార్సీపీ దాడులు చేస్తోందనే దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి పంపే విఫలయత్నం చేశారు. రెండు దళిత వర్గాలు దాడులు చేసుకుంటే ఒక వర్గాన్నే దళితులుగా చిత్రీకరించి.. మరోవర్గం కూడా దళితులేనన్న విషయాన్ని మరుగుపర్చే ప్రయత్నాన్ని ఆ కథనంలో చేశారు. ఈనాడు దిగజారుడు రాతలను నంద్యాల జిల్లా పోలీసులు కూడా తీవ్రంగా ఖండించారు. కమ్యూనిటీ హాలు భూమిపై కన్ను.. బనగానపల్లి నియోజకవర్గం కొలివిుగుండ్ల టీడీపీ కార్యాలయం సమీపంలో సర్వే నంబర్ 384, 385లో 16 సెంట్ల గ్రామకంఠం భూమి ఉంది. ఇందులో దళితులు కమ్యూనిటీ హాలు నిర్మాణానికి గ్రామ పంచాయతీకి 2001లో దరఖాస్తు చేసుకుంటే.. 11 సెంట్లలో నిర్మాణానికి 2002లో గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. దండోరా యువజన సంఘం పేరుతో అధికారులు పట్టా మంజూరు చేశారు. దళితవాడలోని ప్రజలు చందాలు వేసుకుని ఆ హాలు నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం దీని నిర్మాణం చివరి దశలో ఉంది. తన నివాసం ఎదురుగా ఉన్న ఆ భూమిని ఆక్రమించుకోవాలని గతంలో బనగానపల్లి టీడీపీ అధికార ప్రతినిధి విజయ్‌కుమార్ ప్రయత్నించారు. అతని నివాసంలోని ఓ ఫ్లోర్లో టీడీపీ కార్యాలయం కూడా ఉండటం విశేషం. తన ఆలోచనకు విరుద్ధంగా కమ్యూనిటీ హాలు నిర్మిస్తుండటంతో దానిని అడ్డుకునేందుకు ఏడాదిగా విఫలయత్నం చేస్తున్నాడు. తాను కూడా దళితుడైనా సాటి దళితులు నిర్మించుకునే కమ్యూనిటీ హాలును అడ్డుకునేందుకు విజయ్‌కుమార్ శతవిధాల ప్రయత్నించాడు. స్పందన, లోకాయుక్తతోపాటు అధికారులందరికీ ఫిర్యాదు చేశాడు. చివరకు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలతో వీడియోలు కూడా పోస్టు చేశాడు. కమ్యూనిటీ హాలు నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన నాగేశ్వరరావు అనే దళితుడిపై మరింత తీవ్రమైన ఆరోపణలతో పోస్టులు చేశాడు. తాను కబ్జా చేయాలనుకున్న స్థలం దక్కకుండా పోయిందనే అక్కసుతో నాగేశ్వరరావు తమ్ముళ్లకు వచ్చే డప్పు కళాకారుల పింఛన్ రాకుండా విజయ్‌కుమార్ ఫిర్యాదు చేశాడు. దీంతో నాగేశ్వరరావు, అతని సోదరులు విజయ్‌ని ఫోన్లో నిలదీశారు. మాటామాట పెరగడంతో ఫోన్లో విజయ్‌కుమార్‌ను దూషించారు. ఈ మాటలను విజయ్ రికార్డు చేసి అనంతపురం కోర్టులో ప్రైవేట్ కంప్లయింట్ వేశాడు. అక్కడే త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఆరుగురిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా కేసు (క్రైం నంబర్ 202/2023యూ/సెక్షన్ 506ఆర్/డబ్ల్యూ34) నమోదు చేశారు. ఐటీడీపీలో చురుగ్గా విజయ్‌కుమార్ అనంతపురంలో స్థిరపడి న్యాయవాద వృత్తి చేస్తున్న విజయ్‌కుమార్ ఐటీడీపీలో చురుగ్గా ఉంటాడు. సోషల్‌మీడియాలో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తాడు. అలాగే వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారికి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడు. అనంతపురం నుంచి దీపావళికి విజయ్ కొలివిుగుండ్లకు వచ్చాడు. దీంతో నాగేశ్వరరావు, అతని సోదరులు, కుటుంబసభ్యులు ఈ నెల 12న విజయ్‌ని కలిసి తమపై కేసు పెట్టడాన్ని ప్రశ్నించారు. రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణ చెలరేగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. నాగేశ్వరరావు, అతని కుటుంబ స భ్యులు విజయ్‌ని పోలీసు స్టేషన్ వరకూ తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ మేరకు విజయ్‌పై పోలీసులు కేసు (క్రైం నంబర్ 158/2023యూ/సెక్షన్ 448,323, 355,506ఆర్/డబ్ల్యూ34 ఐపీసీ) నమోదు చేశారు. నాగేశ్వరరావు బంధువు రమాదేవి ఫిర్యాదు మేరకు క్రైం నంబర్ 159/2023యూ/సెక్షన్ 354(ఏ),323,509ఆర్/డబ్ల్యూ34 ఐపీసీగా కేసు నమోదు చేశారు. వాస్తవాలను విస్మరించి వక్ర రాతలు ఈ ఘటన ఘర్షణ రెండు వర్గాల మధ్య జరిగింది. ఇందులో వైఎస్సార్సీపీకి సంబంధం లేదు. కానీ విజయ్‌కుమార్ దళితుడని రాసిన ‘ఈనాడు’.. దాడి చేసిన వారు కూడా దళితులే అని రాయకపోవడం గమనార్హం. పంచాయతీ తీర్మానం మేరకు దళితులు నిర్మించుకుంటున్న కమ్యూనిటీ హాలు ప్రస్తావన లేకుండా భూమి ఆక్రమించారని తప్పుడు రాతలు రాసింది. ‘ఈనాడు’ అవాస్తవాలు అచ్చేస్తే.. దాన్ని టీడీపీ నేత లోకేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేసి తప్పుడు ప్రచారానికి దిగారు. అలాగే బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి కూడా వాస్తవాలను వక్రీకరిస్తూ మాట్లాడారు. లోకేశ్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఈనాడు దుష్ప్రచారాన్ని స్థానిక దళితులు తీవ్రంగా ఖండించారు. తప్పుడు రాతలపై చర్యలు ‘ఈనాడు’ కథనంపై నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి స్పందించారు. విలేకరుల సమావేశం నిర్వహించి ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించారు. ‘దళిత న్యాయవాదిపై దాడి పేరుతో ఈనాడులో ప్రచురితమైన కథనం పూర్తి అవాస్తవం. కమ్యూనిటీ హాలు విషయంలో రెండు దళిత వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఇది. దీన్ని రాజకీయ ఘటనగా, దళిత వ్యతిరేక ఘటనగా ఈనాడు చిత్రీకరించింది. అధికార పార్టీపై నిందలు మోపుతూ రాష్ట్ర ప్రజలకు తప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేసింది. తప్పుడు రాతలు రాసి శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా చేస్తే చర్యలు తప్పవు’ అని ఎస్పీ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీకి సంబంధం లేదు కమ్యూనిటీ భవనం విషయంలో చోటు చేసుకున్న ఘర్షణ పూర్తిగా ఎస్సీలకు సంబంధించిన అంశం. ఈ ఘటనకు వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్‌లో కొనసాగుతున్నాం. టీడీపీ నాయకుడిపై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారని చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి చూస్తున్నారు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని రాజకీయంగా సానుభూతి పొందేందుకు మాపై తప్పుడు ఆరోపణలు చేశాడు. బీసీ జనార్దన్ తన పలుకుబడిని ఉపయోగించి గొడవలోలేని వారిపై తప్పుడు కేసు పెట్టించారు.– ఇరికిమాను నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు -
సీఎం శిలాఫలకం మాయం.. ఒక్కసారి కాదు.. జీహెచ్ఎంసీ లేఖ రాస్తుందా?
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్లో అయ్యప్ప దేవాలయాన్ని ఆనుకొని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఎకరం విస్తీర్ణంలో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.1 కోటి మంజూరు చేయడమే కాకుండా 2015 జూన్ 3న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఏడేళ్లు గడిచినా ఇంత వరకు ఇక్కడ పునాది రాయి కూడా పడలేదు. ఫలితంగా సదరు స్థలం రోజుకింత చొప్పున అన్యాక్రాంతమవుతూ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. సర్కారు స్థలాలను కాపాడుకోవడంలో జీహెచ్ఎంసీ పూర్తిగా విఫలమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే ఏడేళ్లుగా కనీసం పునాది రాయి కూడా వేయకపోవడం ఆ శాఖ నిర్వాకానికి అద్దం పడుతోంది. జీహెచ్ఎంసీ వైఫల్యంతోనే.. స్థలాన్ని కాపాడుకోవడంలో విఫలమైన జీహెచ్ఎంసీ కేసీఆర్ హామీని నిలబెట్టడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడమే కాకుండా రూ.కోటి మంజూరు చేయగానే సంబంధిత అధికారులు వెంటనే సదరు స్థలాన్ని స్వాధీనం చేయాలంటూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చదవండి: Banjara Hills: సీఎం శిలాఫలకానికే దిక్కులేదు.. ఇప్పటికైనా సాధ్యమేనా..? మాయమైన శిలాఫలకం... సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన స్థలాన్ని వినియోగించుకోవడంలో జీహెచ్ఎంసీ ఎంతో ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా వ్యవహనించడంతో సీఎం వేసిన శిలా ఫలకం ఏడాది లోపే ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై పత్రికల్లో కథనాలు రావడంతో అధికారులు హుటాహుటిన మళ్లీ శిలాఫలకాన్ని ఏర్పా టు చేశారు. అయితే రెండో సారి ఏర్పాటు చేసిన శిలాఫలకం కూడా మాయం కావడం గమనార్హం. స్థలాన్ని కాపాడుకోవడంలోనూ, శిలాఫలకాన్ని కాపాడటంలోనూ, కేటాయించిన నిధులను వినియోగించుకోవడంలోనూ జీహెచ్ఎంసీ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సాధ్యమేనా..? గ్రేటర్ మేయర్ ప్రాతినిథ్యం వహిస్తున్న బంజారాహిల్స్ డివిజన్‌లోనే సీఎం కేసీఆర్ మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా జీహెచ్ఎంసీ వాటిని సద్వినియోగం చేసుకోకపోగా స్థలం అన్యాక్రాంతం అయ్యేదాకా కళ్లప్పగించి చూస్తోంది. రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని ఈ స్థలంలో ఆక్రమణలను ఇటీవలనే తొలగించారు. కనీసం ఇప్పటికైనా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ కలెక్టర్‌కు లేఖ రాస్తుందో, మళ్లీ నిర్లక్ష్యం వహిస్తుందో వేచి చూడాలి. చదవండి: వనస్థలిపురంలో దారుణం.. ముళ్లపొదల్లో మృతశిశువు తల లభ్యం -
కమ్యూనిటీ హాలే.. టీడీపీ కార్యాలయం
వినుకొండ(నూజెండ్ల): వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేస్తున్నారని, కులధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ఉండకూడదని కోర్టుల్లో కేసులు వేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్న టీడీపీ నాయకులు మాత్రం ఏకంగా ప్రభుత్వ భవనాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మార్చారు. వినుకొండ నియోజకవర్గంలోని కారుమంచి గ్రామంలో అవుదారి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రధాన సెంటర్లో స్థలాన్ని కేటాయించి భవనాన్ని నిర్మించి ఇచ్చారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సొంత పనులకు ప్రభుత్వ కమ్యూనిటీ హాల్‌ను ఉపయోగించుకున్నారు. అయితే టీడీపీ హయాంలో సుమారు రూ.15లక్షల ఎంపీ నిధులు, గ్రామస్తుల ఆర్థిక సహకారంతో కమ్యూనిటీ హాల్ నిర్మించారు. టీడీపీ పార్టీ రంగులు వేయించి ఎన్టీఆర్, టీడీపీ గుర్తులను కూడా వేయించుకుని యథేచ్ఛగా పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పటికి కూడా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్లను వేయించుకుని స్థలదాత పేరును ఒక మూలన రాశారు. గ్రామ సచివాలయాలు నిర్మాణదశల్లో ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం అద్దె భవనాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అయితే కారుమంచి గ్రామంలో ప్రభుత్వ భవనాన్ని గ్రామపంచాయతీకి అప్పగించాలని గ్రామస్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవీ చదవండి: ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి.. -
ప్రభుత్వ కమ్యూనిటీ హాల్: ముక్కేసి..పెగ్గేయ్రా!
సాక్షి, ముషీరాబాద్: బాగ్‌లింగంపల్లిలోని ఓ ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ పేకాట క్లబ్‌గా మారింది. మందుకు, విందుకు నిలయమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురు ఎస్ఐలు దాడిచేసి ఆరుగురిని అరెస్టు చేశారు. డబ్బును స్వాదీనం చేసుకున్నారు. వివరాలు.. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం వెనుకగల ఎల్ఐజీ క్వార్టర్స్‌లో ఇటీవల 75 లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వం నైబర్‌హుడ్ కమ్యూనిటి హాల్‌ను ప్రారంభించింది. తాజాగా ఒక ప్రభుత్వ ఉద్యోగి జన్మదినం సందర్భంగా స్నేహితులు, నాయకులు కొందరు విందును ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ హాల్ రెండు గేట్లకు తాళం వేసి మందు, విందు, పేకాట ఆడుతూ జల్సాలు చేసుకంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ అడ్మిన్ ఎస్సై వెంకట్రమణ, నర్సింహారావు, శ్రీనివాస్‌రెడ్డి, కోటేష్‌ల ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ గోడలు దూకి పేకాట ఆడుతున్న వీడియోలను చిత్రీకరించారు. పోలీసులు వచి్చన విషయాన్ని గుర్తించిన పేకాట రాయుళ్ళు కొంతమంది గోడదూకి పరారయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి డబ్బు స్వా«దీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కొంత మంది ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి విడుదల చేయాలని కోరారు. అనంతరం గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అధికార పారీ్టకి చెందిన నాయకులే జనావాసాల మధ్య ఉండే ఓ ప్రభుత్వ కమ్యూనిటి హాల్లో పేకాట ఆడటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
రైల్వే కమ్యూనిటీ హాల్లో అడ్డగోలు దోపిడీ!
సాక్షి, విజయవాడ (కృష్ణా): స్థానిక సత్యనారాయణపురంలోని రైల్వే కమ్యూనిటీ హాల్ నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. రైల్వే సిబ్బంది తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఈ కమ్యూనిటీ హాల్స్‌ను, రైల్వే ఇనిస్టిట్యూట్‌ను రైల్వేశాఖ నిర్వహించింది. గతంలో దీన్ని ఉద్యోగస్తులతో ఓ కమిటీ ఏర్పడి నిర్వహించే వారు. అయితే సదరు కమిటీపై ఆరోపణలు రావడం.. పదవీ కాలం ముగియడంతో అధికారులే స్వయంగా నిర్వహిస్తున్నారు. అయితే గత కమిటీ ఏ విధమైన వ్యాపార ధోరణులను అవలంబించిందో అదే తరహాలో ప్రస్తుతం అధికారులు అవలంభిస్తున్నారని రైల్వే సిబ్బంది ఆరోపిస్తున్నారు. అడుగడుగునా దోపిడీ! రైల్వే కమ్యూనిటీ హాల్‌కు వెళ్లే వారికి ఖేదమే మిగులుతోంది. అడుగడుగునా దోపిడీకి గురవుతున్నామని వారంతా భావిస్తున్నారు. రైల్వే సిబ్బందికి రూ.22 వేలు, బయట వారికి రూ.32 వసూలు చేస్తున్నారు. కానీ దానికి తగ్గ సౌకర్యాలు మాత్రం కల్పించడంలేదు. 100 లీటర్లు.. నాలుగు గంటల ఏసీ? ఏసీ కావాలంటే నాలుగు గంటలకు 100 లీటర్ల డీజిల్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి గాను సుమారు రూ.7000 వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. కానీ వాస్తవంగా 40 లీటర్లే సరిపోతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. నాలుగు గంటలకు ఏసీకి బిల్లు చెల్లించినా రెండున్నర గం టలు వేసి ఆ చల్లదనంతోనే మిగిలిన సమయం పూర్తి చేస్తున్నారు. సామగ్రి బయటి నుంచే... ఇక కమ్యూనిటీ హాల్లో కావాల్సి సామగ్రి ఎక్కు వ బయట నుంచే అద్దెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అదీ వారు చెప్పిన షామియానా కొట్టు నుంచే వాటిని తెచ్చుకుని వాడుకోవాలి. అలాగే డెకరేషన్ కూడా వారు చెప్పిన వారి చేతనే చేయించుకోవాలి. సామగ్రి, డెకరేషన్‌కు బయట రేట్లతో పోల్చితే కనీసం 25 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. కాగా ఇక్కడ ఉన్న వంటశాలకు రక్షణ కవచం లేకపోవడంతో కుక్‌లు ఇబ్బంది పడుతున్నారు. పాత కమిటీపై ఫిర్యాదులు గత కమిటీలో కొంతమంది సభ్యులు కబేళాలో నూతనంగా నిర్మిస్తున్న కల్యాణ మండపంలో భాగస్వామ్యం ఉంది. ఆ కల్యాణ మండపం నిర్మాణ విషయంలో రైల్వే కమ్యూనిటీ హాల్లోని సామగ్రిని యధేచ్ఛగా వాడుకున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే కమ్యూనిటీ హాల్ కోసం కొనుగోలు చేసిన కేబుల్స్, ఇతర సామాగ్రిని అక్కడకు తరలించారని ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదయ్యాయి. దీంతో తొలుత ఏఈ స్థాయి అధికారితో విచారణ చేయించి, తర్వాత త్రిసభ కమిటీని వేశారు. ఈ కమిటీ విచారణ చేసింది కాని ఇంకా నివేదిక ఇవ్వలేదని సమాచారం. కాగా గత ఏప్రిల్‌కు ముందు ఉన్న కమిటీ ఏ విధంగా డబ్బులు వసూలు చేసేదో ఇప్పుడు అధికారులు అదే విధంగా వసూలు చేస్తున్నారు తప్ప రైల్వే ఉద్యోగస్తులకు సిబ్బందికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉపయోగపడేలాగా... స్టాఫ్ వెల్పేర్ ఫండ్ నుంచి సుమారు రూ.75 లక్షలు ఖర్చు చేసి కమ్యూనిటీ హాల్, ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేశారు. అదే సమయంలోనో, తర్వాతో మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి వంట సామగ్రి, ఇతర సామగ్రి కొనుగోలు చేసి ఉంటే ఆ మేరకు ఖర్చు తగ్గేది. అలాగే ఏసీ కల్యాణ మండపం అని అద్దె వసూలు చేస్తున్నారు. అందువల్ల ఏసీ సౌకర్యం ఉచితం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కమ్యూనిటీ హాల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని కోరుతున్నారు. -
రంగు మారింది
గాజువాక: సామాజిక భవనం కబ్జాకు యత్నించిన టీడీపీ నేతలపై ఎన్నికల సంఘం అధికారులు కన్నెర్రజేశారు. భవనం రంగును వెంటనే మార్చకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల హుకుంతో పచ్చనేతలు ఆగమేఘాలపై సామాజిక భవనం రంగును మార్చారు. వివరాల్లోకి వెళ్తే... జీవీఎంసీ 60వ వార్డు పాతగాజువాక దరి చిట్టినాయుడు కాలనీలోని జీవీఎంసీ సామాజిక భవనాన్ని టీడీపీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్ కబ్జా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ‘సాక్షి’ పత్రి క వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. సామాజిక భవనం ఆక్రమణపై ‘కమ్యూనిటీ హాల్‌పై కన్ను’ శీర్షికన గత నెల 10న కథనం ప్రచురించినప్పటికీ జీవీఎంసీ అధికారులు స్పందించలేదు. దీంతో సంబంధిత మాజీ కౌన్సిలర్ హయాంలో టీడీపీ నాయకులు ఆ సామాజిక భవనానికి పసుపు రంగు వేసి టీడీపీ కార్యాలయంగా మార్చడానికి ప్రయత్నం చేశా రు. ఈ విషయంపై ‘పచ్చనేతల బరితెగింపు’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 3న మరో కథనం ప్రచురించింది. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు స్పందించి సంబంధిత భవనాన్ని పరిశీలించారు. టీడీపీ నాయకులను గట్టిగా మందలించడంతోపాటు వెంటనే దాని రంగును మార్చాలని ఆదేశించడంతో పచ్చనేతలు దిగిరాక తప్పలేదు. సామాజిక భవనం రంగు మార్చడంపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం.. వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, నిడమర్రు/పశ్చిమ గోదావరి : తెలుగు తమ్ముళ్ల అధికార దాష్టికానికి ఓ వ్యక్తి బలయ్యాడు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఓ కుంటుంబాన్ని రోడ్డున పడేయంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబ పెద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిడమర్రు మండలంలోని క్రొవ్విడి పంచాయతీ పరిధిలో గల ఉప్పరగూడెంలో చోటుచేసుకుంది. వివరాలు.. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పేరుతో యడవల్లి తాతారావు కుటుంబం నివాసముంటున్న స్థలం ఇవ్వాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేశారు. తాతారావు ససేమిరా అనడంతో బెదిరింపులకు దిగారు. బలవంతంగా అయినా స్థలం ఖాళీ చేయిస్తామని హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తాతారావు విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందే ముందు కొందరి టీడీపీ నేతల పేర్లు వెల్లడించినట్టు సమాచారం. టీడీపీ నేతల జోక్యంతో కేసు నమోదులో పోలీసులు తీవ్రజాప్యం ప్రదర్శించారని విమర్శలొస్తుచ్చాయి. -
కబ్జాలకు మారు పేరు
తెలుగుదేశం పార్టీ కదిరి అసెంబ్లీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ క్రైస్తవుల కోసం కమ్యూనిటీ హాల్ కట్టించారని ఆయన అనుచరులు కొందరు పదే పదే చెప్పి క్రైస్తవుల ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో కందికుంట డబ్బు ఒక్క రూపాయి కూడా లేదని తెలిసింది. క్రైస్తవుల విరాళాలతోనే నిర్మించి అక్కడ కందికుంట అనుచరులు ఎమ్మెల్యే కందికుంట నిధులు రూ 2 లక్షలు, ఎంపీ నిమ్మల నిధులు రూ 3 లక్షలు దీనికి తోడు కందికుంట సొంత నిధులు మరో రూ.10 లక్షలు అని శిలాఫలకం చెక్కించారు. కానీ అక్కడ కనీసం సీఅండ్ఐజీ చర్చి బోర్డు కూడా పెట్టలేదు. కందికుంట చర్చి ఆస్తులు మింగేసిన విషయం వెలుగులోకి రాకూడదన్న ఉద్దేశ్యంతోనే కమ్యూనిటీ హాల్ నిర్మించినట్లు తెలుస్తోంది. కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సీఅండ్ఐజీ మిషన్ చర్చికి సంబంధించిన సర్వే నెం.660-3లోని రూ. కోట్ల విలువ చేసే క్రైస్తవ విద్యార్థుల ఆశ్రమ పాఠశాల ఉన్న 15 సెంట్ల స్థలాన్ని కందికుంట తన బినామీల పేరు మీద రాయించుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుత ం దీనిపై కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తన మెడపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించి తన చేత రాయించుకున్నారని సీఅండ్‌ఐసీ మిషన్ చర్చి ఫాదర్‌గా ఉన్న ఎం.జేమ్స్ జిల్లా కోర్టులో కూడా చెప్పినట్లు తెలిసింది. వాస్తవంగా ప్రభువు ఆస్తులు అమ్మడానికి తనకు ఏ మాత్రం అధికారాలు లేవని, వారి బలవంతం.. బెదిరింపులకు భయపడే రాయించానని కూడ కోర్టు ఎదుట చెప్పినట్లు సమాచారం. తర్వాత కొద్ది రోజులకే ఆయన ఈ మనోవేదనతోనే చనిపోయాడని కొందరు క్రైస్తవ పెద్దలు చెప్పుకుంటున్నారు. అప్పులోళ్ల గోడు వినేదెవరు? కందికుంట తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇంకా పలుచోట్ల రూ కోట్ల అప్పులు తీసుకున్నారు. ఈ మధ్యే ఒకరు తన అప్పు ఇస్తావా? లేదా అంటూ ఆయన ఇంటి పైకి రాళ్లు కూడా రువ్వి నానా హంగామా చేసిన విషయం చర్చనీయాంశమైంది. నల్లచెరువు, గాండ్లపెంట మండలానికి చెందిన ఆ పార్టీకే చెందిన మండల నాయకులు ఇద్దరు కందికుంటతో వారికున్న డబ్బు లేవాదేవీల కారణంగానే ఆ పార్టీని వీడలేకున్నారని, లేదంటే వారు ఎప్పుడో వైఎస్సార్సీపీలో చేరిపోయే వారని టీడీపీ నాయకులే చెబుతున్నారు. కందికుంట అప్పుల బాధితులకు చివరికి ఆత్యహత్యే శరణ్యమని వారంటున్నారు. మైనార్టీ, వక్ఫ్ బోర్డు ఆస్తులు హాంఫట్! కదిరి-అనంతపురం జాతీయ రహదారి పక్కనే రూ కోట్ల రూపాయలు విలువ చేసే ముస్లిం మైనార్టీల వక్ఫ్ బోర్డు స్థలం ఉంది. ఆ స్థలాన్ని కూడా కందికుంటతో పాటు ఆయన అనుచరులు కబ్జా చేశారన్న విమర్శలు పట్టణంలో వినబడుతున్నాయి. దీనిపై గతంలోఎంఐఎం నాయకులు, కొందరు మైనార్టీ సోదరులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు కూడా చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్థులను రక్షించి కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు అప్పట్లో డిమాండ్ చేశారు. డీడీల స్కాం కందికుంటపై నకిలీ డీడీల స్కాం కేసు ఇప్పటికీ నాంపల్లి సీబీఐ కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ విషయం ఆయనే స్వయంగా తన అఫిడవిట్లో కూడా పేర్కొన్నారు. తనపై 9 కేసులున్నాయని అందులో ఇది కూడా ఒక్కటని ఆయనే ఒప్పుకున్నారు. ఇంకా ఇతనిపై ఐపీసీ సెక్షన్ 420, 302, 307, 324, 375, 471, 147, 148, 149 ఇలా పలు సెక్షన్ల కింద కేసులున్నట్లు ఆయన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ బట్టబయలు చేస్తోంది. -
ఓటర్ల మెడలో గుడి‘గంట’!
అడిగితే చాలు గ్రామాలకు తాయిలాలు గుడుల నిర్మాణానికి మెటీరియల్ గ్రామ పెద్దలతో ప్రమాణాలు చేయించి మరీ సరఫరా భీమిలిలో ప్రలోభాల ప్రహసనం తగరపువలస, న్యూస్‌లైన్: భీమిలిలో ప్రతికూల పవనాలు వీస్తూ ఉండడంతో హతాశుడైన టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తనకు పరిచయమైన పాత బాట పట్టాలని నిశ్చయించుకున్నట్టు ఉంది. తాయిలాలు, పారితోషికాలతో ఓటర్లపై ప్రలోభాల వల విసరాలన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. ఊళ్ల వారీగా, వీధుల వారీగా ఓటర్లకు గాలం వేసి తన పబ్బం గడుపుకోవాలని నిశ్చయించినట్టు తేటతెల్లవుతోంది. నోట్లు వెదజల్లయినా తనపై గల వ్యతిరేకతను తొలగించుకోవాలని ఆరాటపడుతున్నట్టు ఆయన వ్యవహార శైలిని బట్టి అర్ధమవుతోంది. మరీ ముఖ్యంగా స్థానికేతరుడన్న మచ్చ తొలగించుకోవడానికి ఎంతకైనా సిద్ధపడేట్టు కనిపిస్తోంది. గ్రామానికో కమ్యూనిటీ హాలు, వార్డుకో గుడి నిర్మించుకోవడానికి ఇప్పటికే గంటా పచ్చజండా చూపారని తెలియవచ్చింది. ఇందుకోసం మెటీరియల్, డబ్బుతో ఆశ పెడుతూ ఓట్లు తనకే వేయాలని గ్రామపెద్దలతో ప్రమాణాలు చేయించుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు పదేళ్ల క్రితం భీమిలి మున్సిపాల్టీకి చైర్పర్సన్ కావాలని భంగపడి టీడీపీ అధిష్టానాన్ని తిట్టిపోసి పార్టీకి దూరంగా ఉన్న నాయకురాలు మళ్లీ గంటా పుణ్యమాని టీడీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు గంటా తరపున మళ్లీ వార్డు ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈమె 11,12 వార్డుల మహిళలతో గంటా తరపున బేరసారాలు సాగించారు. ఆయా వార్డులలో తెలుగు తమ్ముళ్లుగా పేరుపడ్డ నాయకులు వార్డుకో కమ్యూనిటీ హాలు,గుడిని నిర్మించాలని రాయబారం నడిపినట్టు తెలుస్తోంది. దాంతో వార్డుకు రూ.5 లక్షలు ఇవ్వడానికి గంటా సమ్మతించినట్టు తెలిసింది. 25వ వార్డులో మూడురోజుల క్రితం భూమిపూజ జరిగిన రామాలయానికి గ్రామస్తులు ఇచ్చిన విరాళం కన్నా టీడీపీ అభ్యర్థి గంటా ఎక్కువ సమకూర్చారని వినవస్తోంది. ఎన్నికల ముందు లక్ష విలువైన మెటీరియల్ ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలియవచ్చింది. టన్ను ఇనుము,రెండు లారీల ఇటుక, నాలుగు యూనిట్ల పిక్క, వంద సిమెంటు బస్తాలు ఈ ‘ప్యాకేజీ’లో భాగమని తెలుస్తోంది. హామీ ఇచ్చిన తక్షణం ఆఘమేఘాల మీద మెటీరియల్ పంపడంతో గ్రామ పెద్దలే ఆశ్చర్యపోతున్నట్టు తెలియవచ్చింది. మెటీరియల్ ఇప్పించిన మాజీ పట్టణ అధ్యక్షుడు గంటా తరపున రాముని ఫొటోపై గ్రామస్తులతో ఒట్లు వేయించుకున్నారని వెల్లడైంది. ఒక్క భీమిలిలోనే కాకుండా మూడుమండలాలలోని గ్రామీణ ప్రాంతాలలో ఇదే ధోరణి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసేలోగా ఆలయాల పేరుతో ఒట్లేయించి ఓట్లు కొట్టేయాలని గంటా అనుచరులు పథకం వేస్తున్నట్టు తెలియవచ్చింది. ఇంత హడావుడి చేస్తున్న మంత్రి పదవిలో ఉన్నప్పుడు చిట్టివలస జ్యూట్ మిల్లు తెరిపించలేకోయారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. -
అద్దె భవనాలే ముద్దు!
పాలకొండ.. ఒకప్పుడు మేజర్ పంచాయతీ. ప్రస్తుతం నగర పంచాయతీగా ఎదిగింది. అయితే పట్టణ ప్రజల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. కనీసం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో కూడా చొరవ చూపలేదనే విమర్శలు వస్తున్నాయి. స్థాయి మారినా మౌలిక సదుపాయాల కల్పనలో తీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. నగర పంచాయతీకి ఉండాల్సిన ఏ హంగూ ఇక్కడ లేవు. నగర పంచాయతీ పరిధిలోని నాగవంశపువీధి వెనుక భాగంలో గతంలో పీతలబంద ఎకరా 26 సెంట్లు ఉండగా, ఈ ప్రాంతంలో కమ్యూనిటీ భవనానికి ఏర్పాట్లు చేస్తామని, ప్రతిపాదనలు పంపిస్తామని నేతలు, అధికారులు డబ్బా కొట్టారు. అయితే ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడంతో ఆక్రమణదారులు ఈ ప్రాంతంపై దృష్టిసారించారు. ఇంకెముంది ఎకరా స్థలం సెంట్లకు మారిపోయింది. ఇదే ప్రాంతంలో ఆర్యవైశ్య సంఘానికి 13 సెంట్లను కేటాయించారు. ఈ ప్రాంతంలో కల్యాణ మండపం, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మిస్తామని అప్పట్లో మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ చొంగ రమాదేవి పరిపాలనా కాలంలో సంకల్పించినా కార్యరూపం దాల్చలేదు. వెంటాడుతున్న నిధుల లేమి! ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో ప్రభుత్వ, ఎంపీ నిధులతో నిర్మించిన సామాజిక భవనాల నిర్వాహణకు నిధుల కొరత గుదిబండగా మారింది. నిర్మాణం తర్వాత వాటి జోలికి అధికారులు వెళ్లకపోవడంతో శిథిలమవుతున్నాయి. నిధుల లేమే కారణమని అధికారులు చెబుతున్నారు. మహిళా ప్రాంగణాలుగా ఎస్‌జేఆర్‌వై పథకం కింద రత్తకన్న, బెల్లుపడ, ఉప్పలవీధిలో కమ్యూనిటి భవనాలను సుమారు రూ.17 .7 లక్షలతో నిర్మించారు. వాటిలో రత్తకన్న, బెల్లుపడ భవనాలను ఎస్‌హెచ్‌జీలకు అందజేశారు. ఉప్పల వీధి మండపాన్ని అధికారికంగా అందజేయాల్సి ఉంది. కాగా ఎంపీ నిధులతో నిర్మించిన భవనాల నిర్వాహణపై మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కనీసం సన్నం వేసే పరిస్థితి కూడా లేదు. మరికొన్ని సామాజిక భవనాలు ఇప్పటికీ నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని అంగన్వాడీ కేంద్రాలుగా మారిపోయాయి. నిరుపయోగంగా ఉన్న సామాజిక భవనాలపై స్థానికులు దుస్తులు ఆరేసుకుంటున్నారు. -
చలి పంజా
=ఆశ్రయం కరువైన అభాగ్యులు = చలికి విలవిల =ప్రకటనలకే పరిమితమైన నైట్ షెల్టర్లు =పట్టనట్టుగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ సాక్షి, సిటీబ్యూరో : లాంటివారు పదులు.. వందలు కాదు.. వేలల్లోనే ఉన్నారు. ఎముకలు కొరికే చలిలో సైతం రోడ్డు పక్కన.. మూసివేసిన దుకాణాల ముందు.. బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లు.. ఆస్పత్రుల పరిసరాల్లో చలిని తట్టుకోలేక కడుపులో కాళ్లు ముడుచుకుంటూ అవస్థలు పడుతున్న వారెందరో. అనాథలు.. యాచకులు.. ఇతరత్రా ప్రజలందరిదీ ఇదే దుస్థితి. ఈ పరిస్థితి వల్ల ఆత్మగౌరవం దెబ్బతిని.. తీవ్ర నిరాశానిస్పృహల్లో కొట్టుకుపోకుండా ఉండేందుకు.. వారి గౌరవానికి భంగం కలుగ కుండా ఉండేందుకు.. వారికోసం నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిందిగా ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా వాటిని జీహెచ్ఎంసీ అమలు చేయడం లేదు. ఐదు లక్షల జనాభా దాటిన నగరాల్లో లక్షమందికి ఒకటి చొప్పున ఇలాంటి నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలి. ఆ లెక్కన నగరంలో 70కి పైగా నైట్షెల్టర్లుండాలి. కానీ ఇప్పటివరకు పది కూడా ఏర్పాటు కాలేదు. ఏర్పాటైనవి సైతం నిరాశ్రయులకు అందుబాటులో లేకుండా ఎక్కడెక్కడో ఉండటంతో తక్కువమంది మాత్రమే వాటిని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల అవసరాల కోసం వచ్చేవారిలో వందలాది మంది ఆయా ఆస్పత్రుల సమీపాల్లో కనిపిస్తున్నారు. అలాగే.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వంటి ప్రాంతాల్లో వీరి సంఖ్య ఎక్కువ. వీటిని దృష్టిలో పెట్టుకొని నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు పడుతున్న వారెందరో. గత సంవత్సరం ఇలాంటి వారి దుస్థితిపై ‘సాక్షి’లో వెలువడిన కథనంతో స్పందించిన జీహెచ్ఎంసీ వర్గాలు చెప్పుకోవడానికన్నట్లుగా ఆయా ఆస్పత్రులకు మొక్కుబడి లేఖలు రాశాయి. మీ ఆస్పత్రుల ప్రాంగణాల్లో మీరే నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలంటూ ఎల్వీప్రసాద్, సరోజినీదేవి కంటి ఆస్పత్రులు.. ఉస్మానియా, గాంధీ, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రులకు లేఖలు రాసి చేతులు దులుపుకొన్నాయి. నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను జీహెచ్ఎంసీ పూర్తిగా విస్మరించింది. జీహెచ్ ఎంసీయే వాటి ఏర్పాటుకు ముందుకొచ్చినట్లయితే.. అవసరమైన స్థలం ఇచ్చేందుకు ఆయా ఆస్పత్రులు ముందుకొచ్చేవేమో కానీ.. ఆ బాధ్యతను కూడా ఆస్పత్రులపైనే రుద్దడంతో ఏ ఆస్పత్రి కూడా సానుకూలంగా స్పందించలేదు. షరా మామూలుగానే.. షెల్టర్ లేని ప్రజలు తమ అవస్థలు తాము పడుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు చొరవ తీసుకొని .. బజార్లలోనే బతుకులీడుస్తున్న పేదలకు తగు భరోసా నివ్వాల్సి ఉంది. త్వరలో వినియోగంలోకి రానున్నవి... = సరూర్‌నగర్ కమ్యూనిటీహాల్, ఎల్బీ నగర్ = మల్లాపూర్, కాప్రా కాచిగూడ = ఆర్కేపురం కమ్యూనిటీ హాల్, మల్కాజిగిరి ప్రస్తుతమున్న నైట్‌షెల్టర్లు 1. బైబిల్‌హౌస్, సికింద్రాబాద్ 2. నామాలగుండు, సికింద్రాబాద్ (మహిళలు) 3. అంబేద్కర్‌నగర్, టప్పాచబుత్రా 4. పాత మునిసిపల్ కార్యాలయం, ఉప్పల్ (మహిళలు) 5. వార్డు కార్యాలయం, యూసుఫ్‌గూడ 6. గోల్నాక 7. హఫీజ్‌పేట 8. బలహీనవర్గాల కాలనీ, శివరాంపల్లి 9. పాత మునిసిపల్ కార్యాలయం, శేరిలింగంపల్లి -
నిధుల వరద..
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణ ంలో ఉన్నట్టుండి సంక్షేమ వసతి గృహాలపై ప్ర భుత్వానికి ప్రేమ పుట్టుకొచ్చింది. ఇంతకాలం వీటి స్థితిగతులను పట్టించుకోని ప్రభుత్వం ఒక్కసారిగా భారీ ప్రణాళికను ముందుకు తె చ్చి ంది. బాలికలు, బాలుర కోసం వేర్వేరుగా కళాశాల వసతి గృహాలు, పాఠశాల విద్యార్థులకోసం వసతి గృహాలు, సమీకృత సంక్షేమ వసతి గృహాల కాంప్లెక్స్‌లు, కమ్యూనిటీ హాళ్లు, పాత వసతి గృహాల మరమ్మతులు, ప్రహరీల నిర్మాణం, అదనపు మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికోసం ‘ఇందిరమ్మ కలలు’ పథకం కింద ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి సుమారు రూ.60 కోట్ల నిధులను కేటాయించింది. ఈ మేరకు గత జూన్ నుంచి పలు దఫాలుగా జీఓలు జారీ అయ్యాయి. ఆన్లైన్ టెండర్ల ద్వారా ఈ పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నట్టు సాంఘిక సంక్షేమ అధికారులు తెలిపారు. ఈ పనులను సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షక ఇంజనీర్(ఎస్ఈ) హైదరాబాద్ నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. స్థలాల సేకరణ సైతం దాదాపు పూర్తికావడంతో నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రణాళిక ఇలా.. జిల్లాకు కొత్తగా నాలుగు సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహాలు మంజూరయ్యాయి. బాలుర కోసం సంగారెడ్డి, సిద్దిపేటలో, బాలికల కోసం మెదక్, అందోల్‌లో వసతి గృహాల నిర్మాణానికి రూ.8.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ.2.20 కోట్ల చొప్పున కేటాయించారు. వీటితోపాటు మెదక్, జహీరాబాద్, నర్సాపూర్, దుబ్బాక, నారాయణఖేడ్, సంగారెడ్డిలో ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం సమీకృత సంక్షేమ వసతి గృహాలు మంజూరు చేశారు. ఇందుకోసం రూ.18 కోట్లు కేటాయించారు. సదాశివపేట, పటాన్చెరు, కొండాపూర్, తడ్కల్‌లో రూ.3.20 కోట్లతో నాలుగు కొత్త భవనాల నిర్మించి శిథిలమైన, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాలను ఇందులోకి మార్చనున్నారు. 72 వసతి గృహాల భవనాల మరమ్మతుల కోసం రూ.2 కోట్లు మంజూరయ్యాయి. 244 అదనపు మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.61.75 లక్షలు, 313 అదనపు స్నానాల గదుల కోసం రూ.64.50 లక్షలు, 22 వసతి గృహాలకు ప్రహరీల నిర్మాణం కోసం రూ.2.20 కోట్లు కేటాయించారు. కొత్తగా 16 కమ్యూనిటీ హాళ్లు.. జిల్లాలో కొత్తగా 16 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను నిర్మించనున్నారు. అందోల్ మండలం చౌటకూర్, కొడెకల్, ఖాదీరాబాద్, జహీరాబాద్ పరిధిలోని తూంకుంట, మల్కన్పాడు, జీరపల్లి, నర్సాపూర్ పరిధిలోని మాచెర్టుల, పెద్దాపూర్, సంగారెడ్డి పరిధిలోని ఇరిగిపల్లి, నారాయణఖేడ్ పరిధిలోని మన్సూర్పూర్, పటాన్చెరు పరిధిలోని దాచారం, మెదక్ పరిధిలో కొరివిపల్లి, దుబ్బాక పరిధిలోని లింగంపల్లి, గజ్వేల్ పరిధిలోని క్యాసారం, సిద్దిపేట పరిధిలోని నారాయణరావుపేట్, బద్దిపడగలో కమ్యూనిటీ హాళ్లు నిర్మించడానికి నిధులు విడుదలయ్యాయి. ఒక్కో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.7.50 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులను ఖర్చు చేయనున్నారు. 50 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇందిరమ్మ హౌసింగ్ కాలనీల్లో నివాసముండే ఎస్సీ కుటుంబాలు నెలకు 0-50 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగిస్తే ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనుంది. ఇందుకుగాను జిల్లాలో 29,114 విద్యుత్ కనెక్షన్లు కలిగిన ఎస్సీ వినియోగదారుల బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.23.25 కోట్లు విడుదల చేస్తున్నట్టు గత నెల రెండున జీఓ జారీ చేసింది.