సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణ ంలో ఉన్నట్టుండి సంక్షేమ వసతి గృహాలపై ప్ర భుత్వానికి ప్రేమ పుట్టుకొచ్చింది. ఇంతకాలం వీటి స్థితిగతులను పట్టించుకోని ప్రభుత్వం ఒక్కసారిగా భారీ ప్రణాళికను ముందుకు తె చ్చి ంది. బాలికలు, బాలుర కోసం వేర్వేరుగా కళాశాల వసతి గృహాలు, పాఠశాల విద్యార్థులకోసం వసతి గృహాలు, సమీకృత సంక్షేమ వసతి గృహాల కాంప్లెక్స్‌లు, కమ్యూనిటీ హాళ్లు, పాత వసతి గృహాల మరమ్మతులు, ప్రహరీల నిర్మాణం, అదనపు మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికోసం ‘ఇందిరమ్మ కలలు’ పథకం కింద ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి సుమారు రూ.60 కోట్ల నిధులను కేటాయించింది. ఈ మేరకు గత జూన్ నుంచి పలు దఫాలుగా జీఓలు జారీ అయ్యాయి. ఆన్‌లైన్ టెండర్ల ద్వారా ఈ పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నట్టు సాంఘిక సంక్షేమ అధికారులు తెలిపారు. ఈ పనులను సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షక ఇంజనీర్(ఎస్‌ఈ) హైదరాబాద్ నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. స్థలాల సేకరణ సైతం దాదాపు పూర్తికావడంతో నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
ప్రణాళిక ఇలా..
జిల్లాకు కొత్తగా నాలుగు సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహాలు మంజూరయ్యాయి. బాలుర కోసం సంగారెడ్డి, సిద్దిపేటలో, బాలికల కోసం మెదక్, అందోల్‌లో వసతి గృహాల నిర్మాణానికి రూ.8.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ.2.20 కోట్ల చొప్పున కేటాయించారు. వీటితోపాటు మెదక్, జహీరాబాద్, నర్సాపూర్, దుబ్బాక, నారాయణఖేడ్, సంగారెడ్డిలో ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం సమీకృత సంక్షేమ వసతి గృహాలు మంజూరు చేశారు. ఇందుకోసం రూ.18 కోట్లు కేటాయించారు. సదాశివపేట, పటాన్‌చెరు, కొండాపూర్, తడ్కల్‌లో రూ.3.20 కోట్లతో నాలుగు కొత్త భవనాల నిర్మించి శిథిలమైన, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాలను ఇందులోకి మార్చనున్నారు. 72 వసతి గృహాల భవనాల మరమ్మతుల కోసం రూ.2 కోట్లు మంజూరయ్యాయి. 244 అదనపు మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.61.75 లక్షలు, 313 అదనపు స్నానాల గదుల కోసం రూ.64.50 లక్షలు, 22 వసతి గృహాలకు ప్రహరీల నిర్మాణం కోసం రూ.2.20 కోట్లు కేటాయించారు.
కొత్తగా 16 కమ్యూనిటీ హాళ్లు..
జిల్లాలో కొత్తగా 16 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను నిర్మించనున్నారు.
అందోల్ మండలం చౌటకూర్, కొడెకల్, ఖాదీరాబాద్, జహీరాబాద్ పరిధిలోని తూంకుంట, మల్కన్‌పాడు, జీరపల్లి, నర్సాపూర్ పరిధిలోని మాచెర్టుల, పెద్దాపూర్, సంగారెడ్డి పరిధిలోని ఇరిగిపల్లి, నారాయణఖేడ్ పరిధిలోని మన్సూర్‌పూర్, పటాన్‌చెరు పరిధిలోని దాచారం, మెదక్ పరిధిలో కొరివిపల్లి, దుబ్బాక పరిధిలోని లింగంపల్లి, గజ్వేల్ పరిధిలోని క్యాసారం, సిద్దిపేట పరిధిలోని నారాయణరావుపేట్, బద్దిపడగలో కమ్యూనిటీ హాళ్లు నిర్మించడానికి నిధులు విడుదలయ్యాయి. ఒక్కో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.7.50 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులను ఖర్చు చేయనున్నారు.
50 యూనిట్లలోపు ఉచిత విద్యుత్
ఇందిరమ్మ హౌసింగ్ కాలనీల్లో నివాసముండే ఎస్సీ కుటుంబాలు నెలకు 0-50 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగిస్తే ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనుంది. ఇందుకుగాను జిల్లాలో 29,114 విద్యుత్ కనెక్షన్లు కలిగిన ఎస్సీ వినియోగదారుల బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.23.25 కోట్లు విడుదల చేస్తున్నట్టు గత నెల రెండున జీఓ జారీ చేసింది.
నిధుల వరద..
Published Mon, Aug 19 2013 2:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
Advertisement