ప్రభుత్వ కమ్యూనిటీ హాల్‌లో మద్యం సేవిస్తున్న దృశ్యం
సాక్షి, ముషీరాబాద్: బాగ్‌లింగంపల్లిలోని ఓ ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ పేకాట క్లబ్‌గా మారింది. మందుకు, విందుకు నిలయమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురు ఎస్‌ఐలు దాడిచేసి ఆరుగురిని అరెస్టు చేశారు. డబ్బును స్వాదీనం చేసుకున్నారు. వివరాలు.. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం వెనుకగల ఎల్‌ఐజీ క్వార్టర్స్‌లో ఇటీవల 75 లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వం నైబర్‌హుడ్ కమ్యూనిటి హాల్‌ను ప్రారంభించింది. తాజాగా ఒక ప్రభుత్వ ఉద్యోగి జన్మదినం సందర్భంగా స్నేహితులు, నాయకులు కొందరు విందును ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ హాల్ రెండు గేట్లకు తాళం వేసి మందు, విందు, పేకాట ఆడుతూ జల్సాలు చేసుకంటున్నారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ అడ్మిన్ ఎస్సై వెంకట్రమణ, నర్సింహారావు, శ్రీనివాస్‌రెడ్డి, కోటేష్‌ల ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ గోడలు దూకి పేకాట ఆడుతున్న వీడియోలను చిత్రీకరించారు. పోలీసులు వచి్చన విషయాన్ని గుర్తించిన పేకాట రాయుళ్ళు కొంతమంది గోడదూకి పరారయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి డబ్బు స్వా«దీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కొంత మంది ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి విడుదల చేయాలని కోరారు. అనంతరం గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అధికార పారీ్టకి చెందిన నాయకులే జనావాసాల మధ్య ఉండే ఓ ప్రభుత్వ కమ్యూనిటి హాల్‌లో పేకాట ఆడటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment