bagh lingampally
-
ప్రభుత్వ కమ్యూనిటీ హాల్: ముక్కేసి..పెగ్గేయ్రా!
సాక్షి, ముషీరాబాద్: బాగ్‌లింగంపల్లిలోని ఓ ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ పేకాట క్లబ్‌గా మారింది. మందుకు, విందుకు నిలయమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురు ఎస్ఐలు దాడిచేసి ఆరుగురిని అరెస్టు చేశారు. డబ్బును స్వాదీనం చేసుకున్నారు. వివరాలు.. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం వెనుకగల ఎల్ఐజీ క్వార్టర్స్‌లో ఇటీవల 75 లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వం నైబర్‌హుడ్ కమ్యూనిటి హాల్‌ను ప్రారంభించింది. తాజాగా ఒక ప్రభుత్వ ఉద్యోగి జన్మదినం సందర్భంగా స్నేహితులు, నాయకులు కొందరు విందును ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ హాల్ రెండు గేట్లకు తాళం వేసి మందు, విందు, పేకాట ఆడుతూ జల్సాలు చేసుకంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ అడ్మిన్ ఎస్సై వెంకట్రమణ, నర్సింహారావు, శ్రీనివాస్‌రెడ్డి, కోటేష్‌ల ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ గోడలు దూకి పేకాట ఆడుతున్న వీడియోలను చిత్రీకరించారు. పోలీసులు వచి్చన విషయాన్ని గుర్తించిన పేకాట రాయుళ్ళు కొంతమంది గోడదూకి పరారయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి డబ్బు స్వా«దీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కొంత మంది ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి విడుదల చేయాలని కోరారు. అనంతరం గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అధికార పారీ్టకి చెందిన నాయకులే జనావాసాల మధ్య ఉండే ఓ ప్రభుత్వ కమ్యూనిటి హాల్లో పేకాట ఆడటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పెగాసిస్‌ను ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెగాసిస్ స్పెయిన్‌ను ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ అన్నారు. ప్రతిపక్షాలను, ఉద్యమకారులపై అక్రమంగా కేసు పెట్టడానికి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి పెగాసిస్ పెయిన్‌ను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్‌భవన్‌లో ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ ముగింపు సమావేశాలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా మద్దికాయల అశోక్‌ను పార్టీ పూర్తికాలం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్త ఉద్యమాలు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. పొలిట్ బ్యూరో సభ్యుడు కాటం నాగభూషణం, సభ్యులు తాండ్ర కుమార్, మహేంద్ర, అనుభవ్దాస్ శాస్త్రి, రాజాదాస్తోపాటు 11 రాష్ట్రాలకు చెందిన కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల గర్జన
-
జీహెచ్ఎంసీ ఖాతాలో మరో రికార్డ్
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా బాగ్ లింగంపల్లిలో సోమవారం 15 వేల మందితో రోడ్లను ఊడ్చి, స్వచ్ఛతకై పది సూత్రాల ప్రతిజ్ఞ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా గుజరాత్‌లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ గత ఏడాది మే నెలలో 5,058 మంది విద్యార్థులతో రోడ్లను రికార్డు సృష్టించింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆ రికార్డును బ్రేక్చేసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. జీహెచ్ఎంసీ కార్మికులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నగరాన్ని అగ్రస్థానంలో ఉంచుదాం కేటీఆర్ మాట్లాడుతూ స్వచ్చ సర్వేక్షన్ 2017 లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వచ్చ భారత్ మొదలు కాకముందే తెలంగాణ సీఎం నగరాన్ని నాలుగు వందల యూనిట్లుగా చేసి స్వచ్చ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం కోసం 45 లక్షల చెత్త బుట్టలు పంపిణీ చేసామన్నారు. నగరం బాగుంటనే మనమంతా బాగుంటమన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏది సాద్యం కాదని.. స్వచ్చ సర్వేక్షణలో అందరు పాల్గొని నగరాన్ని అగ్రస్థానంలో ఉంచాలని కేటీఆర్ కోరారు. -
అదృశ్యమైన నలుగురు చిన్నారులు క్షేమం
హైదరాబాద్: నగరంలోని బాగ్‌లింగంపల్లిలో అదృశ్యమైన నలుగురు బాలికల ఆచూకీ లభ్యమైంది. అచ్చయ్యనగర్‌కు చెందిన నలుగురు బాలికలు గురువారం సాయంత్రం అదృశ్యమయ్యారు. గాయత్రి(15), దివ్య(15), రుచిత(13), పావని(13) అనే నలుగురు విద్యార్థినులు జిరాక్స్ కోసం వెళ్లారు. అయితే తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన చిన్నారుల తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. -
నగరంలో నలుగురు బాలికల అదృశ్యం
-
హైదరాబాద్ లో బిజేపీ గెలిస్తేనే అభివృద్ధి
-
హైదరాబాద్ లో బిజేపీ గెలిస్తేనే అభివృద్ధి
హైదరాబాద్: హైదరాబాద్‌లో బిజేపీని గెలిస్తేనే నగరాభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం బాగ్‌లింగంపల్లిలో నిర్వహించిన బిజేపీ మహాసంపర్క్ అభియాన్‌లో కిషన్ రెడ్డి వెల్లడించారు. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బిజేపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఆన్లైన్లో కొత్తగా సభ్యత్వాలు పొందిన వారిని ప్రత్యక్షంగా కలిసి పార్టీ సిద్ధాంతాలు, మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించేందుకు భారతీయ జనతా పార్టీ మహాసంపర్క్ అభియాన్‌ను రూపొందించింది. మే 16 నుంచి జూలై 31 వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ రోజు బాగ్‌లింగంపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బిజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.